ఓ వ్యక్తి నిప్పంటించుకుని.. ఆపై యువతిని..! | man sets fire himself, hugs woman in madhya pradesh | Sakshi
Sakshi News home page

ఓ వ్యక్తి నిప్పంటించుకుని.. ఆపై యువతిని..!

Published Sat, Feb 10 2018 5:32 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

man sets fire himself, hugs woman in madhya pradesh - Sakshi

సాక్షి, భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో గురువారం భయంకర సంఘటన చోటుచేసుకుంది. ఓ హోటల్‌ ఒక వ్యక్తి తనకు తాను శరీరానికి నిప్పంటించుకున్నాడు. అంతేకాక హోటల్‌లో ఉన్న యువతిని కూడా తనతో పాటు అగ్నికి ఆహుతి చేయడానికి ప్రయత్నించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీటీవి కెమెరాలో  రికార్డు అయ్యాయి. దీనిపై ఏఎస్పీ నీరజ్‌ సోని మాట్లాడుతూ.. ఆ వ్యక్తి పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని, ఆపై మహిలను చంపడానికి ప్రయత్నించాడు.

ఈ ఘటన గ్రీన్‌ ప్యారడైజ్‌ అనే హోటల్‌లో చోటుచేసుకుందని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంలో వారిద్దరికి తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఏఎస్పీ తెలిపారు. అతను ఆ యువతిపై కక్షసాధింపుతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఏఎస్పీ చెప్పారు. గతంలో వారిద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగిందన్నారు. దీనికి కారణం వాట్సాప్‌లో ఎడిట్‌ చేసిన ఫొటోలే ఈ ప్రమాదానికి దారితీశాయన్నారు. అతనిపై ఆత్మహత్య యత్నం కేసు, హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఏఎస్పీ చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement