- 7, 8 తేదీల్లో వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి ఏజెన్సీ పర్యటన
- పలుచోట్ల రోడ్‌షో, రేఖపల్లి బహిరంగసభలో ప్రసంగం
- పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖీ
- కాళ్లవాపు, పౌష్టికాహార లోప మృతుల కుటుంబాలకు పరామర్శ
అడవిబిడ్డలకు అండగా..
Published Sun, Dec 4 2016 11:57 PM | Last Updated on Wed, Aug 8 2018 5:41 PM
వీఆర్‌పురం / మారేడుమిల్లి :
పోలవరం ప్రాజెక్టును 2018లో పూర్తి చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇంత వరకు నిర్వాసితులకు నిర్దిష్టమైన ప్యాకేజీని ఇవ్వకుండా అయోమయంలో నెట్టివేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. దీంతో పాటు అనేక అంశాల్లో గిరిజనులకు భరోసా ఇచ్చి ప్రభుత్వంపై పోరాడేందుకుకే తమ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి ఏజెన్సీ పర్యటనకువస్తున్నట్లు తెలిపారు. జగ¯ŒS ఈ నెల 7, 8 తేదీల్లో రంపచోడవరం నియోజకవర్గంతో పాటు విలీనమండలాల్లో చేయనున్న పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను ఆదివారం కన్నబాబు ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, కొమ్మిశెట్టి బాలకృష్ణ, రాష్ట్ర ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లతో కలిసి పరిశీలించారు. మారేడుమిల్లిలో జగ¯ŒS బసచేసే అతిథిగృహాన్ని, రోడ్ షో నిర్వహించే ప్రాంతాలను పరిశీలించారు. వీఆర్ పురం మండలం రేఖపల్లి గ్రామంలో 8న జగ¯ŒS పాల్గొననున్న బహిరంగ సభా ప్రాంగణాన్ని సందర్శించారు. అనంత ఉదయభాస్కర్ సభాస్థలిలో ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, మండలాల వారీగా ప్రజల తరలింపు తదితర విషయాలను రఘురామ్‌కి వివరించారు.
గిరిజనులంటే చంద్రబాబుకు చులకన..
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయే రైతులను, నిర్వాసితులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని కురసాల కన్నబాబు ఆరోపించారు. జగ¯ŒS పర్యటన ఏర్పాట్ల పరిశీలన సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు అంటే చంద్రబాబు చులకనగా చూస్తున్నారని ఆరోపించారు. ఇంత వరకు ఏజెన్సీలో నిర్వాసితులను గాని, కాళ్లవాపు మృతులను గాని పట్టించుకోలేదన్నారు. గిరిజనుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతంలో కాళ్లవాపుతో 12 మంది, పౌష్టికాహార లోపంతో 9 మంది శిశువులు, తల్లులు చనిపోతే ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. ఈ ప్రభుత్వం కళ్లు తెరిపించేలా జగ¯ŒS ఏజెన్సీ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. జెడ్పీటీసీ సత్తి సత్యనారాయణరెడ్డి, గొర్లె బాలాజీబాబు, పార్టీ వీఆర్ పురం మండల కన్వీనర్ పొడియం గోపాల్, జిల్లా నాయకులు ముత్యాల మురళి, ముప్పనశెట్టి శ్రీనివాస్, నక్కా మోహన్, తోట రాజేశ్వరావు, నండూరి గంగాధరరావు, ఆకిరి శ్రీనివాస్, చిక్కాల బాలు, రేవు బాలరాజు, చీమల కాంతారావు, మాచర్ల వెంగళరావు తదితరులు పాల్గొన్నారు.
జగ¯ŒS పర్యటన సాగేది ఇలా..
జగ¯ŒS 7న ఉదయం హైదరాబాద్ నుంచి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి కారులో రంపచోడవరం మండలం గోపవరం వస్తారు. అక్కడ పార్టీ నాయకులు ,కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతారు. అనంతరం సీతపల్లి మీదుగా రంపచోడవరం చేరుకుని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో దేవీపట్నం మండలానికి చెందిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత రైతులతో ముఖాముఖీగా మాట్లాడతారు. అనంతరం రాజవొమ్మంగి మండలంలో ఇటీవల సంభవించిన శిశు మరణాల బాధిత కుటుంబాలను రంపచోడవరంలోనే పరామర్శిస్తారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి బయలుదేరి దేవీగుడి సెంటర్‌లో రోడ్‌షోలో పాల్గొంటారు. అక్కడ నుంచి గెద్దాడ మీదుగా మారేడుమిల్లి చేరుకుని రోడ్‌షోలో పాల్గొంటారు. రాత్రికి మారేడుమిల్లిలో బస చేస్తారు. 8న ఉదయం మారేడుమిల్లి–భద్రాచలం ఘాట్ రోడ్డులో ప్రయాణించి చింతూరు మీదుగా కూనవరం మండలం చేరుకొంటారు. కూనవరం బ్రిడ్జి వద్ద ఆయనకు ఘనస్వాగతం పలుకుతారు. జగ¯ŒS రేఖపల్లి చేరుకొని అక్కడ పోలవరం నిర్వాసిత రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడతారు. అనంతరం ఇటీవల కాళ్లవాపు బారిన పడి మృతి చెందిన వారి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. తిరిగి కూనవరం మీదుగా ఎటపాక మండలానికి వెళ్లి అక్కడ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్ చేరుకొంటారు.
జగ¯ŒS పర్యటనను జయప్రదం చేయాలి
మధురపూడి : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి జిల్లా పర్యటనను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ విజ్ఞప్తి చేశారు. కోరుకొండ మండలం గుమ్ములూరులో నిర్మించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి యోగ ముద్రలో ఉన్న విగ్రహాన్ని ఆయన ఆదివారం పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజాతో కలిసి పరిశీలించారు. జగ¯ŒS బుధవారం ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏజెన్సీలో, విలీన మండలాల్లో పర్యటిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాంబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, గుమ్ములూరు మాజీ సర్పంచ్ మట్టా పెద వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement