పూజలు చేస్తున్న పీఓ రాజీవ్
-
ఐటీడీఏ పీఓ రాజీవ్
భద్రాచలం: అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా భద్రాచలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా ఐటీడీఏ పీఓ, ఇన్‌చార్జ్ సబ్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే సున్నం రాజయ్య, దేవస్థాన ఈఓ టి.రమేష్‌బాబుతో కలిసి పుష్కరాల ప్రారంభ పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానఘాట్ వద్దనే భక్తులు స్నానమాచరించాలని, లోతు ప్రదేశాలకు వెళ్లొద్దని సూచించారు. బారీకేడ్లను ఏర్పాటు చేశామని, నీటి పారుదల శాఖ, అగ్నిమాపక శాఖ పర్యవేక్షణలో ప్రమాదాలు జరగకుండా అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. భక్తులకు పూజా సామగ్రిని అందుబాటులో ఉంచుతున్నామని, అంతా ఆధ్యాత్మిక భావంతో పుష్కర స్నానాలు ఆచరించి ప్రశాంతంగా తిరిగి వెళ్లాలని, రాములోరిని దర్శించుకొని పునీతులు కావాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ భాస్కరన్, తహసీల్దార్ రామకష్ణ, సర్పంచ్ బి.శ్వేత, దేవస్ధానం ఏఈఓ శ్రావణ్ కుమార్, ప్రధాన అర్చకులు జగన్నాథాచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు.