Know Why Ram Pothineni Says Sorry To Warrior Director Lingusamy, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Ram Pothineni On Lingusamy: డైరెక్టర్‌ లింగుస్వామికి రామ్‌ క్షమాపణలు, ఏం జరిగిందంటే

Published Thu, Jun 23 2022 11:38 AM | Last Updated on Thu, Jun 23 2022 12:05 PM

Ram Pothineni Sorry to The Warrior Director Lingusamy On Twitter - Sakshi

ఎనర్జిటిక్ హీరో రామ్‌ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్‌ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘ది వారియర్‌’. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతీశెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన జూలై 14న రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను స్టార్‌ చేసిన చిత్రం బృందం నిన్న ఈ ఓ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలోని ‘విజిల్‌.. విజిల్‌..’ అంటూ  సాగే పాటను సోషల్‌ మీడియా వేదికగా స్టార్‌ హీరో సూర్య రిలీజ్‌ చేశాడు. ఇక ఈ పాట లాంచింగ్‌ వేడుకలో రామ్‌ మాట్లాడుతూ.. విజిల్‌ సాంగ్‌ తనకు బాగా నచ్చిందని చెప్పాడు.

చదవండి: హమ్మయ్యా.. షూటింగ్‌ పూర్తయింది: పూజా హెగ్డే

తమ చిత్రానికి మంచి ఎనర్జిటిక్‌ మ్యూజిక్‌ అందించి దేవిశ్రీ ప్రసాద్‌, సింగర్స్‌, నిర్మాతలతో పాటు ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు. అయితే ఈ సినిమా సృష్టికర్త అయిన దర్శకుడు లింగుస్వామి గురించి మాత్రం రామ్‌ ఎక్కడ ప్రస్తావించలేదు. దీంతో ఇది కాస్తా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం రామ్‌ ట్వీట్‌ చేస్తూ డైరెక్టర్‌ లింగుస్వామికి క్షమాపణలు చెప్పాడు. ‘ఈ చిత్రం తెరకెక్కడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి గురించి చెప్పడం మర్చిపోయాను. నా వారియర్‌, డైరెక్టర్‌ లింగుస్వామి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఫ్రేమ్‌ను మీ భుజాలపై ఎత్తుకున్నారు. నేను ఇప్పటి వరకు పనిచేసిన అత్త్యుత్తమైన డైరెక్టర్లలలో మీరు ఒకరు. థ్యాంక్యూ. సారీ సార్‌.. లవ్‌ యూ’ అంటూ రామ్‌ రాసుకొచ్చాడు. 

చదవండి: అప్పుడు కాలర్‌ ఎగిరేశా.. కానీ అంత ఈజీ కాదు: ఆకాశ్‌ పూరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement