in agency
-
అడవిబిడ్డలకు అండగా..
7, 8 తేదీల్లో వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి ఏజెన్సీ పర్యటన పలుచోట్ల రోడ్‌షో, రేఖపల్లి బహిరంగసభలో ప్రసంగం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖీ కాళ్లవాపు, పౌష్టికాహార లోప మృతుల కుటుంబాలకు పరామర్శ వీఆర్‌పురం / మారేడుమిల్లి : పోలవరం ప్రాజెక్టును 2018లో పూర్తి చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇంత వరకు నిర్వాసితులకు నిర్దిష్టమైన ప్యాకేజీని ఇవ్వకుండా అయోమయంలో నెట్టివేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. దీంతో పాటు అనేక అంశాల్లో గిరిజనులకు భరోసా ఇచ్చి ప్రభుత్వంపై పోరాడేందుకుకే తమ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి ఏజెన్సీ పర్యటనకువస్తున్నట్లు తెలిపారు. జగ¯ŒS ఈ నెల 7, 8 తేదీల్లో రంపచోడవరం నియోజకవర్గంతో పాటు విలీనమండలాల్లో చేయనున్న పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను ఆదివారం కన్నబాబు ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, కొమ్మిశెట్టి బాలకృష్ణ, రాష్ట్ర ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లతో కలిసి పరిశీలించారు. మారేడుమిల్లిలో జగ¯ŒS బసచేసే అతిథిగృహాన్ని, రోడ్ షో నిర్వహించే ప్రాంతాలను పరిశీలించారు. వీఆర్ పురం మండలం రేఖపల్లి గ్రామంలో 8న జగ¯ŒS పాల్గొననున్న బహిరంగ సభా ప్రాంగణాన్ని సందర్శించారు. అనంత ఉదయభాస్కర్ సభాస్థలిలో ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, మండలాల వారీగా ప్రజల తరలింపు తదితర విషయాలను రఘురామ్‌కి వివరించారు. గిరిజనులంటే చంద్రబాబుకు చులకన.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయే రైతులను, నిర్వాసితులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని కురసాల కన్నబాబు ఆరోపించారు. జగ¯ŒS పర్యటన ఏర్పాట్ల పరిశీలన సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు అంటే చంద్రబాబు చులకనగా చూస్తున్నారని ఆరోపించారు. ఇంత వరకు ఏజెన్సీలో నిర్వాసితులను గాని, కాళ్లవాపు మృతులను గాని పట్టించుకోలేదన్నారు. గిరిజనుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతంలో కాళ్లవాపుతో 12 మంది, పౌష్టికాహార లోపంతో 9 మంది శిశువులు, తల్లులు చనిపోతే ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. ఈ ప్రభుత్వం కళ్లు తెరిపించేలా జగ¯ŒS ఏజెన్సీ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. జెడ్పీటీసీ సత్తి సత్యనారాయణరెడ్డి, గొర్లె బాలాజీబాబు, పార్టీ వీఆర్ పురం మండల కన్వీనర్ పొడియం గోపాల్, జిల్లా నాయకులు ముత్యాల మురళి, ముప్పనశెట్టి శ్రీనివాస్, నక్కా మోహన్, తోట రాజేశ్వరావు, నండూరి గంగాధరరావు, ఆకిరి శ్రీనివాస్, చిక్కాల బాలు, రేవు బాలరాజు, చీమల కాంతారావు, మాచర్ల వెంగళరావు తదితరులు పాల్గొన్నారు. జగ¯ŒS పర్యటన సాగేది ఇలా.. జగ¯ŒS 7న ఉదయం హైదరాబాద్ నుంచి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి కారులో రంపచోడవరం మండలం గోపవరం వస్తారు. అక్కడ పార్టీ నాయకులు ,కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతారు. అనంతరం సీతపల్లి మీదుగా రంపచోడవరం చేరుకుని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో దేవీపట్నం మండలానికి చెందిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత రైతులతో ముఖాముఖీగా మాట్లాడతారు. అనంతరం రాజవొమ్మంగి మండలంలో ఇటీవల సంభవించిన శిశు మరణాల బాధిత కుటుంబాలను రంపచోడవరంలోనే పరామర్శిస్తారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి బయలుదేరి దేవీగుడి సెంటర్లో రోడ్‌షోలో పాల్గొంటారు. అక్కడ నుంచి గెద్దాడ మీదుగా మారేడుమిల్లి చేరుకుని రోడ్‌షోలో పాల్గొంటారు. రాత్రికి మారేడుమిల్లిలో బస చేస్తారు. 8న ఉదయం మారేడుమిల్లి–భద్రాచలం ఘాట్ రోడ్డులో ప్రయాణించి చింతూరు మీదుగా కూనవరం మండలం చేరుకొంటారు. కూనవరం బ్రిడ్జి వద్ద ఆయనకు ఘనస్వాగతం పలుకుతారు. జగ¯ŒS రేఖపల్లి చేరుకొని అక్కడ పోలవరం నిర్వాసిత రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడతారు. అనంతరం ఇటీవల కాళ్లవాపు బారిన పడి మృతి చెందిన వారి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. తిరిగి కూనవరం మీదుగా ఎటపాక మండలానికి వెళ్లి అక్కడ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్ చేరుకొంటారు. జగ¯ŒS పర్యటనను జయప్రదం చేయాలి మధురపూడి : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి జిల్లా పర్యటనను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ విజ్ఞప్తి చేశారు. కోరుకొండ మండలం గుమ్ములూరులో నిర్మించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి యోగ ముద్రలో ఉన్న విగ్రహాన్ని ఆయన ఆదివారం పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజాతో కలిసి పరిశీలించారు. జగ¯ŒS బుధవారం ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏజెన్సీలో, విలీన మండలాల్లో పర్యటిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాంబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, గుమ్ములూరు మాజీ సర్పంచ్ మట్టా పెద వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
జగన్ పర్యటనను విజయవంతం చేయండి
వీఆర్ పురం : రంపచోడవరం నియోజక వర్గంతోపాటు విలీన మండలాల్లో ఈ నెల 7,8 తేదీల్లో వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహ¯ŒSరెడ్డి చేపట్టనున్న పర్యటనను విజయవంతం చేయాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్ (బాబు) విజ్ఞప్తి చేశారు. వీఆర్‌పురం మండలం రేఖపల్లిలో శనివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల కన్వీనర్లు పొడియం గోపాల్, టి.వాసు, ఆలూరి కోటేశ్వరావు, వై.రామలింగారెడ్డి, రాష్ట్ర నాయకులు ఆవుల మరియాదాస్, కొమ్మిశెట్టి బాలకృష్ణ, మాచర్ల గంగులు, చండ్ర కృష్ణార్జనరావు, జిల్లా నాయకులు ముత్యాల శ్రీనివాస్, ముత్యాల మురళి, పూసం ప్రసాద్, కొవ్వూరి శివ యాదవ్, కొవ్వూరి రాంబాబు, చిక్కాల బాలు, మామిడి బాలాజి, రేవు బాలరాజు, చింతూరు జెడ్పీటీసీ సోయం అరుణ, కరక లక్ష్మి, మడకం జోగమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
ఏఓబీలో భారీ ఎత్తున పోలీసు కూంబింగ్
వై.రామవరం : ఈనెల రెండో తేదీ నుంచి 8వ తేదీ వరకు గెరిల్లా ఆర్మీ ఆవిర్భావ వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునివ్వడంతో తూర్పు గోదావరి జిల్లా పోలీసు యం త్రాంగం అప్రమ త్తమైంది. తెలంగాణ , చత్తీస్‌గఢ్, ఒడిషా రాష్రా ్టల సరిహద్దు తోపాటు విశాఖ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో విస్తృతంగా పోలీసు కూం బింగ్ నిర్వహిస్తున్నారు. చింతూరు మండల సరిహద్దు ప్రాం తంలో శుక్రవారం మావోయిస్టులు పెట్టిన మందుపాతరలను పోలీసులు వెలికి తీసిన విషయం విదితమే. అలాగే గత ఎ¯ŒSకౌంటర్లో గట్టి దెబ్బ తిన్న మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడవచ్చుననే అభిప్రా యంతో, ముందు జాగ్రత్త చర్యగా మరింత అప్రమతం అయిన పోలీసు యంత్రాంగం ఒక పక్క తూర్పు, మరో పక్క విశాఖ జిల్లాల పోలీసు లతో భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తూ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడు తున్నారు. అలగే ఏజన్సీ అన్ని పోలీసు స్టేషన్లలో భద్రతను మరింత పటిష్టం చేశారు. దీంట్లో భాగంగా వై.రామవరం మండలం మీదుగా శనివారం మరిన్ని పోలీసు బలగాలు సరిహద్దు అటవీ ప్రాంతంలోకి కూంబింగ్‌కు బయలుదేరి వెళ్లాయి. ఒకపక్క మావోల వారోత్సవాల పిలుపు, మరో పక్క పోలీసు కూంబింగ్‌లతో ఏఓబీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం సరిహద్దు అటవీ ప్రాంతంలో గ్రేహౌం డ్స్, ఏఎ¯ŒSఎస్, సీఆర్పీఎఫ్ పోలీçసులు అటవీ ప్రాం తాన్ని జల్లెడ పడుతున్నారు. మావోలు ఇచ్చిన వారోత్సవాల పిలుపుతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రధాన రహదారుల్లో శనివారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. దీంట్లో భాగంగా అడ్డతీగల సీఐ ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో అడ్డతీగల–వై.రామవరం ప్రధాన రహదారిలో కల్వర్టులు, అనుమానాస్పద ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. అలాగే వేటమామిడి జంక్ష¯Œలో సీఐ వాహన తనిఖీలు నిర్వహించి, కేసులు నమోదు చేశారు. అనుమానితులు, అపరిచితులపై గట్టి నిఘా విధించారు. మావోయిస్టుల వసూళ్లంటూ కరపత్రాలు చింతూరు : మన్యంలో మావోయిస్టులు వారోత్సవాల పేరుతో హల్చల్ చేస్తున్న క్రమంలో వారి వ్యూహాలను తిప్పికొట్టేందుకు పోలీసులు ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. ఈ క్రమంలో యాంటీ నక్సల్ స్క్వాడ్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం చింతూరులో పలు వాహనాలపై విశాఖ మన్యంలో మావోయిస్టుల ఏడాది అక్రమ వసూళ్ల వివరాలతో కూడిన కరపత్రాలను అతికించారు. రహదారి కాంట్రాక్టర్లు, గంజాయి స్మగ్లర్లు, చిన్న వ్యాపారులు, క్వారీ యజమానులు, వాహన యజమానులు, బీడీ కాంట్రాక్టర్లు, వెదురు కాంట్రాక్టర్లు, సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి రూ. లక్షలు వసూలు చేశారంటూ కరపత్రాల్లో పేర్కొన్నారు. గిరిజ నుల నుంచి వారి పంట దిగుబడిలో వాటాలు తీసుకుంటున్నారని, గిరిజనులకు చెందాల్సిన సదరు సొమ్ము ఎక్కడికి పోతోంది, ఇందులో సంఘాల నేతల వాటాలెంత అంటూ కరపత్రాలు దర్శనమిచ్చాయి. -
మన్యంలో మావోయిస్టుల హల్చల్
పోలీసులు లక్ష్యంగా మందుపాతర్లు జాతీయ రహదారిపై కలకలం సరివెల(చింతూరు): పీఎల్జీఏ (పీపుల్స్ లిబరేష¯ŒS గెరిల్లా ఆర్మీ) వారోత్సవాలు నిర్వహిస్తున్న మావోయిస్టులు తొలిరోజే మన్యంలో హల్చల్ చేశారు. చింతూరు మండలం సరివెల వద్ద గురువారం అర్థరాత్రి జాతీయ రహదారిపై పోలీసులు లక్ష్యంగా మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాల అడుగున నాలుగు మందుపాతర్లను అమర్చారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి వాటిని నిర్వీర్యం చేయడంతో ప్రమాదం తప్పింది. ఈనెల 2 నుండి 8 వరకు పీఎల్జీఏ వారోత్సవాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సరివెల వద్ద జాతీయ రహదారిపై మావోయిస్టులు బ్యానర్లు, కరపత్రాలను వుంచినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఈ రహదారి గుండా వెళ్లే వాహనాలను కూనవరం మీదుగా దారి మళ్లించారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యానర్లు, కరపత్రాల కింద మావోయిస్టులు మందుపాతర్లు అమర్చి వుంటారని అనుమానించి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సాయంతో తనిఖీ చేశారు. ఊహించినట్టే వాటికింద మావోయిస్టులు అమర్చిన మూడు టిఫి¯ŒS బాక్స్ బాంబులతో పాటు వెదురుతో తయారు చేసిన ఐఈడీని పోలీసులు గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారు. సంఘటనా స్థలాన్ని ఓఎస్డీ డాక్టర్ ఫకీరప్ప, సీఐ దుర్గాప్రసాద్ పరిశీలించారు. మావోయిస్టుల కొత్త పంథా తాజా ఘటనా ద్వారా మావోయిస్టులు మన్యంలో కొత్త పంథాకు తెరలేపారు. గతంలో వారోత్సవాలు, బంద్‌లు నిర్వహించే సమయంలో మావోయిస్టులు కేవలం కరపత్రాలు, బ్యానర్లు, పోస్టర్లు వేయడం పరిపాటి. కాగా తాజాగా వాటికింద మందుపాతర్లను అమర్చడం పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో ఛత్తీస్‌గఢ్‌లో ఎ¯ŒSకౌంటర్లు జరిగిన సమయంలో పోలీసులు మృతిచెందితే వారి మృతదేహాల కింద మావోయిస్టులు మందుపాతర్లను అమర్చేవారు. మృతదేహాలను తొలగించేందుకు వచ్చిన పోలీసులు వాటి బారిన పడి మృత్యువాత పడేవారు. వారోత్సవాలకు పిలుపునిచ్చిన మావోయిస్టులు ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, తెలంగాణ లో పలుచోట్ల కరపత్రాలు, మందుపాతర్లను మావోయిస్టులు అమర్చారు. ఈ క్రమంలో ఆంధ్రా సరిహద్దుల్లోని తెలంగాణ రాష్ట్రం వెంకటాపురం వద్ద మావోయిస్టులు వుంచిన కరపత్రాలను తీసేందుకు ఓ ఆటోడ్రైవర్ ప్రయత్నించగా అది పేలడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. ప్రతీకారేఛ్ఛలో మావోయిస్టులు: ఇటీవల ఏవోబీలో జరిగిన భారీ ఎ¯ŒSకౌంటర్ ద్వారా 32 మందిని కోల్పోయిన మావోయిస్టులు వారోత్సవాల సందర్భంగా ప్రతీకార దాడులకు పాల్పడవచ్చని ఇప్పటికే నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ నేపధ్యంలో తొలిరోజే ఇటు ఆంధ్రాలో అటు తెలంగాణ , చత్తీస్‌గఢ్‌లో మందుపాతర్లు అమర్చడం ద్వారా మావోయిస్టులు తమ ఉనికిని చాటుకున్నారు. వారోత్సవాల వేళ నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టులు మరిన్ని దాడులకు పాల్పడే అవకాశముందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా పీఎల్జీఏ 16వ వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని, బూటకపు ఎ¯ŒSకౌంటర్లను వ్యతిరేకించాలని, 3వ గ్రీ¯ŒSహంట్‌కు వ్యతిరేకంగా పోరాడాలని సం«ఘటనా స్థలంలో శబరి ఏరియా కమిటీ పేరుతో వుంచిన కరపత్రాల్లో మావోయిస్టులు పేర్కొన్నారు. కూంబింగ్‌ను ముమ్మరం చేశాం మావోయిస్టులు వారోత్సవాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు జరుగకుండా సరిహద్దుల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశాం. జాతీయ రహదారిపై బ్యానర్లు, పోస్టర్లు వుంచిన విషయం తెలుసుకుని ప్రజలను అప్రమత్తం చేసి వాహనాల దారిని మళ్లించి వాటిని అక్కడినుండి తొలగించాం. వాటికింద అమర్చిన మందుపాతర్లను నిర్వీర్యం చేశాం. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. డాక్టర్ కె.ఫకీరప్ప, చింతూరు ఓఎస్డీ -
5 నుంచి ’అడవిలో హంతకుడు’ షూటింగ్
కొయ్యలగూడెం: ’అడవిలో హంతకుడు’ చిత్ర షూటింగ్‌ను ఈనెల 5వ తేదీ నుంచి కొయ్యలగూడెం, పోలవరం, బుట్టాయగూడెం మండలాల్లోని అటవీ ప్రాంతంలో చిత్రీకరిస్తున్నట్టు హీరో, దర్శక, నిర్మాత తగరం వంశీరాజు చెప్పారు. కొయ్యలగూడెంలో గురువారం చిత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇందిరా ఆర్ట్ క్రియేషన్‌పై నలుగురు హీరోయిన్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. తన స్వగ్రామం కొయ్యలగూడెం కావడంతో పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో చిత్రీకరించేలా చిత్ర కథాంశాన్ని రూపొందించామన్నారు. తాను దర్శకులు రాఘవేంద్రరావు, కృష్ణవంశీ, కోడి రామకృష్ణ, ఈవీవీ సత్యనారాయణ వద్ద పనిచేశానని చెప్పారు. పయనం, ఆకర్షణ, పాపే నాప్రాణం చిత్రాలకు దర్శకత్వం వహించానన్నారు. ఈ చిత్రంలో జబర్దస్త్ ఫేం అప్పారావు, ఆర్పీ దుర్గారావు, కాదంబరీ కిరణ్ నటిస్తున్నారన్నారు. తనకు నిర్మాత సి.కల్యాణ్ గాడ్‌ఫాదర్ లాంటివారన్నారు -
సైనికుల్లా కదలండి
పార్టీ అడ్డతీగల మండల శాఖ సమావేశంలో వైఎస్సార్ సీసీ జిల్లా సారథి కన్నబాబు పిలుపు అడ్డతీగల : ప్రజాసమస్యలు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు సాగిస్తున్న అరాచక పాలనను అంతమొందించడానికి పార్టీ శ్రేణులు సైనికుల్లా కదలాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధక్షుడు కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. ఆ పార్టీ అడ్డతీగల మండలశాఖ సమావేశం స్థానిక ఆర్అండ్ బీ అతిథిగృహం ఆవరణలో పార్టీ యువజన విభాగం జిల్లా అధక్షుడు అనంత ఉదయభాస్కర్ అధక్షతన గురువారం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కన్నబాబు మాట్లాడుతూ అవినీతి, అక్రమాలకు చంద్రబాబు చిరునామాగా మారి నయవంచక పాలన సాగిస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు అలవి కాని హామీలిచ్చి, గద్దెనెక్కాక నిత్యం అబద్ధాలతో గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. పసికందులు చనిపోతున్నా పట్టించుకోరా? రాజవొమ్మంగి మండలంలో పసికందులు చనిపోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని కన్నబాబు అన్నారు కాళ్లవాపు వ్యాధితో విలీన మండలాల్లో పదుల సంఖ్యలో గిరిజనులు మరణిస్తున్నా పాలకులకు చీమకుట్టినట్టయినా లేదన్నారు. రూ. వందల కోట్లు దోచుకోవడానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఎత్తిపోతల పథకాలను తలకెత్తుకుంటున్నారన్నారు. మన్యంలో భూపతిపాలెం, ముసురుమిల్లి జలాశయాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా విదల్చలేన్నారు. తెలుగుదేశం నియంతృత్వ పరిపాలనకు చరమగీతం పాడేందుకు ప్రతి కార్యకార్తా కంకణం కట్టుకుని పోరాడాలకు కన్నబాబు పిలుపునిచ్చారు. 1019లో చంద్రబాబుకు గుణపాఠం ప్రజాపోరాటాలు చేసే నాయకులను పోలీసుల సాయంతో అణిచివేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి 2019లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. పార్టీ అధినేత జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి ఇచ్చిన స్ఫూర్తితో పార్టీ శ్రేణులు అవిశ్రాంత పోరాటానికి సిద్ధపడాలన్నారు. అత్యంత నీచమైన పరిపాలన చేస్తున్న చంద్రబాబు సొంతానికి రూ. కోట్లు పోగేసుకోవడం మినహా కనీసం వృద్ధులకు పింఛను కూడా ఇవ్వడం లేదని అరకు పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ పరిశీలకురాలు, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విమర్శించారు. టక్కుటమార విద్యలతో ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబు పరిపాలనలోని డొల్లతనం ప్రజలకు ఇప్పటికే అర్థమైందని పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా అత్యధిక ప్రజాప్రతినిధులను గెలిపించిన చరిత్ర మన్యం ప్రజానీకానిదని అనంత ఉదయ్ భాస్కర్ అన్నారు. ఇదే ప్రజాదరణ భవిష్యత్తులోనూ ఉండేలా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమిష్టిగా కృషి చేద్దామన్నారు. ప్రజల కనీసావసరాలు తీర్చడానికి సైతం ఈ ప్రభుత్వానికి మన సొప్పడం లేదని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి విమర్శించారు. సమావేశానికి రంపచోడవరం డివిజ¯ŒSలోని వివిధ మండలాల నుంచి పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు బాలోజి గడ్డిబాబు, కాకినాడ రూరల్ నాయకుడు సీతారాములు, పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు ,డీసీసీబీ డైరెక్టర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం చివర్లో జక్కంపూడి రాజా, కురసాల కన్నబాబు, గిడ్డి ఈశ్వరిలను పార్టీ అడ్డతీగల మండల శాఖ అధ్యక్షుడు మద్దాల వీర్రాజు అనంత ఉదయభాస్కర్ తదితరులు గజమాలతో సత్కరించారు. -
పొత్తిళ్లలోనే మరణిస్తున్న శిశువులు
మూడు రోజుల వ్యవధిలో ఇద్దరి మృతి రాజవొమ్మంగి : మండలంలోని ఇరుగు పొరుగు గ్రామాలైన పూదూడి, పాకవెల్లిలలో గత మూడు రోజుల్లో రెండు శిశు మరణాలు సంభవించాయి. మారుమూల లోతట్టు ప్రాంతంలో ఉన్న తమ గ్రామాలకు సమాచార వ్యవస్థ లేకపోవడం, రహదారి సదుపాయాలు మెరుగుపడకపోవడం ఇందుకు కారణమని అక్కడి గిరిజనులు వాపోతున్నారు. సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పూదేడులోని వంతల పార్వతి కుమారుడు గుక్కపట్టి ఏడ్చి చివరకు మరణించాడు. పార్వతికి రెండో కాన్పులో పుట్టిన ఆ బిడ్డ వయసు 45 రోజులు. అలాగే పాకవెల్తిలో భీంరెడ్డి లక్ష్మికి తొలి కాన్పులో జన్మించిన 45 రోజుల వయస్సు గల ఆడపిల్ల శనివారం మరణించింది. పాలు తాగుతూ ఈ శిశువు ఉక్కిరి బిక్కిరై మరణించిందని గ్రామస్తులు తెలిపారు. ఈ పిల్ల తల్లులిద్దరూ జడ్డంగి పీహెచ్‌సీలోనే పురుడు పోసుకున్నారు. పుట్టిన బిడ్డలకు సరైన వైద్య సదుపాయాలు ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్లే ఈ విధంగా మరణిస్తున్నారని సర్పంచ్ లోతా రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రోడ్డు సరిగాలేక, సకాలంలో ఆసుపత్రికి వెళ్లలేక లోదొడ్డిలో ఇద్దరు, కేశవరంలో ఓ గర్భిణి ఇళ్ళవద్ద పురుడు పోసున్నారని తెలిపారు. -
ఎటపాక మండలంలోనూ కాళ్లవాపు లక్షణాలు
నెల్లిపాక : ఏజెన్సీలో ఆందోళన కలిగిస్తున్న కాళ్లవాపు వ్యాధి లక్షణాలు ఎటపాక మండలంలో కూడా కనిపిస్తున్నాయి. గౌరిదేవిపేట పంచాయతీలోని బాడిసవారి గుంపులోని ముగ్గురు గిరిజనులకు ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. కాళ్లవాపుతో వీఆర్‌పురం మండలంలో వరుస మరణాలు సంభవిస్తుండడంతో బాడిసవారి గుంపు వాసులు ఆందోళన చెందుతున్నారు. మాజీ సర్పంచ్ కారం వెంకట్రావుకు కొన్ని రోజుల క్రితం జ్వరం వచ్చి తగ్గింది. అప్పటి నుంచీ కీళ్ల నొప్పులతో పాటు, పది రోజులుగా కాళ్లవాపు కూడా ఉందని ఆయన తెలిపారు. అదేవిదంగా మడకం భద్రమ్మ, గుండి రాంబాబులకు కూడా కాళ్లు వాపుగా ఉన్నట్టు కనపడుతున్నాయి. కాళ్లు, చేతులు, కీళ్లు తీవ్రమైన నొప్పిగా ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. జ్వరం వచ్చినప్పటి నుంచీ నొప్పులు, వాపులు ఉన్నాయని తెలిపారు. ఆందోళన కలిగిస్తున్న కాళ్లవాపు లక్షణాలు ఇవే అయి ఉంటాయని వారు భయపడుతున్నారు. వైధ్యశాఖ అధికారులు తక్షణమై గ్రామాన్ని సందర్శించి తమకు పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించాలని కోరుతున్నారు. -
మన్యంపై మృత్యునీడ
ప్రాణాంతక వ్యాధుల నీడన గిరిజనం అంతుచిక్కని వ్యాధులకు బలవుతున్న వైనం తాజాగా కాళ్లవాపుతో ఓ గిరిజనుడి మృతి ఐదుకు చేరిన ‘కాళ్లవాపు’ మరణాలు కదిలిన జిల్లా యంత్రాంగం అంతుచిక్కని వ్యాధికి అడవి బిడ్డలు బలైపోతున్నారు. ఏదో చిన్న ఆరోగ్య సమస్యగా మొదలైన కాళ్ల వాపు.. రోజురోజుకూ ముదిరి ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. తాజాగా ఏజెన్సీలోని వీఆర్ పురం మండలం చిన్నమట్టపల్లి గ్రామానికి చెందిన కారం రామారావు(45) .. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ, మంగళవారం తెల్లవారుజామున మరణించాడు. దీంతో ఈ మహమ్మారికి బలైన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఎట్టకేలకు అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం వ్యాధి నియంత్రణకు చర్యలు చేపట్టింది. బాధితుల తరలింపునకు చర్యలు వీఆర్ పురం : కాళ్లవాపు లక్షణాలతో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు అడిషనల్ డీఎంహెచ్ఓ పవన్‌కుమార్ తెలిపారు. కాళ్లవాపుతో మరణించిన కారం రామారావు స్వగ్రామమైన చినమట్టపల్లిలో మంగళవారం వైద్య సిబ్బంది చేపట్టిన ఇంటింటి సర్వేను ఆయన పరిశీలించారు. కాళ్లవాపుlలక్షణాలున్న వారు రక్త నమూనాలు ఇచ్చేందుకు కానీ, పరీక్షలు చేయించుకునేందుకు కానీ నిరాకరిస్తే.. నిర్బంధంగానైనా ఆస్పత్రికి తీసుకురావాలని ఆదేశించారు. ఈ వ్యాధి లక్షణాలున్న కొంతరిని రేఖపల్లి పీహెచ్‌సీకి అంబులెన్స్‌లో తరలించారు. పోలవరం (భూసేకరణ ) డిప్యూటీ కలెక్టర్ ఎల్లారమ్మ, డిప్యూటీ కలెక్టర్(స్పెషలాఫీసర్) పి.శ్రీరామచంద్రమూర్తి, తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్, ఎంపీడీఓ జి.సరోవర్ పాల్గొన్నారు. గిరిజనుడిని బలిగొన్న ‘కాళ్లవాపు’ కాకినాడ సిటీ : జిల్లాలోని విలీన ప్రాంతమైన వీఆర్‌పురం మండలం చినమట్టపల్లి గ్రామానికి చెందిన కారం రామారావు(45) కాళ్ల వాపు వ్యాధితో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ, మంగళవారం తెల్లవారుజామున మరణించాడు. కాళ్లవాపు, ఆయాసం వంటి సమస్యలతో బాధపడుతున్న రామారావును అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఈ నెల 18న కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అప్పటి నుంచి ఏఎంసీ–1లో వెంటిలేటర్‌పై ఉంచి, అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే వీఆర్‌పురం మండలంలో నలుగురు మరణించగా, తాజాగా రామారావు మృతితో కాళ్లవాపు వ్యాధి మరణాల సంఖ్య ఐదుకు చేరింది. 29 మంది డిశ్చార్జి కాళ్లవాపు వ్యాధితో బాధపడుతున్న 32 మంది గిరిజనులు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వీరిని ఈ నెల 8, 9 తేదీల్లో జీజీహెచ్‌కు తరలించగా, ప్రత్యేక వార్డులో ఉంచి, వైద్య సేవలందించారు. వీరిలో 29 మంది ఆరోగ్యం మెరుగుపడడంతో, మంగళవారం ఆస్పత్రిలో సీఎస్ఆర్ఎంఓ టీఎస్ఆర్ మూర్తి నేతృత్వంలో వైద్యులు విశాఖ నుంచి వచ్చిన నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కిరణ్ మహేష్, ఏఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ లకో్ష్మజీనాయుడు, మెడిసిన్ చీఫ్ డాక్టర్ సీఎస్ఎస్ శర్మ సమావేశమై చర్చించారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారుల సూచనలతో 29 మందిని డిశ్చార్జి చేసి, ప్రత్యేక వాహనంలో ఇళ్లకు పంపించారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జాతీయ బృందం రాక కాగా రెండు రోజుల్లో నేషనల్ లేబొరేటరీ నుంచి ప్రత్యేక బృందం జిల్లాకు వస్తున్నట్టు కలెక్టర్ అరుణ్‌కుమార్ వెల్లడించారు. ముంపు మండలాల్లో కాళ్ల వాపు వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించి, శాంపిళ్లను సేకరిస్తుందని తెలిపారు. వైద్య సౌకర్యాలు మెరుగుపరుస్తాం చింతూరు : ఏజెన్సీలోని పీహెచ్‌సీల్లో వైద్య సౌకర్యాలు మెరుగు పరుస్తామని, సిబ్బంది కొరత లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రయ్య తెలిపారు. మంగళవారం ఆయన విలీన మండలాల్లోని పీహెచ్‌సీలను ఆకస్మిక తనిఖీ చేశారు. చింతూరులో ఆయన మాట్లాడుతూ పీహెచ్‌సీల్లో సిబ్బంది కొరతపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, డిప్యుటేషన్‌పై స్టాఫ్‌నర్సులను నియమిస్తున్నట్టు పేర్కొన్నారు. ఏజెన్సీలో కాళ్లవాపు వ్యాధి అధికంగా ఉందని, వీరిలో 19 మందికి కిడ్నీ సంబంధిత వ్యాధి ఉన్నట్టు తెలిపారు. వీరిలో నలుగురికి వ్యాధి తీవ్రత అధికంగా ఉండగా, వీరిలో ఒకరు మంగళవారం మరణించినట్టు చెప్పారు. కొందరు గిరిజనులు తాగుతున్న నాటుసారాను పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని తెలిపారు. చింతూరులో ఏరియా ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ఏజెన్సీలో ప్రతి మండలానికి ఒక డాక్టర్‌తో బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నాటుమందులు ఆశ్రయించి ప్రాణాపాయం కొనితెచ్చుకోవద్దని కోరారు. -
మన్యంపై మలేరియా పడగ
మన్యగ్రామాల్లో పెరుగుతున్న జ్వరాల కేసులు తాజాగా రెండేళ్ల పసివాడిని కబళించిన మహమ్మారి ఇప్పటికీ పూర్తి కాని నివారణ మందు పిచికారీ నియంత్రణలో అలసత్వం వహిస్తున్న అధికారులు రంపచోడవరం : మన్యప్రాంతంలో మలేరియా మహమ్మారి విస్తరిస్తోంది. సీజనల్ వ్యాధులను నియంత్రించలేని వైద్యాధికారుల వైఫల్యానికి గిరిజనుల ప్రాణాలు గాలిలో దీపాలవుతున్నాయి. దేవీపట్నం మండలం చింతలగూడెంకు చెందిన పొడియం బన్నీ అనే రెండేళ్ల పసివాడు మలేరియా బారిన పడి మృతి చెందాడు. తీవ్ర జ్వరంతో అపస్మారక స్థితికి చేరిన బన్నీని బుధవారం దేవీపట్నం నుంచి రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చే సరికే మృతి చెందాడు. ఇటీవల మలేరియా తీవ్రతకు పలువురు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ మరణాలు మలేరియా అధికారుల రికార్డుల్లో నమోదు కావడం లేదు. 27 రోజులు ఆలస్యంగా పిచికారీ ఏజెన్సీలోని 11 మండలాల్లో గత ఏడాది కంటే ఈ ఏడాది మలేరియా జ్వరాల సంఖ్య ఎక్కువైంది. దీనికి అధికారుల అలసత్వమే ప్రధాన కారణం. గ్రామాల్లో రెండు విడతల్లో జరగాల్సిన మలేరియా మందు పిచికారీని సుమారు 27 రోజులు ఆలస్యంగా ప్రారంభించారు. కొన్నేళ్ల క్రితం జిల్లా మలేరియా కార్యాలయానికి నిధుల కొరతతో మలేరియా మందు పిచికారీ సకాలంలో చేపట్టలేకపోయారు. ఫలితంగా ఆ ఏడాది 20 మంది వరకు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మే ఒకటిన ప్రారంభించాల్సిన పిచికారీని మే 27న ప్రారంభించారు. నలభై ఐదు రోజులకు ఒకసారి చొప్పున మలేరియా మందును రెండుసార్లు పిచికారీ చేయాలి. మెుత్తం 935 గ్రామాలకు ఇప్పటికి 480 గ్రామాల్లో మాత్రమే పిచికారీ పూర్తి చేశారు. ఏజెన్సీకి 3.60 లక్షల దోమతెరలు కావాలని ప్రతిపాదనలు పెడితే నేటికీ రంపచోడవరం డీఎంఓ కార్యాలయానికి చేరుకోలేదు. దోమ తెరలు ఇవ్వడంతో పాటు వాటి వినియోగంపై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తేనే ఫలితాలు సాధించవచ్చు. నమోదైన వాటి కంటే ఎక్కువ కేసులు.. గత ఏడాది కంటే మలేరియా కేసులు గణనీయంగా పెరిగాయి. ఏజెన్సీ 11 మండలాల్లో 26 పీహెచ్‌సీలు ఉన్నాయి. గత ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 1,85,306 మంది నుంచి రక్త నమునాలు సేకరించి, వారిలో 3,616 మందికి మలేరియా ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 2,06,392 మంది రక్త నమునాలు సేకరించి, వారిలో 4,496 మందికి మలేరియా ఉన్నట్లు నిర్ధారించారు. మారేడుమిల్లి పీహెచ్సీ పరిధిలో గత ఏడాది 231 మలేరియా కేసులు నమోదు కాగా ఈ ఏడాది 335 కేసులు నమోదయ్యాయి. తులసిపాకలలో 508 కేసులు నమోదు కాగా ఇక్కడ గత ఏడాది కంటే వంద కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. మంగంపాడు పీహెచ్సీలో 440 కేసులు నమోదు చేశారు. ఇక్కడ కూడా గతం కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. చవిటిదిబ్బల పీహెచ్సీలో గత ఏడాది 277 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 439 కేసులు నమోదు చేశారు. గిరిజనుల్లో అత్యధికులు జ్వరం వస్తే ఆర్ఎంపీల వద్దకు వెళ్లి వైద్యం చేయించుకుంటారు. అంటే మలేరియా అధికారుల లెక్కల కంటే ఏజెన్సీలో మలేరియా కేసులు సంఖ్య మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయి. సిబ్బంది కొరతతో వెల్లడి కాని వ్యాధి తీవ్రత వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో క్షేత్రస్థాయిలో పని చేయాల్సిన సిబ్బంది తగినంతమంది లేరు. ఎంపీహెచ్‌ఎస్‌లు 64 మంది పనిచేయాల్సి ఉండగా 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విధి నిర్వహణలో గ్రామాల్లో పర్యటించి జ్వరాల కేసులు ఉంటే వారి రక్తనమూనాలు తీసుకుని మలేరియా నిర్ధారణ అయిన తరువాత మందులు ఇవ్వాలి. అలాగే రోగికి జ్వరం తగ్గిందా లేదా అనేది కూడా చూడాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. కానీ సిబ్బంది కొరత కారణంగా గ్రామస్థాయిలో రోగాల తీవ్రత బయటకు తెలియడం లేదు. కాగా మలేరియా వ్యాప్తిపై జిల్లా మలేరియా అధికారి పీఎస్ఎస్ ప్రసాద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ వ్యాధి నివారణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు తెలిపారు. రెండో విడత మలేరియా మందు పిచికారీ జరుగుతోందన్నారు. -
మహమ్మారిపై సమరభేరి
మలేరియా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వ పూనిక హోమియో ఔషధాలతో నిరోధానికి ప్రణాళిక పైలట్ ప్రాజెక్టుగా ఏజెన్సీలో మూడు మండలాల్లో అమలు అల్లు రామలింగయ్య కళాశాలకు నిర్వహణ బాధ్యత సాక్షి, రాజమహేంద్రవరం : జిల్లాలోని మన్యప్రాంతంలో ఏటా మలేరియా సోకి వందల మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోతుండగా వారిలో ఎక్కువమంది చిన్నారులే. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభుత్వాస్పత్రులు మలేరియా బాధితులతో కిటకిటలాడుతుంటాయి. జ్వరం తగ్గకపోవడంతో పలువురు కాకినాడ, రాజమహేంద్రవరంలలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతూ అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వాలు దోమల నివారణకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడంలేదు. ఈ నేపథ్యంలో మలేరియా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. వ్యాధి సోకకముందే హోమియోపతి మందులను (ప్రివెంటివ్ మెడిసిన్) ఇవ్వడం ద్వారా సమర్థంగా నియంత్రించవచ్చని భావించింది. ఏజెన్సీలో రంపచోడవరం, మారేడుమిల్లి, దేవీపట్నం మండలాల్లోని 21 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టును అమలు చేసే బాధ్యతను రాజమహేంద్రవరంలోని డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల, ఆస్పత్రికి అప్పగించింది. మూడేళ్ల పాటు ఈ ప్రాజెక్టు అమలులో ఉంటుంది. ఇందుకు ఏడాదికి రూ.50 లక్షల చొప్పున మూడేళ్లకు రూ.1.5 కోట్లు కేంద్రం హోమియోపతి కళాశాల, ఆస్పత్రికి కేటాయించింది. ప్రాజెక్టు అమలు ఇలా... ఎంపిక చేసిన రంపచోడవరం, మారేడుమిల్లి, దేవీపట్నం మండలాల్లోని 21 గ్రామాల్లో ఆస్పత్రి బృందం గత ఏప్రిల్ నుంచి ప్రతి రోజూ పర్యటిస్తోంది. జ్వరంతో బాధపడుతున్న గిరిజనుల రక్తనమూనాలకు సేకరించి పరీక్షిస్తోంది. మలేరియా బాధితులను గుర్తించి వ్యాధి తగ్గడానికి మందులు ఇస్తోంది. మిగిలిన వారికి మలేరియా రాకుండా ముందస్తుగా మందులు ఇస్తోంది. మలేరియా తగ్గడానికి నెలకు నాలుగుసార్లు చొప్పున మందులు అందిస్తోంది. మందులు వేసుకోవడంలో బాధితులు అలక్ష్యం వహించే అవకాశం ఉండడంతో ప్రతి గ్రామంలో ఒక వలంటీర్‌ను నియమించి, వారికి ప్రతి నెలా గౌరవవేతనం చెల్లిస్తోంది. వలంటీర్లు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి బాధితులకు మందులు ఇస్తున్నారు. విజయవంతమైతే అన్ని ఏజెన్సీ గ్రామాల్లో అమలు ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టులో ప్రతి వారం వలంటీర్లు గిరిజనులకు మందులు ఇస్తుండగా, వైద్యుల బృందం నెలకోసారి ప్రతి గ్రామంలో పర్యటిస్తోంది. మలేరియా బాధితులను పరీక్షించి వ్యాధి తగ్గిందా, లేదా అన్నది నిర్ధారిస్తోంది. వ్యాధి రాకుండా ముందస్తుగా మందులు వాడుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తుంది. ఎంపిక చేసిన గ్రామాల్లో విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని ఏజెన్సీ గ్రామాల్లో హోమియోపతి మందుల ద్వారా మలేరియాను నియంత్రించాలని కేంద్రం భావిస్తోంది. మంచి ఫలితాలు వస్తున్నాయి.. ఏజెన్సీ గ్రామాల్లో మలేరియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం నిర్వహిస్తున్నాం. మందులను గిరిజనులకు కాకుండా వలంటీర్ల చేతికి ఇస్తున్నాం. వారు ప్రతి ఇంటికీ వెళ్లి స్వయంగా మందులు వేస్తున్నారు. జ్వర బాధితులు ముందస్తుగా మందులు వాడడం వల్ల మలేరియా రావడం లేదు. వెలగపల్లిలో ఏప్రిల్‌లో 108 మంది మలేరియా బాధితులు ఉండగా ప్రస్తుతం ఒక్కరు కూడా లేరు. కొత్త కేసులు నమోదు కావడంలేదు. మంచి ఫలితాలు వస్తున్నాయి. – వెన్నా వీరభద్రరావు, ప్రిన్సిపాల్, హోమియోపతి వైద్య కళాశాల -
రంగురాళ్ల తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు
ఏఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మీ హెచ్చరిక అడ్డతీగల : రక్షిత అటవీ ప్రాంతాల్లో ఎవరైనా రంగురాళ్ల కోసం తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రంపచోడవరం ఏఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మీ హెచ్చరించారు. తపస్వికొండ రక్షిత అటవీ ప్రాంతంలో రంగురాళ్ల తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఈ ప్రదేశంలో శనివారం ఆయన పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో తవ్వకాలు ఎలా, ఏ సమయాల్లో జరుపుతారో ఆయన స్థానికుల నుంచి ఆరా తీశారు. రక్షిత అటవీ ప్రాంతాల్లో రంగురాళ్ల తవ్వకాలు జరపడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. వాటి జోలికి ప్రజలు వెళ్లరాదని, వెళితే కేసుల్లో ఇరుక్కుంటారని హెచ్చరించారు. -
కత్తిపోట్లకు దారితీసిన భూ వివాదం
నెల్లిపాక : భూ వివాదం నేపథ్యంలో తండ్రీ కొడుకుల మధ్య తలెత్తిన ఘర్షణ కత్తితో దాడి చేసుకునేందుకు దారితీసింది. ఘర్షణకు అడ్డు వచ్చిన వ్యక్తిని, తన కొడుకుని కత్తితో పొడిచి తీవ్రంగా గాయపర్చిన ఈ ఘటన ఎటపాక మండలం చింతలపాడు వలస ఆదివాసీ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సోడె ఉంగయ్య, సోడె దేవయ్య తండ్రీకొడుకులు. వీరి మధ్య సోమవారం రాత్రి వారి పోడుభూమి సాగు విషయంలో గొడవ జరిగింది. అది తీవ్రరూపం దాల్చి కత్తులతో దాడి చేసుకునే పరిస్థితి ఎదురైంది. అదే గ్రామానికి చెందిన మడకం భీమరాజు వారిని వారించేందుకు యత్నించాడు. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఉంగయ్య తన చేతిలో ఉన్న కత్తితో దేవయ్యతో పాటు భీమరాజును కూడా పొడిచాడు. దేవయ్యకు గుండెలో, కడుపుపై, భీమరాజుకు కడుపులో తీవ్ర గాయం కావడంతో వారిని భద్రాచలంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శ్వాస అందకపోవడంతో భీమరాజుకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం భీమరాజు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. -
అక్కడేం జరుగుతోంది?
కామరకొండపై కార్పొరేట్ తరహా వ్యవసాయానికి ఏర్పాట్లు అధికారులకు తెలియకుండానే పొక్లెయిన్లతో రహదారి ఏర్పాటు పాత పట్టాల సాకుతో కబ్జాకు సిద్ధం కాదేదీ కబ్జాకు అనర్హం అనడానికి ఇదో ప్రత్యక్ష సాక్ష్యం. కొండపైభాగాన ఉన్న భూమి సాగుకు అనుకూలంగా ఉండడంతో దానిపై కన్నేసిన పెద్దలు చకచకా అక్కడకు చేరుకొనేందుకు రోడ్డును వేసుకున్నారు. పదిహేను రోజులుగా ఆ పనులు జరుగుతున్నప్పటికీ అధికారులకు తెలియకపోవడం చెప్పుకోదగ్గ అంశం. జగ్గంపేట : సుమారు రెండు తాడుల ఎత్తున్న విశాలమైన కొండ అది. సుమారు 350 ఎకరాల విస్తీర్ణంగల ఈ కొండ పైభాగం చదునుగా ఉండడంతో దాన్ని ఆక్రమించుకొనేందుకు కొందరు పెద్దలు వ్యూహరచన చేశారు. అక్కడ కార్పొరేట్ తరహాల్లో సాగు చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. ఆక్రమంలో ఈ కొండపై పొక్లెయిన్ల సహాయంతో 15 రోజులుగా పనులను నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఈ విషయం తమకు తెలియదంటున్నారు అధికారులు. వివరాల్లోకి వెళితే జగ్గంపేట మండలంలో నరేంద్రపట్నం రెవెన్యూ పరిధిలో విశాలమైన కొండలు ఉన్నాయి. ఆయా కొండలను కొద్దిమంది కొండపోడుగా సాగుచేసుకుంటుంటారు. సుమారు 350 ఎకరాల విస్తీర్ణంగల విశాలమైన కామరకొండ నరేంద్రపట్నం రెవెన్యూ పరిధిలో ఉంది. ఇది అటు కాండ్రేగుల, ఇటు మన్యంవారిపాలెం, బావవరం తదితర గ్రామాలకు ఆనుకుని ఉంది. సుమారు రెండు కిలోమీటర్లు ఎక్కితేనే గాని కొండపైకి చేరుకోలేం. దానిపై కన్నేసిన కొందరు పెద్దలు పొక్లెయిన్ల సహాయంతో చకచకా రోడ్డును నిర్మించారు. కొండ పైభాగంలో సుమారు 200 ఎకరాల పైబడి చదునుగా ఉంది. మన్యంవారిపాలెం, బావవరం, గొల్లలగుంటకు చెందిన సుమారు 30 మంది గతంలో ఈ కొండపై పట్టాలు పొందినట్టు చెబుతున్నప్పటికీ వారి వద్ద సరైన ఆధారాలు కూడా ఉన్నట్టు లేవు. వారిలో కొందరు అక్కడ జీడిమామిడి, అపరాల మొక్కలను పెంచుతున్నారు. విలువైన ఈ భూమిపై కన్నేసిన కొందరు నాయకులు బినామీల పేర్లతో అసైన్డ్ పట్టాలు పొందేందుకు ముందుగా చదును చేసి సాగుకు దిగుతున్నట్టు సమాచారం. గంటకు రూ.1500కు పొక్లెయిన్లను ఉపయోగించి 15 రోజులపాటు కొండంతా చదును చేయించడం, రోడ్డు ఏర్పాటు చేయడం వెనుక ఏదో కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆక్రమణలను నిరోధించాలి కామరకొండతోపాటు కాండ్రేగుల పరిధిలోని బోడుకొండ, మన్యంవారిపాలెం, గోవిందపురం పరిధిలోని కొండలపై సర్వే జరిపి అక్రమాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పనులు నిలుపుదల చేయించాం కొండపై భూమిలో బావవరానికి చెందిన కొందరికి పట్టాలు ఉన్నట్టు తెలిసింది. కొండను చదును చేసి, రోడ్డు వేస్తున్నట్టు తెలియగానే ఆపనులను నిలుపుదల చేయించాం. –శివమ్మ, తహసీల్దార్ -
ఉనికిని కాపాడుకునేందుకే మావోల దుశ్చర్యలు
చింతూరు : ఉనికిని కాపాడుకునేందుకే మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని చింతూరు ఓఎస్డీ డాక్టర్ కె.ఫకీరప్ప శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేగ గ్రామస్తులపై మావోయిస్టులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. గిరిజనులను పోలీస్ ఇన్ఫార్మర్లుగా చిత్రీంచి వారిపై మావోయిస్టులు దాడికి పాల్పడటం హేయమైన చర్య అన్నారు. గిరిజనులను పోలీసులు ఎప్పుడూ ఇన్ఫార్మర్లుగా ఉపయోగించలేదన్నారు. పోలీసులకు సాంకేతిక పరిజ్ఞానం ఉందనే విషయం మావోయిస్టులు తెలుసుకోవాలన్నారు. గంజాయి రవాణాదారులు, కలప స్మగ్లర్ల వద్ద డబ్బులు వసూలు చేసే మావోయిస్టులు ఏజెన్సీలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆదివాసీలను పోలీసు ఇన్ఫార్మర్లుగా అనుమానించటం మావోయిస్టుల పిరికిపంద చర్య అన్నారు. మావోయిస్టులకు సహకరిస్తున్న వారి వివరాలు తమవద్ద ఉన్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి పోలీసులు కృషి చేస్తున్నారని, గిరిజనులకు అన్నివేళలా అండగా ఉంటామని ఓఎస్డీ తెలిపారు. మావోయిస్టుల కార్యకలాపాలను ప్రజలు ప్రతిఘటించాలని ఆయన కోరారు. -
వారపు సంతలో విస్తృతంగా తనిఖీలు
వై.రామవరం : సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు అందిన సమాచారంతో పోలీసులు సోమవారం వై. రామవరం వారపుసంతలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సీఐ ముక్తేశ్వరరావు పర్యవేక్షణలో ఎస్సై ఇ.అప్పన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం సేకరించారు. అనుమానాస్పద వ్యక్తుల పేరు, ఊరు, వారి చిరునామాలను ఆరా తీశారు. వాహనాలను తనిఖీ చేశారు. రైటర్ శివ, సీఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.