ఏఓబీలో భారీ ఎత్తున పోలీసు కూంబింగ్
Published Sat, Dec 3 2016 10:52 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
వై.రామవరం :
ఈనెల రెండో తేదీ నుంచి 8వ తేదీ వరకు గెరిల్లా ఆర్మీ ఆవిర్భావ వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునివ్వడంతో తూర్పు గోదావరి జిల్లా పోలీసు యం త్రాంగం అప్రమ త్తమైంది. తెలంగాణ , చత్తీస్‌గఢ్, ఒడిషా రాష్రా ్టల సరిహద్దు తోపాటు విశాఖ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో విస్తృతంగా పోలీసు కూం బింగ్ నిర్వహిస్తున్నారు. చింతూరు మండల సరిహద్దు ప్రాం తంలో శుక్రవారం మావోయిస్టులు పెట్టిన మందుపాతరలను పోలీసులు వెలికి తీసిన విషయం విదితమే. అలాగే గత ఎ¯ŒSకౌంటర్‌లో గట్టి దెబ్బ తిన్న మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడవచ్చుననే అభిప్రా యంతో, ముందు జాగ్రత్త చర్యగా మరింత అప్రమతం అయిన పోలీసు యంత్రాంగం ఒక పక్క తూర్పు, మరో పక్క విశాఖ జిల్లాల పోలీసు లతో భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తూ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడు తున్నారు. అలగే ఏజన్సీ అన్ని పోలీసు స్టేషన్లలో భద్రతను మరింత పటిష్టం చేశారు. దీంట్లో భాగంగా వై.రామవరం మండలం మీదుగా శనివారం మరిన్ని పోలీసు బలగాలు సరిహద్దు అటవీ ప్రాంతంలోకి కూంబింగ్‌కు బయలుదేరి వెళ్లాయి. ఒకపక్క మావోల వారోత్సవాల పిలుపు, మరో పక్క పోలీసు కూంబింగ్‌లతో ఏఓబీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం సరిహద్దు అటవీ ప్రాంతంలో గ్రేహౌం డ్స్, ఏఎ¯ŒSఎస్, సీఆర్పీఎఫ్ పోలీçసులు అటవీ ప్రాం తాన్ని జల్లెడ పడుతున్నారు.
మావోలు ఇచ్చిన వారోత్సవాల పిలుపుతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రధాన రహదారుల్లో శనివారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. దీంట్లో భాగంగా అడ్డతీగల సీఐ ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో అడ్డతీగల–వై.రామవరం ప్రధాన రహదారిలో కల్వర్టులు, అనుమానాస్పద ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. అలాగే వేటమామిడి జంక్ష¯Œలో సీఐ వాహన తనిఖీలు నిర్వహించి, కేసులు నమోదు చేశారు. అనుమానితులు, అపరిచితులపై గట్టి నిఘా విధించారు.
మావోయిస్టుల వసూళ్లంటూ కరపత్రాలు
చింతూరు : మన్యంలో మావోయిస్టులు వారోత్సవాల పేరుతో హల్‌చల్ చేస్తున్న క్రమంలో వారి వ్యూహాలను తిప్పికొట్టేందుకు పోలీసులు ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. ఈ క్రమంలో యాంటీ నక్సల్ స్క్వాడ్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం చింతూరులో పలు వాహనాలపై విశాఖ మన్యంలో మావోయిస్టుల ఏడాది అక్రమ వసూళ్ల వివరాలతో కూడిన కరపత్రాలను అతికించారు. రహదారి కాంట్రాక్టర్లు, గంజాయి స్మగ్లర్లు, చిన్న వ్యాపారులు, క్వారీ యజమానులు, వాహన యజమానులు, బీడీ కాంట్రాక్టర్లు, వెదురు కాంట్రాక్టర్లు, సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి రూ. లక్షలు వసూలు చేశారంటూ కరపత్రాల్లో పేర్కొన్నారు. గిరిజ నుల నుంచి వారి పంట దిగుబడిలో వాటాలు తీసుకుంటున్నారని, గిరిజనులకు చెందాల్సిన సదరు సొమ్ము ఎక్కడికి పోతోంది, ఇందులో సంఘాల నేతల వాటాలెంత అంటూ కరపత్రాలు దర్శనమిచ్చాయి.
Advertisement