: తేజశ్రీని అభినందిస్తున్న సుదిమళ్ల గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్ పద్మిని
ఇల్లెందు: గతేడాది డిసెంబర్‌లో హిమాచల్ ప్రదేశ్‌లోని 17,000 అడుగుల ఎల్తైన మౌంట్ రేనాక్ పర్వతాన్ని అధిరోహించిన సుదిమళ్ల గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థిని ఈసం తేజశ్రీని ప్రభుత్వం రూ.51 వేలతో ఘనంగా సత్కరిచింది. ఇటీవల హైదరాబాద్‌లో గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ చేతుల మీదుగా చెక్ అందజేశారు. మంగⶠవారం సుదిమళ్ల పాఠశాలకు చేరుకున్న ఆమెను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు. మైనస్ 2 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే మౌంట్ రేనాక్ పర్వతాన్ని అధిరోహించి, జాతీయ జెండాను ఎగురవేసి..సుదిమళ్ల గురుకుల పాఠశాలకు, జిల్లాకు ఖ్యాతి తెచ్చిందని ప్రశంసించారు.
- ప్రవీణ్‌సార్ ప్రోత్సాహంతోనే..
గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్ సార్ ఎంతో ప్రోత్సహించారు. ప్రతిభను గుర్తించి..శిక్షణ ఇప్పించి, ఇలా ధైర్యంగా పర్వతం అధిరోహించేలా నడిపించారు. సార్‌కు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. బాగా చదుకుంటా. మా ప్రిన్సిపాల్ మేడం, టీచర్ల సహకారంతో భవిష్యత్‌లో ముందుకు సాగుతా.
–ఈసం తేజశ్రీ