ప్రజాదివస్‌లో ఫిర్యాదుల స్వీకరణ | complaints to kmm asp | Sakshi
Sakshi News home page

ప్రజాదివస్‌లో ఫిర్యాదుల స్వీకరణ

Published Mon, Aug 8 2016 11:13 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఏఎస్పీ సాయికృష్ణ

ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఏఎస్పీ సాయికృష్ణ

ఖమ్మం క్రైం: ప్రజా సమస్యలపై సోమవారం అదనపు ఏఎస్పీ సాయికృష్ణ అధ్వర్యంలో నిర్వహించిన ప్రజాదివస్‌ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ ఫిర్యాదులు అందజేశారు. కుటుంబ, వ్యక్తిగత సమస్యలు, ఆస్తి వివాదాలు, భూ తగాదాలకు సంబంధించిన 20మంది బాధితులు ఏఎస్పీని కలిసి విన్నవించారు. విన్నపాలను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి..పరిష్కార మార్గం చూపాలని ఏఎస్పీ ఆదేశించారు. ఫిర్యాదుదారుల గ్రామానికి నేరుగా వెళ్లి స్థానికులతో మాట్లాడి, వాస్తవ పరిస్థితిని కూడా తెలుసుకోవాలన్నారు. అప్పుడే నిజమైన బాధితులకు న్యాయం జరుగుతుందని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement