seventh phase
-
Lok Sabha Election 2024: ఏడో విడతలో 62 శాతం పోలింగ్
న్యూఢిల్లీ/కోల్‌కతా/దుమ్కా: ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య పండగగా పేరొందిన భారత సార్వత్రిక ఎన్నికల పర్వం శనివారంతో ముగిసింది. లోక్‌సభ ఎన్నికల్లో చివరిదైన ఏడో దశ పోలింగ్ శనివారం పూర్తయింది. శనివారం రాత్రి 11.50 గంటలకు అందిన సమాచారం మేరకు 62 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నిరీ్ణత పోలింగ్ సమయం ముగిసేలోపు క్యూ లైన్లలో నిల్చున్న వారిని ఓటింగ్‌కు అనుమతించారు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశముంది. ఏడో దశలో చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం సహా ఏడు రాష్ట్రాల్లోని 57 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. మూడోసారి అధికారం చేపట్టాలని ఉవి్వళూరుతున్న ప్రధాని మోదీ పోటీచేసిన వారణాసి నియోజకవర్గంలోనూ శనివారం పోలింగ్ నిర్వహించారు. పశ్చిమబెంగాల్లో అత్యధికంగా 73.47 శాతం పోలింగ్ నమోదైంది. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ దక్షిణ కోల్‌కతాలోని భవానీపూర్ ప్రాంతంలోని మిత్ర ఇన్స్టిట్యూట్ స్కూల్ బూత్‌లో ఓటేశారు. బేరామరీలో బాహాబాహీ పశి్చమబెంగాల్లో పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. బసీర్హాట్ లోక్‌సభ నియోజకవర్గంలోని సందేశ్‌ఖాలీ పరిధిలోని బేరామరీలో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. భాంగర్‌లో టీఎంసీ, ఐఎస్ఎఫ్ మద్దతుదారులు ఒకరిపై ఒకరు నాటుబాంబులతో దాడిచేసుకున్నారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు రంగంలోకి దిగి భాష్పవాయుగోళాలు ప్రయోగించారు. లాఠీచార్జ్ చేశారు. తర్వాత కొన్ని నాటుబాంబులను స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్ నుంచి మధ్యాహ్నం రెండుగంటల్లోపు 1,900 ఫిర్యాదులు వచ్చాయని ఈసీ తెలిపింది. ఈవీఎంలు మొరాయించడం, బూత్‌లోకి రాకుండా ఓటర్లు, పోలింగ్ ఏజెంట్లను ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు అడ్డుకోవడం వంటి ఘటనలు జరిగాయని టీఎంసీ, బీజేపీ తదితర పార్టీలు ఫిర్యాదుచేశాయి. కుటుంబాన్ని మించిన కర్తవ్యం 80 ఏళ్ల తల్లి మరణం ఓవైపు, తప్పక ఓటేయాల్సిన బాధ్యత మరోవైపు ఉన్నా తొలుత ఓటేసి కన్నతల్లికన్నా భరతమాతకు ఎక్కువ గౌరవం ఇచ్చారు ఒక వ్యక్తి. బిహార్‌లోని జెహనాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో దేవ్కులీ గ్రామంలో మిథిలేశ్ యాదవ్ తల్లి శనివారం కన్నుమూశారు. ‘ చనిపోయిన అమ్మ ఎలాగూ తిరిగిరాదు. అంత్యక్రియల్ని కొద్దిసేపు ఆపొచ్చు. కానీ పోలింగ్‌ను ఆపలేం. ఎన్నికలు మళ్లీ ఐదేళ్లదాకా రావు. అందుకే ఓటేశాక అంతిమయాత్ర చేపట్టాలని మా కుటుంబం మొత్తం నిర్ణయించుకున్నాం’ అని మిథిలేశ్ చెప్పారు. ఓటేశాక వెంటనే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. -
Lok Sabha Election 2024: నేడే తుదిపోరు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్ శనివారం జరుగనుంది. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌పాటు బిహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశి్చమ బెంగాల్ రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. వీటితో పాటు ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం పోలింగ్ నిర్వహిస్తారు. అంతేకాకుండా బిహార్ ఒకటి, ఉత్తరప్రదేశ్‌లో ఒకటి, పశి్చమబెంగాల్లో ఒకటి, హిమాచల్‌ప్రదేశ్‌లో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉపఎన్నిక జరుగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆఖరి దశలో పోలింగ్ జరిగే స్థానాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, అభిõÙక్ బెనర్జీ, మీసా భారతి, కంగనా రనౌత్ వంటి ప్రముఖులు బరిలో నిలిచారు. చివరి విడతలోని 57 లోక్‌సభ స్థానాల్లో 2019 ఎన్నికల్లో ఎన్డీఏ 32, యూపీఏ 9 సీట్లు దక్కించుకున్నాయి. మిగతా స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. అంటే సగానికి పైగా ఎన్డీయే సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటిదాకా జరిగిన ఆరు దశల్లో 486 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. కాగా మొత్తం ఏడు దశల్లోని 543 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు, 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4న ప్రారంభం కానుంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జూన్ 2న ప్రారంభమవుతుంది. -
Lok Sabha Election 2024: ఏడో విడతలో 5 హాట్ సీట్లు
సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరింది. చివరిదైన ఏడో విడతలో శనివారం పోలింగ్ జరుగుతున్న 57 లోక్‌సభ స్థానాల్లో ఐదు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఆ హాట్ సీట్లపై ఫోకస్... వారణాసి... మోదీ మేజిక్ కాశీ విశ్వేశ్వరుడు కొలువైన ఈ స్థానం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ బరిలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించిన ఆయన ఈసారి హ్యాట్రిక్‌పై కన్నేశారు. 2014లో తొలిసారి ప్రధాని అభ్యరి్థగా ఇక్కడ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై 3.7 లక్షలకు పైగా ఓట్లతో నెగ్గిన ఆయన 2019లో మెజారిటీని 4.8 లక్షల ఓట్లకు పెంచుకున్నారు. ఈసారి దాన్ని రికార్డు స్థాయికి పెంచడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న పీసీసీ చీఫ్ అజయ్ రాయ్ ప్రధానిని ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి. రాయ్ ఒకప్పుడు బీజేపీ నేతే కావడం విశేషం. బీఎస్పీ నుంచి అథర్ జమాల్ లారీ పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటైన వారణాసిలో 1991 నుంచి బీజేపీ పాతుకుపోయింది. 2004లో కాంగ్రెస్ గెలిచినా మళ్లీ 2009లో బీజేపీ దిగ్గజ నేత మురళీ మనోహర్ జోషి ఇక్కడ విజయం సాధించారు.హమీర్పూర్.. అనురాగ్ విన్నింగ్ షాట్!ఇది బీజేపీ కంచుకోట. 1989 నుంచి ఏకంగా 10సార్లు కాషాయ జెండా ఎగిరింది. రెండుసార్లు సీఎంగా పనిచేసిన ప్రేమ్‌కుమార్ ధుమాల్ ఇక్కడ మూడుసార్లు గెలిచారు. ఆ విజయ పరంపరను ధుమాల్ కుమారుడు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కొనసాగిస్తున్నారు. రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన ఠాకూర్ 2019లో ఏకంగా 4 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. అది ఆయనకు వరుసగా నాలుగో విజయం. కాంగ్రెస్ నుంచి సత్పాల్ రైజాదా రంగంలో ఉన్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీజేపీలో చేరిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండటం తెలిసిందే. వాటిలో 4 స్థానాలు హమీర్పూర్ లోక్‌సభ స్థానం పరిధిలోనే ఉన్నాయి.మండీ... కింగ్ వర్సెస్ క్వీన్ ఆరుసార్లు సీఎంగా చేసిన దివంగత కాంగ్రెస్ నేత వీరభద్రసింగ్ రాజ కుటుంబానికి ఈ స్థానం కంచుకోట. ఆయన, భార్య ప్రతిభా సింగ్ ఇద్దరూ ఇక్కడి నుంచి మూడేసిసార్లు గెలవడం విశేషం! 2014, 2019ల్లో బీజేపీ నేత రామ్ స్వరూప్ శర్మ గెలిచి కాంగ్రెస్ హవాకు అడ్డుకట్ట వేశారు. 2021లో ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో జరిగిన ఉప ఎన్నికలో ప్రతిభా సింగ్ స్వల్ప మెజారిటీతో నెగ్గారు. ఈసారి బీజేపీ నుంచి ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి ప్రతిభకు బదులు ఆమె కుమారుడు విక్రమాదిత్యసింగ్ పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అయిన ఆయన ఈసారి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కంగన, విక్రమాదిత్య పోటాపోటీ ప్రచారంతో హోరెత్తించారు. కంగనా నాన్ లోకల్ అని, వరదలప్పుడు రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడలేదని కాంగ్రెస్ చేసిన ప్రచారం జనాల్లోకి బాగా వెళ్లింది.డైమండ్ హార్బర్... అభిషేక్ హవా ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. 2009 నుంచి తృణమూల్ అడ్డాగా మారింది. గత రెండు ఎన్నికల్లోనూ పార్టీ వారసునిగా చెబుతున్న సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ విజయం సాధించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన అభిషేక్‌కు బీజేపీ అభ్యర్థి అభిజిత్ దాస్ (బాబీ) గట్టి పోటీ నేపథ్యంలో ఈసారి విజయం ప్రతిష్టాత్మకంగా మారింది. అభిషేక్ హ్యాట్రిక్ కొడతారా, డైమండ్ హార్బర్‌పై కాషాయ జెండా ఎగురుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. సీపీఎం కూడా బరిలో ఉండటంతో త్రిముఖ పోటీ నెలకొంది.పట్నా సాహిబ్... రవిశంకర్‌కు సవాల్ సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన పటా్నసాహిబ్ పేరుతో 2008లో ఏర్పాటైన లోక్‌సభ స్థానం. 2009, 2014ల్లో బీజేపీ నుంచి నెగ్గిన బాలీవుడ్ షాట్‌గన్ శత్రుఘ్న సిన్హా 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ గూటికి చేశారు. దాంతో ఆయన్ను ఢీకొనేందుకు బీజేపీ సీనియర్ నేత రవి శంకర్ ప్రసాద్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. 2019 ఎన్నికల్లో శత్రుఘ్నపై భారీ మెజారిటీతో నెగ్గారు. ఈసారి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి అన్షుల్ అవిజిత్ నుంచి రవిశంకర్ ప్రసాద్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. అన్షుల్ లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తనయుడు. కాంగ్రెస్‌తో పాటు దాని భాగస్వామి ఆర్జేడీకి కూడా ఇక్కడ గట్టి ఓటు బ్యాంకుంది. దాంతో ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడం బీజేపీకి కఠిన పరీక్షగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: మూడు సీట్లు... ముచ్చెమటలు!
సార్వత్రిక ఎన్నికల జాతర చివరి అంకానికొచ్చింది. జార్ఖండ్‌లో 14 లోక్‌సభ స్థానాలకు గాను 11 చోట్ల పోలింగ్ ముగిసింది. మిగతా మూడింటికి నేడు ఏడో విడతలో పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ప్రధాని మోదీతో సహా బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలంతా సుడిగాలి ప్రచారాలతో హోరెత్తించారు. ఈ మూడు సీట్లలో రెండు ఎస్టీ నియోజకవర్గాలు. వీటిలో 2 బీజేపీ, ఒకటి జేఎంఎం ఖాతాలో ఉన్నాయి. ఈ స్థానాలపై ఫోకస్...గొడ్డా.. బీజేపీ అడ్డా ఇది కమలనాథుల కంచుకోట. 1991లో మాత్రం జేఎంఎం నుంచి సూరజ్ మండల్ విజయం సాధించారు. కేంద్రంలో పీవీ నరసింహారావు సారథ్యంలోని కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వానికి అనుకూలంగా పార్లమెంటులో ఓటేసేందుకు జేఎంఎం ఎంపీలు ముడుపులు తీసుకున్న వివాదంలో సూరజ్ మండల్ పేరు మార్మోగింది. కాంగ్రెస్ కూడా ఒక్క 2004లో మాత్రమే గెలిచింది. గత మూడు ఎన్నికల్లోనూ బీజేపీదే విజయం. హ్యాట్రిక్ కొట్టిన ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ నిశికాంత్ దూబే మరోసారి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో 4.5 లక్షల ఓట్లు సాధించిన జార్ఖండ్ వికాశ్ మోర్చా (ప్రజాతాంత్రిక్) నేత ప్రదీప్ యాదవ్ కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తున్నారు. బొగ్గు గనులకు ప్రసిద్ధి చెందిన ఈ నియోజకవర్గంలోని 6 అసెంబ్లీ స్థానాల్లో 3 కాంగ్రెస్, 2 బీజేపీ, ఒకటి జేఎంఎం చేతిలో ఉన్నాయి. ఈసారి బీజేపీ హవాకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని ఇండియా కూటమి గట్టిగా ప్రయత్నిస్తుండటంతో ఇక్కడ పోటీ ఆసక్తి రేకెత్తిస్తోంది. దుమ్కా... సోరెన్ ఫ్యామిలీ వార్ఈ ఎస్టీ రిజర్వుడ్ స్థానం జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్ శిబు సోరెన్ కంచుకోట. ఆయన 1980లో జేఎంఎం తరఫున ఇక్కడ తొలిసారి పాగా వేశారు. 1989 నుంచి మూడుసార్లు గెలిచినా, తర్వాత రెండు సార్లు బీజేపీ నేత బాబూలాల్ మరాండీ చేతిలో ఓటమి చవిచూశారు. మళ్లీ వరుసగా నాలుగు ఎన్నికల్లోనూ సోరెన్‌దే హవా. వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నళిన్ సోరెన్ ఈసారి జేఎంఎం తరఫున బరిలోకి దిగారు. బీజేపీ కూడా సిట్టింగ్ ఎంపీని కాదని శిబు సోరెన్ కోడలు సీతా సోరెన్‌కు టికెటిచి్చంది. ఆమె సోరెన్ పెద్ద కుమారుడు దివంగత దుర్గా సోరెన్ భార్య. మామ కంచుకోటలో కోడలే జేఎంఎంకు సవాలు విసురుతుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. దుమ్కాలో 40 శాతం గిరిజనులు, 40 శాతం వెనకబడిన వర్గాలు, 20 శాతం ముస్లింలు ఉంటారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో 3 జేఎంఎం, 2 బీజేపీ, ఒకటి కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. రాజ్‌మహల్... హోరాహోరీ ఈ స్థానంపై కాంగ్రెస్ క్రమంగా పట్టు కోల్పోయింది. 1989లో తొలిసారి జేఎంఎం నెగ్గింది. అప్పట్నుంచి కాంగ్రెస్, బీజేపీ, జేఎంఎం మధ్య చేతులు మారుతూ వస్తోంది. గత రెండు ఎన్నికల్లోనూ విజయం జేఎంఎంనే వరిచింది. 2019లో విజయ్‌కుమార్ హన్స్డా లక్ష ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి హేమ్లాల్ ముర్ముపై వరుసగా రెండోసారి గెలిచారు. ఈసారి హ్యాట్రిక్‌పై గురిపెట్టారు. బీజేపీ ఈసారి రాజ్‌మహల్ లోక్‌సభ స్థానం పరిధిలోని బోరియో సిట్టింగ్ ఎమ్మెల్యే తాలా మరాండీని రంగంలోకి దించింది. సీపీఎం నుంచి గోపెన్ సోరెన్ కూడా తలపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: ఏడో విడతలో టఫ్ ఫైట్
లోక్‌సభ ఎన్నికల పోరు చివరి అంకానికి చేరుతోంది. ఇప్పటిదాకా ఆరు విడతల్లో 486 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. మిగతా 57 సీట్లకు ఆఖరిదైన ఏడో విడతలో శనివారం పోలింగ్ జరగనుంది. ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ పరిధిలో 904 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం సీట్లకూ ఈ విడతలోనే పోలింగ్ జరుగుతోంది. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశి్చమ బెంగాల్‌లోని మిగిలిన సీట్లలో ఎన్నికల క్రతువు ముగియనుంది. చివరి విడత నియోజకవర్గాలను విశ్లేషిస్తే గత ఫలితాలకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు తెరపైకొచ్చాయి...చివరి విడతలో పోలింగ్ జరగనున్న 57 స్థానాల్లో గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీయే చక్రం తిప్పింది. ఈ 57 స్థానాల్లో రెండుసార్లూ 25 సీట్ల చొప్పున కొల్లగొట్టింది. కాంగ్రెస్ 2014లో కేవలం 3, 2019లో 8 స్థానాలతో సరిపెట్టుకుంది. ఓట్లపరంగానూ బీజేపీదే పైచేయి. బీజేపీకి 28 సీట్లలో 40 శాతం ఓట్లు రాగా 12 సీట్లలో 30 నుంచి 40 శాతం దక్కాయి. కాంగ్రెస్‌కు 18 సీట్లలో 10 శాతం ఓట్లు కూడా రాలేదు. మొత్తమ్మీద ఈ 57 సీట్లలో 24 చోట్ల పలు పారీ్టలు పటిష్టంగా ఉన్నాయి. తృణమూల్, బీజేపీలకు చెరో 8 సీట్లు కంచుకోటలు. మూడింట బిజూ జనతాదళ్, రెండేసి చోట్ల కాంగ్రెస్, అకాలీదళ్, ఒక చోట జేడీ(యూ) పటిష్టంగా ఉన్నాయి. ఈ స్థానాల్లో గత మూడు ఎన్నికల్లోనూ ఆ పారీ్టలే గెలిచాయి. మరో 14 సీట్లలో ప్రత్యర్థులకు బీజేపీ గట్టి సవాలు విసురుతోంది. వాటిలో 2009 నుంచి కనీసం రెండుసార్లు బీజేపీ గెలిచింది. ఆ లెక్కన 22 చోట్ల బీజేపీదే జోరు. కాంగ్రెస్ బలంగా ఉన్న సీట్లు 6 మాత్రమే. క్లీన్స్వీప్లన్నీ కమలానివే... ఏడో విడత పోలింగ్ జరిగే స్థానాల్లో గత ఎన్నికల్లో ఐదు చోట్ల క్లీన్‌స్వీప్‌లు నమోదయ్యాయి. అంటే గెలిచిన, ఓడిన పార్టీ మధ్య ఓట్ల తేడా 35 శాతం పైగా నమోదైంది. వీటిలో హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి, హమీర్పూర్, సిమ్లా, కాంగ్రా, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ఉన్నాయి. ఇవన్నీ బీజేపీ ఖాతాలోనే పడటం విశేషం. ప్రధాని మోదీ గత ఎన్నికల్లో వారణాసిలో 45.2 శాతం ఓట్ల మెజారిటీ సాధించారు!ఆ స్థానాల్లో హోరాహోరీ... ఏడో విడత స్థానాల్లో గత ఎన్నికల్లో పలు స్థానాల్లో నువ్వానేనా అనేలా టఫ్ ఫైట్ జరిగింది. అవి జలంధర్ (పంజాబ్), బలియా, చందౌలీ (యూపీ), బాలాసోర్ (ఒడిశా), జహానాబాద్ (బిహార్). ఈ స్థానాల్లో గెలుపు మార్జిన్ 2 శాతం లోపే! వీటితో పాటు ఏ పారీ్టకీ స్పష్టమైన మొగ్గు లేని స్వింగ్ సీట్లు 11 ఉన్నాయి. గడచిన మూడు ఎన్నికల్లో వీటిలో ఏ పార్టీ కూడా రెండోసారి గెలవకపోవడం విశేషం. గాజీపూర్, ఘోసి, రాబర్ట్స్‌గంజ్, మీర్జాపూర్ (యూపీ), ఆనంద్‌పూర్ సాహిబ్, ఫరీద్కోట్, ఫతేగఢ్ సాహిబ్, పటియాలా (పంజాబ్), బాలాసోర్ (ఒడిశా), జహానాబాద్, కరాకట్ (బిహార్) ఈ స్వింగ్ సీట్ల జాబితాలో ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కోడ్ ఉల్లంఘనే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన 48 గంటల ధ్యానంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఏడో విడత పోలింగ్ ముందు ప్రధానమంత్రి ధ్యానం చేయడం ముమ్మాటికీ ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ ధ్యాన మండపంలో గురువారం నుంచి రెండు రోజులపాటు మోదీ ధ్యానం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని టీవీ మీడియాలో ప్రసారం చేయకుండా, ప్రింట్ మీడియాలో ప్రచురించకుండా చర్యలు తీసుకోవాలని బుధవారం ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేతలు రణదీప్ సూర్జేవాలా, అభిõÙక్ సింఘ్వీ, సయీద్ నజీర్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. -
లోక్‌సభ పోరు.. ఫైనల్ పంచ్ ఎవరిదో!
బిహార్‌లో లోక్‌సభ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. 40 సీట్లకు గాను ఆరు విడతల్లో 32 చోట్ల ఎన్నికలు ముగిశాయి. చివరిదైన ఏడో దశలో 8 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. వీటిలో బీజేపీ 5 సిట్టింగ్ స్థానాలు. 2 జేడీ(యూ), 1 రాష్ట్రీయ లోక్ మోర్చా చేతిలో ఉన్నాయి. ఎన్డీఏకు ఈసారి రెబల్స్‌తో పాటు ఇండియా కూటమి నుంచి గట్టి సవాల్ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో కీలక స్థానాలపై ఫోకస్... నలంద... జేడీయూ కంచుకోట అలనాటి విఖ్యాత నలంద విశ్వవిద్యాలయ చరిత్రకు సాక్ష్యంగా నిలిచే నియోజకవర్గం. సారవంతమైన గంగా పరీవాహక ప్రాంతంలో ఉంటుంది. ఇది జేడీయూ కంచుకోట. బీజేపీ ఇక్కడ ఖాతాయే తెరవలేదు. గత ఎన్నికల్లో కౌసలేంద్ర కుమార్ జేడీ(యూ) నుంచి హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నారు. ఇండియా కూటమి తరఫున సీపీఐ (ఎంఎల్) నుంచి సందీప్ సౌరవ్ పోటీ చేస్తున్నారు. కమ్యూనిస్టులు గతంలో ఇక్కడ మూడుసార్లు గెలిచారు.ఆరా... రైట్ వర్సెస్ లెఫ్ట్ మొదట్లో దీని పేరు షాబాద్. 1977లో ఆరాగా మారింది. ఆర్కే సింగ్ 2014లో తొలిసారి ఇక్కడ కాషాయ జెండా ఎగరేశారు. 2019లోనూ నెగ్గిన ఆయన ఈసారి హ్యాట్రిక్ కోసం ఉవి్వళ్లూరుతున్నారు. ఇండియా కూటమి తరఫున సీపీఎం (ఎంఎల్) అభ్యర్థి సుధామా ప్రసాద్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో సీపీఐ (ఎంఎల్)కు ఇక్కడ 4 లక్షల పైగా ఓట్లొచ్చాయి! రైట్, లెఫ్ట్ పారీ్టల వార్ ఇక్కడ ఉత్కంఠ రేపుతోంది.పట్నా సాహిబ్... రవిశంకర్‌కు సవాల్ సిక్కుల మత గురువు గురు గోవింద్‌సింగ్ జన్మస్థలం. 2008లో ఏర్పాటైంది. 2009, 2014ల్లో బాలీవుడ్ షాట్‌గన్ శత్రుఘ్న సిన్హా బీజేపీ తరఫున గెలిచారు. 2019లో ఎన్నికల ముందు శత్రుఘ్న బీజేపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ అభ్యరి్థగా బరిలో దిగారు. దాంతో 20 ఏళ్లుగా రాజ్యసభకు ప్రాతినిధ్య వహిస్తున్న సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్‌ను బీజేపీ బరిలో దించింది. శత్రుఘ్నను ఆయన 2.8 లక్షల పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఈసారి కూడా బీజేపీ నుంచి ఆయనే బరిలో ఉన్నారు. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ తరఫున లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ తనయుడు అన్షుల్ అవిజిత్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీలకు మంచి ఓటు బ్యాంకు ఉండటంతో బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంటోంది. పాటలీపుత్ర... లాలుకు ప్రతిష్టాత్మకం గత రెండు ఎన్నికల్లోనూ ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతిని బీజేపీ నేత రామ్ కృపాల్ యాదవ్ ఓడించారు. 2009లో లాలు కూడా ఇక్కడ ఓటమి చవిచూశారు. లాలుకు ఒకప్పటి నమ్మినబంటు రాంకృపాల్ బీజేపీ అభ్యరి్థగా ఉన్నారు. బీజేపీ తరఫున రెండుసార్లు వరుసగా గెలిచిన ఆయన 2004లో ఇక్కడ ఆర్జేడీ అభ్యరి్థగా బీజేపీని ఓడించడం విశేషం. ఆర్జేడీ నుంచి మీసా భారతి మళ్లీ పోటీ చేస్తున్నారు. కుమార్తెను ఎలాగైనా లోక్‌సభకు పంపాలని కలలుగంటున్న లాలుకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ దన్ను ఆర్జేడీకి కలిసొచ్చే అంశం. కరాకట్.. బీజేపీకి పవన్ గండం ఇక్కడ కుష్వాహా (కోయెరి) సామాజికవర్గానిదే ఆధిపత్యం. గత మూడు ఎన్నికల్లోనూ ఆ వర్గం నేతలే గెలుస్తున్నారు. కుషా్వహాలు, రాజ్‌పుత్‌లు, యాదవులు ఇక్కడ రెండేసి లక్షల చొప్పున ఉంటారు. గతేడాది బీజేపీలో చేరిన భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ ఇప్పుడు పారీ్టకి కొరకరాని కొయ్యగా మారారు. ఇక్కడ టికెట్ ఆశించి భంగపడి ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. ఇండియా కూటమి తరఫున సీపీఐ (ఎంఎల్) నుంచి రాజారాం సింగ్ కుషా్వహా బరిలో ఉన్నారు. ఎన్డీయే నుంచి రా్రïÙ్టయ లోక్ మోర్చా వ్యవస్థాపకుడు ఉపేంద్ర కుష్వాహా పోటీ చేస్తున్నారు. పవన్ సింగ్ నామినేషన్‌కు జనం భారీగా వచ్చారు. త్రిముఖ పోటీలో ఎన్డీఏ ఎదురీదుతోంది.జహానాబాద్... జేడీయూ వర్సెస్ ఆర్జేడీ ‘రెడ్ కారిడార్’లో అత్యంత సున్నితమైన నక్సల్స్ ప్రభావిత నియోజకవర్గం. కమ్యూనిస్టులకు కంచుకోట. 1998 నుంచీ ఆర్జేడీ, జేడీయూ మధ్య చేతులు మారుతోంది. 2014లో రా్రïÙ్టయ లోక్ సమతా పార్టీ నెగ్గింది. 2019లో జేడీ(యూ) నేత చందేశ్వర్ ప్రసాద్ కేవలం 1,751 ఓట్ల తేడాతో ఆర్జేడీ అభ్యర్థి సురేంద్ర ప్రసాద్ యాదవ్‌ను ఓడించారు. ఈసారి కూడా వారిద్దరే బరిలో ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok shabha Elections 2024: ఎవరిని ఎన్నుకుందాం?!
400కు పైగా అని ఒక కూటమి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని మరో కూటమి. హోరాహోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికల పోరు తుది అంకానికి చేరుతోంది. జూన్ 1న చివరిదైన ఏడో విడతతో దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. చివరి విడతలో పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో హిమాచల్‌ప్రదేశ్ ఒకటి. అక్కడి తొలి ఓటర్లు పలు అంశాలపై చురుగ్గా స్పందిస్తున్నారు. నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలు, మహిళా భద్రత తదితరాలకే తమ ప్రాధాన్యత అని చెబుతున్నారు. అయితే అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటముల్లో ఎవరికి ఓటేయాలో తేల్చుకోలేని డైలమాలో ఉన్నామని ఈ యంగ్ ఓటర్స్‌లో పలువురు అంటున్నారు. నోటాకే తమ ఓటని పలువురు చెబుతుండటం విశేషం. రాష్ట్రంలో 4 లోక్‌సభ సీట్లతో పాటు ఉప ఎన్నికలు జరుగుతున్న 6 అసెంబ్లీ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది.ఉచితాలు అనుచితాలే...! కొన్నేళ్లుగా పారీ్టలన్నీ పోటాపోటీగా ప్రకటిస్తున్న పలు ఉచిత హామీలపై, అమలు చేస్తున్న ఉచిత పథకాలపై యువ ఓటర్లలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతుండటం విశేషం. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల భారమంతా అంతిమంగా పన్నులు చెల్లిస్తున్న మధ్యతరగతి ప్రజానీకంపైనే పడుతోందని వారంటున్నారు. అధికారంలోకి వచ్చే పార్టీ ఏదైనా హిమాచల్‌లో ఉచితాలను నిలిపివేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ‘‘అభివృద్ధి పనులకు ఉపయోగించాల్సిన నిధులు ఉచితాల కారణంగా పక్కదారి పడుతున్నాయన్నది నిస్సందేహం’’ అంటున్నారు సోలన్‌కు చెందిన రియా. ఆమె ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటేస్తున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైనా యువత నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పదేళ్ల బీజేపీ పాలనను కొందరు విమర్శిస్తుంటే మరికొందరు ప్రశంసిస్తున్నారు. ‘‘బీజేపీ సారథ్యంలోని నియంతృత్వమా? విపక్ష ఇండియా కూటమి సంకీర్ణమా? కేంద్రంలో ఎవరికి మద్దతివ్వాలో తేల్చుకోలేకపోతున్నా. ఏమైనా రాజకీయాల్లో సానుకూల మార్పు మాత్రం కోరుకుంటున్నా’’ అంటున్నాడు మరో ఓటరు నితీశ్. బీజేపీ సర్కారు అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని, రాజ్యాంగ సంస్థలన్నింటినీ దురి్వనియోగం చేస్తోందని డిగ్రీ ఫస్టియర్ విద్యార్థి రోహిత్ విమర్శిస్తున్నారు. ‘‘మోదీకి ఓటేయడమంటే నియంతృత్వాన్ని సమర్థించడమే. అయితే సంకీర్ణ ప్రభుత్వాలు కూడా దేశానికి మంచివి కావు. కనుక ఇండియా కూటమికి ఓటేయడం కూడా సరికాదు’’ అంటున్నాడతను! ఔత్సాహిక జర్నలిస్టు...సంజౌలీ ప్రభుత్వ పీజీ కాలేజీలో జర్నలిజం చదువుతున్న అన్షుల్ ఠాకూర్ ఈసారి ఓటేయాలని ఉత్సాహంతో ఉన్నాడు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కలి్పంచి, మహిళలకు భద్రతను పెంచేవారికే తన ఓటని స్పష్టంగా చెబుతున్నాడు. పారిశ్రామికవేత్త కావాలన్నది తన కల అని మరో పీజీ విద్యార్థి పరీక్షిత్ అంటున్నాడు. ఆధునిక సాంకేతికతను, స్టార్టప్ సంస్కృతిని, యువతను ప్రోత్సహించే వారికే తన ఓటని చెబుతున్నాడు. ‘‘ఏ పార్టీ అధికారంలోకి వచి్చనా ఉమ్మడి పౌరస్మృతి, నూతన విద్యా విధానాలను సమర్థంగా అమలు చేయాలి. ఈశాన్య ప్రాంతాలతోపాటు లద్దాఖ్ వంటి ప్రదేశాలపై దృష్టి పెట్టాలి. భారత సంస్కృతిని పరిరక్షించాలి. తొలిసారి ఓటరుగా ఇది నా ఆకాంక్ష’’ అని సంజౌలీ పీజీ కాలేజీకి చెందిన మరో విద్యార్థి వశి‹Ù్ట శర్మ చెప్పాడు. అభ్యర్థులెవరూ నా అంచనాలకు తగ్గట్టుగా లేరు. అందుకే నా తొలి ఓటు నోటాకే’’ అని మంచీకి చెందిన అదితి ఠాకూర్ చెప్పుకొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: యూపీలో ఆఖరి పోరాటం!
ఉత్తరప్రదేశ్‌లో సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ఆఖరి అంకానికి చేరుకుంది. 6 విడతల్లో 67 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. మిగతా 13 సీట్లలో జూన్ 1న చివరిదైన ఏడో విడతలో పోలింగ్ జరగనుంది. 2019లో వీటిలో 11 స్థానాలు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కైవసం కాగా బీఎస్పీకి 2 దక్కాయి. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి, సీఎం యోగి కంచుకోట గోరఖ్‌పూర్ సహా కీలక నియోజవర్గాలపై ఫోకస్... గోరఖ్‌పూర్... భోజ్‌పురీ వార్ సుప్రసిద్ధ గోరఖ్‌నాథ్ ఆలయానికి నెలవు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంచుకోట. ఆయన గురువు మహంత్ అవైద్యనాథ్ 1989 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు. తర్వాత యోగి 1998 నుంచి 2014 దాకా ఐదుసార్లు నెగ్గారు. ఆయన సీఎం కావడంతో జరిగిన ఉప ఎన్నికలో అనూహ్యంగా ఎస్పీ గెలిచినా 2019లో బీజేపీ ప్రముఖ భోజ్‌పురి నటుడు రవికిషన్ను బరిలోకి దించి 3 లక్షల మెజారిటీతో కాషాయ జెండా ఎగరేసింది. ఈసారీ ఆయనే పోటీలో ఉన్నారు. ఎస్పీ నుంచి భోజ్‌పురి నటి కాజల్ నిషాద్, బీఎస్పీ నుంచి జావెద్ సిమ్నాని బరిలో ఉన్నారు. కాంగ్రెస్ దన్నుతో బీజేపీకి ఎస్పీ గట్టి పోటీ ఇస్తోంది.గాజీపూర్.. త్రిముఖ పోరు ఇక్కడ 2014లో బీజేపీ, 2019లో ఎస్పీ గెలిచాయి. ఎస్సీ నుంచి అఫ్జల్ అన్సారీ, బీఎస్పీ నుంచి ఉమేశ్ సింగ్, బీజేపీ నుంచి పరాస్ నాథ్ రాయ్ పోటీలో ఉన్నారు. ఇక్కడ 20 శాతం ఎస్సీలు, 11 శాతం ముస్లింలు ఉంటారు. ఓటర్లు ఒక్కోసారి ఒక్కో పారీ్టకి పట్టం కడుతున్న నేపథ్యంలో త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది. గాజీపూర్ పరిధిలోని 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 ఎస్పీ చేతిలోనే ఉన్నాయి!వారణాసి... మోదీ హ్యాట్రిక్ గురికాశీ విశ్వేశ్వరుడు కొలువుదీరిన ఈ లోక్‌సభ స్థానంలో 1991 నుంచి కమలనాథులు పాతుకుపోయారు. 2004లో కాంగ్రెస్ నెగ్గినా 2009లో బీజేపీ దిగ్గజం మురళీ మనోహర్ జోషి గెలుపొందారు. 2014లో ప్రధాని అభ్యరి్థగా నరేంద్ర మోదీ ఇక్కడ తొలిసారి బరిలో దిగారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై 3.7 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచారు. 2019లో మెజారిటీని 4.8 లక్షలకు పెంచుకున్నారు. ఈసారి హ్యాట్రిక్ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్ తరఫున పీసీసీ చీఫ్ అజయ్ రాయ్, బీఎస్పీ నుంచి అథర్ జమాల్ లారీ రేసులో ఉన్నారు. ఈసారి మోదీ మెజారిటీ పెరుగుతుందా, లేదా అన్నదే ప్రశ్నగా కనిపిస్తోంది.చందౌలీ... టఫ్ ఫైట్ దేశంలోనే అత్యంత వెనకబడ్డ ప్రాంతాల్లో ఒకటి. ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువ. 2014, 2019ల్లో మోదీ వేవ్‌లో బీజేపీ ఖాతాలో పడింది. సిట్టింగ్ ఎంపీ మహేంద్రనాథ్ పాండే ఈసారి హ్యాట్రిక్‌పై గురి పెట్టారు. ఎస్పీ నుంచి వీరేంద్ర సింగ్, బీఎస్పీ నుంచి సత్యేంద్రకుమార్ మౌర్య పోటీలో ఉన్నారు. బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది.మీర్జాపూర్... ప్రాంతీయ పారీ్టల హవాఒకప్పుడు బందిపోటు రాణి పూలన్ దేవి అడ్డా. 1996, 1999లో ఆమె ఎస్పీ తరఫున విజయం సాధించారు! 2001లో ఆమె హత్యానంతరం బీఎస్పీ రెండుసార్లు గెలిచింది. 2014లో అప్నాదళ్ నుంచి అనుప్రియా పటేల్ ఘనవిజయం సాధించారు. 2016లో పార్టీ బహిష్కరణతో అప్నాదళ్(ఎస్) పేరుతో కొత్త పార్టీ పెట్టి ఎన్డీఏ దన్నుతో 2019లో మళ్లీ నెగ్గారు. ఈసారి కూడా ఎన్డీఏ నుంచి బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి రమేశ్ చంద్ర బిండ్, ఎస్పీ తరఫున మనీశ్ తివారీ రేసులో ఉన్నారు. మీర్జాపూర్లో వెనకబడిన వర్గాలు 49 శాతం, ఎస్సీ, ఎస్టీలు 25 శాతం ఉంటారు.కుషీనగర్... హోరాహోరీగౌతమ బుద్ధుడు మహాపరినిర్వాణం (శరీర త్యాగం) చేసిన చోటు కావడంతో ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు, పర్యాటకులు ఏటా భారీగా వస్తుంటారు. 2008లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో కాంగ్రెస్ బోణీ కొట్టగా 2014, 2019ల్లో బీజేపీ పాగా వేసింది. సిట్టింగ్ ఎంపీ విజయ్ కుమర్ దూబే ఈసారీ బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి అజయ్ ప్రతాప్ సింగ్ (పింటూ). బీఎస్పీ నుంచి శుభ్ నారాయణ్ చౌహాన్ పోటీ చేస్తున్నారు. బీఎస్పీ చీల్చే ఓట్లు కీలకం కానున్నాయి.పోలింగ్ జరిగే మొత్తం స్థానాలు...మహారాజ్‌గంజ్, గోరఖ్‌పూర్, కుషీనగర్, దేవరియా, బన్స్‌గావ్ (ఎస్సీ), ఘోసి, సలేంపూర్, బలియా, ఘాజిపూర్, చందౌలీ, వారణాసి, మీర్జాపూర్, రాబర్ట్స్‌గంజ్ (ఎస్సీ)– సాక్షి, నేషనల్ డెస్క్ -
రేపు ఏడో విడత బొగ్గు గనుల వేలం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఏడో విడత బొగ్గు గనులను ఈ నెల 29న వేలం వేయనుంది. వేలం ద్వారా 106 బొగ్గు గనులను ఆఫర్ చేయనుంది. ఆరో విడతలో వేలం వేసిన 28 బొగ్గు గనులకు సంబంధించి ఒప్పందాలపై అదే రోజు సంతకాలు చేయనున్నట్టు బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ 28 బొగ్గు గనుల్లో గరిష్టంగా 74 మిలియన్ టన్నుల మేర వార్షిక బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుందని పేర్కొంది. ఏటా వీటి నుంచి రూ.14,497 కోట్ల ఆదాయం వస్తుందని.. కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత లక్ష మందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించింది. ఇక ఏడో విడత వేలానికి ఉంచే 106 బొగ్గు గనుల్లో 61 గనులు కొంత వరకు అన్వేషించినవి కాగా, 45 గనుల్లో అన్వేషణ పూర్తయినట్టు బొగ్గు శాఖ తెలిపింది. మొత్తం 106 గనుల్లో 95 నాన్ కోకింగ్ కోల్, ఒకటి కోకింగ్ కోల్, 10 లిగ్నైట్ గనులుగా వెల్లడించింది. -
ఉత్తర్ ప్రదేశ్ చివరి దశ ఎన్నికల పోలింగ్
-
బెంగాల్ ఏడో దశ ఎన్నికల్లో భారీగా పోలింగ్
కోల్‌కతా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఏడో దశ పోలింగ్ శాతం భారీగా నమోదైంది. 34 అసెంబ్లీ స్థానాలకు 75.6 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికలు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 259 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఈనెల 29న 35 స్థానాలకు చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ► పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఏడో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 5:30 గంటల వరకు 75.06 శాతం పోలింగ్ నమోదైంది. నేడు ఐదు జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ► బెంగాల్లో ఏడో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీగా తరలి వస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు 36.02 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. బెంగాల్‌లోని 5 జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ► పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఏడో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు. భోవానిపూర్ నియోజకవర్గ టీఎంసీ అభ్యర్థి శోభండేబ్ చటోపాధ్యాయ్ మన్మతానాథ్ నందన్ పాఠశాలలోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో ప్రస్తుత సీఎం మమతా బెనర్జీ ఈ నియోజకవర్గంలో గెలుపొందిన విషయం తెలిసిందే. కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఏడో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఏడో దశ ఎన్నికల పోటీలో 284 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ దశలో పోలింగ్‌లో 86 లక్షలమంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 12,068 పోలింగ్ బూత్‌ల ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హింసాత్మక సంఘటనల దృష్ట్యా.. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తోంది -
ఆఖరి దశలో నువ్వా? నేనా?
ఏడో దశ లోక్‌సభ ఎన్నికలు పాలకపక్షమైన బీజేపీకి, ప్రతిపక్షాలకు కూడా కీలకమైనవి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నేతృత్వంలోని ఎన్డీఏకు ఈ దశలో అనుకూల పరిస్థితి ఉందని కొందరు చెబుతుంటే, బీజేపీ పాలనపై జనంలో వ్యతిరేకత వ్యక్తమౌతోందని రాజకీయ పండితులు మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్ పూర్తయ్యే 542 సీట్లలో బీజేపీ సహా ఎన్డీఏకు 240 వరకూ వస్తాయని, కాంగ్రెస్‌కు వంద మించవని ఓ పక్కఅంచనాలు నడుస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకుగాని, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏకు గాని మెజారిటీకి దగ్గరగా సీట్లు రాని పక్షంలో ఏ కూటమికీ చెందని ప్రాంతీయపక్షాలు కొత్త ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తాయని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కిందటి లోక్‌సభ ఎన్నికల తర్వాత 5 రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితుల్లో గణనీయ మార్పులు వచ్చాయి. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారం కోల్పోయింది. ఈ రెండు చోట్లా కాంగ్రెస్ విజయం సాధించింది. ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. 2017లో జేడీయూ, ఆర్జేడీ కూటమి సర్కారు రాజీనామా చేశాక మళ్లీ నితీశ్‌కుమార్ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ సర్కారులో జేడీయూతో బీజేపీ, ఎల్జేపీ చేతులు కలిపాయి. యూపీలో 13 సీట్లూ కీలకమే! ఇక్కడ ఆఖరి దశ పోలింగ్ జరిగే 13 సీట్లను గతంలో బీజేపీ గెలుచుకుంది. మీర్జాపూర్లో బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ నాయకురాలు అనుప్రియా పటేల్ విజయం సాధించారు. కిందటేడాది గోరఖ్‌పూర్ ఉప ఎన్నికలో సమాజ్‌వాదీపార్టీ(ఎస్పీ) విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో ఈ 13 సీట్లలో 8 చోట్ల మాయావతి నేతృత్వంలోని బహుజన్‌సమాజ్ పార్టీ(బీఎస్పీ) రెండో స్థానంలో నిలవగా, ఎస్పీ మూడు స్థానాల్లో ద్వితీయ స్థానం ఆక్రమించింది. కాంగ్రెస్, ఆప్ చెరొక స్థానంలో రెండో స్థానంలో నిలిచాయి. మిగిలిన దశల్లో మాదిరిగానే ఎస్పీ, బీఎస్పీ కూటమి అన్ని స్థానాల్లో కలిసి పోటీచేస్తూ బీజేపీకి గట్టి పోటీ ఇస్తోంది. కాంగ్రెస్ ఒంటరి పోరు సాగిస్తోంది. ఈ దశలో పోలింగ్ జరిగే సీట్లలో ప్రధాని మోదీ రెండోసారి పోటీచేస్తున్న వారణాసి మళ్లీ దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఇక్కడ ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఎస్పీ గట్టి అభ్యర్థులను బరిలో నిలపలేదు. మోదీ మెజారిటీ పెంచడమే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. బిహార్‌లో రెండు చోట్ల హోరాహోరీ చివరి దశలో పోలింగ్ జరిగే బిహార్‌లోని 8 నియోజకవర్గాలు: పట్నా సాహిబ్, పాటలీపుత్ర, ఆరా, జెహానాబాద్, కర్కట్, బుక్సర్, సాసారామ్, నలందాలో బీజేపీ కిందటిసారి తన పూర్వ మిత్రపక్షమైన రాష్ట్రీయలోక్‌సమతా పార్టీ(ఆరెలెస్పీ)తో కలిపి ఏడు సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీకి ఐదు, ఆరెలెస్పీకి రెండు దక్కాయి. జేడీయూ ఒక స్థానంలో విజయం సాధించింది. ఆర్ఎల్ఎస్పీ ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి ఆర్జేడీ కూటమిలో చేరింది. 2014లో బీజేపీ టికెట్‌పై పోటీచేసిన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్లీ పట్నా సాహిబ్ బరిలోకి దిగారు. ఆయనపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. కిందటి ఎన్నికల్లో పాటలీపుత్రలో ఓడిపోయిన ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కూతురు మీసా భారతి(ఆర్జేడీ) మళ్లీ పోటీచేస్తున్నారు. గతంలో ఆమెను ఓడించిన ఆర్జేడీ మాజీ నేత రామ్‌కపాల్ యాదవ్ బీజేపీ టికెట్‌పై రెండోసారి పోటీకి దిగారు. కేంద్ర మాజీ మంత్రి, దళిత నేత బాబూ జగ్జీవన్‌రామ్ కూతురు, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ మళ్లీ సాసారామ్ నుంచి పోటీకి దిగారు. 2014లో ఆమెను ఓడించిన బీజేపీ అభ్యర్థి ఛేదీ పాస్వాన్ ఈసారి కూడా బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. సీఎం నితీశ్‌కుమార్ సొంతూరు కల్యాణ్బీఘా ఉన్న నలందా స్థానంలో మాత్రమే ఆయన పార్టీ గెలిచింది. కిందటిసారి పది వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచిన జేడీయూ నేత కౌశలేంద్ర కుమార్ మళ్లీ పోటీచేస్తుండగా, ఆయనకు మారిన పరిస్థితుల్లో బీజేపీ మద్దతు ఉంది. ఆయనకు ఆర్జేడీ కూటమిలోని హిందూస్థానీ ఆవామ్ మోర్చా(సెక్యులర్) అభ్యర్థి అశోక్ కుమార్ ఆజాద్ గట్టి పోటీ ఇస్తున్నారు. మిగిలిన అన్ని సీట్లలోనూ బీజేపీ–జేడీయూ కూటమి, మహా కూటమి మధ్య గట్టి పోటీ ఉంది. మధ్యప్రదేశ్‌లో ఎనిమిదీ బీజేపీ గెలిచిన సీట్లే ఈ రాష్ట్రంలో చివరి దశలో పోలింగ్ జరిగే 8 సీట్లు: దేవాస్, ఉజ్జయినీ, మంద్సోర్, రత్లామ్, ధార్, ఇండోర్, ఖర్గోన్, ఖండ్వా. 2014లో ఈ ఎనిమిది స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంది. ఈ సీట్లన్నీ మాల్వా–నిమాఢ్ ప్రాంతంలో ఉన్నాయి. 2015లో రత్లామ్(ఎస్టీ) స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. కిందటేడాది చివర్లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 66 స్థానాల్లో కాంగ్రెస్ 35, బీజేపీ 21 సీట్లు కైవసం చేసుకున్నాయి. దళితులు, ఆదివాసీలు గణనీయ సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతంలోని సీట్లలో రెండింటిని ఎస్సీలకు, మూడింటిని ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఎస్సీ స్థానమైన దేవాస్‌లో ప్రపంచ ప్రఖ్యాత కబీర్ దోహాల గాయకుడు ప్రహ్లాద్‌సింగ్ టిపానియా కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్నారు. పద్మశ్రీ అవార్డు పొందిన టిపానియా ఎన్నికల ప్రచారంలో తన పాటలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. జనరల్ స్థానాలైన ఖండ్వా, ఇండోర్‌లో కూడా బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఖండ్వాలో కేంద్ర మాజీ మంత్రి, పీసీసీ మాజీ నేత అరుణ్ యాదవ్(కాంగ్రెస్) రెండోసారి పోటీచేస్తున్నారు. ఇండోర్ నుంచి గతంలో వరుసగా 8 సార్లు గెలిచిన లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈసారి పోటీలో లేరు. మంద్సోర్ నుంచి 2009లో గెలిచిన యువజన కాంగ్రెస్ మాజీ నేత మీనాక్షీ నటరాజన్(కాంగ్రెస్) మూడోసారి బరిలోకి దిగారు. 2014లో ఆమె బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. బెంగాల్లో భీకర పోరు 2014లో మొత్తం 9 స్థానాలనూ పాలకపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది. కోల్‌కతా దక్షిణ్, కోల్‌కతా ఉత్తర్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఈ దశ ఎన్నికల ప్రచారాన్ని తృణమూల్, బీజేపీ దూకుడుగా నిర్వహించాయి. అనేక చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 42 సీట్లలో 21 కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో మోదీ–అమిత్‌షా ద్వయం బెంగాల్లో తృణమూల్ నాయకురాలు, సీఎం మమతా బెనర్జీతో ఢీ అంటే ఢీ అంటూ తీవ్ర స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దమ్‌దమ్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ తృణమూల్ సభ్యుడు, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మళ్లీ పోటీలో ఉన్నారు. చివరి దశలోని అన్ని సీట్లలోనూ తృణమూల్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ సాగుతోంది. పంజాబ్‌లో కాంగ్రెస్, అకాలీ–బీజేపీ కూటమి రాష్ట్రంలోని 13 లోక్‌సభ స్థానాల్లో 2014లో ఆప్ 4 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టించింది. అకాలీ–బీజేపీ కూటమి ఐదు, కాంగ్రెస్ నాలుగు సీట్లు గెలుచుకున్నాయి. అయితే, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ప్రస్తుతం పోటీ కాంగ్రెస్, అకాలీదళ్–బీజేపీ కూటమి మధ్యనే ఉంది. అకాలీ మాజీ డెప్యూటీ సీఎం, మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ కొడుకు సుఖ్బీర్ సింగ్ బాదల్ ఫిరోజ్‌పూర్ నుంచి, సుఖ్బీర్ భార్య, కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బఠిండా నుంచి, కేంద్ర మాజీ మంత్రి హర్దీప్సింగ్ పురీ(బీజేపీ)అమత్సర్ నుంచి పోటీకి దిగారు. పదేళ్ల తర్వాత 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన అకాలీదళ్ కనీసం మూడు సీట్లు గెలవాలనే పట్టుదలతో ఉంది. వేడెక్కిన హిమాచల్ మొత్తం 4 సీట్లున్న హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, కాం గ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంది. 2014లో నాలుగు సీట్లనూ(సిమ్లా, మండీ, హమీర్పూర్, కాంగ్ఢా) బీజేపీ కైవసం చేసుకుంది. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. బీజేపీ పాలనలోని హిమాచల్‌లో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వృద్ధ నేత సుఖ్రామ్ మనవడు ఆశ్రయ్శర్మ మండీ నుంచి పోటీచేస్తుండగా, మాజీ సీఎం ప్రేమ్‌కుమార్ ధూమల్ కొడుకు, బీజేపీ సిట్టింగ్ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ హమీర్పూర్ నుంచి మరోసారి పోటీకి దిగారు. ఝార్ఖండ్‌లో ఆదివాసీ సీట్లు రెండు ఈ రాష్ట్రంలోని 14 సీట్లలో చివరి 3 స్థానాలకు ఆఖరి దశలో పోలింగ్ జరుగుతోంది. రాజ్‌మహల్, దూమ్కా ఆదివాసీలకు రిజర్వ్ చేసిన స్థానాలు. మూడో సీటు గొడ్డా జనరల్ నియోజకవర్గం. 2014లో ఎస్టీ సీట్లు రెండింటిని మాజీ సీఎం శిబూ సోరెన్ నేతృత్వంలోని ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కైవసం చేసుకుంది. గొడ్డాలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించి తొలిసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా బీజేపీ–ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ కూటమి అన్ని సీట్లకూ పోటీచేస్తోంది. కాంగ్రెస్ కూటమిలో జేఎంఎం, ఆర్జేడీతో పాటు తొలి ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ నాయకత్వంలోని జేవీఎం(పీ) చేరింది. కూటమి తనకు కేటాయించని ఒక సీటులో ఆర్జేడీ పోటీకి దిగింది. చండీగఢ్‌లో కిరణ్ ఖేర్ ఎదురీత? 2014 ఎన్నికల్లో త్రిముఖ పోటీలో విజయం సాధించిన సినీనటి కిరణ్ ఖేర్(బీజేపీ) ప్రస్తుత ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ ఓటర్లలో, పార్టీ కార్యకర్తల్లో ఆమెపై అసంతృప్తి కారణంగా ఆమె గెలుపునకు బాగా కష్టపడాల్సి వస్తోంది. 2019లో కూడా త్రిముఖ పోటీ నెలకొంది. ఆమెపై కాంగ్రెస్ పాత ప్రత్యర్థి కేంద్ర మాజీ మంత్రి పవన్‌కుమార్ బన్సల్ పోటీచేస్తున్నారు. ఆప్ తరఫున బలమైన అభ్యర్థి హర్మోహన్ ధవన్ బరిలోకి దిగారు. కిందటిసారి తన ప్రత్యర్థులిద్దరి మధ్య ఓట్లు చీలిపోవడంతో కిరణ్ 69 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. గతంలో నాలుగుసార్లు చండీగఢ్ నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి బన్సల్‌పై కూడా వ్యతిరేకత ఉంది. -
స్విస్ బ్యాంక్‌లో రూ.7 కోట్ల డిపాజిట్లు..!
సాధారణంగా అక్రమ సంపాదనపరులు తమ నల్లడబ్బును స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటారని అంటుంటారు. అక్కడి బ్యాంకుల్లో సొమ్మున్నట్టు బహిరంగంగా ఎవరూ చెప్పుకోరు. అయితే, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సునీల్ కుమార్ జాఖఢ్ మాత్రం తన భార్యకు స్విస్ బ్యాంకులో ఏడు కోట్ల రూపాయల విలువైన డిపాజిట్లు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో స్పష్టం చేశారు. తన భార్య సిల్వియా జాఖఢ్ పేరుమీద జ్యూరిక్ లోని జ్యూర్చర్ కాంటోనల్ బ్యాంకులో 7.37 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయని ఎన్నికల సంఘానికి సమర్పించిన అస్తిపాస్తుల వివరాల్లో వెల్లడించారు. మధ్య ప్రదేశ్ మాజీ గవర్నర్ బలరాం జాఖడ్ కుమారుడైన సునీల్ ఈ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీ. ఇక్కడ ఆయన ప్రముఖ బాలీవుడ్ హీరో సన్నీదేవల్తో తలపడుతున్నారు. స్విస్ బ్యాంకు సొమ్ము కాకుండా దేశంలోని వేర్వేరు బ్యాంకుల్లో 1.23 కోట్ల విలువైన డిపాజిట్లు ఉన్నాయని సునీల్ తెలిపారు. తన భార్యకు 12.06 కోట్ల విలువైన ఆస్తులున్నాయని పేర్కొన్నారు. ఇక సన్నీడియోల్ విషయానికి వస్తే ఆయనకు 60.46 కోట్ల విలువైన చరాస్తులు,21 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య లిండా దేవల్‌కు 5.72 కోట్లు ఉన్నాయి. సన్నీదేవల్కు మొత్తం 49.3 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆయన భార్య పేరు మీద 1.66 కోట్ల అప్పులున్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. సన్నీ దేవల్ జీఎస్టీ కింద కోటి 7 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందట. -
మోదీ–రాహుల్ ప్రచార మారథాన్
ప్రపంచంలోనే భారీ ఎన్నికల్లో ప్రచారం కూడా అదే తారస్థాయిలో సాగింది. ఈసారి ‘అబ్‌కీబార్ 300 పార్’’ నినాదంతో తన చివరి ప్రచార యాత్రను శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్లో ముగించిన నరేంద్రమోదీ ఎన్నికల మారథాన్ 51 రోజుల్లో 144 ర్యాలీలూ, రోడ్డుషోలతో సుదీర్ఘ సంచలనంగా సాగింది. మార్చి 28న ప్రారంభమైన మోదీ ప్రచారం మూడొంతులు రెండు రాష్ట్రాల్లోనే వెచ్చించడం విశేషం. యూపీ, పశ్చిమబెంగాల్‌లలోనే మోదీ మూడొంతుల ప్రచారం సాగడం యాదృచ్ఛికం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 25 రాష్ట్రాలూ, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 1,05,000 కిలోమీటర్లు మోదీ ప్రయాణించగా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 23 రాష్ట్రాలూ, రెండు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 128 బహిరంగసభల్లో పాల్గొన్నారు. రాహుల్ కంటే 16 సభలు ఎక్కువగా పాల్గొన్న మోదీ! మార్చి 28న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మోదీ తొలిసారిగా ఈ ఎన్నికల ప్రచారఅంకాన్ని ప్రారంభించి ఈ శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్లో ప్రచారాన్ని ముగించే సరికి 144 ర్యాలీలూ, రోడ్డుషోల్లో్లనూ మోదీ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ కంటే అధికంగా 16 సభల్లో మోదీ పాల్గొన్నారు. అయితే ఈ రెండు ప్రధాన పార్టీల అధినేతలూ అత్యధిక లోక్‌సభ స్థానాలున్న యూపీలోనే అత్యధిక సభల్లో పాల్గొనడం గమనార్హం. మోదీ ప్రచార హోరు... మధ్యప్రదేశ్‌లో ఈ శుక్రవారం ఎన్నికల ప్రచార పర్వం ముగిసే సరికి మోదీ మొత్తం 1.5 కోట్ల మంది ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించినట్టు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించారు. ఆర్నెల్ల క్రితం కాంగ్రెస్ అధికారపగ్గాలు చేపట్టిన మధ్యప్రదేశ్, రాజస్థాన్లపైనే మోదీ దృష్టి అంతా కేంద్రకీరించారు. రాజస్థాన్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 9 ర్యాలీల్లో మోదీ పాల్గొన్నారు. 2019 ఎన్నికల పర్వంలో పశ్చిమ యూపీలో తొలి నాలుగు దశల్లో కలిపి యూపీలో మొత్తం 11 ర్యాలీల్లో పాల్గొంటే, చివరి మూడు దశల్లో అన్ని రాష్ట్రాలకంటే అధికంగా తూర్పు ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 18 ఎన్నికల ర్యాలీల్లో మోదీ పాల్గొని రికార్డు సృష్టించారు. దేశంలోనే అత్యధిక(80) లోక్‌సభ స్థానాలున్న యూపీలో మొత్తం అన్ని దశల్లో కలిపి 29 ర్యాలీల్లో మోదీ పాల్గొన్నారు. ప్రధాని మోదీ కేంద్రీకరించిన మరో రాష్ట్రం పశ్చిమబెంగాలే. యూపీ తరువాత 42 లోక్‌సభ స్థానాలున్న పశ్చిమబెంగాల్లో గెలుపుకోసం అహరహం శ్రమించిన ప్రధాని నరేంద్రమోదీ 17 ర్యాలీల్లో పాల్గొని మమతా బెనర్జీ కోటలో ప్రకంపనలు సృష్టించారు. 40, 48 సీట్లున్న పెద్ద రాష్ట్రాలైన బిహార్‌లో 10 ర్యాలీల్లోనూ, మహారాష్ట్రలో 9 రాష్ట్రాల్లోనూ మోదీ ప్రచారంలో పాల్గొన్నారు. నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్(యూ), శివసేనలో పొత్తు నేపథ్యంలో మోదీ ప్రచార భారాన్ని కొంత బిహార్ ముఖ్యమంత్రి, మహారాష్ట్రలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పంచుకున్నట్టు తెలుస్తోంది. రాహుల్ ర్యాలీ జోరు... ఉత్తర ప్రదేశ్‌పై బీజేపీ లాగానే కాంగ్రెస్ కూడా కీలకంగా దృష్టి సారించింది. యూపీలో మొత్తం 19 ర్యాలీల్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అందులో ఆరు ర్యాలీలు రాహుల్ సొంత నియోజకవర్గమైన అమేథీలోనూ, రెండు రాయబరేలీ, రెండు సుల్తాన్పూర్, రెండు బారాబంకీ నియోజకవర్గాల్లోనూ పాల్గొన్నారు. రాహుల్ మధ్య ప్రదేశ్‌లో 17 ర్యాలీలూ, రాజస్తాన్‌లో 12 ర్యాలీల్లో మోదీ దీటుగా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ రోజుకి 3 నుంచి 4 ర్యాలీలతో ప్రచారాన్ని ప్రారంభించి రెండు సందర్భాల్లో మాత్రం రోజుకి ఐదు ర్యాలీల్లో పాల్గొన్నారు. మోదీ మొత్తం ప్రచారంలో మధ్య మధ్యలో కేవలం 3 నుంచి 4 రోజులు మాత్రమే విరామం తీసుకున్నారు. నింగీ నేలా మార్గాన మోదీ ఈ ప్రచారంలో మొత్తం 100,500 కిలోమీటర్లను కవర్‌చేశారు. అత్యధికంగా ఏప్రిల్ 18న మోదీ 4000 కిలోమీటర్లు సుదీర్ఘంగా ప్రయాణించారు. గుజరాత్‌లోని అమ్రేలీ నుంచి కర్నాటకలోని బాగల్కోట్, చిక్కోడీ, కేరళలోని తిరువనంతపురంలకు మోదీ ఈ ఎన్నికల మొత్తం ప్రచారంలో అత్యధిక కిలోమీటర్లు ప్రయాణించడం విశేషం. మోదీ సభలన్నింటిలో అత్యధిక మంది జనం హాజరయ్యింది ఏప్రిల్ 3న కోల్‌కతాలో జరిగిన సభ. ఈ సభకి 5 లక్షల మంది ప్రజలు హాజరైనట్టు బీజేపీ ప్రకటించుకుంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా సైతం జనవరి 6 నుంచి మార్చి 8 వరకు దాదాపు 61 సభల్లో ప్రసంగించారు. 43 ఇతర రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్నికల ప్రకటన అనంతరం అమిత్ షా మొత్తం 161 ర్యాలీల్లోనూ, 18 రోడ్‌షోల్లోనూ పాల్గొన్నారు. రోజుకి సగటున 1,166 కిలోమీటర్ల చొప్పున, మొత్తం 158,000 కిలోమీటర్లు అమిత్ షా ప్రయాణించారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 129 ర్యాలీలూ, నితిన్ గడ్కారీ 56 ర్యాలీలూ, సుష్మాస్వరాజ్ 23 ర్యాలీల్లోనూ పాల్గొన్నారు. యోగీ ఆదిత్యనాథ్ 135 ర్యాలీల్లో పాల్గొన్నారు. -
పంజా విసిరేదెవరు?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవా తక్కువగా ఉన్న రాష్ట్రం పంజాబ్ ఒక్కటే. శిరోమణి అకాలీదళ్‌తో పొత్తు ఉన్న బీజేపీ ఈ రాష్ట్రంలో జూనియర్ ప్లేయర్ మాత్రమే. మొత్తం 13 ఎంపీ స్థానాలకు గాను బీజేపీ మూడు సీట్లలోనే పోటీచేస్తోంది. మిగిలిన 10 సీట్లలో ఎస్ఏడీ అభ్యర్థులే బరిలో ఉన్నారు. పాకిస్తాన్‌కు సరిహద్దు రాష్ట్రంగా ఉండడంతో అక్కడ విభిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. పుల్వామా దాడులు అక్కడ ఎన్నికల అంశమే కాదు. ఎందుకంటే పాకిస్తాన్‌తో పంజాబీ ప్రజలెవరూ యుద్ధం కోరుకోవడం లేదు. శాంతి మంత్రాన్నే వారు జపిస్తున్నారు. పొరుగు దేశంతో యుద్ధం వస్తే పంజాబ్ మీదే అత్యధిక ప్రభావం కనబడుతుంది. అందుకే ఈ సారి మోదీ రూటు మార్చారు. ప్రచారంలో జాతీయ భద్రత అంశాలను పక్కన పెట్టి రాజీవ్‌గాంధీ నం.1 అవినీతిపరుడని, సిక్కుల ఊచకోత అంశాన్ని ప్రస్తావించారు. రెండేళ్ల క్రితం ఎస్ఏడీ–బీజేపీ కూటమి నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ హయాంలో పాలనపరమైన లోపాలు ఎంచడానికి పెద్దగా ఏం లేవు. దీంతో ఇక్కడ కాంగ్రెస్, ఎస్ఏడీ–బీజేపీ మధ్యే హోరాహోరి పోరు నెలకొంది. ఎస్ఏడీలో చీలికలు ఆ పార్టీకి చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఖదూర్ సాహిబ్ ఎంపీ రంజిత్‌సింగ్ బ్రహ్మపుర, మాజీ ఎంపీ రతన్ సింగ్ అజనాల, మాజీ మంత్రి సేవా సింగ్ షెఖ్వాన్తో కలిసి శిరోమణి అకాలీ దళ్ (తక్సాలీ) పేరుతో కొత్త పార్టీ పెట్టి సిక్కు ఓటర్లను ప్రభావితం చేయడానికి తమ వంతు ప్రయత్నాలు విస్తృతంగా చేసింది. అంతర్గత పోరుతో ఆప్ సతమతం గత లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు సీట్లు గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సారి అంతర్గత పోరాటంతో సతమతమవుతూ చతికిలపడిపోయింది. పార్టీలో అంతర్గతంగా అసమ్మతి సెగలు, బహిరంగంగా తిరుగుబాట్లు ఆ పార్టీని ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. గత ఏడాది ఆప్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా నేతృత్వంలోని ఏడుగురు ఎమ్మెల్యేలు పంజాబ్ ఏక్తా పార్టీ పేరుతో వేరు కుంపటి పెట్టారు. మరో నాలుగు పార్టీలతో కలిసి వారు ఈ సారి ఎన్నికల బరిలో దిగారు. దీంతో ఈ సారి ఆప్ పెద్దగా పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. సంగ్రూర్‌లో సిట్టింగ్ ఎంపీ భగవత్ మన్పై మాత్రమే ఆప్ ఆశలు పెట్టుకుంది. మొత్తమ్మీద ప్రధాన ప్రతిపక్షాల్లో అంతర్గత పోరే ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కి వరంలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంజాబ్ డెమొక్రటిక్ అలయెన్స్ ప్రభావం ఎంత ? బీఎస్పీ, సీపీఐ, పంజాబ్ ఏక్తా పార్టీ, లోక్ ఇన్సాఫ్ పార్టీ, పంజాబ్ ఫ్రంట్ అండ్ రివల్యూషనరీ మార్క్సిస్టు పార్టీలు కలిసి పంజాబ్ డెమొక్రటిక్ అలయెన్స్ పేరుతో కొత్త కూటమిగా ఏర్పడ్డాయి. ఈ పార్టీ అ«భ్యర్థులు ఇల్లిల్లు తిరుగుతూ కొత్త తరహాలో ప్రచారం చేశారు. పంచకుల హింసపై విచారణతో పాటు గంజాయి సాగుని చట్టబద్ధం చేయాలన్న డిమాండ్‌తో భిన్న తరహాలో ఎన్నికల బరిలో దూసుకుపోతున్నారు. ఈ పార్టీలకు సీట్లు గెలుచుకునే అవకాశాలు లేనప్పటికీ, ఎవరి ఓటు బ్యాంకు ఎంత చీలుస్తాయన్నదే ఆసక్తికరంగా మారింది. ఎన్నికల అంశాలు రైతు ఆత్మహత్యలు పంజాబ్ ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ రాష్ట్రం. మొత్తం 10.5 లక్షల కుటుంబాలకు వ్యవసాయమే జీవనాధారం. సగటున రోజుకి ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. నిరుద్యోగం భారత్‌లో సగటు నిరుద్యోగం రేటు 10.2%గా ఉంటే పంజాబ్‌లో 16శాతంగా ఉంది. ఈ నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరకకపోవడంతో యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి పెడదారిన పడుతున్నారు. సరిహద్దు ఉద్రిక్తతలు పుల్వామా దాడుల అనంతరం పాక్‌కి అత్యంత సానుకూల దేశం హోదాని భారత్ తొలగించింది. దీంతో ఇరుదేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. కొన్ని వందల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. డ్రగ్స్ మాఫియా పంజాబ్ పేరు వింటేనే డ్రగ్స్ మాఫియా గుర్తుకొస్తుంది. మార్కెట్లోకి కృత్రిమ డ్రగ్స్ ప్రవేశించి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. మాదకద్రవ్యాలు సేవించి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. సగటున ఏడాదికి 60 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే గంజాయి సాగుని చట్టబద్ధం చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. పంచకుల కాల్పులు ఇద్దరు సా«ధ్వీలపై అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా అధినేత రాం రహీమ్ గుర్మీత్ సింగ్‌ను దోషిగా తేల్చిన నేపథ్యంలో ఏడాదిన్నర క్రితం పంజాబ్ రాష్ట్రం అట్టుడికింది. గుర్మీత్ సింగ్ అనుచరులు వీరంగం సృష్టించారు.ఈ సందర్భంగా చెలరేగిన హింసలో వందల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకారుల్ని అదుపు చెయ్యడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో కూడా కొందరు చనిపోయారు. మొత్తం నియోజకవర్గాలు : 13 గురుదాస్‌పూర్, అమృత్సర్, ఖదూర్ సాహిబ్, జలంధర్, హోషియార్పూర్, ఆనందపూర్ సాహిబ్, లూదియానా, ఫతేగఢ్ సాహిబ్, ఫరీద్కోట్, ఫిరోజ్‌పూర్, భటిండా, సంగ్రూర్, పాటియాలా ఓటర్ల సంఖ్య: 2.03 కోట్లు -
ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించే ఎనిమిది సీట్లు!
మధ్యప్రదేశ్ చివరి దశ కీలకం లోక్‌సభ ఎన్నికల చివరి దశలో మధ్యప్రదేశ్‌లోని 8 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. దళితులు, ఆదివాసీల జనాభా అధికంగా ఉన్న ఈ స్థానాలు రాజస్తాన్, మహారాష్ట్ర వైపు ఉన్న మాల్వా–నిమాఢ్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ఎనిమిది సీట్లలో రెండింటినీ ఎస్సీలకు, మూడింటిని ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఎస్సీ సీట్లు: దేవాస్, ఉజ్జయిన్, ఎస్టీ సీట్లు: రత్నామ్, ధార్, ఖర్గోన్. మిగిలిన మందసోర్, ఇండోర్, ఖండ్వా జనరల్ స్థానాలు. 2014 ఎన్నికల్లో ఈ 8 సీట్లనూ బీజేపీ కైవసం చేసుకుంది. 2018 చివర్లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రాంతంలోని 66 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 2013లో 56 గెలుచుకుంది. 2018లో 21 సీట్లలోనే విజయం సాధించింది. కాంగ్రెస్ తన బలాన్ని 9 నుంచి 35 సీట్లకు పెంచుకోగలిగింది. ఈ ప్రాంతం దేశ మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుందనే పేరుంది. 2009 ఎన్నికల్లో ఇక్కడి 8 సీట్లలో ఆరు గెలుచుకున్న కాంగ్రెస్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు రెండు సీట్లే గెలిచిన బీజేపీ 2014 ఎన్నికల్లో మొత్తం సీట్లన్నీ గెలిచి ఢిల్లీలో గద్దెనెక్కింది. సిట్టింగ్ సభ్యులపై ప్రజా వ్యతిరేకత కారణంగా బీజేపీ ఈ ఎనిమిది సీట్లలో ఐదు చోట్ల కొత్త అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. ఇండోర్‌లో ‘తాయి’ లేని ఎన్నికలు 1989 నుంచీ వరుసగా 8 సార్లు ఇండోర్ నుంచి గెలిచిన లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ (తాయి) తనకు 76 ఏళ్లు నిండాయంటూ పోటీకి దిగలేదు. నగరానికి చెందిన మరో బడా నేత కైలాస్ విజయవర్గీయ కూడా ఎన్నికల బరిలో లేకపోవడంతో ‘తాయి(సుమిత్ర), భాయీ(కైలాస్)’ లేని ఎన్నికలని జనం అనుకుంటున్నారు. బీజేపీ టికెట్‌పై సింధీ వర్గానికి చెందిన శంకర్ లాల్వాణీ, కాంగ్రెస్ అభ్యర్థిగా పంకజ్ సంఘ్వీ పోటీ చేస్తున్నారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి సత్యనారాయణ్ పటేల్‌పై 4 లక్షల 66 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో సుమిత్రా మహాజన్ గెలిచారు. రైతుల రుణ మాఫీ ఈ ఎన్నికల్లో ప్రధానాంశంగా మారింది. ఎన్నికల హామీ ప్రకారం అధికారం చేపట్టిన పది రోజుల్లో కమల్‌నాథ్ కాంగ్రెస్ సర్కారు రుణ మాఫీ చేయలేదని బీజేపీ అభ్యర్థి లాల్వాణీ ప్రచారం చేశారు. రుణ మాఫీ సక్రమంగా జరగకపోవడంతో కాంగ్రెస్ ఇబ్బంది పడుతుండగా, కొత్త అభ్యర్థి కావడంతో లాల్వాణీ విస్తృతంగా ప్రచారం చేయాల్సివచ్చింది. రెండుసార్లు నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి తరఫున సుమిత్రా మహాజన్ ప్రచారం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇండోర్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ సుమిత్రా తాయి మాత్రమే తనను మందలించగలరని చెప్పారు. 30 ఏళ్ల తర్వాత ఎలాగైనా ఇండోర్ సీటు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఖండ్వాలో పాత ప్రత్యర్థుల మధ్య పోటీ ఖండ్వాలో సిట్టింగ్ బీజేపీ ఎంపీ నంద్‌కుమార్ చౌహాన్, కాంగ్రెస్ అభ్యర్థి అరుణ్ యాదవ్ మధ్య మరోసారి ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. 2014లో యాదవ్‌ను 2 లక్షల 59 వేలకు పైగా ఓట్లతో చౌహాన్ ఓడించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా గతంలో పనిచేసిన యాదవ్ 2009లో అప్పటికి నాలుగుసార్లు గెలిచిన చౌహాన్‌ను ఓడించారు. మారిన పరిస్థితుల్లో యాదవ్‌కు గెలుపు అవకాశాలు మెరుగయ్యాయని కాంగ్రెస్ భావిస్తోంది. మన్మోహన్ కేబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు. ఆయన తండ్రి సుభాష్ యాదవ్ కూడా గతంలో పీసీసీ అధ్యక్షునిగా ఉన్నారు. ఇప్పుడు ఎస్టీ రిజర్వ్ సీటైన ఖర్గోన్ నుంచి 2007 ఉప ఎన్నికలో అరుణ్ లోక్‌సభకు ఎన్నికయ్యారు. దేవాస్‌లో కాంగ్రెస్ టికెట్‌పై కబీర్ దోహాల గాయకుడు ఎస్సీలకు కేటాయించిన మరో లోక్‌సభ స్థానం దేవాస్. కబీర్దాస్ దోహాలు పాడుతూ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన ప్రహ్లాద్‌సింగ్ టిపానియా కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేస్తున్న కారణంగా దేవాస్ ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సిట్టింగ్ సభ్యుడు మనోహర్ ఉంత్వాల్కు బదులు మాజీ సివిల్ జడ్జి మహేంద్రసింగ్ సోలంకీకి బీజేపీ టికెట్ ఇచ్చింది. 64 ఏళ్ల టిపానియా కబీర్ కవితలు పాడుతూ ఎన్నికల సభల్లో ప్రజలను అలరిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి మోదీ సర్కారు సాధించిన విజయాల గురించి వివరిస్తూ జడ్జిగా కన్నాఎంపీగా ఎక్కువ మందికి సేవచేయగలనని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ సభ్యుడు ఉంత్వాల్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సజ్జన్‌సింగ్ వర్మను ఓడించారు. ఈ స్థానంలో అధిక సంఖ్యలో ఉన్న బలాయీ దళిత కులానికి చెందిన టిపానియా, సోలంకీ మధ్య పోరులో కాంగ్రెస్ అభ్యర్థికే విజయావకాశాలు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఉజ్జయినీలో బీజేపీ కొత అభ్యర్థి ఫిరోజియా ఎస్సీలకు రిజర్వ్ చేసిన ఉజ్జయినీలో బీజేపీ సిట్టింగ్ సభ్యుడు చింతామణి మాల్వీయాకు బదులు ఈసారి అనిల్ ఫిరోజియాను బరిలోకి దింపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని కొత్త బీజేపీ నేతకు అవకాశమిచ్చారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రేంచంద్ గుడ్డూపై మాల్వీయా 3 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. కాంగ్రెస్ టికెట్‌పై ఈసారి బాబూలాల్ మాల్వీయా పోటీచేస్తున్నారు. బీజేపీ తరఫున పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కాంగ్రెస్ తరఫున ప్రియాంకాగాంధీ ఉజ్జయినీలో ప్రచారం చేశారు. మూడు ఎస్టీ సీట్లలో హోరాహోరీ ఆదివాసీలకు రిజర్వ్ చేసిన రత్నామ్, ధార్, ఖర్గోన్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య కూడా గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ కంచుకోట రత్నామ్లో 2015 ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కాంతిలాల్ భురియా విజయం సాధించారు. మళ్లీ 2019లో పోటీచేస్తున్న భురియాపై బీజేపీ తరఫున గుమన్‌సింగ్ డామోర్ పోటీకి దిగారు. కిందటి ఎన్నికల్లో బీజేపీ నేత దిలీప్‌సింగ్ భురియా గెలిచారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య చేతులు మారే స్థానం ధార్. ఇక్కడ బీజేపీ సిట్టింగ్ సభ్యురాలు సావిత్రీ ఠాకూర్‌కు బదులు ఛతర్సింగ్ దర్బార్‌ను పోటీలో నిలిపింది. ఆయన గతంలో రెండుసార్లు ఇక్కడ నుంచి గెలిచారు. కాంగ్రెస్ టికెట్‌పై దినేశ్ గిర్వాల్లో బరిలోకి దిగారు. ఈ స్థానంలో బీజేపీకి విజయావకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఖర్గోన్లో కూడా బీజేపీ కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపింది. గజేంద్ర పటేల్ (బీజేపీ), గోవింద్ ముజాల్దా(కాంగ్రెస్) మధ్య గట్టి పోటీ ఉంది. మంద్సోర్ శూరులెవ్వరో? మధ్యప్రదేశ్‌లోని మంద్‌సోర్‌లో ఆరుగురు రైతులు మరణించిన రెండేళ్ళ అనంతరం ఇప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం అందకపోవడం ఈ ఎన్నికల్లో తిరిగి చర్చనీయాంశంగా మారింది. నెత్తురోడిన రైతు కుటుంబాలు ఈ ఎన్నికల్లో బీజేపీపై వ్యతిరేకతతో ఉన్నాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు హోరాహోరీగా మారింది. మంద్సోర్ లోక్‌సభ స్థానం బీజేపీ జనసంఘ్‌కి బలమైన ప్రాంతం. బీజేపీ లక్ష్మినారాయణ పాండే 8 సార్లు ఈ లోక్‌సభ స్థానం నుంచి విజయపరంపరని కొనసాగించారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ బీజేపీని ఓడించి, ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నా, తరిగి బీజేపీ సుధీర్ గుప్తా 2014లో ఈ స్థానంలో గెలుపు బావుటా ఎగురవేశారు. తిరిగి ఈ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ నుంచి మీనాక్షి నటరాజన్ బరిలోకి దిగారు. బీజేపీ అభ్యర్థి సుధీర్ గుప్తా అభివృద్ధి మంత్రంతో జనంలోకి వెళ్ళారు. మంద్సోర్ లోక్‌సభ స్థానంలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ సీట్లున్నాయి. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా బీజేపీ ఎనిమిది అసెంబ్లీ సీట్లల్లో ఏడింటిని కైవసం చేసుకోవడం విశేషం. అయితే ఒక్క సీటు మినహా ఆరు సీట్లలో ఈ రెండు పార్టీల మధ్య కేవలం 2000 ఓట్ల తేడానే ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో సైతం ఓటింగ్ శాతం పెరిగితే అది బీజేపీకి అనుకూలించవచ్చుననీ, లేదంటే కాంగ్రెస్‌కి గెలుపు అవకాశాలుంటాయనీ, రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఏదిఏమైనా ఇక్కడ కాంగ్రెస్ బీజేపీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. -
రాహుల్ ఓ మూర్ఖుడు: హెగ్డే
సాక్షి, బెంగళూరు: రాహుల్ మూర్ఖుడు అంటూ కేంద్ర సహాయ మంత్రి, కర్ణాటకకు చెందిన అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్య కొత్త వివాదం రేపింది. ‘మోదీలైస్’ (మోదీ అబద్ధాలు) అనే కొత్తపదం ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీల్లోకి వచ్చిందంటూ రాహుల్ గురువారం ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్‌చేశారు. ఇంగ్లిష్‌లోనే మోదీలైస్ అనే పదం లేకున్నా ఆక్స్ఫర్డ్ నిఘంటువులో ఉందంటూ రాహుల్ నకిలీ ఫొటో పోస్ట్చేయడంపై హెగ్డే స్పందిస్తూ రాహుల్ గాంధీ మూర్ఖుడని, ప్రపంచంలో బుద్ధిహీనులుగా పేరొందిన వారిలో ఆయన ఒకరని వ్యాఖ్యానించారు. కాగా, మోదీలైస్ అనే పదం తమ డిక్షనరీల్లో దేంట్లోనూ లేదని ఆక్స్ఫర్డ్ స్పష్టంచేసింది. గాడ్సేను పొగుడుతూ హెగ్డే ట్వీట్ చేíసినా దానిని కొద్దిసేపటికే తొలగించారు. తన ఖాతా హ్యాకింగ్‌కు గురైందనీ, ఆ ట్వీట్ తాను చేయలేదని ఆయన చెప్పారు. రాజీవే పెద్ద హంతకుడు: బీజేపీ ఎంపీ గాడ్సేను ప్రస్తావిస్తూ కర్ణాటకకే చెందిన మరో బీజేపీ ఎంపీ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ‘గాడ్సే చంపింది ఒకరిని. ఉగ్రవాది అజ్మల్ కసబ్ చంపింది 72 మందిని. కానీ రాజీవ్ గాంధీ ఏకంగా 17 వేల మందిని హత్య చేశారు. ఈ ముగ్గురిలో ఎవరు అత్యంత క్రూరుడు?’ అని మంగళూరు ఎంపీ నళిన్ కుమార్ ట్వీట్ చేశారు. నెటిజన్లు, కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ట్వీట్‌ను తొలగించి, క్షమాపణలు చెబుతూ నళిన్ మరో ట్వీట్ చేశారు. గాంధీ.. పాక్ జాతిపిత: బీజేపీ ప్రతినిధి గాంధీజీ.. పాకిస్తాన్ జాతిపిత అంటూ బీజేపీ మీడియా వ్యవహారాల బాధ్యతలు చూసే అనిల్ సౌమిత్ర తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్‌పెట్టారు. భారత్‌లో గాంధీ వంటి వారు కోట్ల మంది పుట్టారని, వారిలో కొందరు దేశానికి ఉపయోగపడగా, మరికొందరు పనికిరానివారని సౌమిత్ర పేర్కొన్నారు. దీనిపై బీజేపీ తక్షణమే స్పందించింది. సౌమిత్రను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. -
ఎన్నికల ప్రచారానికి తెర
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఏడో విడత సార్వత్రిక ఎన్నికల ప్రచారం శుక్రవారంతో ముగిసింది. 38 రోజుల పాటు ఏకధాటిగా సాగిన ఎన్నికల ప్రచారానికి తెరపడింది. చివరి దశ ఎన్నికల్లో భాగంగా 7 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన 59 లోక్‌సభ స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. కోల్‌కతాలో బీజేపీ చీఫ్ అమిత్ షా సభ సందర్భంగా టీఎంసీ–బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణలతో బెంగాల్లో గురువారం రాత్రి 10 గంటల వరకే ఎన్నికల ప్రచారానికి ఈసీ అనుమతించింది. ఉత్తరప్రదేశ్(13), పంజాబ్(13), పశ్చిమబెంగాల్(9), బిహార్(8), మధ్యప్రదేశ్(8), హిమాచల్‌ప్రదేశ్(4), జార్ఖండ్(3)తో పాటు చండీగఢ్ సీటుకు ఏడో విడతలో భాగంగా మే 19న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. నేతల విస్తృత ప్రచారం.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 59 స్థానాల్లో బీజేపీ ఏకంగా 32 సీట్లను ౖకైవసం చేసుకుంది. బీజేపీని కేంద్రంలో అధికారానికి దూరంగా ఉంచడమే తమ లక్ష్యమనీ, తమకు ప్రధాని పదవిఅక్కర్లేదనీ కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ ఇటీవల చేసిన ప్రకటనను రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. విపక్షాల ఏకీకరణలో భాగంగానే హస్తం పార్టీ వ్యూహాత్మకంగా ఈ ప్రకటన చేసిందని చెబుతున్నారు. చివరి విడత ఎన్నికల్లో ప్రధాని మోదీ(వారణాసి)తో పాటు బీజేపీ నేతలు కిరణ్‌ఖేర్(చండీగఢ్), భోజ్‌పురి నటుడు రవికిషన్(గోరఖ్‌పూర్) కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా(ఘాజీపూర్) కాంగ్రెస్ నేత పవన్‌కుమార్ బన్సల్(చండీగఢ్)లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. -
ప్రాంతీయ పార్టీలు బీజేపీకి మద్దతివ్వవు
న్యూఢిల్లీ/సిమ్లా: లోక్‌సభ ఎన్నికల్లో లౌకికవాద పార్టీలు గరిష్టస్థాయిలో సీట్లు గెలుచుకుంటాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలసివస్తాయనే సంకేతాలిచ్చారు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ), సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ), తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) వంటి ప్రాంతీయ పార్టీలు బీజేపీకి మద్దతు ఇవ్వవన్నారు. రాహుల్ శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీకి ప్రజలిచ్చిన అవకాశాన్ని ఆయన వృథా చేశారన్నారు. గాంధీజీ భావజాలానికి, మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌లు పూర్తిగా విరుద్ధమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం (ఈసీ) పూర్తి పక్షపాతంతో వ్యవహరిస్తోందనీ, మోదీ ప్రచార సభలను దృష్టిలో పెట్టుకునే, ఆయనకు ఇబ్బంది కలగకుండా ఆదేశాలు ఇస్తోందన్నారు. ఈ నెల 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ప్రతిపక్షాల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయని ప్రశ్నించగా జవాబు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. అయితే తాము మోదీలా కాకుండా, సీనియర్ నాయకుల అనుభవాన్ని వాడుకుంటామని, మాజీ ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ తదితరుల సలహాలు తీసుకుంటామని తెలిపారు. మోదీ తప్పించుకోకుండా ఒక పద్ధతి ప్రకారం అన్ని ద్వారాలనూ మూసేయడమే తమ పార్టీ వ్యూహమని రాహుల్ చెప్పారు. ఇప్పటికే 90 శాతం ద్వారాలను తాము మూసివేయగా, మరో 10 శాతం ద్వారాలను మోదీ తనంతట తానే మూసేశారని వ్యాఖ్యానించారు. అంతకుముందు రాహుల్ మీడియాతో మాట్లాడుతూ మోదీ తొలిసారిగా విలేకరుల సమావేశానికి హాజరవుతుండటం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందనీ, అయితే కొందరు జర్నలిస్టులను ఆ భేటీకి రానివ్వడం లేదని తెలిసిందన్నారు. అవినీతిపై చర్చకు రండి.. రాహుల్ శుక్రవారం సిమ్లాలోని సోలన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవినీతిపై తనతో చర్చకు రావాలని మోదీకి సవాల్ విసిరారు. ‘నాకు 15 నిమిషాలు ఇవ్వండి. నేను నాలుగు ప్రశ్నలడుగుతాను. సమాధానం చెప్పడానికి మోదీ మూడు, నాలుగు గంటల సమయం తీసుకోవచ్చు. ఆ చర్చ తర్వాత మోదీ తన ముఖాన్ని దేశ ప్రజలకు చూపించలేరు’ అని రాహుల్ అన్నారు. వాళ్లు గాడ్సే ప్రేమికులు.. గాంధీజీని హత్య చేసిన గాడ్సేపై బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటాన్ని రాహుల్ ప్రస్తావిస్తూ ‘బీజేపీ, ఆరెస్సెస్ వాళ్లు దేవుడి ప్రేమికులు (గాడ్–కే–లవర్స్) కాదు, గాడ్సే ప్రేమికులు (గాడ్–సే–లవర్స్)’ అని వ్యంగ్యంగా అన్నారు. భోపాల్ బీజేపీ అభ్యర్ధి ప్రజ్ఞాఠాకూర్ గురువారం మాట్లాడుతూ గాడ్సే దేశభక్తుడని పేర్కొనడం, తీవ్ర విమర్శలు రావడంతో కొద్దిసేపటి తర్వాత ఆమె క్షమాపణలు చెప్పడం తెలిసిందే. -
కేంద్రంలో మళ్లీ మేమే
న్యూఢిల్లీ/ఖర్గోన్(మధ్యప్రదేశ్): బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వమే వరసగా రెండోసారి అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి 300పైగా సీట్లు గెలుచుకుంటుందని తెలిపారు. 2014లో ప్రధాని అయ్యాక జరిగిన మొట్టమొదటి మీడియా సమావేశంలో మోదీ పాల్గొన్నారు. షెడ్యూల్ ప్రకారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ చీఫ్ అమిత్‌షా నిర్వహించాల్సిన ఈ సమావేశంలో ప్రధాని కూడా పాల్గొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఆయన గత ఐదేళ్ల పాలనానుభవం, ప్రస్తుత ఎన్నికలు, ప్రచారం గురించి మాత్రమే మాట్లాడారు. బీజేపీలో పార్టీ అధ్యక్షుడే అంతా చూసుకుంటారని, విలేకరుల ప్రశ్నలకు అమిత్‌షాయే సమాధానమిస్తారని చెప్పారు. ప్రధానిగా అవకాశం ఇచ్చిన ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అంతా పార్టీ అధ్యక్షుడే చూస్తారు తమది క్రమశిక్షణ గల పార్టీ అని, అన్ని విషయాలను పార్టీ అధ్యక్షుడే చూసుకుంటారని ప్రధాని తెలిపారు. ‘మేం క్రమశిక్షణ గల పార్టీ సైనికులం. మాకు సర్వస్వం పార్టీ అధ్యక్షుడే. ఐదేళ్లపాటు ప్రధానిగా పనిచేసే అవకాశం ఇస్తూ ఆశీర్వదించిన మీ అందరికీ, మీద్వారా ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకే ఇక్కడికి వచ్చా. పూర్తి మెజారిటీతో ఒకే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడం గతంలో కొన్ని సార్లు మాత్రమే జరిగింది. ఈసారి 300పైగా సీట్లు తప్పకుండా గెలుచుకుంటాం. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుంది. ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. పగ్గాలు చేపట్టిన వెంటనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు కృషిచేస్తా’ అని తెలిపారు. ‘ప్రచారంలో నాకు మంచి అనుభవాలు ఎదురయ్యాయి. మా పార్టీ ప్రచారంపై ఎవరైనా పరిశోధన చేయదలచిన వారికి అనుమతి ఇవ్వాల్సిందిగా పార్టీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేస్తున్నా. ముందుగా అనుకున్న ప్రకారమే అన్ని కార్యక్రమాలను నిర్వహించాం. ఎన్నికల్లో బీజేపీ ప్రచారం అద్భుతంగా సాగింది. అందుకు వాతావరణం కూడా అనుకూలించింది’ అని అన్నారు. ‘ఎన్నికల సమయంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల వేదికలను వేరే దేశాలకు మార్చిన సందర్భాలున్నాయి. కానీ, ఈసారి ఎన్నికలతోపాటు ఐపీఎల్, రంజాన్ వంటివి ఏకకాలంలో ప్రశాంతంగా జరుగుతున్నాయి’ అని తెలిపారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. మన ప్రజాస్వామ్య శక్తి ప్రపంచానికి చూపించాల్సిన బాధ్యత మనకుంది. వైవిధ్యభరితమైన మన ప్రజాస్వామ్యంతో ప్రపంచాన్ని మెప్పించాలి’ అని అన్నారు. రఫేల్ ఒప్పందంపై ప్రధాని మోదీని ఓ విలేకరి ప్రశ్నించగా అమిత్ షా జోక్యం చేసుకుంటూ..అన్ని ప్రశ్నలకూ ప్రధాని సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అంతకుముందు ప్రధాని మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్లో జరిగిన చిట్టచివరి ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ఈసారి 300కు పైగా సీట్లను గెలుచుకుని వరసగా రెండోసారి అధికారంలోకి వస్తుందనే నమ్మకం తనకుందని అన్నారు. ‘కశ్మీర్ నుంచి కన్యాకుమారి, కచ్ నుంచి కామ్రూప్ వరకు ‘ఈసారి 300కు పైగా సీట్లు, మళ్లీ మోదీ ప్రభుత్వమే’ అని దేశం అంటోంది.130 కోట్ల భారతీయుల ఆకాంక్షే బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం. ఆదివారం మీరు ఓటేయడానికి వెళ్లి చరిత్రను లిఖిస్తా రు. దశాబ్దాల తర్వాత దేశంలో వరసగా రెండోసారి సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారు. ప్రసు ్తత ఎన్నికలు గతానికి పూర్తిగా భిన్నం. ఈసారి ప్రజలు ఏదో ఒక పార్టీ కోసం కాకుండా దేశం కోసం, నవ భా రత నిర్మాణం కోసం ఓటేస్తున్నారు’ అని తెలిపారు. ప్రజ్ఞాసింగ్‌ను క్షమించను: మోదీ మహాత్మాగాంధీని పొట్టనబెట్టుకున్న నాథూరామ్ గాడ్సేను దేశభక్తునిగా కీర్తించిన ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ను క్షమించలేనని ప్రధాని మోదీ తెలిపారు. ఖర్గోన్లో ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని..‘గాంధీజీ లేక గాడ్సేల గురించి ప్రజ్ఞాసింగ్ చెడ్డగా మాట్లాడారు. ఆవ్యాఖ్యలు ఖండించ దగినవి. సభ్య సమాజంలో ఇటువంటి భాష, ఆలోచనలకు తావులేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు ఒకటికి వందసార్లు ఆలోచించాలి. ఆమె ఇప్పటికే క్షమాపణ చెప్పినప్పటికీ, నేను మాత్రం మనస్ఫూర్తిగా క్షమించలేకపోతున్నా’ అని అన్నారు. మళ్లీ మోదీయే ప్రధాని: అమిత్‌షా నాథూరాం గాడ్సేను పొగుడుతూ భోపాల్ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థిని ప్రజ్ఞాసింగ్‌తోపాటు, కేంద్రమంత్రి అనంత్‌కుమార్ హెగ్డే, ఎంపీ నళిన్‌కుమార్ కటీల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, పార్టీ సిద్ధాంతాలకు అవి వ్యతిరేకమని మీడియా సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. పది రోజుల్లోగా ఈ విషయంలో వివరణ ఇవ్వాలంటూ పార్టీ క్రమశిక్షణ కమిటీ వారికి నోటీసులు జారీ చేసిందని తెలిపారు. అయితే, ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని, వాటికి పార్టీతో ఎటువంటి సంబంధం లేదన్నారు. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని అమిత్ షా తెలిపారు. ఈసారి 300పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని, మోదీయే మళ్లీ ప్రధాని అవుతారని అన్నారు. ‘ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ దేశ భద్రత విషయంలో రాజీపడింది. -
ప్రజల్నే పాలకులుగా చేస్తాం
పట్నా/న్యూఢిల్లీ/కుషినగర్/జైపూర్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలను పాలకులుగా చేస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే న్యాయ్ పథకం అమలు చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త జవసత్వాలు తీసుకువస్తామని రాహుల్ తెలిపారు. బిహార్‌లోని పట్నా, యూపీలోని కుషీనగర్‌లో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ ‘మీరే ప్రభువులు. మేం ప్రభుత్వం ఏర్పాటు చేశాక మా మన్‌కీ బాత్ వినాలని మిమ్మల్ని కోరం. మీకు అవసరమైనవి తెలుసుకుని దాని ప్రకారమే విధానాలు రూపొందిస్తాం’అని అన్నారు. నోట్లరద్దు, జీఎస్టీ కారణంగా ప్రజలు కోల్పోయిన కొనుగోలు శక్తిని మళ్లీ పెంచేందుకు న్యాయ్ వంటి పథకం అవసరమని ఆర్థిక నిపుణులు చెప్పారన్నారు. ఈ పథకం అమలుతో ప్రధాని మోదీ లాగేసుకున్న సొమ్మును తిరిగి ప్రజలకే అందజేస్తామని హామీ ఇచ్చారు. మోదీ కారణంగా కొందరు పారిశ్రామికవేత్తలుమాత్రం లాభపడ్డారన్నారు. కొత్త పదం ‘మోదీలైస్’ ప్రధాని మోదీ నిత్యం చెప్పే అబద్ధాలతో ఇంగ్లిష్‌లో మోదీలైస్ (మోదీ అబద్ధాలు) అనే కొత్త పదం పుట్టుకొచ్చిందని రాహుల్ ట్విట్టర్లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఫొటోషాప్ చేసిన ఇంగ్లిష్ డిక్షనరీలోని ‘మోదీలై’ అనే పదం ఉన్న పేజీని స్క్రీన్‌షాట్ తీసి ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు. ఆ పేజీలో ‘మోదీలై’కి మూడు అర్థాలతోపాటు దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుపుతూ ఉదాహరణలున్నాయి. దీంతోపాటు ‘మోదీ అబద్ధాలను ప్రజలకు తెలిపే వెబ్సైట్ ఒకటి ఉంది!’ అంటూ ఆ వెబ్సైట్ లింక్ ‘మోదీ లైస్: ది మోస్ట్ అక్యురేట్ లిస్ట్ ఆఫ్ పీఎం మోదీస్ మెనీ లైస్’ అని వ్యంగ్యంగా పేర్కొన్నారు. బాధితురాలికి న్యాయం చేస్తాం రాజస్తాన్‌లోని ఆళ్వార్‌లో సామూహిక లైంగికదాడికి గురైన దళిత మహిళను కాంగ్రెస్ చీఫ్ పరామర్శించారు. అనంతరం సీఎం అశోక్ గహ్లోత్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బాధితురాలికి న్యాయం చేస్తామన్నారు. -
‘మోదీ గుంజిళ్లు తీయాలి’
మందిర్ బజార్/డైమండ్ హార్బర్: సంఘసంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ద్వారా బీజేపీ బెంగాలీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఈ దుశ్చర్యకు బీజేపీ నేతలు తగిన ఫలితం అనుభవిస్తారనీ, బెంగాలీలు వారిని క్షమించబోరని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని మమత ఫాసిస్టుగా, ప్రజలను హింసించే వ్యక్తిగా అభివర్ణించారు. పంచలోహాలతో చేసిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని పాత విగ్రహం ఉన్నచోటే ప్రతిష్టిస్తామన్న మోదీ ప్రతిపాదనను మమత తిరస్కరించారు. మందిర్ బజార్, డైమండ్ హర్బర్‌ల్లో గురువారం ఎన్నికల ప్రచారంలో మమత పాల్గొన్నారు. మోదీ గుంజిళ్లు తీయాలి.. బంగారం లాంటి పశ్చిమబెంగాల్ టీఎంసీ పాలనలో దివాళా తీసిందని బీజేపీ చీఫ్ అమిత్ షా చెప్పడంపై మమత మండిపడ్డారు. ‘బెంగాల్ దివాలా తీసిన రాష్ట్రంగా మారిందని చెప్పడానికి మీకు (బీజేపీ నేతలకు) సిగ్గుగా అనిపించడం లేదా? బెంగాల్‌కు బీజేపీ భిక్ష అక్కర్లేదు. కొత్తగా విద్యాసాగర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయడానికి మా దగ్గర నిధులున్నాయి. ప్రధాని మోదీ ఓ అబద్ధాల కోరు. అలాంటి వ్యక్తిని దేశం ఇప్పటివరకూ చూడలేదు. విద్యాసాగర్ విగ్రహాన్ని బీజేపీ గూండాలు ఎలా ధ్వంసం చేశారో మీడియా స్పష్టంగా చూపింది. బెంగాల్ వారసత్వ సంపదను ధ్వంసం చేసినందుకు మోదీ గుంజిళ్లు తీయాలి’ అని మమత వ్యాఖ్యానించారు. ఈసీ అమ్ముడుపోయింది.. సామాజిక మాధ్యమాల్లో బీజేపీ నకిలీ వార్తలు, వదంతులు వ్యాప్తి చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి అమ్ముడుపోయిందని మమత విమర్శించారు. ఈ మాట అన్నందుకు తాను జైలుకు వెళ్లాల్సివచ్చినా అందుకు సిద్ధమేనని తేల్చిచెప్పారు. -
మమతతో పోలీసుల కుమ్మక్కు
మథురాపూర్ / చందౌలీ / మిర్జాపూర్: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పశ్చిమబెంగాల్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కైన పోలీసులు సంఘసంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసానికి సంబంధించిన సాక్ష్యాలను మాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తప్పదని అర్థం కావడంతో మమతా బెనర్జీ తనను జైల్లో పెట్టిస్తామని బెదిరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలను వేధిస్తున్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) గూండాలే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని మోదీ పునరుద్ఘాటించారు. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ, విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆందోళనలో మమత.. టీఎంసీ నేతలు, ఆ పార్టీకి చెందిన గూండాలు బెంగాల్‌ను నరకంగా మార్చేశారని ప్రధాని మోదీ విమర్శించారు. ‘నారదా, శారదా చిట్‌ఫంట్ కుంభకోణాల్లో సాక్ష్యాలను మాయంచేసిన రీతిలోనే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహ ధ్వంసం ఘటనలో సాక్ష్యాలను అదృశ్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దుశ్చర్యకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ఖరారవడంతో మమతా బెనర్జీ కలవరపడుతున్నారు. ఆ ఆందోళనతోనే నన్ను జైల్లో పెట్టిస్తామని బెదిరిస్తున్నారు. మమతా బెనర్జీ ఆమె మేనల్లుడు అభిషేక్‌లు బెంగాల్‌ను లూటీచేయడం, బలవంతపు వసూళ్ల సిండికేట్‌ను నడపడమే పనిగా పెట్టుకున్నారు. ఈ అత్తా–అల్లుడి ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలు నిర్ణయించుకున్నారు’ అని మోదీ ఆరోపించారు. ‘జై శ్రీరామ్’ అనడమూ నేరమే.. పశ్చిమబెంగాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ పోరాడుతోందని ప్రధాని మోదీ తెలిపారు. ‘పశ్చిమబెంగాల్లో ప్రజాస్వామ్యం అపఖ్యాతిపాలైంది. దుర్గాపూజ, సరస్వతీపూజతో పాటు చివరికి జై శ్రీరామ్ అని నినదించడం కూడా బెంగాల్లో నేరమైపోయింది. రాష్ట్రంలోని బీజేపీ కార్యాలయాలను కూడా స్వాధీనం చేసుకుంటామని మమతా బెనర్జీ బెదిరించారు. పశ్చిమబెంగాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ పోరాడుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలపై తన బొమ్మ వేసుకుంటూ మమతా బెనర్జీ స్టిక్కర్ దీదీగా మారిపోయారు. ఆమెకు భారత ప్రధానిపై నమ్మకం ఉండదు కానీ, పాక్ ప్రధానిని మాత్రం ఏ జంకూ లేకుండా ప్రశంసిస్తారు. ఓవైపు బీజేపీ కార్యకర్తలను జైలులో పెడుతున్న బెంగాల్ పోలీసులు, మరోవైపు టీఎంసీ గూండాలను మాత్రం స్వేచ్ఛగా తిరగనిస్తున్నారు’ అని ఆరోపించారు. విపక్షాలు విఫలమయ్యాయి.. తనపై ప్రతిపక్షాల దూషణలు పెరిగేకొద్దీ ప్రజల ప్రేమ కూడా పెరుగుతూనే ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ‘ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతున్నామని మహాకల్తీ కూటమిలోని రాజకీయ పార్టీలన్నింటికి అర్థమైంది. ఇవన్నీ మోదీ హటావో(మోదీని తప్పించండి) అనే నినాదంతో ముందుకెళుతున్నాయి. బెంగళూరులో ఓ వేదికపై గ్రూప్ ఫొటో దిగిన ఈ పార్టీల నేతలంతా కలసికట్టుగా ప్రధాని పదవికి ఓ అభ్యర్థిని ఎన్నుకోవడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. ప్రధాని ఎవరు అవుతారన్న ప్రశ్న ఉదయించగానే, ఎవరి డబ్బావారు వాయించుకోవడం మొదలుపెట్టారు’ అని మోదీ ఎద్దేవా చేశారు. ‘10 సీట్లు, 20, 22, 30, 55 లోక్‌సభ సీట్లు ఉన్నవారంతా ప్రధాని అయిపోవాలని కలలు కంటున్నారు. కలలు కనడం తప్పుకాదు. కా నీ ఇప్పుడు దేశమంతా ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్(ఈసారి కూడా మోదీ ప్రభుత్వమే) అంటోంది. మేం జాతీయ భద్రత విషయంలో రాజీపడం. ఉగ్రవాదులను ఏరివేయడంతో పాటు వేర్పాటువాదుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. ఈ సేవకుడు ప్రజల ఆశలు, ఆకాంక్షల సాధన దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళుతున్నాడు’ అని తెలిపారు. -
గాడ్సే దేశ భక్తుడైతే గాంధీ జాతి వ్యతిరేకా?
అగర్ మాల్వా, ఉజ్జయిని, భోపాల్/న్యూఢిల్లీ: బీజేపీ నేత, ఆ పార్టీ భోపాల్ లోక్‌సభ అభ్యర్థి, మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేని దేశభక్తుడిగా అభివర్ణించారు. దీంతో గాడ్సే దేశ భక్తుడైతే మహాత్మా గాంధీ జాతి వ్యతిరేకా అని విపక్ష నేతలు మండిపడ్డారు. ఇటీవల రెండుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రజ్ఞా సింగ్ గురువారం మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వాలో రోడ్ షో సందర్భంగా తాజా వివాదానికి తెరతీశారు. ఓ న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ.. గాడ్సే దేశ భక్తుడని, ఆయన ఎప్పటికీ దేశ భక్తుడిగానే ఉంటారని అన్నారు. ఆయన్ను ఉగ్రవాది అంటున్నవారు తమను తాము ఒకసారి పరీక్షించుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వారికి సరైన గుణపాఠం చెబుతారన్నారు. స్వతంత్ర భారత తొలి ఉగ్రవాది హిందూ అంటూ గాడ్సేని దృష్టిలో ఉంచుకుని రాజకీయ నేతగా మారిన నటుడు కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు.. ప్రజ్ఞ ఈ విధంగా జవాబిచ్చారు. ప్రజ్ఞ వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ మండిపడ్డాయి. బీజేపీ అసలు రంగు బయటపడిందని ధ్వజమెత్తాయి. ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ప్రజ్ఞ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. క్షమాపణ చెప్పాల్సిందిగా ప్రజ్ఞను ఆదేశించింది. దీంతో క్షమాపణ చెప్పిన ఆమె తాను చేసిన వ్యాఖ్యలను సైతం ఉపసంహరించుకున్నారు. భోపాల్‌లో మే 12న ఎన్నికల ప్రచారం ముగించిన ప్రజ్ఞ.. 19న ఎన్నికలు జరగబోయే మాల్వా ప్రాంతంలో పార్టీ ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అసలు రంగు బయటపడింది: ఎన్సీపీ అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ అసలు రంగును ప్రజలిప్పుడు చూస్తున్నారని మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్ జయంత్ పాటిల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. గాంధీని చంపిన గాడ్సే.. ప్రజ్ఞ పేర్కొన్నట్టుగా దేశ భక్తుడేనా? అన్న సంగతి ప్రధాని మోదీ స్పష్టం చేయాలన్నారు. మాలెగావ్ పేలుళ్ల నిందితురాలు కూడా ఉగ్రవాది గాడ్సే కోవలోకే వస్తారని ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర అవ్హద్ అన్నారు. గాడ్సే దేశ భక్తుడైతే మహాత్మా గాంధీ జాతి వ్యతిరేకా అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్లో ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలతో పూర్తిగా విభేదిస్తున్నామన్న బీజేపీ ప్రజ్ఞ వ్యాఖ్యలతో తాము పూర్తిగా విభేదిస్తున్నామని బీజేపీ పేర్కొంది. మహాత్మా గాంధీ హంతకుడు దేశభక్తుడు కాలేడని తెలిపింది. ఆమె అలాంటి ప్రకటన ఎలా చేశారో వివరణ కోరతామని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తెలిపారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పడం సమంజసమని పేర్కొన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రజ్ఞ క్షమాపణలు చెప్పడం నెలలో రెండోసారి. గతంలో కర్కరేపై చేసిన వ్యాఖ్యలకు కూడా ఆమె క్షమాపణ చెప్పారు. తాజా వ్యాఖ్యలకు సైతం ఆమె క్షమాపణలు చెప్పినట్లు ఆమె ప్రతినిధి, బీజేపీ నేత డాక్టర్ హితేష్ బాజ్‌పాయ్ తెలిపారు. ప్రజ్ఞ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని కూడా ఆయన చెప్పారు. గతంలోనూ... ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కలకలం సృష్టించారు. ఐపీఎస్ అధికారి, ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే తాను పెట్టిన శాపంతోనే ముంబై ఉగ్రదాడుల్లో మరణించారని అన్నారు. ఏటీఎస్ చీఫ్‌గా మాలెగావ్ పేలుళ్ల కేసు విచారించిన కర్కరే తనను హింసించారని ప్రజ్ఞ అప్పట్లో ఆరోపించారు. 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసంలో పాల్గొన్నందుకు గర్వపడుతున్నానని మరోసారి వ్యాఖ్యానించారు. అది బీజేపీ డీఎన్ఏలోనే ఉంది : కాంగ్రెస్ ప్రజ్ఞ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. మోదీ, అమిత్ షాల అభిమాన బీజేపీ నేత ప్రజ్ఞా సింగ్ మరోసారి జాతి యావత్తును అవమానించారని పేర్కొంది. హింసా సంస్కృతి, అమరులను కించ పరచడమనేది బీజేపీ డీఎన్ఏలోనే ఉందని విమర్శించింది. ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రజ్ఞా సింగ్‌ను దండించాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ప్రధానిని కోరారు. బీజేపీ నేతలు గాడ్సే వారసులనేది స్పష్టమయ్యిందని అన్నారు. వారు గాడ్సేని దేశ భక్తుడని, వీర మరణం పొందిన కర్కరేని దేశ ద్రోహి అని అంటారన్నారు. తమ నేతల ద్వారా బీజేపీ.. జాతిపిత సిద్ధాంతాలు, ఆలోచనా విధానంపై ‘హానికారక దాడులు’ చేస్తూనే ఉందని ఆరోపించారు. ‘ఇది గాంధేయ సూత్రాలను కించ పరిచేందుకు జరుగుతున్న కుట్ర. దేశం క్షమించజాలని క్షమాపణార్హం కాని నేరం..’ అని అన్నారు. మోదీకి ఎంత మాత్రం తెలివి ఉన్నా ప్రజ్ఞా సింగ్‌ను దండించి, దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భోపాల్‌లో బీజేపీ ప్రత్యర్థి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ కూడా ప్రజ్ఞ వ్యాఖ్యలపై మండిపడ్డారు. గాడ్సేని ప్రశంసించడం దేశ భక్తి కాదని, అదొక జాతి వ్యతిరేక చర్య అని అన్నారు. మోదీ, అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
నామ్‌దార్‌కు ఇద్దరు బ్యాట్స్‌మెన్
దేవ్‌గఢ్ (జార్ఖండ్) / పాలిగంజ్ (బిహార్)/తాకి (పశ్చిమబెంగాల్): లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోనున్న నేపథ్యంలో నామ్‌దార్‌కు బాసటగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు బ్యాట్స్మన్లను బరిలోకి దింపిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శనకు బాధ్యత వహించే పనిని ఆ పార్టీ మణిశంకర్ అయ్యర్, శామ్ పిట్రోడాలకు అప్పగించిందని విమర్శించారు. బుధవారం జార్ఖండ్‌లోని దేవ్‌గఢ్, బిహార్‌లోని పాటలీపుత్ర, పశ్చిమబెంగాల్లోని తాకి ఎన్నికల సభల్లో ఆయన మాట్లాడారు. ‘1984లో సిక్కుల ఊచకోతపై ‘అయ్యిందేదో అయిపోయింది’ అని ఒకరంటారు. ఇంకొకరు గుజరాత్ ఎన్నికల్లో నన్ను దూషించిన తర్వాత ఇన్నాళ్లూ తెరవెనుక ఉండి.. ఇప్పుడు మళ్లీ నాపై దాడికి (నీచ్ ఆద్మీ అంటూ) దిగుతున్నారు’ అని పిట్రోడా, అయ్యర్‌లను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. మే 23న ఏం జరగబోతోందనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అని సభకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించి ప్రధాని అన్నారు. కాంగ్రెస్‌కు ఈ విషయం బాగా తెలుసని, అందుకే ఫలితాలను ఎదుర్కొనేందుకు సంసిద్ధమవుతోందని చెప్పారు. ఓటమిని ఎవరి తలపై రుద్దాలా అనే ఆలోచనలో పడిందన్నారు. నామ్‌దార్ కారణంగా ఓటమి పాలయ్యామని కాంగ్రెస్ ఎప్పుడూ చెప్పుకోదని, అది రాజవంశ సూత్రాలకు విరుద్ధమని విమర్శించారు. కేవలం ఐదో విడత ఎన్నికల తర్వాత మాత్రమే ఆ కుటుంబానికి చెందిన సమీప సభ్యులిద్దరూ సొంతగా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టారని ఎద్దేవాచేశారు. బరిలోకి దిగకుండానే మ్యాచ్ ఆడే సాహసం కెప్టెన్‌ను అడక్కుండా వారు చేయరన్నారు. నిందను మోసేందుకు కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నారన్నారు. ఉగ్రవాదులు, నక్సలైట్లు, వారి మద్దతుతారులను ప్రోత్సహించేలా రాజద్రోహ చట్టాన్ని నీరు గార్చాలని కాంగ్రెస్ ప్రయత్నించిందన్నారు. కానీ బీజేపీ అందుకు అనుమతించదని, తమ ప్రభుత్వం ఉగ్రవాదుల స్థావరాల్లోకి వెళ్లి మరీ దాడి చేసిందని చెప్పారు. భూతాలను తరిమినట్టు వారిని తరిమి కొట్టాలన్నారు. సైన్యానికి ఈ మేరకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామన్నారు. దేశ భద్రత ఒక అంశమే కాదని మహా కల్తీ కూటమి నేతలంటున్నారని మోదీ ఆరోపించారు. లెక్కలేనన్ని ఉగ్రదాడుల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు అది ఒక అంశంగా కాకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఢిల్లీలో కూర్చున్నవారికి గిరిజనుల బాధలు పట్టవన్నారు. ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉండబోతున్నాయంటూ.. ఈసారి బిహార్‌కు తాజా అభివృద్ధి గంగ (వికాస్ కీ గంగ)ను తీసుకువస్తానని ప్రధాని అన్నారు. అయితే మరింత గొప్ప విజయం లభించేలా చివరి విడత పోలింగ్ ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం గూండాస్వామ్యంగా మారింది పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం గూండాస్వామ్యంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెంగాల్ రాష్ట్రంలో ఆత్యయిక స్థితిని సృష్టించారనీ, ప్రతీ దాన్ని నాశనం చేయడానికి ఆమె ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మోదీ ధ్వజమెత్తారు. ప్రజల ధైర్యం, నిశ్చయాలే ఆమె ‘తీవ్ర బాధాకరమైన పాలన’ నుంచి విముక్తి కల్పిస్తాయని మోదీ అన్నారు. ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు జిల్లాల్లో మోదీ బుధవారం ప్రచారం నిర్వహించారు. బెంగాల్‌లోని 42 సీట్లలో తమ పార్టీయే అధిక సీట్లు గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
బెంగాల్లో ప్రచారం కుదింపు
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో ఎన్నికల ప్రచార సమయాన్ని కుదిస్తూ ఎన్నికల కమిషన్ (ఈసీ) అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఏడో విడత ఎన్నికల ప్రచార గడువు శుక్రవారం సాయంత్రానికి ముగియాల్సి ఉండగా, హింసాత్మక ఘటనల నేపథ్యంలో దానిని పశ్చిమ బెంగాల్లో మాత్రం గురువారం రాత్రికి కుదిస్తూ ఈసీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ ఇలాంటి ఉత్తర్వులివ్వడం భారత ఎన్నికల చరిత్రలోనే తొలిసారి. బెంగాల్లో గురువారం రాత్రి 10 గంటలకు ప్రచార గడువు ముగుస్తుందని డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ చంద్ర భూషణ్ తెలిపారు. బెంగాల్‌లోని 9 నియోజకవర్గాలకు ఆదివారం చివరి విడత పోలింగ్ జరగనుంది. కోల్‌కతాలో మంగళవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ సందర్భంగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకోవడం తెలిసిందే. బెంగాల్లో హోం శాఖ ముఖ్య కార్యదర్శి అత్రి భట్టాచార్య, సీఐడీ అదనపు డీజీ రాజీవ్‌లను పదవుల నుంచి తొలగించాలని ఈసీ ఆదేశించింది. చంద్ర మాట్లాడుతూ ‘రాజ్యాంగబద్ధమైన అధికారాలతో ప్రచారం గడువును ఈసీ తగ్గించడం ఇదే తొలిసారి. కానీ ఇదే చివరిసారి కాదు’ అని అన్నారు. పశ్చిమ బెంగాల్ ఇన్చార్జ్గా ఉన్న మరో ఉప కమిషనర్ సుదీప్ జైన్ మాట్లాడుతూ భట్టాచార్య బెంగాల్ ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు ఇవ్వడం ద్వారా ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో జోక్యం చేసుకున్నారనీ, అందువల్లే ఆయనను బాధ్యతల నుంచి తప్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు, అభ్యర్థులందరికీ సమానావకాశాలు కల్పించేందుకు అవసరమైన సహకారం రాష్ట్ర అధికారుల నుంచి దక్కడం లేదని కేంద్ర ఎన్నికల పరిశీలకులు తమ దృష్టికి తెచ్చినట్లు ఈసీ వెల్లడించింది. ‘ఎన్నికలు అయిపోగానే కేంద్ర బలగాలు వెళ్లిపోతాయి. ఇక్కడ ఉండేది మేమే’ అంటూ టీఎంసీ సీనియర్ నేతలు ఓటర్లను భయపెడుతున్నారని పరిశీలకులు తమకు చెప్పారంది. తత్వవేత్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసం కావడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఈసీ, దుండగులను త్వరలోనే పట్టుకుంటారని తాము ఆశిస్తున్నట్లు పేర్కొంది. మోదీ కోసమే: కాంగ్రెస్, సీపీఎం ప్రచారం గడువును తగ్గించాల్సినంత తీవ్రమైన పరిస్థితులు బెంగాల్లో ఉంటే బుధవారం రాత్రికే ప్రచారానికి ఈసీ తెరదించాల్సిందని కాంగ్రెస్ పేర్కొంది. బెంగాల్లో గురువారం ప్రధాని మోదీ ప్రచారం చేయాల్సి ఉందనీ, ఆయన కార్యక్రమానికి ఆటంకం కలగకూడదనే గురువారం రాత్రి ప్రచారాన్ని ముగించాలని ఈసీ ఆదేశాలిచ్చిందంటూ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఆరోపించారు. బెంగాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని ఈసీ చెబుతూ కూడా మోదీ సభలు పూర్తయ్యే వరకు ప్రచారానికి అనుమతి ఇస్తోందనీ, ఈసీ ఇలా చేయడం కూడా గతంలో ఎన్నడూ లేదంటూ పటేల్ ఓ ట్వీట్ చేశారు. మోదీ సభల కోసమే గడువును గురువారం రాత్రి 10 గంటల వరకు ఈసీ ఇచ్చిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా ఆరోపించారు. సాధారణంగా ఎన్నికల ప్రచారం సాయంత్రం ముగుస్తుందనీ, మరి ఇప్పుడు గురువారం అంటే గురువారం సాయంత్రం కాకుండా రాత్రి 10 గంటలక వరకు ఈసీ ఎందుకు సమయం ఇస్తోందని ఏచూరి ప్రశ్నించారు. మోదీకి ఈసీ ఇచ్చిన బహుమతి: మమత పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం గడువును ఎన్నికల సంఘం (ఈసీ) కుదించడం రాజ్యాంగ విరుద్ధమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజ్యాంగవిరుద్ధ, అనైతిక బహుమతిని ప్రధాని మోదీకి ఈసీ ఇచ్చిందని మమత ఆరోపించారు. పూర్తిగా ఆరెస్సెస్ మనుషులతో నిండిపోయిన ఇలాంటి ఈసీని తానెన్నడూ చూడలేదని ఆమె పేర్కొన్నారు. ‘324 అధికరణాన్ని ఉపయోగించాల్సినంతగా బెంగాల్లో శాంతి భద్రతల సమస్యేమీ లేదు. ఇద్దరు అధికారులను తొలగించాలని ఆదేశించింది ఈసీ కాదు. మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా’ అని మమత ఆరోపించారు. రాజ్యాంగంలోని 324వ అధికరణాన్ని ఉపయోగించి బెంగాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఈసీ ఒకరోజు కుదించింది. ఈసీ ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ చేస్తూ ‘బెంగాల్లో అరాచకత్వం ఉందని రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పింది. ప్రతిసారి హింస పెరగడం, రాష్ట్ర ప్రభుత్వమే పంపిన విధ్వంసకారులు, పక్షపాతంతో వ్యవహరించే పోలీసులు, హోం శాఖల గురించి ఈసీ ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది’ అని అన్నారు. ఆర్టికల్ 324 ఏం చెబుతోందంటే.. దేశంలో పార్లమెంటుకు, అన్ని శాసనసభలకు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు జరిగే అన్ని ఎన్నికలను నిర్వహించేందుకు, నియంత్రించేందుకు ఈసీకి అధికారాన్ని రాజ్యాంగంలోని 324వ అధికరణం ఇస్తోంది. ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీకి, ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని పరిపాలనాపరమైన పనులను ఈసీ ఈ అధికరణం కింద చేస్తుంది. ఎన్నికల నిర్వహణలో అవసరమైన పరిపాలన, న్యాయ, శాసనపరమైన పనులను అన్నింటినీ ఈసీయే చూసుకుంటుంది. ఈ అధికారాలను వాడే బెంగాల్లో ప్రచారం గడువును ఈసీ కుదించింది. -
కమలానికి యూపీ దెబ్బ?
సార్వత్రిక ఎన్నికల సినిమా క్లైమాక్స్‌కు వచ్చేసింది. అధికార పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య తగ్గనుందన్న సరికొత్త ఆంచనాలు కమలనాథుల్లో ఎంతో కొంత గుబులు రేపుతున్నాయి. ఆంబిట్ కేపిటల్ అనే ఓ బ్రోకరేజీ సంస్థ చేసిన ఒక సర్వే ప్రకారం బీజేపీ ఉత్తర ప్రదేశ్‌లో దాదాపు 50 సీట్లు కోల్పోనుంది. దేశం మొత్తమ్మీది 543 సీట్లలో అధికార పార్టీ గెలుచుకోగల స్థానాలు 210 పదికి మించవని క్షేత్రస్థాయిలో తాము చేసిన సర్వే తెలుపుతోందని ఆంబిట్ కేపిటల్ బిజినెస్ స్టాండర్డ్‌లో ఒక కథనం ప్రచురితమైంది. వివరాలు... గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం పరిధిలోని రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలతో తాము ఒక సర్వే నిర్వహించామని.. దాని ప్రకారం నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఈ ఎన్నికల్లో 220 – 240 సీట్లు రావచ్చునని తేలింది. ఆంబిట్ కేపిటల్‌కు చెందిన రితిక మన్కర్ ముఖర్జీ, సుమీత్ శేఖర్లు ఈ సర్వే నిర్వహించారు. మరోసారి అధికారం చేపట్టాలన్న బీజేపీ ఆశలకు ఉత్తర ప్రదేశ్ ఫలితాలు గండికొట్టవచ్చునని.. 2014లో గెలుచుకున్న 71 స్థానాల్లో గరిష్టంగా 35 మాత్రమే దక్కుతాయని వీరు అంటున్నారు. బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ లోక్దళ్లతో ఏర్పాటైన మహాగఠబంధన్ ప్రభావం బీజేపీపై ఉండనుందని వీరు చెబుతున్నారు. ఈ అంచనాలే నిజమైతే.. ఫలితాల తరువాత బీజేపీ కనీసం నాలుగు ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకోవాల్సిన పరిస్థితి ఉండనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ.. బీఎస్పీ జట్టు కట్టినా ఆశ్చర్యం లేదన్నది ఆంబిట్ అంచనా. బీజేపీ అభ్యర్థులు నేరుగా అఖిలేష్‌ను మాత్రమే విమర్శిస్తూండటం.. మాయావతిపై పెద్దగా విమర్శలు చేయకపోవడాన్ని భవిష్యత్ పరిణామాలకు సూచికగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అంటున్నారు. 2014 ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని బట్టి చూస్తే బీఎస్పీ మూడో అతిపెద్ద జాతీయ పార్టీ. అప్పట్లో తగినన్ని సీట్లు రాకపోయినా.. ఈ సారి ఎస్పీతో జట్టు కట్టిన ఫలితంగా ఎక్కువ సీట్లు సాధించే అవకాశముంది. గత ఎన్నికల ఫలితాల ఆధారంగా చూసినప్పుడు బీఎస్పీ, ఎస్పీల కూటమికి యూపీలో 45 శాతం ఓట్లు రావచ్చునని, బీజేపీ ఓట్ల శాతం 34.2 వరకూ ఉండవచ్చునని వివరించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌పై ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొనడం, పశువధశాలపై నిషేధం తమ ఉపాధికి గండికొట్టిందని ఒక వర్గం వారు భావిస్తూండటం దీనికి కారణం. నగరాలకు హిందూ పేర్లు పెట్టడం కూడా ఓటర్లకు నచ్చడం లేదని ఆంబిట్ అంటోంది. -
ఏడో దశలో ఎన్డీఏకు సగం సీట్లు దక్కేనా?
పదిహేడో లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ జరిగే 59 సీట్లలో బీజేపీ కిందటిసారి 32 సీట్లు గెలుచుకుంది. వాటిలో రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో (యూపీలోని గోరఖ్‌పూర్, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్) బీజేపీ ఓడిపోయింది. మొత్తంమీద ఆఖరి దశ ఎన్నికల్లో బీజేపీకి ఉన్న సీట్లు నిలబెట్టుకోవడానికి, ప్రతిపక్షాలు తమ బలాన్ని పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలైన అకాలీదళ్(4), ఆరెలెస్పీ(2), జేడీయూ(1), అప్నాదళ్(1) ఈ 59లో 8 స్థానాలు గెలుచుకున్నాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో 2017లో జేడీయూ చేరగా, ఆరెలెస్పీ బయటికొచ్చి యూపీఏ మిత్రపక్షంగా మారింది. ఉప ఎన్నికలో గెలిచిన గురుదాస్‌పూర్‌తో కలిపి కాంగ్రెస్‌కు ఐదు స్థానాలున్నాయి. ఈ దశలో పోలింగ్ జరిగే పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 9 సీట్లనూ కిందటిసారి తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ సీట్లలో కనీసం మూడు నాలుగు కైవసం చేసుకోవాలని బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. మధ్యప్రదేశ్‌పైనే కాంగ్రెస్ ఆశ! మధ్యప్రదేశ్‌లో పోలింగ్ జరిగే 8 లోక్‌సభ సీట్లలో బీజేపీకి ఏడు ఉండగా, కాంగ్రెస్ సీటు ఒక్కటే. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో చివరి దశ సీట్లలో నాలుగైదు గెలుచుకోవచ్చని ఈ పార్టీ ఆశ పడుతోంది. ఝార్ఖండ్‌లోని మూడు స్థానాల్లో రెండు ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) చేతిలో ఉన్నాయి. మూడో స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. జేఎంఎం అగ్రనేత శిబూ సోరెన్ దూమ్కా నుంచి పోటీ చేస్తున్నారు. పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాల్లో అకాలీదళ్, కాంగ్రెస్, ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) నాలుగేసి సీట్లు కైవసం చేసుకున్నాయి. బీజేపీకి ఒక సీటు దక్కింది. ఆప్ ఎంపీల్లో ముగ్గురికి పార్టీ కేంద్ర నాయకత్వంతో మంచి సంబంధాలు లేవు. ఈ రాష్ట్రంలో కూడా రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది. మారిన పరిస్థితుల్లో పంజాబ్‌లో అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో పనిచేస్తోంది. 2017 ఎన్నికల తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని అకాలీదళ్ తన ఉనికి కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతోంది. అందుకే పార్టీ నేత, ప్రకాశ్‌సింగ్ బాదల్ కొడుకు, మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్సింగ్ బాదల్ ఫిరోజ్‌పూర్ నుంచి లోక్‌సభకు పోటీచేస్తున్నారు. ఉన్న బలం నిలబెట్టుకోవడానికి ఆయన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. యూపీలో ప్రతిపక్షాల బలం పెరిగే అవకాశం ప్రతిపక్షాలకు ఈ దశలో ఎక్కువ సీట్లు గెలిచే అవకాశమున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. పోలింగ్ జరిగే 13 సీట్లలో కిందటిసారి బీజేపీ 12 గెలుచుకోగా, మిత్రపక్షమైన అప్నాదళ్ ఒక స్థానం కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీ, ఆరెల్డీతో కూడిన మహా కూటమి దాదాపు సగం స్థానాలు గెలవగలననే నమ్మకంతో ఉంది. 2014 మాదిరిగా బీజేపీ దాదాపు అన్ని సీట్లు గెలిచే పరిస్థితి లేదని మహా కూటమి అంచనా వేస్తోంది. యూపీ బీజేపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన సొంత స్థానమైన గోరఖ్‌పూర్‌పై తన పట్టు ఎలాగైనా నిలబెట్టుకోవాలని సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. 2018 ఉప ఎన్నికలో గెలిచిన ప్రవీణ్ నిషాద్ ఎస్పీకి రాజీనామా చేసి బీజేపీకి దగ్గరయ్యారు. ఎస్పీ కొత్త అభ్యర్థిని బరిలోకి దింపింది. నాలుగు సీట్లున్న హిమాచల్ ప్రదేశ్‌లో కిందటి ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవని కాంగ్రెస్ సగం స్థానాలు కైవసం చేసుకోవాలనుకుంటోంది. కేంద్ర మాజీ మంత్రి, కేంద్ర మాజీ మంత్రి సుఖ్రామ్ తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినా మారిన పరిస్థితుల్లో బీజేపీ నాలుగు సీట్లు కైవసం చేసుకోవడం కష్టమే. మొత్తం మీద చివరి దశ పోలింగ్ జరిగే 59లో సగానికి పైగా బీజేపీ గెలుచుకుంటేనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీఏకు మార్గం సుగమం అవుతుంది. -
చండీగఢ్‌లో త్రిముఖ పోటీ
పంజాబ్, హరియాణా ఉమ్మడి రాజధాని చండీగఢ్ లోక్‌సభ స్థానానికి చివరిదశలో మే 19న పోలింగ్ జరగనుంది. ఈ స్థానంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ కిరణ్ ఖేర్ రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రసిద్ధ నటుడు అనుపమ్ ఖేర్ భార్య, ప్రముఖ నటి, టీవీలో ప్రముఖ సంగీత కార్యక్రమాలెన్నింటికో వ్యాఖ్యాతగా ఉన్న కిరణ్ ఖేర్ ఈసారి కూడా తన గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. నాలుగుసార్లు లోక్‌సభకి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ అభ్యర్థి వపన్ కుమార్ బన్సాల్‌పై కిరణ్ ఖేర్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చండీగఢ్ లోక్‌సభ స్థానాన్ని మాజీ రైల్వే మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి బన్సాల్ 1991, 1999, 2004, 2009 ఎన్నికల్లో విజయపరంపర కొనసాగించారు. 2014లో కిరణ్ ఖేర్ 42.2 శాతం ఓట్లతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. 1996లో బీజేపీ నుంచి సత్యపాల్ జైన్ ఈ స్థానంలో గెలిచారు. ఈసారి మాత్రం ఇక్కడ త్రిముఖ పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. కాంగ్రెస్, బీజేపీలకు తోడు గత ఎన్నికల్లో కిరణ్ ఖేర్ గెలుపుకోసం కీలకంగా పనిచేసిన హర్మోహన్ ధవన్ ఈసారి ఆమ్ ఆద్మీ తరఫున పోటీచేస్తున్నారు. హర్మోహన్ ధవన్ ఈసారి ఓట్లు చీలుస్తారనే భయంలో కాంగ్రెస్ ఉంది. ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకన్నా ఆప్ అభ్యర్థిపైనే ఆశలు పెట్టుకున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. అయితే నాలుగు ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి బన్సాల్ ఈ ప్రాంత ప్రజలకు చేసిందేమీలేదని బీజేపీ విమర్శిస్తోంది. స్వచ్ఛత, అభివృద్ధి కార్యక్రమాల విషయాల్లో ఈ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ వల్ల ఒరిగిందేమీ లేదని కిరణ్ ఖేర్ ఆరోపణ. అయితే కాంగ్రెస్ అభ్యర్థి బన్సాల్ మాత్రం ప్లాన్డ్ సిటీ అయిన చండీగఢ్‌ని స్వచ్ఛత ర్యాంకింగ్‌లో 3వ స్థానం నుంచి 20వ స్థానానికి దిగజార్చిన ఘనత బీజేపీదేనని తిరుగుదాడి చేస్తున్నారు. ఐదేళ్ల నా పాలన చూడండి, 15 ఏళ్ళపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ని పోల్చుకుని ఓటెయ్యండని కిరణ్ ఖేర్ ప్రజల్లోకి వెళుతున్నారు. నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దేందుకు రాబోయే ఐదేళ్ళ ఎజెండాని ముందుగానే ప్రకటించిన కిరణ్ ఖేర్ ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ ఇంగ్లిష్ మీడియం స్కూల్స్‌గా మారుస్తాననీ, సోలార్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తాననీ అంటున్నారు. చండీగఢ్‌ని సిలికాన్ వ్యాలీప్రమాణంగా పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేస్తానంటోన్న కిరణ్‌ఖేర్ ఈసారి గెలుపు తనదేననే ధీమాతో ఉన్నారు. అయితే ఈసారి ప్రజలు ఈ మూడు పార్టీల్లో ఎవరిని ఆదరిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది. -
ఝార్ఖండ్ ఆదివాసిల్లో జేఎంఎం పట్టు!
మావోయిస్టులకు పట్టున్న ప్రాంతం ఝార్ఖండ్‌లో ఆదివాసీల జనాభా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలిగిన స్థాయిలో ఉంది. ఝార్ఖండ్‌లో మొత్తం 14 పార్లమెంటు స్థానాలున్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మెల్లిమెల్లిగా బీజేపీ తన బలాన్ని పెంచుకుంటూ వస్తోంది. ఇక్కడ కాంగ్రెస్, ఝార్ఖండ్ వికాస్ మోర్చా, ఆర్జేడీ, జనతాదళ్(యూ) ఝార్ఖండ్ ఏర్పడినప్పటినుంచీ ప్రజలను ప్రభావితం చేస్తూ వస్తున్నాయి. ఈ ప్రాంతంలో భారతీయ జనతాపార్టీ బలం అనూహ్యంగా పుంజుకుంది. 2004లో 14 లోక్‌సభ స్థానాలకు గాను యూపీఏ (కాంగ్రెస్, జెఎంఎం, ఆర్జేడీ, సీపీఐ)కి 13 సీట్లు వస్తే, బీజేపీ ఒక్క సీటుకే పరిమితం అయ్యింది. 2009లో బీజేపీ 8 స్థానాల్లో విజయఢంకా మోగిస్తే, కాంగ్రెస్ 1, జేవీఎం 1, ఇండిపెండెంట్లు 2 గెలుచుకున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 12 స్థానాల్లో విజయఢంకా మోగించింది. ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) 2 స్థానాలను నిలబెట్టుకోగలిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఝార్ఖండ్ ముక్తి మోర్చా, ఝార్ఖండ్ వికాస్ మోర్చా(ప్రజాతాంత్రిక్ జెవీఎం), ఆర్జేడీ కలిసి పోటీ చేస్తున్నాయి. గత ప్రాభవాన్ని పునర్నిర్మించుకోవాలని కాంగ్రెస్ కూటమి భావిస్తోంటే, తమ బలాన్ని సుస్థిరం చేసుకుంటామన్న ఆశాభావంతో బీజేపీ ఉంది. జనాభాలో 25 శాతంగా ఉన్న ఆదివాసీలు రాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు. ఆదివాసీలు ఆధారపడి బతుకుతోన్న అడవినుంచి అత్యధిక మంది ఆదివాసీలను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు తెచ్చిన చట్టాలు వారి ఆగ్రహానికి కారణమయ్యాయి. అలాగే రైతాంగాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందన్న విమర్శ పాలకులను వెంటాడుతోంది. ఇప్పటికే ఆరు దశల పోలింగ్ ముగిసింది చివరి దశలో జరిగే రాజ్ మహల్, దుమ్కా, గొడ్డా నియోజకవర్గాల్లో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకత ఈ ఎన్నికల్లో పనిచేస్తుందా? లేక ఈసారి కూడా బీజేపీకే పాలనావకాశం దక్కుతుందా అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజ్‌మహల్ ... ఎస్టీ రిజర్వుడు సీటైన రాజ్‌మహల్ లోక్‌సభ స్థానాన్ని 2014లో ఝార్ఖండ్ ముక్తి మోర్చా కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి హేమ్లాల్ ముర్ముపై జేఎంఎం అభ్యర్థి విజయ్‌కుమార్ హన్స్‌డాక్ విజయం సాధించారు. ఈసారి కాంగ్రెస్, జేఎంఎం కూటమి తరఫున సీపీఎం అభ్యర్థి గోపీన్ సోరెన్ పోటీ చేస్తున్నారు. గోపీన్ సోరెన్ పై గతంలో పోటీ చేసి ఓడిపోయిన హేమ్లాల్ ముర్ముని బీజేపీ తిరిగి పోటీకి దింపింది. ఈ నియోజకవర్గంలో ఈసారి బీజేపీ, జేఎంఎంలు గెలుపుగుర్రమెక్కడానికి హోరాహోరీ పోరాడుతున్నాయి. 2014 గణాంకాలను బట్టి ఈ పార్లమెంటు స్థానంలో మొత్తం 13,53,467 మంది ఓటర్లున్నారు. ఈ స్థానంలో 2009లో బీజేపీ తరఫున దేవిధన్ బెస్రా విజయాన్ని సాధించారు. దుమ్కా ... ఎస్టీ రిజర్వుడు స్థానమైన దుమ్కా ఝార్ఖండ్ ముక్తి మోర్చాకి బలమైన పునాదులున్న ప్రాంతం. 2014 ఎన్నికల్లో బీజేపీని కట్టడిచేసేందుకు జెఎంఎం శిబూ సోరెన్‌ని బరిలోకి దింపింది. బీజేపీ అభ్యర్థి సునీల్‌సోరెన్‌ఫై 3,35, 815 ఓట్లతో శిబూసోరెన్ విజయాన్ని కైవసం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి సునీల్ సోరెన్‌కి 2,96,785 ఓట్లు వచ్చాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ వరసగా ఈ స్థానాన్ని జేఎంఎం కైవసం చేసుకుంటూ వచ్చింది. 2002లో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం ఈ స్థానంలో జేఎంఎం గెలుపొందింది. గొడ్డా.... ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లున్న గొడ్డా పార్లమెంటు స్థానంలో బీజేపీకి బలమైన పునాదులున్నాయి. 2014లో గొడ్డా స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి ఫరూక్ అన్సారీపై బీజేపీ అభ్యర్థి నిశీకాంత్‌దూబే గత ఎన్నికల్లో విజయం సాధించారు. 2014లో నిశీకాంత్ దూబే 36.25 శాతం ఓట్లతో(3,80,500) ఓట్లతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఫరూక్ అన్సారీకి కూడా 3,19,818 (30.47శాతం) ఓట్లు వచ్చాయి. ఈసారి కూడా బీజేపీ నిశీకాంత్ దూబేని బరిలోకి దింపింది. జార్ఖండ్ వికాస్ మోర్చా అభ్యర్థి ప్రదీప్ యాదవ్ ఈ స్థానంలో కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. -
బీజేపీ వాడుకుని వదిలేసింది: సుఖ్రామ్
‘‘హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలోకి రావడానికి బీజేపీ నన్ను వాడుకుని వదిలేసింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంలో నాదే కీలక పాత్ర,’’ అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుఖ్రామ్ వాపోయారు. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 93 ఏళ్ల నేత మీడియాతో మాట్లాడుతూ, ‘‘ మళ్లీ కాంగ్రెస్‌లో చేరడం తప్పో ఒప్పో నాకు తెలియదు. కాని, ఇవి నాకు చివరి ఎన్నికలు. జీవితకాలం గడిపిన పార్టీలో ఉండగానే కన్నుమూయాలనుకుంటున్నాను,’’ అని ఆయన చెప్పారు. తన మనవడు, మండీ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆశ్రయ్ శర్మ తరఫున ఆయన ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేసిన సుఖ్‌రామ్‌పై 1998లో కోట్లాది రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చాయి. అప్పుడు అరెస్టయి కొంత కాలం జైలు జీవితం గడిపారు. ఆ సమయంలో కాంగ్రెస్ తనను అవమానించిందని ఆయన అన్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ నా కుటుంబాన్ని బాగా ఉపయోగించుకుంది. విజయం సాధించాక నా కొడుకు అనిల్ శర్మకు మంత్రి పదవి ఇచ్చినా తగిన విలువ ఇవ్వలేదు. ఆశ్రయ్‌కు మండీ బీజేపీ టికెట్ కోసం ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్‌ను కలవాలనుకున్నాను. ఎంత ప్రయత్నించినా కుదరలేదు. ఆశ్రయ్‌కు బీజేపీ సభ్యత్వం కూడా లేనప్పుడు అతనికి టికెట్ ఎలా ఇస్తామని సీఎం సహా బీజేపీ నేతలు ప్రశ్నించడంతో బీజేపీతో చెడిపోయింది. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయించకున్నాను. నా మనవడి రాజకీయ భవిష్యత్తు కోసం నేను కాంగ్రెస్ మాజీ సీఎం వీరభద్రసింగ్‌ను క్షమాపణ కూడా కోరాను. నేను పెట్టిన ప్రాంతీయపార్టీ హిమాచల్ వికాస్ కాంగ్రెస్ (హెచ్వీసీ) వల్ల 1998 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అందుకే వీరభద్రకు నాపై కోపం ఉండొచ్చు,’’ అని సుఖ్రామ్ వివరించారు. అయితే, తన మనవడు ఆశ్రయ్ను వీరభద్ర ఆశీర్వదించారని, అతని కోసం మనస్పూర్తిగా ప్రచా రం చేస్తున్నారని ఆయన తెలిపారు. వయసు తొమ్మిది పదులు దాటినా ఆయన శారీరకంగా, మానసికంగా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. హిమాచల్‌లోని 4 లోక్‌సభ సీట్లకు మే 19న పోలింగ్ జరుగుతుంది. -
పిట్రోడా బహిరంగ క్షమాపణ చెప్పాలి
ఖన్నా(పంజాబ్): 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లపై తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు తమ పార్టీ నేత అయిన శ్యామ్ పిట్రోడా సిగ్గుపడాలని, దేశ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ పేర్కొన్నారు. సోమవారం పంజాబ్‌లోని ఖన్నాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. ‘పిట్రోడా జీ, మీరలా అనడం పూర్తిగా తప్పు. అందుకు మీరు సిగ్గుపడాలి. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయనకు ఫోన్లో చెప్పా. అదే విషయాన్ని ఇప్పుడు బహిరంగంగా మీకు వెల్లడిస్తున్నా’ అని రాహుల్ అన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో నోట్లరద్దు, జీఎస్టీ కారణంగా ప్రజల కొనుగోలు శక్తిని పూర్తిగా హరించి వేశాయని, లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు, రైతులకు మద్దతు ధర, ప్రతి బ్యాంకు అకౌంట్లో రూ.15 లక్షల జమ వంటి గత ఎన్నికల హామీలను బీజేపీ విస్మరించిందని మండిపడ్డారు. బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. రఫేల్ ఒప్పందంపై 15 నిమిషాల బహిరంగ చర్చకు వచ్చేందుకు కూడా ఆయన భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రధాని మోదీ విమర్శించడం అంటే దేశ ప్రజలను విమర్శించడమేనని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదల కోసం న్యాయ్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఈ పథకం కింద పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.72 వేలు చొప్పున జమ కావడమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. 1984లో దేశరాజధానిలో సిక్కుల ఊచకోతపై కాంగ్రెస్ ఓవర్సీస్ విభాగం చీఫ్ శ్యామ్ పిట్రోడా ‘జరిగిందేదో జరిగిపోయింది’ అంటూ మాట్లాడటంపై తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో చేసిన ఇలాంటి వ్యాఖ్యలను ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తుండటంతో నష్ట నివారణకు రాహుల్ ప్రయత్నిస్తున్నారు. -
తొలి తీవ్రవాది హిందూ మతస్తుడే
సాక్షి, చెన్నై/అరవకురిచ్చి: భారతదేశంలో తొలి తీవ్రవాది హిందూ మతస్తుడే అని సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాత్రి అరవకురిచ్చిలో ఎన్నికల ప్రచారంలో కమల్ మాట్లాడారు. ‘స్వతంత్ర భారతదేశంలో తొలి తీవ్రవాది హిందువు. అతని పేరు నాథూరాం గాడ్సే’ అని అన్నారు. అతనితోనే తీవ్రవాదం ప్రారంభమైందన్నారు. తనకు తాను గాంధీ మనవడిగా కమల్ అభివర్ణించుకున్నారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని.. మహాత్ముని విగ్రహం ముందు నిల్చుని మాట్లాడుతున్నానని అన్నారు. దేశంలో సమానత్వాన్ని కోరుకునే గొప్ప భారతీయుల్లో తానూ ఒకడినన్నారు. జాతీయ జెండాలోని 3 రంగులు విభిన్న విశ్వాసాలకు ప్రతీకలని, ఇవి ఎప్పటికీ చెక్కుచెదరవన్నారు. ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ.. కమల్ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ ఆరోపించింది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన కమల్‌పై చర్యలు తీసుకోవాలని సోమవారం కేంద్ర ఎన్నికల సంఘంను బీజేపీ కోరింది. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కమల్ విషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిలిసాయి సౌందర్యరాజన్ ఆరోపించారు. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలో ఉన్నారు కాబట్టే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ సైతం కమల్ వ్యాఖ్యలను ఖండించారు. కళకు, ఉగ్రవాదానికి మతం ఉండదని తెలుపుతూ వివేక్ సోమవారం ట్వీట్ చేశారు. గాడ్సేని తీవ్రవాదిగా పోలిస్తే సరిపోయేదని.. అతని మతాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఏకీభవించిన నేతలు.. కమల్ వ్యాఖ్యలకు కాంగ్రెస్, ద్రవిడార్ కజగం (డీకే) పార్టీలు మద్దతు తెలిపాయి. గాడ్సేకి ఆర్ఎస్ఎస్ శిక్షణ ఇచ్చిందని డీకే అధినేత కె.వీరమణి వ్యాఖ్యానించారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి కూడా కమల్ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్ఎస్ఎస్ను ఐసిస్ ఉగ్రవాద సంస్థతో పోల్చారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ బెయిల్‌పై బయట ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. -
దమ్ముంటే అరెస్ట్ చేయండి
బరసత్/కన్నింగ్: పశ్చిమబెంగాల్లో బీజేపీ జైత్రయాత్రను ఎవ్వరూ అడ్డుకోలేరని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. బంగారు బెంగా ల్ను దివాళా బెంగాల్‌గా సీఎం మమత మార్చేశారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పడకేసిందని విమర్శించారు. తాను బెంగాల్ గడ్డపై జైశ్రీరామ్ నినాదం ఇస్తున్నాననీ, దమ్ముంటే మమత తనను అరెస్ట్ చేయించాలని సవాల్ విసిరారు. బెంగాల్‌లోని కన్నింగ్‌లో ప్రచారంలో అమిత్ పాల్గొన్నారు. మమతకు కోపం వచ్చేస్తుంది ఇటీవల పశ్చిమ మిడ్నాపూర్‌లో ఓ సభ సందర్భంగా జై శ్రీరామ్ నినాదాలు ఇచ్చిన బీజేపీ కార్యకర్తలపై మమతా బెనర్జీ దూసుకుపోవడాన్ని షా ప్రస్తావించారు. ‘ఎవరైనా జై శ్రీరామ్ అని నినాదం ఇస్తే మమతా దీదీకి కోపం వచ్చేస్తుంది. ఈరోజు నేను జై శ్రీరామ్ నినాదం ఇస్తున్నాను. మీకు(మమత) నిజంగా దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి. మంగళవారం కూడా నేను కోల్‌కతాలోనే ఉంటాను’ అని సవాల్ విసిరారు. జాదవ్పూర్లోని బరుయిపూర్‌లో తన హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వడకపోవడంతో బీజేపీ సభ రద్దు కావడంపై అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు. కాగా బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ వ్యక్తిగత సహాయకుడిగా భావిస్తున్న ఓ వ్యక్తి నుంచి పోలీసులు రూ.కోటి స్వాధీనం చేసుకున్నారు. అసన్‌స్టోల్ రైల్వే స్టేషన్లో ఉన్న ఘోష్ సహాయకుడు గౌతమ్ చటోపాధ్యాయతోపాటు లక్ష్మీకాంత్ షా అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ–టీఎంసీ మాటలయుద్ధం బరుయిపూర్‌లో అమిత్ షా సభ రద్దుకావడంపై బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. బెంగాల్లో ప్రజాస్వామ్యానికి బదులు నియంత పాలన నడుస్తోందనీ, అందుకే షా హెలికాప్టర్ ల్యాండింగ్‌తో పాటు సభకు కూడా అనుమతి ఇవ్వలేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్గీయ ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఈసీ మౌనప్రేక్షకుడిగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్‌కతాలో ఈ నెల 15న యూపీ సీఎం యోగి పాల్గొనే సభకు అధికారులు అనుమతి రద్దుచేశారు. -
భార్యను వదిలేసినోడు.. చెల్లెళ్లను గౌరవిస్తాడా?
గోరఖ్‌పూర్: బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి ప్రధాని మోదీపై ఘాటు విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే అమాయకురాలైన భార్య జశోదాబెన్‌ను మోదీ వదిలేశారని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీలోని మహిళా నేతలు కూడా మోదీలా తమ భర్తలు తమను వదిలేస్తారేమో అని కలవరపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం మోదీ సెకనుకో కులం మార్చుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాబట్టి మోదీలాంటి వ్యక్తికి ఓటేయవద్దని దేశంలోని మహిళలందరికీ విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాయావతి ప్రధానిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ మహిళా నేతలకు భయం రాజస్తాన్‌లోని ఆళ్వార్‌లో దళిత మహిళపై అత్యాచారం నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలన్న మోదీ డిమాండ్‌పై మాయావతి స్పందిస్తూ.. ‘ఈ విషయంలో మోదీ నీచ రాజకీయాలు చేస్తున్నారు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. రాజకీయ ప్రయోజనాల కోసం సొంత భార్యనే వదిలేసిన వ్యక్తి ఇతరుల చెల్లెళ్లు, భార్యలను ఎలా గౌరవిస్తాడు? ఇటీవల నాకు ఓ కొత్త విషయం తెలిసింది. తమ భర్తలు మోదీకి సమీపంగా ఉండటం చూసి బీజేపీ మహిళా నేతలే ఆందోళనకు గురవుతున్నారట! వాళ్లంతా మోదీలాగే తమను వదిలేస్తారని భయపడుతున్నారట. మోదీ హయాంలో గుజరాత్లో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై తీవ్రమైన దాడులు జరిగాయి. కాబట్టి ఆళ్వార్ ఘటనపై మాట్లాడే నైతిక అర్హత ఆయనకు లేదు’ అని స్పష్టం చేశారు. మోదీని తప్పించేవరకూ ఎస్పీ–బీఎస్పీ పొత్తు దృఢంగా ఉంటుందని స్పష్టం చేశారు. మాయావతి క్షమాపణ చెప్పాలి: బీజేపీ మోదీపై వ్యక్తిగత విమర్శలు చేసిన మాయావతి క్షమాపణలు చెప్పాలని కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాయావతి కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీల వివరాలను సీతారామన్ మీడియా ముందు ప్రదర్శించారు. ‘దళిత హక్కుల సాధన కోసం బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మాయావతి.. దళిత్ బేటీ(దళిత కులం యువతి) స్థాయి నుంచి దౌలత్‌కీ బేటీ(ధనికురాలైన మహిళ)గా మారారు’ అని దుయ్యబట్టారు. మోదీపై విమర్శలతో మాయావతి తన స్థాయిని దిగజార్చుకున్నారనీ, ఆమె ప్రజాజీవితానికి అనర్హురాలని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. -
ప్రతి ఇంట్లోనూ ‘మోదీ’ గాలే
రత్లాం/సోలన్: దేశంలో ఇప్పుడు మోదీ గాలి వీయడం లేదని కొందరు ఎన్నికల పండితులు దుష్ప్రచారం చేస్తున్నారనీ, దేశంలోని ప్రతీ ఇంట్లో నుంచి మోదీ గాలి వీస్తోందని ప్రధాని మోదీ సోమవారం అన్నారు. పంజాబ్, మధ్యప్రదేశ్, హిమాచల్‌లలో మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ‘దేశంలో మోదీ గాలి లేదని గతంలో కొందరు ఎన్నికల పండితులు అన్నారు. కానీ గతంలోకన్నా ఇప్పుడు పోలింగ్ శాతం ఎక్కువగా ఉంది. రికార్డులు సృష్టిస్తున్న వారిలో రెండు రకాల ప్రజలు ఉన్నారన్న విషయం ఆ కొందరికి తెలియదు. తొలిసారి ఓటేస్తున్న నా యువ స్నేహితులు ఒక రకమైతే, ఇక రెండో రకం తమ కొడుకు/సోదరుడిని మళ్లీ ప్రధానిగా చూడాలనుకుంటున్న నా తల్లులు, సోదరిలు. వారికి వంటగ్యాస్, కరెంట్ ఇచ్చాను. వారంతా నాకు ఓటేయడానికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. వీరంతా ఏ గాలి వల్ల వస్తున్నారో అర్థం చేసుకోవడంలో ఆ ఎన్నికల పండితులు విఫలమయ్యారు. ఆ గాలి ప్రతీ ఇంటి నుంచి వస్తోంది.’ అని అన్నారు. దేశంలో భోపాల్ విషవాయువు ఘటన, కామన్వెల్త్ ఆటలు, 2జీ స్పెక్ట్రం కుంభకోణం తదితర కుంభకోణాలు కాంగ్రెస్ హయాంలో జరిగినవేననీ, ఇప్పుడు ఆ పార్టీ నేత శామ్ పిట్రోడా సిక్కు అల్లర్లపై ‘అయ్యిందేదో అయ్యింది’ అంటూ చేసిన వ్యాఖ్యలు వారి సిగ్గులేని తనానికి నిదర్శనమని మోదీ మండిపడ్డారు. ఐఎన్ఎస్ విరాట్‌ను గాంధీలు విహారయాత్రలకు ఉపయోగించుకోవడం, ఉగ్రవాదులు, నక్సలైట్ల దాడుల్లో జవాన్లు చనిపోవడం తదితర ఏ అంశంపై ప్రశ్నించినా ఇకపై కాంగ్రెస్ ‘అయ్యిందేదో అయ్యింది’ అన్న సమాధానమే ఇస్తుందని ఎద్దేవా చేశారు. పంజాబ్‌లోని బఠిండాలో మోదీ మాట్లాడుతూ శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై రాహుల్ ఆయనను నిందించడం కాదనీ, తమ పార్టీ నేత అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు రాహులే సిగ్గుపడాలని మోదీ అన్నారు. 50 సీట్లు గెలవడానికే కాంగ్రెస్ అష్టకష్టాలు పడుతోందని విమర్శించారు. ప్రజలనే దేవుళ్లను మోసం చేశారు.. మధ్యప్రదేశ్‌లో రైతు రుణమాఫీ హామీని అమలు చేయడంలో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మోదీ అన్నారు. ఈ విషయంలో ప్రజలు అనే దేవుళ్లను కాంగ్రెస్ మోసం చేసిందని పేర్కొన్నారు. ‘భారతమాతకు జై’ అనే నినాదాన్ని పలకడానికి కూడా కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసిందని ఆరోపించారు. హిందూ ఉగ్రవాదం అనే కొత్త పదాన్ని కాంగ్రెస్ తెరపైకి తెచ్చిందన్నారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ లోక్‌సభ ఎన్నికలకు భోపాల్ స్థానం నుంచి పోటీ చేస్తుండి కూడా పార్టీలో అంతర్గత కొట్లాటల వల్లే ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రధాని, రాష్ట్రపతి సహా దేశం మొత్తం ఓటు వేస్తుంటే దిగ్విజయ్ మాత్రం ఓటు వేయలేదనీ, ఇది ఆయన దురహంకారానికి నిదర్శనమని మోదీ అన్నారు. ఓటు వేయకపోవడం ద్వారా దిగ్విజయ్ మహా పాపానికి ఒడిగట్టారనీ, తన సొంత ఊరికి వెళ్లి దిగ్విజయ్ ఓటు వేయకుండా, ఓటమికి భయపడే భోపాల్‌లోనే ఉండి ప్రజలను ఓట్లు అడిగారని మోదీ పేర్కొన్నారు. అవి కాంగ్రెస్‌కు ఏటీఎంలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రక్షణ ఒప్పందాలను తమకు కాసులు కురిపించే ఏటీఎంలుగా చూశాయని హిమాచల్‌ప్రదేశ్ ప్రచారంలో మోదీ వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ హయాంలో రక్షణ దళాలకు అవసరమైన ఆయుధాలు, వస్తువుల్లో 70 శాతం విదేశాల నుంచే వచ్చేవి. ఆ దేశాలపై ఇండియా ఆధారపడేది. ఆయా ఆయుధాలు, వస్తువుల కొనుగోలు కోసం కాంగ్రెస్ పార్టీ విదేశాలతో చేసుకునే ఒప్పందాలు ఆ పార్టీకి ఏటీఎంలుగా ఉండేవి. 1947లో ఇండియాకు స్వాతంత్య్రం వచ్చే నాటికి మనకు రక్షణ వస్తువుల ఉత్పత్తిలో 150 ఏళ్ల అనుభవం ఉండగా, నాటికి చైనాకు ఏ మాత్రం అనుభవం లేదు. కానీ ఇప్పుడు చైనా నుంచి ఉత్పత్తులు కొనాల్సి వస్తోంది. ఇందుకు కాంగ్రెస్ విధానాలే కారణం’ అని అన్నారు. -
17వ లోక్‌సభకు.. కొత్త ముఖాలు!
లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో చివరిదైన ఏడో దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు కూడా ఖరారవడంతో ఈ ఎన్నికల్లో మొత్తం ఎంత మంది పోటీ చేస్తున్నారన్నది స్పష్టమయింది. లోక్‌సభ లోని 543 స్థానాలకు గాను రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి మొత్తం 8,048 మంది పోటీ చేస్తున్నారు(గత ఎన్నికలో 8,794 మంది పోటీ చేశారు). అయితే, వీరిలో 85 శాతం అంటే 6,819 మంది ఎన్నికలకు కొత్త వారే. అంటే మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారు. మిగతా వారిలో 8 శాతం రెండోసారి, 3.2 శాతం మూడోసారి, 1.5 శాతం నాలుగోసారి పోటీ చేస్తున్నారు. నాలుగు సార్లకు మించి పోటీ చేస్తున్న వారు 2.2 శాతం ఉన్నారు. అభ్యర్థుల్లో 85 శాతం కొత్త వారే కాబట్టి ఎన్నికల తర్వాత ఏర్పడబోయే 17వ లోక్‌సభలో కొత్త ముఖాలే ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీల తరఫున మొత్తం 2,163 మంది బరిలో దిగారు. 2,445 మంది చిన్న చిన్న పార్టీల తరఫున, 3,440 మంది ఇండిపెండెంట్లుగా ఎన్నికల గోదాలో కలబడుతున్నారు. ఈ సారి ప్రధాన రాజకీయ పార్టీలు కూడా చాలా మంది సిట్టింగులను పక్కన పెట్టేశాయి. 2014 ఎన్నికల్లో 73 శాతం సిట్టింగు ఎంపీలకు టికెట్లు లభిస్తే, ఈ సారి 59 శాతం సిట్టింగులకే మళ్లీ పోటీ చేసేందుకు అవకాశం దక్కింది. అంటే ప్రతి పది మంది సిట్టింగ్ ఎంపీల్లో దాదాపు నలుగురు పోటీ చేసే అవకాశం కోల్పోయా రు. పార్టీల వారీగా చూస్తే భారతీయ జనతా పార్టీకి 275 మం ది ఎంపీలుంటే వారిలో 156 మందికే ఈ సారి పోటీ చేసేందుకు టికెట్టు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ 48 మంది సిట్టింగ్ ఎంపీల్లో 28 ఎంపీలకే మళ్లీ అవకాశం ఇచ్చింది. ప్రాంతీయ పార్టీలదీ అదే దారి ప్రాంతీయ పార్టీలు కూడా ఈ సారి ఎక్కువ మంది కొత్త వారిని ఎన్నికల్లో నిలబెట్టాయి.ప్రస్తుత లోక్‌సభలో ప్రాంతీయ పార్టీల ఎంపీలు మొత్తం 139 మంది ఉంటే, వారిలో 63 మంది(45.5%) మాత్రమే ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అంటే 50 శాతానికిపైగా కొత్త ముఖాలే ప్రాంతీయ పార్టీల తరఫున పోటీ చేస్తున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే 37 మంది ప్రస్తుత ఎంపీల్లో కేవలం ఆరుగురికే మళ్లీ టికెట్ ఇచ్చింది. ఒడిశా లోని బీజేడీ 20 మంది సిట్టింగులకుగాను నలుగురినే తిరిగి బరిలో దింపింది. ఏపీలో తెలుగు దేశం పార్టీ 16 మంది సిట్టింగు ఎంపీల్లో పది మందినే మళ్లీ పోటీ చేయిస్తోంది. వైఎస్సార్సీపీ తొమ్మిది మంది సిట్టింగు ఎంపీల్లో ఏడుగురికి టికెట్ ఇవ్వలేదు. తెలంగాణలోని టీఆర్ఎస్కున్న 11 మంది సిట్టిం గ్ ఎంపీల్లో ఏడుగురు మళ్లీ పోటీ చేస్తున్నారు. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ ఏడుగురిలో నలుగురినే మళ్లీ పోటీ చేయిస్తోంది. ప్రధాన పార్టీలు, ప్రాంతీయ పార్టీలూ కూడా ఈ సారి కొత్త వారినే ఎక్కువ మందిని ఎన్నికల్లో నిలబెట్టా యి. ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా, యూపీఏ సర్కారు వచ్చినా కూడా చాలా మంది ఎంపీలు కొత్తవారే అవుతారు. 90వ దశకం నుంచీ.... 1990 దశకం చివరి నుంచి ఎన్నికల్లో సిట్టింగులను పక్కన పెట్టడం పెరుగుతూ వస్తోంది. ప్రధాన పార్టీలు సిట్టింగు ఎంపీలను మార్చడానికి కారణాలు అనేకం ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ప్రభుత్వ వ్యతిరేకతను తప్పించుకోవడం.అధికార పార్టీపై ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ సార్లు అధికారంలో కొనసాగిన పార్టీలపై సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. అలాంటి పార్టీ మరోసారి అధికారం కైవసం చేసుకోవానుకున్నప్పుడు ప్రజా వ్యతిరేకతను అధిగమించడం కోసం కొత్త వారికి టికెట్లు ఇస్తుంది. సిట్టింగ్‌ల పనితీరు, నియోజకవర్గాల్లో సదరు వ్యక్తికున్న బలం, ఆర్థిక పుష్టి వంటి అంశాలు కూడా అభ్యర్థి మార్పుకు దారి తీస్తాయి. మోదీ అయితే, ప్రతి ఎన్నికల్లో దాదాపు 50 శాతం కొత్త వారికి టికెట్లు ఇవ్వడమన్నది గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అమలు చేస్తున్న వ్యూహం. ప్రధాని అయ్యాక లోక్‌సభ ఎన్నికల్లో కూడా దీనినే అమలు పరుస్తున్నారు. అభ్యర్థులను మార్చే విషయంలో బీజేపీ కంటే కాంగ్రెస్ వెనకబడి ఉందని చెప్పాలి. చాలా ఏళ్లుగా ఆ పార్టీ అభ్యర్థుల ఎంపికలో విధేయతకే పెద్దపీట వేస్తూ వచ్చింది. కాబట్టి పనితీరు, ప్రభుత్వ వ్యతిరేకత ఎలా ఉన్నా చాలా మంది సిట్టింగులకే టికెట్లు లభించేవి. అయితే, ఈ సారి ఆ పార్టీ కూడా చాలా మంది సిట్టింగులను పక్కన పెట్టడం పార్టీ కొత్త అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెచ్చిన మార్పుగా పరిశీలకులు భావిస్తున్నారు. సిట్టింగులు,అనుభవజ్ఞులకు బదులు కొత్త వారు ఎన్నికవడం శుభసూచకమే అయినా, పాత వారి రాజకీయ, పరిపాలన అనుభవం వ్యర్ధమయినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా కొత్తగా ఎన్నికయిన వారు కూడా రెండో దఫా మళ్లీ అవకాశం వస్తుందో రాదో అన్న ఆందోళనతో విధి నిర్వహణపై శ్రద్ధ చూపించలేరని వారు అభిప్రాయపడుతున్నారు. -
ఆరు ముగిసింది... ఆఖరు పోరు ముందుంది..
ఆదివారం దేశంలోని 7 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో ఆరో విడత పోలింగ్ ముగిసింది. దీంతో 17వ లోక్‌సభ ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. మే 19న తుది విడత పోలింగ్ జరుగుతుంది. ఢిల్లీలో పోలింగ్ బూత్‌ల దగ్గర ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ల దగ్గర యువతులు బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఓటు వేసిన నవవధువు బిహార్ రాష్ట్రం సివాన్‌లో ఓటేసిన నాటి, నేటి తరం మహిళలు న్యూ ఢిల్లీ సంగం విహార్ పోలింగ్ స్టేషన్లో ఐడీకార్డులతో ఓటర్లు పశ్చిమ బెంగాల్ సింగ్‌భూమ్‌లోని పోలింగ్ స్టేషన్ వద్ద భద్రతా విధుల్లో ఉన్న జవాన్ హరియాణా ఫరీదాబాద్‌లో ఓటేసిన ఆనందంలో మహిళలు ఢిల్లీలో ఓ సీనియర్ ఓటర్ను పోలింగ్ బూత్‌కి ఎత్తుకుని వెళ్తున్న యువకుడు బిహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లాలో ఓటింగ్‌లో పాల్గొన్న మహిళలు ప్రయాగరాజ్‌లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న సాధువులు -
‘ఏడు’లోనూ భారీ పోలింగ్
7 రాష్ట్రాలు, 2 యూటీలలోని 89 స్థానాల్లో ప్రశాంతంగా ఓటింగ్ పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 81.35 శాతం పోలింగ్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బుధవారం జరిగిన ఏడో విడత సార్వత్రిక ఎన్నికల్లో ఒక మోస్తరు నుంచి భారీ పోలింగ్ నమోదైంది. ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 89 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. పశ్చిమ బెంగాల్లో 9 స్థానాలకు అత్యధికంగా 81.35 శాతం పోలింగ్ నమోదవగా పంజాబ్‌లోని 13 స్థానాలకు ఒకే దశలో జరిగిన పోలింగ్‌లో ఆ రాష్ట్ర చరిత్రలోకెల్లా తొలిసారిగా 73 శాతం ఓటింగ్ నమోదైంది. అలాగే గుజరాత్‌లోని మొత్తం 26 స్థానాలకు ఒకే దశలో జరిగిన ఎన్నికల్లో 62 శాతం పోలింగ్ రికార్డయింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్లో కేవలం 47.92 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతంలో ఉన్న 17 లోక్‌సభ స్థానాలతోపాటు 119 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 72 శాతం పోలింగ్ నమోదవగా ఉత్తరప్రదేశ్‌లోని 14 స్థానాలకు 57.10 శాతం, బీహార్‌లోని ఏడు స్థానాలకు 60 శాతం నమోదైంది. అలాగే జమ్మూకాశ్మీర్‌లో ఒక స్థానానికి 25.62 శాతం, కేంద్రపాలిత ప్రాంతాలైన దాద్రానగర్ హవేలీ, డామన్ డయూలలో ఒక్కో స్థానానికి వరుసగా 85 శాతం, 76 శాతం పోలింగ్ నమోదైంది. పంజాబ్‌లోని మోగా, ఖదూర్ సాహిబ్, అమృత్సర్ స్థానాల పరిధిలో అకాలీదళ్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో 15 మంది గాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోటీ చేసిన యూపీలోని రాయ్‌బరేలీ స్థానంలో 51.85 శాతం ఓటింగ్ రికార్డయింది. అలాగే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీ చేసిన గుజరాత్‌లోని వడోదరా స్థానంలో 70 శాతం పోలింగ్ నమోదైంది. ఓటేసిన మోడీ భార్య, తల్లి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ భార్య యశోదాబెన్, ఆయన మాతృమూర్తి హిరాబా మోడీలు బుధవారం జరిగిన ఏడో విడత సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెహ్సనా జిల్లాలోని ఉంఝా నగరంలో ఉన్న కోట్ కువా ప్రాంతంలో యశోదాబెన్ ఓటు వేశారు. అనంతరం మీడియా ప్రశ్నలకు ఏమాత్రమూ స్పందించకుండానే ఆమె హడావుడిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదేవిధంగా మోడీ తల్లి హిరాబా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఎన్నికల కేంద్రానికి ఆటోలో వచ్చి ఓటు వేశారు. గాంధీనగర్ నుంచి బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు గుర్తుండిపోతాయి: అద్వానీ భారత్‌లో ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎన్నికల కంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు బాగా గుర్తుండిపోతాయని బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ చెప్పారు. బుధవారం కుమారుడు జయంత్, కుమార్తె ప్రతిభా అద్వానీలతో కలిసి గుజరాత్‌లోని అహ్మదాబాద్ వెస్ట్ నియోజకవర్గంలో ఓటేసిన అనంతరం అద్వానీ విలేకరులతో మాట్లాడారు. ‘నేను 1947 నుంచి అన్ని ఎన్నికలను చూశాను. దేశంలో 1952లో జరిగిన తొలి ఎన్నికల నుంచి ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎన్నికలను చూశాను. అయితే దేశ చరిత్రలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు బాగా గుర్తుండిపోతాయి’ అని చెప్పారు. నిర్బంధ ఓటింగ్ విధానాన్ని అమలుచేయాలని పునరుద్ఘాటించారు. ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల కమిషన్ విజయవంతమైతే ఎంతగానో సంతోషిస్తానని చెప్పారు. అయితే, తన పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే అవకాశాలపై ప్రశ్నించగా, అద్వానీ దాటవేశారు. పార్లమెంటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపైనే మాట్లాడతానని, రాజకీయాలు మాట్లాడనని పేర్కొన్నారు.