దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ మరో ఘనతను దక్కించుకుంది. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్- 2023లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇవాళ ప్రకటించిన 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి, ఉత్తమ యాక్టర్స్‌గా ఎన్టీఆర్, రామ్‌చరణ్ సంయుక్తంగా ఆవార్డ్ అందుకోనున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల విజేతలను కూడా ప్రకటించారు. ఏయే సినిమాకు అవార్డులు దక్కాయో ఫుల్ లిస్ట్ చూసేయండి.
68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్-2023 విజేతలు వీళ్లే..
తెలుగు..
- ఉత్తమ చిత్రం- ఆర్ఆర్ఆర్
- ఉత్తమ దర్శకుడు- ఎస్ఎస్ రాజమౌళి
- ఉత్తమ నటుడు- రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్(ఆర్ఆర్ఆర్)
- ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) - సీతారామం (హను రాఘవపూడి)
- ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - దుల్కర్ సల్మాన్
- ఉత్తమ నటి - మృణాళ్ ఠాకూర్ (సీతారామం)
- ఉత్తమ నటి (క్రిటిక్స్) -సాయి పల్లవి( విరాట్ పర్వం)
- ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)
- ఉత్తమ సహాయ నటి - నందితాదాస్ (విరాట్ పర్వం)
- ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ - ఎం.ఎం.కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్)
- ఉత్తమ సాహిత్యం - సిరివెన్నెల సీతారామశాస్త్రి (సీతారామం)
- ఉత్తమ నేపథ్య గాయకుడు - కాలభైరవ (కొమురం భీముడో.. ఆర్‌ఆర్ఆర్)
- ఉత్తమ నేపథ్య గాయని - చిన్మయి శ్రీపాద (ఓ ప్రేమ -సీతారామం)
- ఉత్తమ కొరియోగ్రఫీ -ప్రేమ్ రక్షిత్ (నాటు నాటు.. ఆర్‌ఆర్ఆర్)
- బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - సాబు శిరిల్ (ఆర్ఆర్‌ఆర్)
తమిళం
- ఉత్తమ చిత్రం - పొన్నియిన్ సెల్వన్- 1
- ఉత్తమ నటుడు- కమల్ హసన్ (విక్రమ్)
- ఉత్తమ నటి- సాయి పల్లవి (గార్గి)
- ఉత్తమ దర్శకుడు- మణి రత్నం (పొన్నియిన్ సెల్వన్ -1)
- ఉత్తమ సంగీత దర్శకుడు- ఏఆర్ రెహమాన్ (పొన్నియన్ సెల్వన్- 1)
- ఉత్తమ సహాయ నటుడు -(మేల్) కాళి వెంకట్
- ఉత్తమ సహాయ నటి - ఊర్వశి
- ఉత్తమ చిత్రం క్రిటిక్స్- కదైసి వ్యవసాయి
- ఉత్తమ యాక్టర్ క్రిటిక్స్ - ధనుష్ (తిరు), మాధవన్(రాకెట్రీ)
- ఉత్తమ నటి క్రిటిక్స్- నిత్యా మీనన్ (తిరు)
- ఉత్తమ గేయ రచయిత- తమిరై
- ఉత్తమ గాయకుడు- సంతోష్ నారాయణ్ (తిరు)
- ఉత్తమ గాయని - అంతనా నంది
- ఉత్తమ తొలి చిత్ర నటుడు- ప్రదీప్ రంగనాథ్
- ఉత్తమ తొలి చిత్ర నటి - అదితి శంకర్ (విరుమన్)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ- సెంథిల్, రవి వర్మన్
కన్నడ
- ఉత్తమ చిత్రం -కాంతార
- ఉత్తమ నటుడు- రిషబ్ షెట్టి (కాంతార)
- ఉత్తమ నటి - చైత్ర జే అచార్
- ఉత్తమ దర్శకుడు - కిరణ్ రాజ్ (777 ఛార్లీ)
- ఉత్తమ సహాయ నటుడు- అచ్యుత్ కుమార్
- ఉత్తమ సహాయ నటి - మంగళ
- ఉత్తమ సంగీత దర్శకుడు - అజనీష్
- ఉత్తమ గేయ రచయిత - నాగేంద్ర ప్రసాద్
- ఉత్తమ గాయకుడు - సాయి విగ్నేశ్
- ఉత్తమ గాయని- సునిధి చౌహాన్
- ఉత్తమ చిత్రం (క్రిటిక్స్)- ధరణి మండల
- ఉత్తమ నటుడు క్రిటిక్స్- నవీన్ శంకర్
- ఉత్తమ నటి క్రిటిక్స్- సప్తమి గౌడ
మలయాళం
- ఉత్తమ చిత్రం- నా తన్ కేస్ కోడు
- ఉత్తమ నటుడు- కుంచకో బోబన్ ( నా థన్ కేస్ కోడు)
- ఉత్తమ నటి - దర్షన రాజేంద్రన్ (జయజయజయజయహే)
- ఉత్తమ దర్శకుడు- రతీస్ బాలకృష్ణన్ (నా థన్ కేస్ కోడు)
- ఉత్తమ సహాయ నటుడు- ఇంద్రాన్స్ (ఉడల్)
- ఉత్తమ సహాయ నటి -పార్వతి తిరువోతు (ఫుజు)
- ఉత్తమ సంగీత దర్శకుడు- కైలాష్ మీనన్ (వాషి)
- ఉత్తమ గేయ రచయిత- అరుణ్ అలత్ (హృదయం)
- ఉత్తమ ప్లేబాక్ సింగర్ - ఉన్ని మీనన్ (భీష్మ పర్వం)
- ఉత్తమ ప్లేబాక్ సింగర్ - మృదుల వారియర్ (పాథోన్పథం నోట్టండు)
- ఉత్తమ ఫిలిం (క్రిటిక్స్)- అరిఇప్పు
- ఉత్తమ నటుడు (క్రిటిక్స్)- అలెన్సియర్ లే లోపెజ్ (అప్పన్)
- ఉత్తమ నటి (క్రిటిక్స్) -రేవతి (భూతకాలం)
Comments
Please login to add a commentAdd a comment