రంగురాళ్ల తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు | colour tones in agency | Sakshi
Sakshi News home page

రంగురాళ్ల తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు

Aug 27 2016 8:21 PM | Updated on Sep 4 2017 11:10 AM

రక్షిత అటవీ ప్రాంతాల్లో ఎవరైనా రంగురాళ్ల కోసం తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రంపచోడవరం ఏఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మీ హెచ్చరించారు. తపస్వికొండ రక్షిత అటవీ ప్రాంతంలో రంగురాళ్ల తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఈ ప్రదేశంలో శనివారం ఆయన పర్యటించారు.

ఏఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మీ హెచ్చరిక
అడ్డతీగల :
రక్షిత అటవీ ప్రాంతాల్లో ఎవరైనా రంగురాళ్ల కోసం తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రంపచోడవరం ఏఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మీ హెచ్చరించారు. తపస్వికొండ రక్షిత అటవీ ప్రాంతంలో రంగురాళ్ల తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఈ ప్రదేశంలో శనివారం ఆయన పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో తవ్వకాలు ఎలా, ఏ సమయాల్లో జరుపుతారో ఆయన స్థానికుల నుంచి ఆరా తీశారు. రక్షిత అటవీ ప్రాంతాల్లో రంగురాళ్ల తవ్వకాలు జరపడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. వాటి జోలికి ప్రజలు వెళ్లరాదని, వెళితే కేసుల్లో ఇరుక్కుంటారని హెచ్చరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement