2022 Year End Review: List Of Movies That Joined In The Rs 100+ Crores Club In 2022 - Sakshi
Sakshi News home page

100 Cr Club Movies 2022: వంద కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాలివే.. మీరు ఓ లుక్కేయండి..!

Published Tue, Dec 27 2022 5:45 PM | Last Updated on Tue, Dec 27 2022 6:44 PM

This Year All the films that joined the Rs 100 crore club in 2022  - Sakshi

ఈ ఏడాది చిత్ర పరిశ్రమ కలిసొచ్చిందనే చెప్పాలి. 2022లో విడుదలైన పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టాయి. చిన్న సినిమా అయినా సరే కంటెంట్ ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ జాబితాలో ది కశ్మీర్ ఫైల్స్, కాంతార ముందు వరుసలో ఉంటాయి. ఇక టాలీవుడ్ సంచలనం ఆర్ఆర్ఆర్ ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ ఏడాది ప్రేక్షకుల ఆదరణ పొందిన చాలా చిత్రాలు వంద కోట్ల క్లబ్‌లో చేరి రికార్డ్ సృష్టించాయి. అలాగే వీటితో పాటు బాలీవుడ్‌ చిత్రాలు సైతం ఈ మార్క్‌ను చేరుకున్నాయి. ఈ ఏడాది వంద కోట్ల వసూళ్లు దాటిన సినిమాలేవో ఓసారి రివైండ్ చేసుకుందాం.

ఈ ఏడాది వంద కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాలివే..

టాలీవుడ్ చిత్రాలు: ఆర్ఆర్ఆర్, సర్కారువారిపాట, భీమ్లా నాయక్, రాధేశ్యామ్, కార్తికేయ, గాడ్‌ఫాదర్

బాలీవుడ్ చిత్రాలు: ది కశ్మీర్ ఫైల్స్, బ్రహ్మస్త్ర, దృశ్యం-2, భూల్ భూలయ్యా-2, గంగూభాయ్ కతియావాడి, విక్రమ్ వేద, లాల్‌సింగ్ చద్దా, జగ్‌జగ్‌ జీయో

తమిళ చిత్రాలు: పొన్నియిన్ సెల్వన్, విక్రమ్, బీస్ట్, డాన్, తిరుచిత్రాంబలం, సర్దార్, వలిమై

కన్నడ చిత్రాలు: కేజీఎఫ్-2, కాంతార, విక్రాంత్‌ రోణ, 777 ఛార్లీ, జేమ్స్  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement