సాక్షి, ప్రకాశం: ఏపీలో మరోసారి భూ ప్రక...
పూణే: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్ర�...
ఆఫ్రికా దేశం ఉగాండాలో వింత వ్యాధి అక�...
అట్టావా: వచ్చే ఏడాది ఎన్నికలు జరుగబో�...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫార్ము�...
‘‘కష్టం నాన్నా.. నాకు ఇవేం అర్థం కావడం...
సాక్షి, తాడేపల్లి: నేడు మాజీ ముఖ్యమంత�...
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి పాలనలో కక...
భోపాల్: మధ్యప్రదేశ్లో ఉన్న అటవీ ప్�...
అవసరాలకు అనుగుణంగా రాజకీయాలు చేయడం వ...
వాషింగ్టన్: దాయాది దేశం పాకిస్తాన్...
జైపూర్: రాజస్థాన్లోని ఓ పెట్రోల్ �...
న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్ జగ్దీప�...
బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదే�...
Published Mon, Mar 7 2022 7:03 AM | Last Updated on Mon, Mar 7 2022 6:30 PM
ఉత్తర ప్రదేశ్: అసెంబ్లీ ఎన్నికల ఏడో దశ పోలింగ్
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు తుది అంకానికి చేరాయి. ఉత్తర్ ప్రదేశ్ ఏడో దశ (చివరి విడత) ఎన్నికల పోలింగ్ ముగిసింది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ చివరి దశ ఎన్నికలలో మధ్యాహ్నం 3 గంటల వరకు 46.40% ఓటింగ్ నమోదైంది. సాయంత్రం ఆరుగంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
యూపీ తుది(ఏడో) విడత పోలింగ్లో భాగంగా మధ్యాహ్నాం ఒంటి గంట వరకు 35.51 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
ఆజాంఘడ్లో వయసుమళ్లిన ఓ పెద్దాయన ఆరోగ్యం బాగోలేని భార్యను.. ఓ దివ్యాంగురాలిని తోపుడు బండిలో వేసుకుని ఓటింగ్ కోసం వచ్చాడు. ఒంట్లో శక్తి లేకున్నా.. ఓటేయడం తన బాధ్యత అంటున్నాడు ఆయన. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH | Azamgarh: An elderly person reaches polling booth by pulling a cart, with his wife who has a fracture & a handicapped woman on it. "I've back problem & my wife also not well, hence, used this cart. We've no expectations. Can Rs 500, 1000 (given by state)cure us?" he said pic.twitter.com/tn0RcvwMrC
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 7, 2022
మీర్జాపూర్లో ఓటు వేశా. నియోజకవర్గంలోని మొత్తం 5 స్థానాల్లో మా ఎన్డీయే అభ్యర్థులు గెలుస్తారని నాకు భరోసా ఉంది: అప్నా దళ్ నేత అనుప్రియా పటేల్
"I have cast my vote in Mirzapur. I am assured that all 5 seats in the constituency will be won our NDA candidates," Apna Dal's Anupriya Patel said after casting her vote pic.twitter.com/JOG4FlQkUi
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 7, 2022
ఉత్తర ప్రదేశ్ ఏడో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 8.58 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు.
8.58% voter turnout recorded till 9 am in last phase of #UttarPradeshElections2022
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 7, 2022
Polling is underway in 54 Assembly seats across 9 districts pic.twitter.com/FCuZNX8TAW
ఉత్తర ప్రదేశ్ ఏడో దశ పోలింగ్ మౌ ప్రాంతంలో కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం క్యూ కట్టారు.
Polling underway in Mau in the last phase of #UttarPradeshElections2022
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 7, 2022
613 candidates across 54 Assembly seats in 9 districts are in fray pic.twitter.com/j9KlhVA6Ts
యూపీ ఏడో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయమే తమ హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
అజామ్గఢ్, మౌ, జాన్పూర్, ఘాజీపూర్, చందౌలీ, వారణాసి, మీర్జాపూర్, భదోయి, సోన్భద్రా జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈదశలో రాష్ట్రమంత్రులు నీలకాంత్తివారీ, అనీల్ రాజ్భర్, రవీంద్ర జైస్వాల్, గిరీశ్ యాదవ్, రమాశంకర్ సింగ్ పోటీలో ఉన్నారు. యోగీ ప్రభుత్వం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చిన ధారాసింగ్ చౌహాన్తో పాటు పలు చిన్నా చితక పార్టీల అధిపతులు కూడా పోటీ పడుతున్నారు.
ఏడో దశ పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలున్నాయి. పోలింగ్ జరుగుతున్న 54 సీట్లలో 11 సీట్లు ఎస్సీలకు, రెండు సీట్లు ఎస్టీలకు రిజర్వయ్యాయి.
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల చివరిదైన ఏడో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ దిశలో 54 సీట్లలో 613మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తం 2.06 కోట్ల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటలకు మొదలై పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment