-
దొరికిన కిడ్నాపర్లు ..
-
ప్రజల సహకారంతో పట్టివేత
-
రూ.50 లక్షల కోసం వివాహిత కిడ్నాప్
కాకినాడ క్రైం :
రూ.50 లక్షల కోసం వివాహితను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన నిందితులను విజువల్ పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజా సహకారంతో పట్టుకున్నట్టు జిల్లా ఏఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. కాకినాడ రూరల్ సర్పవరం జంక్ష¯ŒSలో మంగళవారం పోలీస్ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కిడ్నాప్‌కి పాల్పడిన నిందితుల వివరాలను వెల్లడించారు.
కాకినాడ వెంకటరత్నపురానికి చెందిన భార్యభర్తలు కాలే వీరవెంకట సత్యనారాయణసాయి, కాలే ధరలక్ష్మి యాక్ట్ ఫార్వార్డర్స్ షిప్పింగ్ కంపెనీ నిర్వహిస్తున్నారు. దీనికి సీఈఓగా ఉన్న ధనలక్ష్మి.. రంగయ్యనాయుడు వీధిలో ఉన్న ఆఫీసు కెళ్లేందుకు సోమవారం సాయంత్రం 5 గంటలకు మహేంద్ర వెరిటో కారులో డ్రైవర్ ఆరుగుల సుబ్బారావు (దయ)తో బయలుదేరారు. కారు కల్పనా థియేటర్ వద్దకొచ్చేసరికి డ్రైవర్ కారు ఆపడంతో పెండ్యాల బాబూరావు, విశ్వనాథరాజు కారులోకి జొరబడ్డారు. ధనలక్ష్మి నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి, అరిస్తే చంపేస్తామంటూ కత్తులతో బెదిరించారు.
విషయాన్ని గమనించిన...
దేవి మల్టీఫెక్స్ థియేటర్ సమీపాన చిలుకూరి టవర్స్‌లో ఉంటున్న కాటూరి విజయ్‌కుమార్ ఈ విషయాన్ని గమనించాడు. కారు పోర్టు మీదుగా బీచ్ గుండా ఉప్పాడ వైపు వెళ్లడంతో వెంబడించాడు. కిడ్నాప్ సమాచారాన్ని 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కిడ్నాప్‌పై అలర్ట్ అయిన పోలీసులు తిమ్మాపురం, ఉప్పాడ కొత్తపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారు ఉప్పాడ సెంటర్‌కి చేరుకోగానే విజువల్ పోలీస్ వ్యవస్థ డ్యూటీలో ఉన్న కొత్తపల్లి స్టేష¯ŒS ఏఎస్సై లోవరాజు ఆపడానికి యత్నించగా కారును వేగంగా పోనిచ్చారు. ఈ విషయాన్ని కోనపాపపేట గ్రామస్తులకు తెలియజేయడంతో వారు బీచ్‌రోడ్డులో రోడ్డుకి అడ్డంగా లారీని పెట్టడంతో కిడ్నాపర్లు దొరికిపోయారు. కారు డ్రైవర్ దయ పరార్ కాగా, ఇద్దరు నిందితులను వారు పోలీసులకు అప్పగించినట్టు ఏఎస్పీ దామోదర్ తెలిపారు.