పెట్రోల్‌ డీలర్‌కు ఉత్తమ అవార్డు | best award to petrol dealer | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ డీలర్‌కు ఉత్తమ అవార్డు

Published Tue, Oct 4 2016 12:39 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM

అవార్డు అందుకుంటున్న నాగబత్తిని రవి - Sakshi

అవార్డు అందుకుంటున్న నాగబత్తిని రవి

ఖమ్మం జెడ్పీసెంటర్‌ : నాణ్యతా ప్రమాణాలతో పాటు అత్యధిక పెట్రో అమ్మకాలు చేసినందుకు డీలర్‌ నాగబత్తిన రవికి రెండు రీజినల్‌ పెట్రో అవార్డులు అందుకున్నారు. హిందుస్తాన్‌ పెట్రోలియం ఏటా రీజినల్‌ స్థాయిలో పెట్రోలు, డీజిల్‌ అత్యధిక అమ్మకాలు, నాణ్యత విషయంలో నిబద్ధత పాటించినందుకు అవార్డులు అందజేస్తోంది. అందులోభాగంగా రూరల్‌ మండలంలోని శ్రీ శేషాద్రి ఆటోఫిల్స్‌ హెచ్‌పీ బంక్‌కు సంస్థ అవార్డు అందించింది. వరంగల్‌ రీజియన్‌ ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో నెలకు 13 లక్షల లీటర్ల పెట్రోలు, డీజిల్‌ విక్రయించడం, నాణ్యతను పాటించడం, వినియోగదారులకు మంచి సేవలను అందించడాన్ని పరిగణలోకి తీసుకొని సంస్థ రవికి అవార్డును అందించింది. రీజినల్‌ స్థాయిలో జరిగిన వార్షిక సమావేశంలో జోన్‌ జనరల్‌ మేనేజర్‌ జీఎస్వీ ప్రసాద్‌ వరంగల్‌ రీజినల్‌ చీఫ్‌ మేనేజర్‌ పీకే విశ్వనాథం, సేల్స్‌ ఆఫీసర్‌ నినాద్‌ ఈ అవార్డును అందజేశారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement