రంగురాళ్ల తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు
ఏఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మీ హెచ్చరిక
అడ్డతీగల :
రక్షిత అటవీ ప్రాంతాల్లో ఎవరైనా రంగురాళ్ల కోసం తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రంపచోడవరం ఏఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మీ హెచ్చరించారు. తపస్వికొండ రక్షిత అటవీ ప్రాంతంలో రంగురాళ్ల తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఈ ప్రదేశంలో శనివారం ఆయన పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో తవ్వకాలు ఎలా, ఏ సమయాల్లో జరుపుతారో ఆయన స్థానికుల నుంచి ఆరా తీశారు. రక్షిత అటవీ ప్రాంతాల్లో రంగురాళ్ల తవ్వకాలు జరపడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. వాటి జోలికి ప్రజలు వెళ్లరాదని, వెళితే కేసుల్లో ఇరుక్కుంటారని హెచ్చరించారు.