వారపు సంతలో విస్తృతంగా తనిఖీలు
వారపు సంతలో విస్తృతంగా తనిఖీలు
Published Mon, Aug 15 2016 10:16 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
వై.రామవరం :
సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు అందిన సమాచారంతో పోలీసులు సోమవారం వై. రామవరం వారపుసంతలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సీఐ ముక్తేశ్వరరావు పర్యవేక్షణలో ఎస్సై ఇ.అప్పన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం సేకరించారు. అనుమానాస్పద వ్యక్తుల పేరు, ఊరు, వారి చిరునామాలను ఆరా తీశారు. వాహనాలను తనిఖీ చేశారు. రైటర్ శివ, సీఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement