వైఎస్ జగన్ నేడు జిల్లాకు రాక
– కాకినాడ ఆసుపత్రిలో చాపరాయి బాధితులకు పరామర్శ
– రంపచోడవరంలో రాత్రి బస
– శనివారం చాపరాయి పర్యటన
సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శుక్రవారం జిల్లాకు రానున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం కాకినాడ చేరుకుని, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం రంపచోడవరం చేరుకుని రాత్రి బస చేయనున్నారు. మరుసటి రోజైన శనివారం చాపరాయి గ్రామంలోని బాధిత కుటుంబాలను పరామర్శించి అదే రోజు హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు వైఎస్ జగన్ టూర్ షెడ్యూల్‌ను గురువారం రాత్రి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ప్రకటించారు.