to
-
క్యాజువల్ వేర్ ఆర్ పార్టీ వేర్: లుక్ మాత్రం అదుర్స్ ! (ఫోటోలు)
-
పొలిటికల్ కారిడార్ : దత్తపుత్రుడి అగచాట్లు ..
-
అమరావతి పాదయాత్రపై సవరణ పిటిషన్లు కొట్టివేత
-
స్కూల్ పిల్లలకు లిఫ్ట్ ఇచ్చిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి
-
ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఎనర్జీ పవర్ ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్థాపన
-
టాలీవుడ్లోకి మరో వారసురాలు!
-
వైఎస్ జగన్ నేడు జిల్లాకు రాక
– కాకినాడ ఆసుపత్రిలో చాపరాయి బాధితులకు పరామర్శ – రంపచోడవరంలో రాత్రి బస – శనివారం చాపరాయి పర్యటన సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శుక్రవారం జిల్లాకు రానున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం కాకినాడ చేరుకుని, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం రంపచోడవరం చేరుకుని రాత్రి బస చేయనున్నారు. మరుసటి రోజైన శనివారం చాపరాయి గ్రామంలోని బాధిత కుటుంబాలను పరామర్శించి అదే రోజు హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు వైఎస్ జగన్ టూర్ షెడ్యూల్‌ను గురువారం రాత్రి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ప్రకటించారు. -
ఏప్రిల్ నుంచి రైతుమిత్ర గ్రూపులకు రుణాలు
- జిల్లా సహకార అధికారి ప్రవీణ అమలాపురం టౌన్ : వచ్చే ఏప్రిల్ నుంచి సహకార సంఘాల్లో జాయింట్ లైబిలిటీ గ్రూపుల (జేఎల్‌జీ) ద్వారా రైతుమిత్ర గ్రూపులకు రుణాలు ఇవ్వనున్నామని, ఈలోగా జిల్లాలోని 304 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జేఎల్‌జీ గ్రూపుల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా సహకార అధికారిణి (డీసీవో) టి.పవ్రీణ వెల్లడించారు. జేఎల్‌జీల ఏర్పాటు, రైతు గ్రూపులకు రుణాల బట్వాడా తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు స్థానిక డీసీసీబీ బ్రాంచి కార్యాలయంలో అమలాపురం డివిజన్లోని సంఘాల అధ్యక్షులు, సీఈవోలకు మంగళవారం జరిగిన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఇంతకాలం సహకార సంఘాల్లో రైతులకు వ్యక్తిగతంగానే పంట రుణాలు ఇచ్చేవారు, ఇప్పుడు జేఎల్‌జీ విధానంలో రైతులకు కూడా గ్రూపులుగా రుణాలు ఇచ్చే వెసులబాటు అందుబాటులోకి వస్తోంది. డివిజనల్ సహకార అధికారి ఎ.రాధాకృష్ణారావు అధ్యక్షతన జరిగిన సదస్సులో డీసీవో ప్రవీణ పలు సహకార అంశాలపై చర్చించారు. కౌలు రైతులకు కూడా రుణాలు ఇచ్చే విధానాలపై ఆమె సమీక్షించారు. డిజిటల్ మెంబరు రిజస్ట్రేషన్ (డీఎంఆర్)కు సంబంధించి సంఘ సభ్యుల పూర్తి సమాచారం సేకరించాలని ఆమె సూచించారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సంఘాలు 50:50 పద్ధతిలో గోదాములు నిర్మించుకునే వెసులబాటును సద్వినియోగం చేసుకోవాలని ప్రవీణ పేర్కొన్నారు. సంఘాల్లో తెల్లకార్డు కలిగిన సభ్యులకు ఆరోగ్య రక్ష ద్వారా బీమా కల్పించాలని సూచించారు. జిల్లా సహకార ఆడిటర్ వీవీ ఫణికుమార్ సంఘాల్లో ఆడిట్, జేఎల్జీపై సంఘాల అధ్యక్షులకు అవగాహన కల్పించారు. జిల్లా సహకార విద్యాధికారి ఆదిమూలం వెంకటేశ్వరరావు, కోనసీమ సహకార సంఘాల అధ్యక్షుల సమాఖ్య అధ్యక్షుడు గోకరకొండ విజయ రామారావు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ జిన్నూరి బాబి మాట్లాడుతూ సహకార సంఘాల్లో జేఎల్‌జీ విధానం అమలుపై ప్రసంగించారు. -
పెట్రోల్ డీలర్‌కు ఉత్తమ అవార్డు
ఖమ్మం జెడ్పీసెంటర్ : నాణ్యతా ప్రమాణాలతో పాటు అత్యధిక పెట్రో అమ్మకాలు చేసినందుకు డీలర్ నాగబత్తిన రవికి రెండు రీజినల్ పెట్రో అవార్డులు అందుకున్నారు. హిందుస్తాన్ పెట్రోలియం ఏటా రీజినల్ స్థాయిలో పెట్రోలు, డీజిల్ అత్యధిక అమ్మకాలు, నాణ్యత విషయంలో నిబద్ధత పాటించినందుకు అవార్డులు అందజేస్తోంది. అందులోభాగంగా రూరల్ మండలంలోని శ్రీ శేషాద్రి ఆటోఫిల్స్ హెచ్‌పీ బంక్‌కు సంస్థ అవార్డు అందించింది. వరంగల్ రీజియన్ ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో నెలకు 13 లక్షల లీటర్ల పెట్రోలు, డీజిల్ విక్రయించడం, నాణ్యతను పాటించడం, వినియోగదారులకు మంచి సేవలను అందించడాన్ని పరిగణలోకి తీసుకొని సంస్థ రవికి అవార్డును అందించింది. రీజినల్ స్థాయిలో జరిగిన వార్షిక సమావేశంలో జోన్ జనరల్ మేనేజర్ జీఎస్వీ ప్రసాద్ వరంగల్ రీజినల్ చీఫ్ మేనేజర్ పీకే విశ్వనాథం, సేల్స్ ఆఫీసర్ నినాద్ ఈ అవార్డును అందజేశారు. -
సంస్కృతిని కాపాడాలి
కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి -పూల పండగ ప్రారంభం ఖమ్మం కమాన్‌బజార్ : తెలంగాణ సంస్కృతిని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు నగరంలోని అన్ని డివిజన్ల నుంచి బతుకమ్మలతో కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకోగా జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. కళాకారుల నృత్య ప్రదర్శన, కోలాటాలు, బతుకమ్మ పాటలతో ర్యాలీ శోభాయమానంగా బస్టాండ్, మయూరిసెంటర్, కాల్వొడ్డు మీదుగా గుంటుమల్లేశ్వరస్వామి దేవాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతిని పూజించే ఈ పండగ ఔన్నత్యాన్ని భావి తరాలకు అందించాలని కోరారు. ఊరేగింపులో జేసీ దివ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్పర్సన్ కవిత, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, కార్పొరేటర్ కమర్తపు మురళి పాల్గొన్నారు. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు... మున్సిపాలిటీ నుంచి గుంటుమల్లేశ్వరస్వామి గుడి వరకు సాగిన ప్రదర్శనలో కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, కోలాటాలు చూపరులను ఆకట్టుకున్నాయి. కొంతమంది కళాకారులు తలపై బిందెలు, బతుకమ్మలను పెట్టుకుని పాటలకు అనుగుణంగా చేసిన నృత్యాలు చూపరులను కట్టిపడేశాయి. -
గోదావరికి పొంచివున్న వరద
భద్రాచలం : గోదావరికి వరద పోటెత్తే అవకాశం ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భద్రాచలం వద్ద ఆదివారం 21 అడుగుల నీటిమట్టం నమోదైంది. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులూ వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి నదిలోకి నీరు భారీగా చేరుతోంది. ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టు ల నుంచి కూడా భారీగా వరద నీటిని దిగువకు వదిలినట్లుగా అధికారులకు సమాచారం అందింది. మరో రెండు రోజుల్లో గోదావరికి ప్రమాద స్థాయిలో వరద నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం వద్ద 43 అడుగుల నీటిమట్టం నమోదైతే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 48 అడుగులకు రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులు వస్తే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతంలో భారీగా వరద నీరు చేరుతుండటంతో సోమవారం రాత్రికి భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక చేరువలో గోదావరి ప్రవహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజానీకాన్ని అప్రమత్తం చేశారు. -
‘కాకినాడ’ పీఠం కైవసమే లక్ష్యం
అధికార పార్టీ వైఫల్యాల్నీ, వంచననూ ఎండగట్టాలి మెజారిటీ డివిజన్లూ, మేయర్ స్థానమూ గెలవాలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నేతల పిలుపు కాకినాడ: రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో మెజారిటీ డివిజన్లలో గెలుపుతో పాటు మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని వైఎస్సార్ సీపీ కార్పొరేషన్ ఎన్నికల పరిశీలకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షతన బుధవారం జరిగింది. ముఖ్యఅతిథిగా బొత్స మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలను రెండేళ్ళ పాలనలో తుంగలో తొక్కి, ప్రత్యేక హోదా విషయంలో దగా చేసిన తెలుగుదేశం, బీజేపీ వైఫల్యాలను ఇంటింటా ప్రచారం చేయాలన్నారు. టీడీపీ అరాచకాలను ధైర్యంగా ఎదుర్కోవడంతో పాటు ఐకమత్యంతో పనిచేసి మంచి ఫలితాలను సాధించాలని కోరారు. సమర్థులే అభ్యర్థులు : ధర్మాన పార్టీ జిల్లా పరిశీలకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో సమర్థులైన అభ్యర్థులను సర్వేలు, ఇతర అంశాల ప్రాతిపదికగా ఎంపిక చేస్తారని స్పష్టం చేశారు. అభ్యర్థి గుణగణాలతోపాటు ప్రజలతో ఉండే సత్సంబంధాలను పరిగణనలోకి తీసుకుంటారన్నారు. మరో పరిశీలకుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని శత్రువుగా చూసే ధోరణిలో పాలన సాగిస్తున్న చంద్రబాబు హయాంలో ఎన్నికలు యుద్ధంలా జరుగుతున్నాయని, కేడర్ సైనికుల్లా పనిచేయాల్సి అవసరం ఉందని చెప్పారు. జన్మభూమి కమిటీల ద్వారా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీట్ లెవెల్లో పార్టీ శ్రేణులతో కమిటీలు వేయాలన్నారు. మరో ఎన్నికల పరిశీలకుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ పార్టీ నేతలు ఐక్యతతో పనిచే సి ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని సూచించారు. ‘స్మార్ట్ సిటీ’ ప్రచారార్భాటమే : కన్నబాబు పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ద్వారా రూ.386 కోట్లు విడుదలైనట్టు గొప్పలు చెబుతూ ఇప్పటి వరకు పట్టుమని రూ.2 కోట్లు నిధులు ఖర్చు చేయలేదని విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికొదిలిన టీడీపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడంతో పాటు పార్టీ విధానాలను విస్తృతంగా ప్రచారం చేసి గెలుపుబాట పట్టాలన్నారు. మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ద్వారా అధికార పార్టీకి ఎక్స్ అఫిషియో సభ్యులున్నందున కనీసం 35 స్థానాల్లో గెలుపును లక్ష్యంగా భావించాలన్నారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోపాటు ఇతర వైఫల్యాలను, స్మార్ట్‌సిటీ పేరుతో అభివృద్ధికి ఆమడదూరంగా ఉన్న విధానాలను ఇంటింటికీ తిరిగి విస్తృత ప్రచారం చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా మేయర్ పీఠాన్ని జగన్‌కు బహుమతిగా ఇద్దామని పిలుపునిచ్చారు. కాకినాడ సిటీ కో ఆర్డినేటర్ ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోగలమనే ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, జన్మభూమి కమిటీ అరాచకాలు పెరిగిపోయాయన్నారు. అమర జవాన్లకు నివాళి ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఎలా పనిచేయాలనే అంశంపై పార్టీ శ్రేణులకు నేతలు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు స్వాగతం పలుకగా, రాష్ట్ర కార్యదర్శి కర్రి నారాయణరావు, మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, కాకినాడ నగర ఎస్సీ, మైనార్టీ సెల్ అధ్యక్షులు సునీల్, అక్బర్ అజామ్ తదితరులు ప్రసంగించారు. తొలుత మహానేత వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన జవాన్లకు నివాళులర్పిస్తూ శశిధర్ తీర్మానం ప్రవేశపెట్టగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. పార్టీ పెద్దాపురం, జగ్గంపేట కో ఆర్డినేటర్లు తోట సుబ్బారావునాయుడు, ముత్యాల శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, మట్టా సుజాత, రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్, జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు అబ్దుల్ బషీరుద్దీన్, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శులు బొబ్బిలి గోవిందు, అల్లి రాజబాబు, మీసాల దుర్గాప్రసాద్, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి పెద్దిరెడ్డి రామలక్ష్మి, రాష్ట్ర యువజన విభాగం సభ్యుడు వాసిరెడ్డి జమీలు, పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
ప్రజలకు అందుబాటులో ఉండాలి
స్థానికంగానే సమస్యలు పరిష్కరించుకోవాలి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 'గండుగులపల్లి(దమ్మపేట): స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్థానిక సమస్యలను అక్కడే పరిష్కరించుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.మంగళవారం మండల పరిధిలోని గండుగులపల్లిలోని తన నివాసంలో ఉన్న తుమ్మలను జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమపై నమ్మకంతో ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకున్న ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధిని వేగవంతం చేయాలన్నారు. అధికారులు ధైర్యం చేసి పనులు చేస్తే ఆ కీర్తి వారికే దక్కుతుందని, గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు ప్రస్తుతం మంచి స్థానాల్లో ఉన్నారంటే దానికి వారు చేసిన పనివిధానమే కారణమన్నారు. పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చునని, ఆ విధంగా అధికారులు పనులు చేయాలన్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు విషయంలో పైరవీలకు ప్రాధాన్యతనిస్తే సహించేది లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన రోడ్ల విస్తరణ పనులను వేగవంతం చేయాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో మాజీ సొసైటీ అధ్యక్షుడు పైడి వెంకటేశ్వరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, చల్లగుళ్ల నరసింహారావు, సత్తుపల్లి ఆత్మ కమిటీ చైర్మన్ కట్టా అజయ్‌కుమార్, వేంసూరు సొసైటీ అధ్యక్షుడు వెల్ది జగన్మోహనరావు, నాయకులు దుగ్గిదేవర వెంకట్‌లాల్, కురిశెట్టి సత్తిబాబు, కాసాని నాగప్రసాద్ తదితరులున్నారు. -
విద్యతోనే అభివృద్ధి
గురుకుల పాఠశాల ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల ఐలాపురం (పినపాక): విద్యతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. ఐలాపురం గ్రామం వద్దనున్న మినీ గురుకులంలో గిరిజన బాలికల ఇంగ్లిష్ మీడియం పాఠశాలను శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ మీడియం విద్య అవసరమని అన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌కు త్వరలో అనుమతులు వస్తాయన్నారు. ‘మిషన్ భగరధ’తోపాటు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా కూడా పినపాక నియోజకవర్గానికి సాగు నీరు అందించనున్నట్టు చెప్పారు. రూ.400 కోట్లతో పర్ణశాల–చినరావిగూడెం గ్రామాల మధ్య త్వరలోనే వంతెన నిర్మించనున్నట్టు తెలిపారు. బూర్గంపాడు–ఏటూరునాగారం రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించనున్నట్టు తెలిపారు. గిరిజనుల బాలికల పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్, కాస్మొటిక్స్ అందజేశారు. కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఐటీడీఏ పీఓ రాజీవ్ గాంధీ, పాల్వంచ ఆర్డీఓ రవీంద్రనాధ్, మణుగూరు డీఎస్పీ అశోక్ కుమార్, పినపాక వైస్ ఎంపీపీ దాట్ల వాసుబాబు, సర్పంచులు కుంజా వెంకటేశ్వర్లు, తోలెం కళ్యాణి, ఇర్పా సారమ్మ, ఎంపీటీసీ సభ్యులు కొండేరు రాము, గొంది లక్ష్మీదేవి, ఎంపీడీఓ గడ్డం రమేష్, తహసీల్దార్ కోటేశ్వరరావు, ఎంఈఓ వీరభద్రస్వామి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థునికి నోట్ బుక్స్, దుస్తులు అందజేస్తున్న మంత్రి తుమ్మల, పక్కన ఎమ్మెల్యే పాయం, జడ్పీ చైర్పర్సన్ కవిత -
రేనాక్ ‘తేజా’నికి సత్కారం
ఇల్లెందు: గతేడాది డిసెంబర్లో హిమాచల్ ప్రదేశ్‌లోని 17,000 అడుగుల ఎల్తైన మౌంట్ రేనాక్ పర్వతాన్ని అధిరోహించిన సుదిమళ్ల గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థిని ఈసం తేజశ్రీని ప్రభుత్వం రూ.51 వేలతో ఘనంగా సత్కరిచింది. ఇటీవల హైదరాబాద్‌లో గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ చేతుల మీదుగా చెక్ అందజేశారు. మంగⶠవారం సుదిమళ్ల పాఠశాలకు చేరుకున్న ఆమెను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు. మైనస్ 2 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే మౌంట్ రేనాక్ పర్వతాన్ని అధిరోహించి, జాతీయ జెండాను ఎగురవేసి..సుదిమళ్ల గురుకుల పాఠశాలకు, జిల్లాకు ఖ్యాతి తెచ్చిందని ప్రశంసించారు. ప్రవీణ్‌సార్ ప్రోత్సాహంతోనే.. గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్‌కుమార్ సార్ ఎంతో ప్రోత్సహించారు. ప్రతిభను గుర్తించి..శిక్షణ ఇప్పించి, ఇలా ధైర్యంగా పర్వతం అధిరోహించేలా నడిపించారు. సార్‌కు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. బాగా చదుకుంటా. మా ప్రిన్సిపాల్ మేడం, టీచర్ల సహకారంతో భవిష్యత్‌లో ముందుకు సాగుతా. –ఈసం తేజశ్రీ -
దేశ సమగ్రతకు ఉపాధ్యాయులు నడుం బిగించాలి
ఖమ్మం: దేశ సమగ్రతకు ఉపాధ్యాయులు నడుం బిగించాలని ఇంటర్‌బోర్డు మాజీ కన్వీనర్ కర్నాటి రాంమోహన్‌రావు అన్నారు. టీపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో గురువారం విజయ్ అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలితరం నాయకత్వం వ్యక్తిగత జీవితాలను త్యాగం చేస్తే.. ఈ తరం యువత వ్యక్తి శ్రేయోవాదం వైపు పయనిస్తోందన్నారు. దేశానికి కొత్త నాయకత్వం కావాలని, నేడు దేశంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. విద్య మనచేతిలో లేకపోవడం వల్లనే విలువలు పడిపోతున్నాయన్నారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.మనోహర్‌రాజు మాట్లాడుతూ నేడు విద్యారంగంలో అనేక అసమానతలు ఉన్నాయన్నారు. కొఠారి కమిషన్ నివేదికను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ నాగిరెడ్డి, రవికుమార్, రామారావు, సంగమేశ్వరరావు, నర్సింహారావు, లక్ష్మీనారాయణ, ఎ.వి.నాగేశ్వరరావు, కె.వెంకటేశ్వర్లు, మహేష్, వీరబాబు, యోగానందం తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదాల నివారణలో ప్రభుత్వ విఫలం
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు మధిర : రోడ్డు ప్రమాదాలను నివారించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైఎస్ఆర్సీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు జల్లేపల్లి సైదులు, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సంయుక్త కార్యదర్శి తూమాటి నర్సిరెడ్డి ఆరోపించారు. మంగళవారం రిక్రియేషన్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. రెండు నెలల క్రితం నాయకన్‌గూడెం వద్ద ఎన్ఎస్పీ కాలువపై జరిగిన బస్సు ప్రమాదంలో ఒక పాప మృతి చెందిందని, అయితే అక్కడ ఎటువంటి జాగ్రత్తలు చేపట్టకపోవడంతోనే.. తిరిగి అక్కడే జరిగిన మరో ప్రమాదంలో అమాయకులు మృతి చెందారని విమర్శించారు. బ్రిడ్జిపై రైలింగ్ లేకపోవడంతోనే బస్సు ఫల్టీ కొట్టిందన్నారు. 10మంది ప్రయాణికుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. జిల్లాకు చెందిన రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల బాధ్యత వహిస్తూ ఆర్అండ్బీ, ఎన్ఎస్పీ అధికారులను సమన్వయపర్చి సమస్యను పరిష్కరించక పోవడంవల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. అంతేకాక మంత్రి ఈ రహదారి నుంచే హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారని, అయినప్పటికీ మంత్రి చూసీచూడనట్లు వ్యవహరించారని ఆరోపించారు. మృతిచెందిన ప్రయాణికులకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ.5లక్షలు, గాయపడినవారికి లక్ష రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు విడుదల చేయాలని కోరారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. డబుల్బెడ్రూం ఇళ్ల ఊసెత్తని ప్రభుత్వం ప్రజలకు గారడీ మాటలు చెబుతోందని విమర్శించారు. అర్హులైనవారికి పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. సెప్టెంబర్ 2న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి వేడుకలను ప్రతి పల్లెలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అన్ని గ్రామాల్లో పార్టీ బలోపేతానికి త్వరలోనే కృషి చేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ సీపీ క్రియాశీలకపాత్ర పోషిస్తుందన్నారు. సమావేశంలో నాయకులు షేక్ ఖాసీం సాహెబ్, ముక్కెర వెంకట్రామిరెడ్డి, అయిలూరి ఉమామహేశ్వరరెడ్డి, చింతిరాల వెంకటే శ్వరరావు ఉన్నారు. -
అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకురావాలి
సూర్యాపేట సూర్యాపేట మున్సిపాలిటీకి అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు తీసుకురావాలని మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక అన్నారు. గురువారం సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై సుమారు 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు రాఖీ కట్టిన అనంతరం ప్రసంగించారు. కార్మికుల్లో సోదరభావం పెంపొందించడంతో పాటు ప్రజల్లో పారిశుద్ధ్య కార్మికుల పట్ల గౌరవం పెరిగే విధంగా కృషి చేస్తున్నామన్నారు. కార్మికులు నిత్యం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషిచేస్తున్నారని వారిని సోదరసోదరీమణులుగా భావించి తెలంగాణ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా సూర్యాపేట మున్సిపాలిటీ తరపున రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో కార్మికులు పారదర్శకంగా పనిచేసి తమ విధులను నిర్వహించి మున్సిపాలిటీకి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు తమ వంతు బాధ్యత నెరవేర్చాలని తెలిపారు. సీఎం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారన్నారు. ఇచ్చిన మాట తప్పే వ్యక్తి సీఎం కేసీఆర్ కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీఓ 14 ప్రకారం పెంచిన వేతనాన్ని బకాయిలతో సహా చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ చైర్పర్సన్ గండూరి ప్రవళికకు టీఆర్ఎస్కేవీ నాయకులు సయ్యద్ సమ్మి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి ప్రకాష్, వైస్ చైర్పర్సన్ నేరెళ్ల లక్ష్మి, ఆకుల లవకుశ, బైరు దుర్గయ్యగౌడ్, షేక్ తాహేర్‌పాషా, రంగినేని ఉమ, వల్దాసు దేవేందర్, రాంబాయమ్మ, రాధిక, నర్సింహ, స్వరూపరాణి, మున్సిపల్ అధికారులు రాంచందర్, విద్యాసాగర్, విజయేందర్‌రెడ్డి, వెంకటేశ్వరరావు, సారగండ్ల శ్రీనివాస్, సూర్గి శంకర్‌గౌడ్, గౌస్, సయ్యద్సమ్మి తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకురావాలి
సూర్యాపేట సూర్యాపేట మున్సిపాలిటీకి అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు తీసుకురావాలని మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక అన్నారు. గురువారం సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై సుమారు 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు రాఖీ కట్టిన అనంతరం ప్రసంగించారు. కార్మికుల్లో సోదరభావం పెంపొందించడంతో పాటు ప్రజల్లో పారిశుద్ధ్య కార్మికుల పట్ల గౌరవం పెరిగే విధంగా కృషి చేస్తున్నామన్నారు. కార్మికులు నిత్యం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషిచేస్తున్నారని వారిని సోదరసోదరీమణులుగా భావించి తెలంగాణ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా సూర్యాపేట మున్సిపాలిటీ తరపున రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో కార్మికులు పారదర్శకంగా పనిచేసి తమ విధులను నిర్వహించి మున్సిపాలిటీకి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు తమ వంతు బాధ్యత నెరవేర్చాలని తెలిపారు. సీఎం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారన్నారు. ఇచ్చిన మాట తప్పే వ్యక్తి సీఎం కేసీఆర్ కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీఓ 14 ప్రకారం పెంచిన వేతనాన్ని బకాయిలతో సహా చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ చైర్పర్సన్ గండూరి ప్రవళికకు టీఆర్ఎస్కేవీ నాయకులు సయ్యద్ సమ్మి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి ప్రకాష్, వైస్ చైర్పర్సన్ నేరెళ్ల లక్ష్మి, ఆకుల లవకుశ, బైరు దుర్గయ్యగౌడ్, షేక్ తాహేర్‌పాషా, రంగినేని ఉమ, వల్దాసు దేవేందర్, రాంబాయమ్మ, రాధిక, నర్సింహ, స్వరూపరాణి, మున్సిపల్ అధికారులు రాంచందర్, విద్యాసాగర్, విజయేందర్‌రెడ్డి, వెంకటేశ్వరరావు, సారగండ్ల శ్రీనివాస్, సూర్గి శంకర్‌గౌడ్, గౌస్, సయ్యద్సమ్మి తదితరులు పాల్గొన్నారు. -
జేడీఏగా విజయనిర్మలకు పూర్తి బాధ్యతలు
ఖమ్మం: జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులుగా ముండ్లపాటి విజయనిర్మలకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం రాత్రి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత ఫిబ్రవరిలో ఇదే కార్యాలయంలోని రైతు శిక్షణ కేంద్రంలో పనిచేస్తున్న సహాయ వ్యవసాయ సంచాలకురాలు పి.మణిమాలకు జేడీఏగా రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ఈ శాఖలో రాష్ట్రస్థాయిలో ఉపసంచాలకుల వరకు పదోన్నతులు కల్పించారు. దీంతో మన జిల్లాకు రెండు ఉపసంచాలకుల పదవులు భర్తీ అయ్యాయి. జేడీఏ కార్యాలయ ఉపసంచాలకులుగా విజయనిర్మలకు అవకాశం దక్కింది. దీంతో విజయనిర్మలకు జేడీఏగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారధి ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో మణిమాల నుంచి జేడీఏ బాధ్యతలను విజయనిర్మల తీసుకున్నారు. మణిమాల ఏడీఏగా తిరిగి తన విభాగంలోకి వెళ్లారు. -
యూఎస్ఏ టు ఊట్లపల్లి
పెద్దవూర: పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కర పండుగకు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా పౌరసత్వం ఉన్న వల్లూరి గోపాలకృష్ణ దంపతులు సైతం యూఎస్ఏ నుంచి ఊట్లపల్లి ఘాట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా వారు పుష్కర స్నానం ఆచరించి, పెద్దలకు పిండ ప్రదానం చేశారు. గోపాలకృష్ణ అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఐజీ ర్యాంక్ పోలీస్ అధికారి (పీస్ ఆఫీసర్)గా పనిచేసి పదవీ విరమణ పొందారు. -
ప్రజాదివస్‌లో ఫిర్యాదుల స్వీకరణ
ఖమ్మం క్రైం: ప్రజా సమస్యలపై సోమవారం అదనపు ఏఎస్పీ సాయికృష్ణ అధ్వర్యంలో నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ ఫిర్యాదులు అందజేశారు. కుటుంబ, వ్యక్తిగత సమస్యలు, ఆస్తి వివాదాలు, భూ తగాదాలకు సంబంధించిన 20మంది బాధితులు ఏఎస్పీని కలిసి విన్నవించారు. విన్నపాలను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి..పరిష్కార మార్గం చూపాలని ఏఎస్పీ ఆదేశించారు. ఫిర్యాదుదారుల గ్రామానికి నేరుగా వెళ్లి స్థానికులతో మాట్లాడి, వాస్తవ పరిస్థితిని కూడా తెలుసుకోవాలన్నారు. అప్పుడే నిజమైన బాధితులకు న్యాయం జరుగుతుందని సూచించారు. -
జెడ్పీకి పూర్వవైభవం తీసుకొస్తా..
సీఎంతో మాట్లాడి జిల్లాకు మరిన్ని నిధులు జెడ్పీకి కేంద్ర నిధులు ఇవ్వడం లేదు నిధుల కొరతతో అభివృద్ధికి ఆటంకం జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం ‘సాక్షి’ఇంటర్వ్యూలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కవిత ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి చేసి జిల్లా పరిషత్‌లు పూర్వ వైభవం తీసుకవచ్చేందుకు పాటుపడతానని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టి ఆదివారానికి రెండేళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా ‘సాక్షి’తో ఆమె పలు అంశాలపై ముచ్చటించారు. కేంద్ర ప్రభుత్వం పలు పథకాలకు బ్రేక్ వేసిందని, దీంతో జిల్లా పరిషత్ పాలనకు కొంతమేర ఆటంకం కలిగిందన్నారు. ముఖ్యమంత్రి కే సీఆర్‌తో మాట్లాడి జిల్లా అభివృద్ధికి నిధులు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి మంత్రి తుమ్మల నాగేశ్వరావు విశేష కృషి చేస్తున్నారని, ఆయన సహకారంతో అభివృద్ధికి తన వంతు పాటుపడతానన్నారు. గ్రామ పంచాయతీల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, త్వరలో తండాలను సైతం పంచాయతీలుగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడినా జిల్లా పరిషత్ పాలన రెండుచోట్ల ఉంటుందని పేర్కొన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ వివరాలు.. ప్ర: పాలనలో సంతృప్తికరంగా ఉందా...? జ: రెండేళ్ల పాలన సంతృప్తికరంగా ఉంది. అందరి సహకారంతో ఉన్న నిధులతో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నా. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలో తొలి జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా ఎన్నికయ్యా, ఈ పదవి దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. ప్ర: రెండేళ్ళలో మీరు చేసిన అభివృద్ధి ..? జ: రెండేళ్ళ పాలనలో రూ. 424 కోట్లతో జిల్లాలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాం. మంచినీటి సరఫరా, బోర్లు, íసీసీ రోడ్ల, అంగన్వాడీ బిల్డింగ్‌ల నిర్మాణం చేపట్టాం. రోడ్లు, వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. పలు రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపాం. ప్ర: జిల్లాల విభజనలో మీ పయనం ఎటు..? జ: జిల్లాల పునర్విభజన పక్రియ జరుగుతుంది. ఇంకా మూడేళ్ళు కాలపరిమితి ఉంది. నిర్ణయం తీసుకోలేదు. సమయం వచ్చినప్పుడు నిర్ణయం ప్రకటిస్తా. ప్ర: రాబోయే రోజుల్లో చేపట్టే అభివృద్ధి పనులు ..? జ: జిల్లా అభివృద్ధికి నిధులు వచ్చేలా కృషి చేస్తా. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ప్రయత్నిస్తా. స్థానిక సంస్థల కేంద్ర బిందువు జెడ్పీ సొంత వనరులపై దృష్టి సారిస్తా. ప్ర: కేంద్ర నిధులు పరిస్థితి ఎంటీ..? జ: జిల్లా పరిషత్‌లకు కేంద్రం నుంచి ప్రతి ఎటా కోట్లాది రూపాయల నిధులు వచ్చేవి. వాటిలో నుంచి గ్రామ పంచాయతీలకు 50 శాతం, మండల పరిషత్‌లకు 30 శాతం, జిల్లా పరిషత్‌కు 20 శాతం నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేశాం. కాని గత రెండేళ్ళుగా ప్రభుత్వం బీఆర్జీఎఫ్ పథకాన్ని కేంద్రం ఎత్తి వేసింది. దీంతో నిధులు రాక అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. ప్ర: ప్రభుత్వ ప«థకాలు ఎలా అమలవుతున్నాయి..? జ: తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. సంక్షేమం, అభివృద్ధి సమానంగా జరుగుతుంది. ఇంటింటికి నీరు అందించే లక్ష్యంతో ‘మిషన్ భగిరథ’ జిల్లాలో పరుగులు తీస్తుంది. సెప్టెంబర్ నాటికి జిల్లాలో 102 హ్యబిటేషన్లలో నీరు అందించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సా«రథ్యంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాకతీయ మిషన్, హరితహారంలో జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఓడీఎఫ్ లక్ష్యంగా మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతుంది. -
భక్తులకు అసౌకర్యం కలగనీయం
ఐటీడీఏ పీఓ రాజీవ్ భద్రాచలం: అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా భద్రాచలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా ఐటీడీఏ పీఓ, ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే సున్నం రాజయ్య, దేవస్థాన ఈఓ టి.రమేష్‌బాబుతో కలిసి పుష్కరాల ప్రారంభ పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానఘాట్ వద్దనే భక్తులు స్నానమాచరించాలని, లోతు ప్రదేశాలకు వెళ్లొద్దని సూచించారు. బారీకేడ్లను ఏర్పాటు చేశామని, నీటి పారుదల శాఖ, అగ్నిమాపక శాఖ పర్యవేక్షణలో ప్రమాదాలు జరగకుండా అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. భక్తులకు పూజా సామగ్రిని అందుబాటులో ఉంచుతున్నామని, అంతా ఆధ్యాత్మిక భావంతో పుష్కర స్నానాలు ఆచరించి ప్రశాంతంగా తిరిగి వెళ్లాలని, రాములోరిని దర్శించుకొని పునీతులు కావాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ భాస్కరన్, తహసీల్దార్ రామకష్ణ, సర్పంచ్ బి.శ్వేత, దేవస్ధానం ఏఈఓ శ్రావణ్ కుమార్, ప్రధాన అర్చకులు జగన్నాథాచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘మిస్సైల్‌మ్యాన్’కు నివాళి
నల్లగొండ టూటౌన్ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా బుధవారం టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పట్టణంలోని క్లాక్‌టవర్ సెంటర్లో గల అమరవీరుల స్థూపం వద్ద కలాం చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.నాగార్జున, నాయకులు యుగంధర్, అంబేద్కర్, విజయ్, హరీశ్, క్రాంతి, కిరణ్, రాజేశ్, రాంబాబు, యాదగిరి తదితరులున్నారు. ఎస్‌ఆర్‌టీఐఎస్‌టీ ఇంజనీరింగ్ కళాశాలలో.. కనగల్ : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఎస్‌ఆర్‌టీఐఎస్‌టీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ హరినాథరెడ్డి అన్నారు. మండలంలోని చర్లగౌరారం పరిధిలో గల కళాశాలలో మాజీ రాష్ట్రపతి కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడారు. దేశం గొప్ప దార్శనికుడిని కోల్పోయిందన్నారు. కలాం ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మాల దయాకర్‌రెడ్డి, హెచ్ఓడీలు మధు, రవికుమార్, హైమావతి, శ్రీనివాస్‌కుమార్, గిరీశ్‌కుమార్, టీపీఓ శ్రీనివాస్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.