ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఢిలీ, నోయిడాతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వాన పడుతోంది. దీంతో దక్షిణ ఢిల్లీలోని ఆర్‌కేపురం, దానికి సమీపంలోని ప్రాంతాల్లో వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ ప్రకటించింది.
Early morning rain 🌧⛈️#delhirains pic.twitter.com/QsbDjbzmax
— Deepak (@Deepak_020418) July 24, 2024
ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, మీరట్, బాఘ్‌పట్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ అధికారులు తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీ, సివిల్ లైన్స్, కాశ్మీరీ గేట్, సీలంపూర్, షహద్ర, వివేక్ విహార్, పటేల్ నగర్, రెడ్ ఫోర్ట్, ప్రీత్ విహార్, బుధ జయంతి పార్క్ , ప్రెసిడెంట్ హౌస్ ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నట్లు ఐఎండీ ‘ఎక్స్’లో పేర్కొంది. ఇక.. గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 27 డిగ్రీలు నమోదు అవుతోంది.
#DelhiRains Heavy Raining near Laxmi Narayan Mandir (Birla Mandir), New Delhi. pic.twitter.com/xEuRGYsRAN
— Pramod Kumar (@kumarpramod22) July 24, 2024
ఇక.. సోమవారం ఒక్కసారిగా వాతావరణ మారిపోయి.. దట్టమైన మబ్బులు కమ్ముకొని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
Good Morning 😊 #delhirains pic.twitter.com/H1mFGpltT3
— Yuvi 💫(Martyn)🇮🇳 (@martyn_spamfam) July 24, 2024
Comments
Please login to add a commentAdd a comment