Nayanthara: అన్నీ మంచి అనుభూతులే..! | Actress nayanthara shares her memories in 2022 | Sakshi
Sakshi News home page

Nayanthara: అన్నీ మంచి అనుభూతులే..!

Published Sun, Jan 1 2023 7:46 AM | Last Updated on Sun, Jan 1 2023 8:04 AM

Actress nayanthara shares her memories in 2022 - Sakshi

తన జీవితంలో 2022 ఓ ఆనందాల హరివిల్లు అని నటి నయనతార అన్నారు. సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఈమెను చెప్పుకోవచ్చు. మొదట్లో కేరళ రాష్ట్రం, తిరువనంతపురం నుంచి చెన్నై మహానగరానికి వచ్చిన డయానా మరియం కురియన్‌కి సినిమా పేరు నయనతార. మలయాళి కుటుంబానికి చెందిన ఈమె పుట్టింది మాత్రం బెంగళూరులో. 2002లో మలయాళ చిత్ర పరిశ్రమలో కథానాయకిగా తెరంగేట్రం చేశారు. ఆ తరువాత 2005లో అయ్యా చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు.

20 వసంతాలు పూర్తి చేసుకున్న నయనతార నటిగాను, వ్యక్తిగతంగానూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అగ్రనాయకి స్థాయికి చేరుకున్నారు. రెండుసార్లు ప్రేమలో ఓడిపోవడంతో ఒక దశలో ఇక పెళ్లి చేసుకోకూడదనే వైరాగ్యానికి వచ్చారు. అలాంటిది ఇప్పుడు పెళ్లి చేసుకోవడమే కాకుండా ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యారు.

ఈ సంతోషకరమైన తరుణాలన్నీ 2022లోనే జరగడంతో ఇది ఆనందాల నిలయమైన ఏడాది అని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం నయనతార మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంటూ ఈ ఏడాది తనకు ఆనందాల నిలయంగా అమరిందన్నారు. తాను ప్రధాన పాత్రను పోషించిన కనెక్ట్‌ చిత్రాన్ని ఆదరించిన అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారన్నారు.   

చదవండి: (స్టార్‌ క్యాలెండర్‌ 2023)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement