ఎటపాక మండలంలోనూ కాళ్లవాపు లక్షణాలు
Published Sun, Sep 25 2016 10:15 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
నెల్లిపాక :
ఏజెన్సీలో ఆందోళన కలిగిస్తున్న కాళ్లవాపు వ్యాధి లక్షణాలు ఎటపాక మండలంలో కూడా కనిపిస్తున్నాయి. గౌరిదేవిపేట పంచాయతీలోని బాడిసవారి గుంపులోని ముగ్గురు గిరిజనులకు ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. కాళ్లవాపుతో వీఆర్‌పురం మండలంలో వరుస మరణాలు సంభవిస్తుండడంతో బాడిసవారి గుంపు వాసులు ఆందోళన చెందుతున్నారు. మాజీ సర్పంచ్ కారం వెంకట్రావుకు కొన్ని రోజుల క్రితం జ్వరం వచ్చి తగ్గింది. అప్పటి నుంచీ కీళ్ల నొప్పులతో పాటు, పది రోజులుగా కాళ్లవాపు కూడా ఉందని ఆయన తెలిపారు. అదేవిదంగా మడకం భద్రమ్మ, గుండి రాంబాబులకు కూడా కాళ్లు వాపుగా ఉన్నట్టు కనపడుతున్నాయి. కాళ్లు, చేతులు, కీళ్లు తీవ్రమైన నొప్పిగా ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. జ్వరం వచ్చినప్పటి నుంచీ నొప్పులు, వాపులు ఉన్నాయని తెలిపారు. ఆందోళన కలిగిస్తున్న కాళ్లవాపు లక్షణాలు ఇవే అయి ఉంటాయని వారు భయపడుతున్నారు. వైధ్యశాఖ అధికారులు తక్షణమై గ్రామాన్ని సందర్శించి తమకు పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించాలని కోరుతున్నారు.
Advertisement