allert
-
తెలంగాణ: మూడు రోజులు వర్ష సూచన.. ఎల్లో అలెర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో మూడు రోజు వర్షాలు కురవనున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ 25 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఆవర్థనం, ద్రోని కొనసాగుతోంది. ఆవర్థనం, ద్రోని కారణంగా రాష్టానికి వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మరో ముడు రోజులు రాష్టానికి వర్ష సూచన ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.ఈరోజు ఆదిలాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందిరేపు కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. -
ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఢిల్లీలో భారీ వర్షం
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఢిలీ, నోయిడాతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వాన పడుతోంది. దీంతో దక్షిణ ఢిల్లీలోని ఆర్కేపురం, దానికి సమీపంలోని ప్రాంతాల్లో వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ ప్రకటించింది.Early morning rain 🌧⛈️#delhirains pic.twitter.com/QsbDjbzmax— Deepak (@Deepak_020418) July 24, 2024 ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, మీరట్, బాఘ్పట్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ అధికారులు తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీ, సివిల్ లైన్స్, కాశ్మీరీ గేట్, సీలంపూర్, షహద్ర, వివేక్ విహార్, పటేల్ నగర్, రెడ్ ఫోర్ట్, ప్రీత్ విహార్, బుధ జయంతి పార్క్ , ప్రెసిడెంట్ హౌస్ ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నట్లు ఐఎండీ ‘ఎక్స్’లో పేర్కొంది. ఇక.. గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 27 డిగ్రీలు నమోదు అవుతోంది. #DelhiRains Heavy Raining near Laxmi Narayan Mandir (Birla Mandir), New Delhi. pic.twitter.com/xEuRGYsRAN— Pramod Kumar (@kumarpramod22) July 24, 2024ఇక.. సోమవారం ఒక్కసారిగా వాతావరణ మారిపోయి.. దట్టమైన మబ్బులు కమ్ముకొని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. Good Morning 😊 #delhirains pic.twitter.com/H1mFGpltT3— Yuvi 💫(Martyn)🇮🇳 (@martyn_spamfam) July 24, 2024 -
ఏఐ స్కామ్ అలర్ట్.. ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి..
ఇటీవల మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా వార్తలు చదివే యాంకర్లను చూసి ఆశ్చర్యపోయాం. ఇది టెక్నాలజీపరంగా మనం చూస్తున్న మార్పులు. అంతవరకు బాగానే ఉంది కానీ, సోషల్ మీడియాలో మన ఫొటోలు, వీడియోలు దొంగిలించి, ఏఐ టెక్నాలజీ ద్వారా తక్కువ నిడివిగల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలుగా రూపొందించి, వాటిద్వారా మనల్ని బెదిరించే, సన్నిహితులను డబ్బు అభ్యర్థించే నేరస్థులు పుట్టుకొస్తున్నారు జాగ్రత్త!లేనిది ఉన్నట్టుగా సృష్టించి, భ్రమించేలా చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డీప్ ఫేక్ స్కామ్స్ కొత్తగా వెలుగు చూస్తున్నాయి. స్కామర్లు ఈ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. దీనివల్ల జరిగే హాని.. ఒక వ్యక్తిని వేధించడం లేదా అవమానించడం. సమాజంలో వారి ఇమేజ్ను, అలాగే విశ్వసనీయతను నాశనం చేయడం. ఈ విధానం ద్వారా డబ్బులను డిమాండ్ చేయడం లేదా వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడం, బెదిరించడం. కస్టమర్ కేవైసీ మెకానిజమ్‌ను కూడా మోసం చేయడం. క్రిమినల్ న్యాయ పరిశోధనల కోసం ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను మార్చడం. తప్పుడు సమాచార ప్రచారాలకు మద్దతు ఇవ్వడం. వినియోగదారుల పాస్‌వర్డ్‌లను తెలుసుకోవడానికి ఏఐ టెక్నాలజీని ఉపయోగించడం. బాధితులను మోసగించడానికి స్కామర్లు ఉపయోగించే సాకులు ఉదాహరణకు: మనకు లైవ్ వీడియో కాల్ వస్తుంది. ఆ వీడియోలో మనకు బాగా తెలిసిన సన్నిహిత వ్యక్తే ఉంటారు. ‘మా ఇంట్లో దొంగతనం జరిగింది. నా దగ్గర అవసరానికి డబ్బేమీ లేదు. సహాయం చెయ్ ప్లీజ్’ అని అడుగుతారు. లేదంటే.. సడెన్‌గా జబ్బు పడ్డాను, అత్యవసర పరిస్థితుల కోసం నాకు డబ్బు కావాలి యాక్సిడెంట్ అయ్యింది, డబ్బు కావాలి’ అని అంటారు. ఆ సమయంలో ‘అయ్యో, మనకు తెలిసిన వారికే, ఎంతటి కష్టం వచ్చింది అనుకుంటాం. డబ్బు సాయానికి ఆన్లైన్ బదిలీలు చేస్తాం. ఆ తర్వాత కానీ, జరిగిన నష్టం అర్థం కాదు. దుర్వినియోగం ఇలా అవుతోంది.. ► డీప్ ఫేక్‌లను (వీడియోలు, ఫేక్వర్చువల్ ఐడెంటిటీలు) రూపొందించడంలో ఏఐ సహాయపడుతుంది. ఇది చాలా వాస్తవికంగా కనిపిస్తుంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికీ, అసలు వ్యక్తుల్లా నటించడానికీ ఉపయోగపడుతుంది. ► మోడర్న్ స్టైల్లో వాయిస్ ఫిషింగ్ దాడులను నిర్వహించడానికి సైబర్ నేరస్తులు సోషల్ మీడియా అకౌంట్లనుంచి మన ఆడియోలను క్లోన్ చేయవచ్చు. (ఎమర్జెన్సీ సాకుతో డబ్బును బదిలీ చేయడానికి బాధితుల్లా నటించవచ్చు) ► ఏఐ టెక్నిక్స్ ఉపయోగించి సైబర్ నేరస్తులు మీ ఇమెయిల్‌ను పోలినటువంటి మెయిల్స్‌నే క్రియేట్ చేయవచ్చు. ► ఇప్పటికే ఉన్న ఆన్లైన్ సేఫ్టీని తప్పించి హైటెక్ మాల్వేర్ను రూపొందించడానికి ఏఐ ఉపయోగపడుతుంది. ► ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నడిచే డిజిటల్ ల్యాండ్ స్కేప్‌లు మనుషుల ప్రవర్తనకు తగినట్టుగా అనుకరిస్తాయి. అందుకే, ఏఐ సాధనాలను ఉపయోగించి మరింత నమ్మదగిన సోషల్ దాడులకు పాల్పడవచ్చు. నేరాల బారిన పడకుండా చిట్కాలు ♦ కోడ్ వర్డ్ తప్పనిసరి చేయాలి. మీ పిల్లలు, కుటుంబసభ్యులు, సన్నిహితులకు సంబంధించి ఒక కోడ్వర్డ్ను సెట్ చేయండి. ఏదైనా వీడియో, లైవ్ ద్వారా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు కోడ్‌వర్డ్ చెప్పమని అడిగి, నిర్ధారించుకోవచ్చు. ♦ లైవ్‌లో అయితే ‘ఒకసారి వెనక్కి తిరగమని చెప్పండి. ఏఐ టెక్నాలజీ అయితే అలా తిరగడం అనేది సాధ్యం కాదు. ♦ సైబర్ నేరస్థులు మీ సన్నిహితుల ఫోన్ నంబర్ల మాదిరే కనిపించే యాక్సెస్‌ను కూడా కలిగి ఉంటారు. అందుకని, మీకు తెలిసిన నంబర్ నుండి వాయిస్ మెయిల్ లేదా టెక్ట్స్ వచ్చినా వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకొని, లోతైన కారణాన్ని కనుక్కోండి. ♦ మీ సోషల్ మీడియా, ఇ–మెయిల్ అకౌంట్స్‌కు రెండు రకాల ప్రామాణీకరణను పాటించండి. దీని వల్ల మీరు అనధికార విషయాలకు దూరంగా ఉండవచ్చు. ♦ అంకెలు, ప్రత్యేక అక్షరాలతో బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి. ♦ ఇ–మెయిల్స్, ఎస్సెమ్మెస్‌లలో వచ్చే షార్ట్ లింక్స్‌పై క్లిక్ చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. ధ్రువీకరించినవాటిని మాత్రమే ఓపెన్ చేయండి. ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్న ఏఐ మోసాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే ‘ఏది నిజం – ఏది మాయ’ అని తెలుసుకోవడం ముఖ్యం. ఆధునిక పద్ధతుల్లో జరిగే ఏ మోసాలైనా మానవ మేధస్సును ఉపయోగించి అడ్డుకోవడం సులువే. అందుకు కావల్సింది కొంత జాగరూకత మాత్రమే అని గుర్తించాలి. డీప్ ఫేక్ స్కామ్ నమూనా.. ►ఏఐ ఆధారిత ఫోన్ వీడియో కాల్ మోసాలు అవతలివారిని ఒప్పించేవిగా, నమ్మించేవిగా ఉండవచ్చు. ►నేరగాళ్లు బాధితులను యాదృచ్ఛికంగా ఎంచుకుంటారు. మన సోషల్ మీడియా ప్రొఫైల్ ఇందుకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత స్కామర్లు బాధితులతో సోషల్ నెట్‌వర్క్‌లతో కమ్యూనికేట్ చేయడం ప్రారంభిస్తారు. ► స్కామర్ మనకు తెలిసిన వ్యక్తిలా నటిస్తాడు. తప్పుడు కథనాలను పునరావృతం చేయడం ద్వారా (ఏఐ–ఆధారిత డీప్ ఫేక్‌లను ఉపయోగించడం) బాధితులను పెద్ద మొత్తంలో డబ్బును ట్రాన్స్ఫర్ చేసేలా ఒప్పించడం, లేదా తియ్యగా మాట్లాడుతూ ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించడం వంటి మోసాలకు పాల్పడతారు. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
అలర్ట్: పెను తుపానుగా ‘అంఫన్’
సాక్షి, చెన్నై : తమిళనాడుపై అంఫన్ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాను కారణంగా దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే సేలం, ఈరోడ్, ధర్మపురి, కోయంబత్తూర్, క్రిష్ణగిరి జిల్లాలో భారీ ఈదురుగాలతో కూడిన వర్షాలకు పడుతున్నాయి. కొన్ని చోట్ల హోర్డింగ్‌లు, చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డ. బంగాళాఖాతంలో పెను తుఫాన్‌గా మారడంతో రాష్ట్రంలోని హార్బర్లలో మూడో ప్రమాద హెచ్చరిక సూచి ఎగుర వేశారు. రామేశ్వరం నుంచి చెన్నై ఎన్నూర్ హార్బర్ వరకు ఈ హెచ్చరిక జారీ అయింది. సముద్ర తీరంలో గాలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో జాలర్లు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారి ఆదివారం రాత్రి సాయంత్రం తీవ్ర తుపాన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. (అతి తీవ్ర తుపాన్‌గా ‘అంఫన్’). సోమవారం నాటికి పెను తుపానుగా మారిన అంఫన్.. సాయంత్రానికి సూపర్ సైక్లోన్‌గా మారనుంది. ప్రస్తుతం ఇది ఉత్తర వాయువ్య దిశగా బంగాళాఖాతం మీదుగా పయనిస్తోంది. దిఘా, బంగ్లాదేశ్ హటియా దీవుల మద్య తీరం దాటుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో 155-185 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇది తదుపరి ఉత్తర ఈశాన్య దిశగా వాయువ్య బంగాళాఖాతం మీదుగా ప్రయాణించి పశ్చిమ బెంగాల్- బంగాదేశ్ తీరాల వద్ద డిగా, హతియా దీవులు(బాంగ్లాదేశ్) మధ్య మే 20 వ తేదీ మధ్యాహ్నం సమయంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. అంఫాన్ వల్ల ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తాజా హెచ్చరికలతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. సముద్ర తీరంలో ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం ప్రాంతాల మధ్య తుపాను కొనసాగుతోంది. ఉత్తర దిశగా ప్రయాణించి మరింత తీవ్రమై ఈరోజు (మే 18వ తేదీన) ఉదయం 05.30 గంటలకు అత్యంత తీవ్ర తుఫానుగా మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో పారదీప్ (ఒరిస్సా)కు దక్షిణ దిశగా 790 కిమీ, డిగా (పశ్చిమ బెంగాల్)కు దక్షిణ నైఋతి దిశగా 940 కిమీ, ఖేపుపర (బంగ్లాదేశ్)కు దక్షిణ నైఋతి దిశగా 1060కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. -
నేడు కేరళకు రుతుపవనాలు
తిరువనంతపురం/న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం: నైరుతీ రుతుపవనాలు నేడు(జూన్ 8న) కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేరళలోని పలు జిల్లాల్లో శుక్రవారం వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతో కేరళలోని పలు జిల్లాలను హెచ్చరిస్తూ ఐఎండీ రెడ్, ఆరంజ్, యెల్లో అలర్టులను జారీచేసింది. ఈ విషయమై వాతావరణ శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘జూన్ 1న కేరళను తాకాల్సిన నైరుతీ రుతుపవనాలు వారం రోజులు ఆలస్యంగా కేరళకు వస్తున్నాయి. దీనిప్రభావం మిగతా రాష్ట్రాలపై కూడా ఉంటుంది. కేరళ, కర్ణాటక తీరప్రాంతంలో జూన్ 9న అల్పపీడన ద్రోణి ఏర్పడనుంది. దీనివల్ల వాయవ్య దిశలో రుతుపవనాలు వేగంగా కదులుతాయి’ అని తెలిపారు. గతేడాది కేరళలో భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో ఏకంగా 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.ఈ విషయమై కేరళ విపత్తు నిర్వహణ సంస్థ కార్యదర్శి శేఖర్ స్పందిస్తూ.. భారీ వర్షాలు, వరదల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లకు హ్యాండ్‌బుక్ జారీచేశామని తెలిపారు. ఉత్తరాది మరింత భగభగ రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రతోపాటు ఒడిశా, జార్ఖండ్, బిహార్‌లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశ ముంది. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో శుక్రవారం అత్యధికంగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, రాజస్తాన్‌లోని చురులో 46.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. హరియాణాలోని భివానీ జిల్లాలో 43.1 డిగ్రీలు, చండీగఢ్‌లో 40 డిగ్రీలు, పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర, మధ్యభారతంలో అధిక ఉష్ణోగ్రతలు మరోవారం రోజుల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు. -
ఏఓబీలో భారీ ఎత్తున పోలీసు కూంబింగ్
వై.రామవరం : ఈనెల రెండో తేదీ నుంచి 8వ తేదీ వరకు గెరిల్లా ఆర్మీ ఆవిర్భావ వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునివ్వడంతో తూర్పు గోదావరి జిల్లా పోలీసు యం త్రాంగం అప్రమ త్తమైంది. తెలంగాణ , చత్తీస్‌గఢ్, ఒడిషా రాష్రా ్టల సరిహద్దు తోపాటు విశాఖ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో విస్తృతంగా పోలీసు కూం బింగ్ నిర్వహిస్తున్నారు. చింతూరు మండల సరిహద్దు ప్రాం తంలో శుక్రవారం మావోయిస్టులు పెట్టిన మందుపాతరలను పోలీసులు వెలికి తీసిన విషయం విదితమే. అలాగే గత ఎ¯ŒSకౌంటర్లో గట్టి దెబ్బ తిన్న మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడవచ్చుననే అభిప్రా యంతో, ముందు జాగ్రత్త చర్యగా మరింత అప్రమతం అయిన పోలీసు యంత్రాంగం ఒక పక్క తూర్పు, మరో పక్క విశాఖ జిల్లాల పోలీసు లతో భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తూ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడు తున్నారు. అలగే ఏజన్సీ అన్ని పోలీసు స్టేషన్లలో భద్రతను మరింత పటిష్టం చేశారు. దీంట్లో భాగంగా వై.రామవరం మండలం మీదుగా శనివారం మరిన్ని పోలీసు బలగాలు సరిహద్దు అటవీ ప్రాంతంలోకి కూంబింగ్‌కు బయలుదేరి వెళ్లాయి. ఒకపక్క మావోల వారోత్సవాల పిలుపు, మరో పక్క పోలీసు కూంబింగ్‌లతో ఏఓబీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం సరిహద్దు అటవీ ప్రాంతంలో గ్రేహౌం డ్స్, ఏఎ¯ŒSఎస్, సీఆర్పీఎఫ్ పోలీçసులు అటవీ ప్రాం తాన్ని జల్లెడ పడుతున్నారు. మావోలు ఇచ్చిన వారోత్సవాల పిలుపుతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రధాన రహదారుల్లో శనివారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. దీంట్లో భాగంగా అడ్డతీగల సీఐ ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో అడ్డతీగల–వై.రామవరం ప్రధాన రహదారిలో కల్వర్టులు, అనుమానాస్పద ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. అలాగే వేటమామిడి జంక్ష¯Œలో సీఐ వాహన తనిఖీలు నిర్వహించి, కేసులు నమోదు చేశారు. అనుమానితులు, అపరిచితులపై గట్టి నిఘా విధించారు. మావోయిస్టుల వసూళ్లంటూ కరపత్రాలు చింతూరు : మన్యంలో మావోయిస్టులు వారోత్సవాల పేరుతో హల్చల్ చేస్తున్న క్రమంలో వారి వ్యూహాలను తిప్పికొట్టేందుకు పోలీసులు ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. ఈ క్రమంలో యాంటీ నక్సల్ స్క్వాడ్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం చింతూరులో పలు వాహనాలపై విశాఖ మన్యంలో మావోయిస్టుల ఏడాది అక్రమ వసూళ్ల వివరాలతో కూడిన కరపత్రాలను అతికించారు. రహదారి కాంట్రాక్టర్లు, గంజాయి స్మగ్లర్లు, చిన్న వ్యాపారులు, క్వారీ యజమానులు, వాహన యజమానులు, బీడీ కాంట్రాక్టర్లు, వెదురు కాంట్రాక్టర్లు, సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి రూ. లక్షలు వసూలు చేశారంటూ కరపత్రాల్లో పేర్కొన్నారు. గిరిజ నుల నుంచి వారి పంట దిగుబడిలో వాటాలు తీసుకుంటున్నారని, గిరిజనులకు చెందాల్సిన సదరు సొమ్ము ఎక్కడికి పోతోంది, ఇందులో సంఘాల నేతల వాటాలెంత అంటూ కరపత్రాలు దర్శనమిచ్చాయి. -
వణికిస్తున్న ‘క్యాంట్’
– తుపాను హెచ్చరికలతో అన్నదాతల్లో ఆందోళన – నేటినుంచి వర్షాలు కురిసే అవకాశం – జిల్లాలో వరి, మొక్కజొన్న, పొగాకు పంటలకు పొంచివున్న ప్రమాదం జంగారెడ్డిగూడెం : మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన క్యాంట్ తుపాను కదలికలు జిల్లా రైతుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. బుధవారం సాయంత్రం విశాఖ పట్నానికి 520, మచిలీపట్నంకు 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకతమైన తుపాను తీరం వైపు దూసుకొస్తున్నట్టు తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో గురువారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ తుపాను ఏ ప్రాంతంలో తీరాన్ని దాటుతుందనేది ఇంకా స్పష్టం కాలేదు. దీని ప్రభావంతో కురిసే వర్షాల వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో తుపాను రానుండటం వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పంటలకు నష్టం వాటిల్లింది. మిగిలిన కొద్దిపాటి పంట అయినా చేతికి వస్తుందనుకుంటున్న తరుణంలో తుపాను ముప్పు సమీపిస్తుండటంతో కన్నీటిపర్యంతం అవుతున్నారు. తీరగ్రామాల్లో అప్రమత్తం తుపాను ప్రభావంతో గురువారం నుంచే భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించిన తుపాను హెచ్చరికల కేంద్రం తీరప్రాంత గ్రామాలను, సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులను అప్రమత్తం చేయాలని సూచించింది. దీంతో జిల్లాలోని తీర గ్రామాల్లో ప్రజలను స్థానిక అధికారులు అప్రమత్తం చేశారు. జాలర్లను సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో వివిధ పంటలు వేసిన రైతులు కలత చెందుతున్నారు. వర్షాలొచ్చినా నష్టమే తుపాను ఎక్కడ తీరం దాటుందనే విషయాన్ని పక్కన ఉంచితే.. దీని ప్రభావంతో కురిసే భారీ వర్షాల వల్ల వరి పంటకు తీవ్ర నష్టం కలుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 2.28 లక్షల హెక్టర్లలో వరి పంట వేశారు. ఇందులో 17 శాతం విస్తీర్ణంలో కోతలు పూర్తయ్యాయి. మిగిలిన పంట వివిధ దశల్లో చేతికి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. కోసిన పంటను కళ్లాలపై కుప్పలు కోసి ఒబ్బిడి చేస్తున్నారు. ఒకవేళ భారీ వర్షాలు పడితే కళ్లాలపై ఉన్న పంట, వరికుప్పలు, చేతికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వరికి lష్టం జరిగే అవకాశం ఉంది. ఇటీవల వేసిన మొక్కజొన్న పంటకు కూడా తీవ్ర నష్టం జరుగుతుందని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. దాదాపు చేతికి వచ్చే స్థితిలో ఉన్న మిరప పంటకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు. ఉద్యాన పంటలైన అరటి, పందిళ్లపై సాగుచేస్తున్న కూరగాయ తోటలకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో ఈ పంటలన్నీ నేలవాలే ప్రమాదం ఉందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్న వర్జీనియా పొగాకుకు కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. జిల్లాలోని ఎన్ఎల్ఎస్ పరిధిలో ఇప్పటివరకు 5వేల హెక్టార్లలో రైతులు వర్జీనియా నాట్లు వేశారు. 110 హెక్టార్లలో నాట్లు వేశారు. వర్షతీవ్రత అధికంగా ఉంటే నష్టం సంభవించే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. -
చిన్నారుల విషయంలో అప్రమత్తత అవసరం
పట్నంబజారు (గుంటూరు) : ఇటీవల కాలంలో చిన్నారులు, విద్యార్థులు, వృద్ధులు కనిపించకుండా పోవడం అధికమవుతోందని, దీనిపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులు కనబడకుండాపోవడం కలవరపాటుకు గురిచేసే అంశమన్నారు. అయితే చిన్నారులు, వృద్ధులు, విద్యార్థులు నివాసం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపై ఉందన్నారు. విద్యార్థుల పట్ల కుటుంబ సభ్యులతోపాటు, ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో బయటకు వెళ్ళినప్పుడు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. విద్యార్థులకు ఇష్టం లేని కోర్సుల్లో చేర్పించడం, నిర్బంధంగా హాస్టల్లో చేర్పించడం వంటివి సరికాదన్నారు. వారి అభిరుచులకు తగ్గట్టుగా ఆయా కోర్సుల్లో చేర్పించడం ఉత్తమమని తెలిపారు. కుటుంబ కలహాలు, ఆస్తుల విషయాల్లో ఏర్పడే వివాదాలు చిన్నారులు, విద్యార్థులకు తెలియకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. -
చిన్నారుల విషయంలో అప్రమత్తత అవసరం
పట్నంబజారు (గుంటూరు) : ఇటీవల కాలంలో చిన్నారులు, విద్యార్థులు, వృద్ధులు కనిపించకుండా పోవడం అధికమవుతోందని, దీనిపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులు కనబడకుండాపోవడం కలవరపాటుకు గురిచేసే అంశమన్నారు. అయితే చిన్నారులు, వృద్ధులు, విద్యార్థులు నివాసం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపై ఉందన్నారు. విద్యార్థుల పట్ల కుటుంబ సభ్యులతోపాటు, ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో బయటకు వెళ్ళినప్పుడు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. విద్యార్థులకు ఇష్టం లేని కోర్సుల్లో చేర్పించడం, నిర్బంధంగా హాస్టల్లో చేర్పించడం వంటివి సరికాదన్నారు. వారి అభిరుచులకు తగ్గట్టుగా ఆయా కోర్సుల్లో చేర్పించడం ఉత్తమమని తెలిపారు. కుటుంబ కలహాలు, ఆస్తుల విషయాల్లో ఏర్పడే వివాదాలు చిన్నారులు, విద్యార్థులకు తెలియకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.