సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్ర అవినీతి నిరోధక శాఖలో (ఏసీబీ) ఏఎస్పీగా పని చేస్తున్న ఓ మహిళా అధికారి, కల్వకుర్తి సీఐగా పని చేస్తున్న మల్లికార్జున్‌రెడ్డి మధ్య కొన్నాళ్ళుగా సాగుతున్న వివాహేతర సంబంధం ఆదివారం అర్ధరాత్రి బట్టబయలైంది. ఏఎస్పీ భర్త, అతని బంధువులు ఇన్‌స్పెక్టర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారిణి భర్త సురేందర్‌రెడ్డి ఫిర్యా దు మేరకు ఇన్‌స్పెక్టర్‌పై కేపీహెచ్‌బీ ఠాణాలో సోమ వారం కేసు నమోదైంది.వివరాల్లోకి వెళితే.. మల్లికార్జున్‌రెడ్డి సైతం గతంలో ఏసీబీలో పని చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన, ‘ఓటుకు కోట్లు’ కేసును దర్యాప్తు చేసిన బృందంలో అప్పట్లో డీఎస్పీ çహోదాలో ఉన్న మహిళా అధికారిణి తో అతను కలిసి పనిచేశాడు. అలా వీరి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం అమెరికాలో ఉంటున్న సదరు అధికారిణి భర్తకు తెలియడంతో అతను, ఆయన కుటుంబీకులు ఏడాది క్రితం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో అధికారులు ఇరువురినీ మందలించడంతో పాటు మల్లికార్జున్‌రెడ్డిని ఏసీబీ నుంచి తప్పిస్తూ.. పోలీసు విభాగానికి పంపారు. ప్రస్తుతం అతడు కల్వకుర్తి సీఐగా పని చేస్తున్నారు. అయితే కొన్నాళ్ళుగా మళ్లీ మహిళా అధికారి, మల్లిఖార్జున్ రెడ్డి తమ పరిచయం కొనసాగిస్తున్నారు. అతను తరచూ కేపీహెచ్‌బీ ఏడో ఫేజ్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న అధికారిణి ఇంటికి రాకపోకల సాగిస్తున్నాడు. ఎక్కువగా రాత్రి వేళల్లో ఈ వ్యవహారం సాగుతుండటాన్ని గుర్తించిన సురేందర్‌రెడ్డి కుటుంబీకులు విషయాన్ని అమెరికాలో ఉన్న అతడికి సమాచారం అందించారు. రెండు రోజుల క్రితం రహస్యంగా అమెరికా నుంచి వచ్చిన సురేందర్‌రెడ్డి భార్య వ్యవహారం బట్టబయలు చేసేందుకు కాపుకాశాడు. ఆదివారం రాత్రి 10 గంటల తర్వాత మల్లికార్జున్‌రెడ్డి సదరు అధికారిణి ఇంటికి వచ్చినట్లు గుర్తించిన ఆయన తన తల్లి, బంధువులతో కలిసి అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సురేందర్‌రెడ్డి బంధువులు మల్లికార్జున్‌రెడ్డిని చెప్పుతో కొడుతూ అక్కడి నుంచి తరిమారు. ఈ నేపథ్యంలో మల్లికార్జున్‌రెడ్డి వారిని తీవ్రస్థాయిలో బెదిరించాడు.
ఈ మొత్తం వ్యవహారం మీడియా కెమెరాలకు చిక్కింది. తన భార్యను మల్లిఖార్జున్ రెడ్డి ట్రాప్ చేశాడని, దాదాపు రెండేళ్లుగా వారిద్దరి మధ్య సంబంధం కొనసాగుతుందని సురేందర్‌రెడ్డి ఆరోపించాడు. తన భార్య వ్యవహారం బయట పెట్టాలనే ఉద్దేశంతోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపాడు. సోమవారం మీడియా ద్వారా విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఏఎస్పీ, సీఐల వ్యవహారశైలిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. శాఖాపరమైన విచారణ అనంతరం వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఏఎస్పీతో తనకు ఐదేళ్లుగా పరిచయం ఉందని చెప్పిన మల్లికార్జున్‌రెడ్డి... ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, మంజూరైన తర్వాత వివాహం చేసుకోనున్నామని మీడియాతో పేర్కొన్నాడు ఆదివారం రాత్రి ఆమెను దించేందుకే వారింటికి వెళ్ళానని చెబుతుండగా, ఈ వాదనను సురేందర్‌రెడ్డి ఖండిస్తున్నాడు. సోమవారం మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్‌ను కలిసి తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన మల్లికార్జున్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు.పోలీసులు మల్లికార్జున్‌రెడ్డిపై ఐపీసీలోని 447, 497, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి నాగర్‌కర్నూల్ ఎస్పీతో పాటు ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నారు.
మహిళా ఏఎస్పీ, ఇన్‌స్పెక్టర్ మధ్య వివాహేతర సంబంధం
Published Tue, Jan 23 2018 8:07 AM | Last Updated on Mon, Aug 13 2018 2:57 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment