‘మిస్సైల్‌మ్యాన్‌’కు నివాళి | Tribute to missileman | Sakshi
Sakshi News home page

‘మిస్సైల్‌మ్యాన్‌’కు నివాళి

Published Thu, Jul 28 2016 2:01 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

Tribute to missileman

నల్లగొండ టూటౌన్‌ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం వర్ధంతి సందర్భంగా బుధవారం టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో పట్టణంలోని క్లాక్‌టవర్‌ సెంటర్‌లో గల అమరవీరుల స్థూపం వద్ద కలాం చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.నాగార్జున, నాయకులు యుగంధర్, అంబేద్కర్, విజయ్, హరీశ్, క్రాంతి, కిరణ్, రాజేశ్, రాంబాబు, యాదగిరి తదితరులున్నారు.
ఎస్‌ఆర్‌టీఐఎస్‌టీ ఇంజనీరింగ్‌ కళాశాలలో..
కనగల్‌ : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఎస్‌ఆర్‌టీఐఎస్‌టీ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ హరినాథరెడ్డి అన్నారు. మండలంలోని చర్లగౌరారం పరిధిలో గల కళాశాలలో మాజీ రాష్ట్రపతి కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడారు. దేశం గొప్ప దార్శనికుడిని కోల్పోయిందన్నారు. కలాం ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ మాల దయాకర్‌రెడ్డి, హెచ్‌ఓడీలు మధు, రవికుమార్, హైమావతి, శ్రీనివాస్‌కుమార్, గిరీశ్‌కుమార్, టీపీఓ శ్రీనివాస్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement