విద్యార్థునికి నోట్ బుక్స్, దుస్తులు అందజేస్తున్న మంత్రి తుమ్మల, పక్కన ఎమ్మెల్యే పాయం, జడ్పీ చైర్‌పర్సన్ కవిత
విద్యతోనే అభివృద్ధి
Published Fri, Sep 2 2016 11:07 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
గురుకుల పాఠశాల ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల
ఐలాపురం (పినపాక): విద్యతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. ఐలాపురం గ్రామం వద్దనున్న మినీ గురుకులంలో గిరిజన బాలికల ఇంగ్లిష్ మీడియం పాఠశాలను శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ మీడియం విద్య అవసరమని అన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌కు త్వరలో అనుమతులు వస్తాయన్నారు. ‘మిషన్ భగరధ’తోపాటు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా కూడా పినపాక నియోజకవర్గానికి సాగు నీరు అందించనున్నట్టు చెప్పారు. రూ.400 కోట్లతో పర్ణశాల–చినరావిగూడెం గ్రామాల మధ్య త్వరలోనే వంతెన నిర్మించనున్నట్టు తెలిపారు. బూర్గంపాడు–ఏటూరునాగారం రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించనున్నట్టు తెలిపారు. గిరిజనుల బాలికల పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్, కాస్మొటిక్స్ అందజేశారు. కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఐటీడీఏ పీఓ రాజీవ్ గాంధీ, పాల్వంచ ఆర్డీఓ రవీంద్రనాధ్, మణుగూరు డీఎస్పీ అశోక్ కుమార్, పినపాక వైస్ ఎంపీపీ దాట్ల వాసుబాబు, సర్పంచులు కుంజా వెంకటేశ్వర్లు, తోలెం కళ్యాణి, ఇర్పా సారమ్మ, ఎంపీటీసీ సభ్యులు కొండేరు రాము, గొంది లక్ష్మీదేవి, ఎంపీడీఓ గడ్డం రమేష్, తహసీల్దార్ కోటేశ్వరరావు, ఎంఈఓ వీరభద్రస్వామి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థునికి నోట్ బుక్స్, దుస్తులు అందజేస్తున్న మంత్రి తుమ్మల, పక్కన ఎమ్మెల్యే పాయం, జడ్పీ చైర్‌పర్సన్ కవిత
Advertisement