Linguswamy
-
ఆ చిత్రం సీక్వెల్లో పూజా హెగ్డే.. ముచ్చటగా మూడోసారి!
తమిళసినిమా: ఇంతకుముందు వరకు తెలుగులో టాప్ హీరోయిన్గా వెలిగిపోయిన బ్యూటీ నటి పూజాహెగ్డే. అయితే ఎవరికైనా తాము నడిచే పయనంలో ఎత్తుపల్లాలు సహజమే. ప్రస్తుతం ఈమె నట పయనం అంత ఆశాజనకంగా లేదని చెప్పాలి. ఇటీవల తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించిన చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. ముఖ్యంగా తమిళంలో పదేళ్ల క్రితం నటించిన తొలి చిత్రం ముగమూడి ఇటీవల నటించిన బీస్ట్ చిత్రం పూజాహెగ్డేకు అపజయాలనే అందించాయి. అలాగని ఈ అమ్మడికి అవకాశాలు అడుగంటాయని చెప్పలేం. తెలుగులో మహేశ్‌బాబుకు జంటగా ఒక చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం పైన పూజాహెగ్డే ఆశలన్నీ. అలాంటిది తాజాగా కోలీవుడ్‌లో ముచ్చటగా మూడోసారి ఒక అవకాశం వరించిందనే ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు పలు సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు లింగసామి ఇప్పుడు ఒక మంచి హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి చిత్రాన్ని దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకుముందు సంచలన విజయం సాధించిన పైయ్యా చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. పైయ్యా చిత్రంలో నటుడు కార్తీ, తమన్న జంటగా నటించారు. తాజాగా నటుడు సూర్య, కార్తీ, శింబు వంటి నటులకు కథను వినిపించినా వారు ఆసక్తి చూపలేదని సమాచారం. దీంతో నటుడు ఆర్యను తన చిత్రానికి కథానాయకుడిగా ఎంచుకున్నారు. ఇందులో ఆయనకు జంటగా దివంగత నటి శ్రీదేవి వారసురాలు జాన్వీకపూర్ నటించనున్నట్లు ఇటీవల ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆ ప్రచారాన్ని జాన్వీకపూర్ తండ్రి, సినీ నిర్మాత బోనికపూర్ ఖండించారు. దీంతో దర్శకుడు లింగస్వామి నటి పూజాహెగ్డే ను తన చిత్రంలో నాయకిగా ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఖాదర్‌బాషా ఎండ్ల ముత్తు రామలింగం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తిచేసి లింగసామి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతారని సమాచారం. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడానికి ఇంకా కాస్త సమయం ఉంది. -
అదే జరిగితే ' అంతకుముందు.. ఆ తర్వాత'.. డైరెక్టర్ లింగుస్వామి సీరియస్..!
అనువాద చిత్రాల వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి 'వారిసు' రిలీజ్‌పై వివాదం ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఈ అంశంపై దర్శకుడు లింగుస్వామి స్పందించారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఏం చేయాలో మాకు తెలుసన్నారు. (చదవండి: టాలీవుడ్లో ‘అనువాదం’ పై వివాదం) సంక్రాంతికి కేవలం తెలుగు చిత్రాలకు మాత్రమే థియేటర్ల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి చేసిన ప్రకటనపై కోలీవుడ్ దర్శక, నిర్మాతలు విమర్శలు చేశారు. ఇలా వ్యవహరించడం పద్ధ కాదని డైరెక్టర్ లింగుస్వామి అన్నారు. ఒకవేళ ఆ విధంగానే జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని లింగుస్వామి హెచ్చరించారు. ఇక తెలుగు సినీ నిర్మాతల మండలి లేఖపై తమిళ సినీ దర్శకులు ఆగ్రహంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వారిసుకు రావాల్సిన థియేటర్లు లభించకపోతే పరిస్థితి పూర్తిగా మారుతుందన్నారు. వారు ఇలాగే వ్యవహరిస్తే 'వారిసుకు ముందు, వారిసుకు తర్వాత' అనేలా ఉంటుందని దర్శకుడు లింగుసామి అన్నరు. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వారిసు'. దిల్‌రాజు నిర్మాత. యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సిద్ధమైన ఈ చిత్రాన్ని తెలుగులో 'వారసుడు' పేరుతో సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించారు. -
తన మూవీ డైరెక్టర్‌కు క్షమాపణలు చెప్పిన రామ్, ఏం జరిగిందంటే!
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన జూలై 14న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను స్టార్ చేసిన చిత్రం బృందం నిన్న ఈ ఓ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలోని ‘విజిల్.. విజిల్..’ అంటూ సాగే పాటను సోషల్ మీడియా వేదికగా స్టార్ హీరో సూర్య రిలీజ్ చేశాడు. ఇక ఈ పాట లాంచింగ్ వేడుకలో రామ్ మాట్లాడుతూ.. విజిల్ సాంగ్ తనకు బాగా నచ్చిందని చెప్పాడు. చదవండి: హమ్మయ్యా.. షూటింగ్ పూర్తయింది: పూజా హెగ్డే తమ చిత్రానికి మంచి ఎనర్జిటిక్ మ్యూజిక్ అందించి దేవిశ్రీ ప్రసాద్, సింగర్స్, నిర్మాతలతో పాటు ఇతర చిత్ర యూనిట్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు. అయితే ఈ సినిమా సృష్టికర్త అయిన దర్శకుడు లింగుస్వామి గురించి మాత్రం రామ్ ఎక్కడ ప్రస్తావించలేదు. దీంతో ఇది కాస్తా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం రామ్ ట్వీట్ చేస్తూ డైరెక్టర్ లింగుస్వామికి క్షమాపణలు చెప్పాడు. ‘ఈ చిత్రం తెరకెక్కడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి గురించి చెప్పడం మర్చిపోయాను. నా వారియర్, డైరెక్టర్ లింగుస్వామి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఫ్రేమ్‌ను మీ భుజాలపై ఎత్తుకున్నారు. నేను ఇప్పటి వరకు పనిచేసిన అత్త్యుత్తమైన డైరెక్టర్లలలో మీరు ఒకరు. థ్యాంక్యూ. సారీ సార్.. లవ్ యూ’ అంటూ రామ్ రాసుకొచ్చాడు. చదవండి: అప్పుడు కాలర్ ఎగిరేశా.. కానీ అంత ఈజీ కాదు: ఆకాశ్ పూరీ Totally missed mentioning the MAIN MAN at the end amidst all the madness!! My Warriorrrr! My Director @dirlingusamy sir! Sir you have carried every single frame of this film on your shoulders!Thank you for being one of the best directors I’ve worked so far!!Sorry & Love you!!♥️ — RAm POthineni (@ramsayz) June 22, 2022 -
The Warriorr: 150 మంది డ్యాన్సర్లు, 100 మంది మోడల్స్‌తో మాస్ సాంగ్
ఒక మంచి మాస్ సాంగ్‌తో ‘ది వారియర్’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి, గుమ్మడికాయ కొట్టింది చిత్రబృందం. రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ఇది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం కోసం వారం రోజులుగా రామ్‌పై ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో 150 మంది డ్యాన్సర్లు, 100 మంది మోడల్స్‌తో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ మాస్ సాంగ్ షూట్ శనివారంతో ముగిసింది. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ సందర్భంగా శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో రామ్ కనిపిస్తారు. పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ పనులు ప్రారంభించాం. తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న మా సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. రామ్ సరసన కృతీ శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
నా తొలి సినిమా తమిళంలో చేయాల్సింది: రామ్ పోతినేని
సాక్షి, చెన్నై: తన మొదటి చిత్రాన్ని తమిళంలో చేయాల్సిందని హీరో రామ్ అన్నారు. తాను చెన్నైలో పెరిగి చదివిన కుర్రాడినని తెలిపారు. లింగుస్వామి దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆయన ప్రతి సన్నివేశాన్ని ఎంతో కేర్ తీసుకుని రూపొందించారని.. డీఎస్పీ అద్భుతమైన సంగీతాన్ని అందించారని తెలిపారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ఉదయనిధి స్టాలిన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. తమిళంలో రామ్ కథానాయకుడిగా (తెలుగు, తమిళం) చిత్రం ది వారియర్. చదవండి👉 ది వారియర్: ఒక్క పాటకు మూడు కోట్లు పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ఇది. ప్రముఖ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జులై 14వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. కాగా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం కోసం నటుడు శింబు బుల్లెట్ అనే పల్లవితో సాగే పాటను తెలుగు, తమిళం భాషల్లో పాడటం విశేషం. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చెన్నైలోని లక్స్ థియేటర్లో నిర్వహించారు. ఎమ్మెల్యే, నటుడు ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. చదవండి👉 శ్రీవిష్ణు ‘భళా తందనాన’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ -
రామ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, ‘ది వారియర్’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్
ఎనర్జీటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా తమిళ డైరెకట్ర్ లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది వారియర్’. ద్విభాషా(తెలుగు, తమిళం) చిత్రంగా తెరకెక్కతున్న ఈమూవీ కృతిశెట్టి, అక్షర గౌడలు హీరోయిన్లుగా నటిస్తుండగా నటుడు ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ నుంచి మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్‌ను చేసి తాజాగా ప్రకటించింది చిత్ర బృందం. చదవండి: ఎన్టీఆర్ ఇంట్లో రామ్‌చరణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు లీక్ జూలై 14న ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఈ తాజా అప్డేట్ ఇస్తూ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న హీరోయిన్ కృతి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన సంగతి తెలిసిందే. అలాగే మహా శివరాత్రి సందర్భంగా ఆది పినిశెట్టి లుక్‌ను కూడా వదిలారు. ఈ మూవీలో రామ్ పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో అలరించబోతున్నాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. #THEWARRIORR is coming to you on the 14th of JULY!💥 Love..#RAPO pic.twitter.com/iBVbO7jCqL — RAm POthineni (@ramsayz) March 27, 2022 -
ఎనర్జిటిక్ హీరోకు సరైనోడు విలన్.. ఆది రోల్ రివీల్
Aadhi Pinisetty As Guru In Ram Pothineni The Warrior Movie: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో 'ది వారియర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కృతీ శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో మరోసారి విలనిజం చూపించనున్నాడు ఆది పినిశెట్టి. 'సరైనోడు' తర్వాత రెండోసారి పూర్తి స్థాయి ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నాడు. దీనికి సంబంధించిన లుక్‌ను మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేశారు. ఈ సినిమాలో 'గురు' పాత్రలో ఆది పవర్‌ఫుల్‌గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గురు పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉందని డైరెక్టర్ లింగుస్వామి తెలిపారు. విలన్‌గా ఆది పినిశెట్టి అందరిని ఆశ్చర్యపరుస్తాడని పేర్కొన్నారు. హీరో విలన్ల మధ్య సీన్స్ నువ్వా నేనా అన్నట్లు ఉంటాయన్నారు. గురు పాత్రకు ఆది పినిశెట్టి వంద శాతం యాప్ట్ అయ్యారని నిర్మాత శ్రీనివాస చిట్టూరి తెలిపారు. ఈ రోల్ సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండనుందన్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. Meet GURU from #TheWarriorr ! @AadhiOfficial you Monster!! Haha..can’t wait for them to witness your career best performance brother! Happy #MahaShivaratri my people. Love..#RAPO pic.twitter.com/uuWEMxrRCR — RAm POthineni (@ramsayz) March 1, 2022 -
పవర్ఫుల్ పాత్రలో రామ్ పోతినేని.. టైటిల్ రివీల్
Ram Pothineni New Movie The Warrior Title Revealed: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కృతీ శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో మరోసారి విలనిజం చూపించనున్నాడు ఆది పినిశెట్టి. సరైనోడు తర్వాత రెండోసారి పూర్తి స్థాయి ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు మేకర్స్. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'ది వారియర్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ టైటిల్‌తోపాటు రామ్ పోతినేని ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ పోలీసు అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పోలీస్ రోల్లో రామ్ చేయలేదు. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. #RAPO19 is #𝐓𝐇𝐄𝐖𝐀𝐑𝐑𝐈𝐎𝐑𝐑 🔥#RAPO19FirstLook pic.twitter.com/dedw7G3SBD — RAm POthineni (@ramsayz) January 17, 2022 ఇదీ చదవండి: హీరో రామ్‌కు గాయాలు.. షూటింగ్‌కు బ్రేక్ -
కృతిశెట్టికి చివాట్లు!.. 'బేబమ్మ'పై డైరెక్టర్ ఫైర్?
Lingusamy fires on Krithi Shetty: తొలి చిత్రంతోనే స్టార్ హీరోయిన్ అంత క్రేజ్ సంపాదించుకుంది కన్నడ భామ కృతిశెట్టి. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీని తన వైపుకు తిప్పుకుంది ఈ బ్యూటీ. ఆకర్షించే ఆందంతో పాటు, ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకులకు తక్కువ సమయంలోనే ఎక్కువ దగ్గరైంది. మొదటి సినిమానే సూపర్, డూపర్ హిట్ అవ్వడంతో ఈ ‘బేబమ్మ’కు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ రామ్ పోతినేని హీరోగా, లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉండగా ఓ సన్నివేశం షూట్ చేస్తున్న సమయంలో కృతిశెట్టిని డైరెక్టర్ లింగుస్వామి మందలించినట్లు సమాచారం. సీనియర్ నటుడు నాజర్-కృతిశెట్టిల సెంటిమెంట్ సీన్ షూట్ చేస్తుండగా సరైన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో కృతి ఫెయిల్ అయిందట. అప్పటికే చాలా టేకులు తీసుకున్నా కృతి సరిగ్గా పర్ఫార్మ్ చేయకపోవడంతో విసిగిపోయిన డైరెక్టర్ ఆమెపై గట్టిగా అరిచినట్లు సంబంధిత వర్గాల సమాచారం. నాజర్ లాంటి సీనియర్ నటులతో షూట్ ఉన్నప్పుడు అయినా ముందుగా ప్రాక్టీస్ చేసుకుంటే బావుంటుందని యూనిట్ సభ్యులు సైతం భావించారట. కాగా తొలి సినిమా ఉప్పెనలో విజయ్ సేతుపతి లాంటి స్టార్‌తో నటించిన కృతిశెట్టి..ఈ చిత్రంలో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో ఎలా ఫెయిల్ అయ్యిందోనని కొందరు పెదవి విరుస్తున్నారు. మరోవైపు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఒక్కోసారి ఎక్స్ప్రెషన్స్ పండాలంటే సమయం పడుతుందిగా అంటూ మరికొందరు ఆమెను వెనకేసుకొస్తున్నారు. -
రామ్ మూవీ: పవర్ ఫుల్ రోల్లో నదియా..ఫోటో వైరల్
హీరో రామ్ తమిళ డైరెక్టర్ లింగుస్వామితో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. ఇటీవలె ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి నదియా లుక్ ఒకటి బయటికొచ్చింది. చాలా పవర్ఫుల్ రోల్లో నదియా కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె అత్తారింటికి దారేది, మిర్చి సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అలాంటి పాత్రల్లో నదియా కనిపించనుందని సమాచారం. హీరో లేదా హీరోయిన్‌కు తల్లిగా నదిగా క్యారెక్టర్ చాలా హుందాగా ఉంటుందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రామ్, కృతిశెట్టి, నదియాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవలె ప్రముఖ దర్శకులు శంకర్ ఈ షూటింగ్ లొకేషన్‌కు వెళ్లి, చిత్ర బృందాన్ని సర్ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. -
సినిమాల్లోకి వంటలక్క ఎంట్రీ! మరి డాక్టర్ బాబు పరిస్థితి?
కార్తీకదీపం సీరియల్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన నటి ప్రేమీ విశ్వనాథ్. వంటలక్కగా తన సహజసిద్ధమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ మలయాళ ముద్దుగుమ్మ త్వరలోనే వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెలుగులో పలు సినిమా అవకాశాలు వచ్చినా కాదనుకున్న ప్రేమీ విశ్వనాథ్ తాజాగా ఓ బడా ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి- హీరో రామ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతుంది. రామ్‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. ఇటీవలె ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం మేకర్స్ వంటలక్కను సంప్రదించగా.. కథ నచ్చడంలో ఆమె కూడా వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ పాత్ర కోసం వంటలక్కకు మంచి పారితోషికాన్ని కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కార్తీకదీపం సీరియల్‌తో హీరోయిన్‌కు సమానంగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రేమీ విశ్వనాథ్..ఇక వెండితెరపై కూడా సత్తా చాటేందుకు రెడీ అయ్యిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
రామ్ సినిమా ఆపాలంటూ తమిళ నిర్మాత ఫిర్యాదు
హైదరాబాద్: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సినిమా చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ఇటీవల రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామితో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారో లేదో ఈ చిత్రాన్ని ఆపాలంటూ స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞాన్ వేల్ రాజా అడ్డుకుంటున్నారు. కాగా ఇదే తరహాలో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తెలుగులో సినిమా అనౌన్స్ చేయగానే లైకా ప్రొడక్షన్స్ అడ్డుకున్న సంగతి తెలిసిందే. చిక్కుల్లో రామ్ చిత్రం లింగుస్వామికి, తనకు మధ్య సినిమాల పరంగా కొన్ని ఆర్థిక లావాదేవీలు పెండింగ్‌లో ఉన్నాయని, అవి తేలేవరకు మరో సినిమాలు చేయకుండా చూడాలని తెలుగు నిర్మాతల మండలిలో జ్ఞాన్వేల్ తెలుగు నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మా బ్యానర్ లో లింగుస్వామి సినిమా చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం అది పూర్తి చేయకుండా, మా ప్రాజెక్ట్ పక్కనపెట్టి తెలుగులో రామ్‌తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఇది కరెక్టు కాదు, మాట ప్రకారం ముందు మా బ్యానర్లో సినిమా చేయాలి. ఆ తర్వాతే కొత్త ప్రాజెక్టులోకి వెళ్లాలి. అందుకే నేను ఫిర్యాదు చేశాను గానీ ఆయన రామ్‌తో సినిమా చేయడంపై మాకెలాంటి అభ్యంతరమూ లేదని’ వివరించారు. మరి దీని పై లింగుస్వామి ఎలా స్పందిస్తారో చూడాలి. చదవండి: ఫ్యాన్స్ కోసం ‘గుడ్ లక్ సఖి’ స్పెషల్ షో -
ఫైనల్ స్టోరీ సూపర్ డూపర్ కిక్ ఇచ్చింది: రామ్ పోతినేని
ఎనర్జీటిక్ హీరో రామ్ పోతినేని, తమిళ దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తెలుగు, తమిళ బాషల్లో రూపొందనున్న ఈ మూవీపై తాజాగా రామ్ ఓ అప్డేట్ను ఇచ్చాడు. ఈ సందర్భంగా ఇటీవల డైరెక్టర్ లింగుస్వామి ఫైనల్ స్క్రీప్ట్ పూర్తిచేసినట్లు వెల్లడించాడు. రామ్ ట్వీట్ చేస్తూ.. ‘చివరి కథనం పూర్తెయింది.కథ సూపర్ డూపర్ కిక్ ఇచ్చింది. లవ్ యూ లింగుస్వామి సార్. ఇక షూటింగ్ మొదలు పెడదాం’ అంటూ రాసుకొచ్చాడు. ఇక రామ్ ట్వీట్, అతడి ఎక్జైట్మెంట్ చూస్తుంటే ఈ మూవీ ఓ రేంజ్లో ఉండబోందని అర్థమవుతుంది. దీంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు పూర్తి స్క్రీప్ట్ వినకుండానే ఈ సినిమాకు ఒకే చెప్పి రామ్ సాహసం చేశాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంలో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. Final Narration Done & How!!! @dirlingusamy love you sir!! Super duper kicked!!! Roll that camera I say!!! 🔥@SS_Screens @ThisIsDSP @IamKrithiShetty #RAPO19 — RAm POthineni (@ramsayz) June 24, 2021 -
హీరో రామ్ మూవీలో విలన్‌గా మాధవన్, స్పందించిన నటుడు!
తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్లో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా ఓ మాస్ మసాలా చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్‌కు జోడిగా ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం లాక్డౌన్ అనంతరం సెట్స్‌పైకి రానుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా హీరో మాధవన్‌ను తీసుకోనున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమార్స్‌పై మాధవన్ స్పందించాడు. లింగుస్వామి తెలుగు మూవీలో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంగా లేదని సోషల్ మీడియా వేదిక వెల్లడించాడు. మ్యాడి ట్వీట్ చేస్తూ.. ‘అద్భుతమైన డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్లో నటించాలని నాకూ ఉంది. అయితే కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న తెలుగు సినిమాలో నేను విలన్‌గా నటిస్తున్నానంటూ వార్తలు వస్తున్నాయి. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. ఇది కేవలం పుకారు మాత్రమే’ అంటూ స్పష్టం చేశాడు. Would so love to work with @dirlingusamy and recreate the magic cause he is such a wonderful, loving man too… unfortunately no truth in the news doing the rounds recently, of us doing a telugu film together with en as an antagonist ❤️❤️❤️🙏🙏🙏 — Ranganathan Madhavan (@ActorMadhavan) June 12, 2021 -
సీఎం రిలీఫ్ ఫండ్‌కు డైరెక్టర్ లింగుస్వామి విరాళం
చెన్నై: కరోనా కట్టడిలో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి పలువురు విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటికే నటుడు రజనీకాంత్, శివకుమార్ కుటుంబం, అజిత్, విశాల్, దర్శకుడు శంకర్, వెట్రిమారన్ తదితరులు కరోనా నివారణ నిధికి విరాళాలు ఇచ్చారు. కాగా సోమవారం దర్శక, నిర్మాత లింగుస్వామి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌కు చెక్కు అందించారు. దర్శకుడిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న లింగుస్వామి ఇటీవల కరోనా రోగుల కోసం చెన్నైలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
‘బేబమ్మ’కు బంపరాఫర్.. స్టార్ హీరోతో రొమాన్స్
‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్గా మారిపోయారు కృతి శెట్టి. ఆల్రెడీ నాని ‘శ్యామ్ సింగరాయ్’, సుధీర్‌బాబు– మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ సినిమాల్లో ఆమె హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ఆఫర్‌ను దక్కించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా కృతీ శెట్టిని ఎంపిక చేయాలనుకుంటున్నారనే టాక్ వినబడుతోంది. చూడబోతుంటే కృతీ డైరీ ఫుల్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. -
లింగుస్వామి దర్శకత్వంలో ‘సెవెన్’హీరో
యువ కథానాయకుడు హవీశ్ తమిళ స్టార్ట్ డైరెక్టర్స్‌లో ఒకరైన లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేయబోతున్నారు. ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్ రెండు భాషల్లో సమాంతరంగా రూపొందనుంది. రన్, పందెంకోడి వంటి చిత్రాలతో కమర్షియల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న లింగుస్వామి, స్టాఫ్ ఇమేజ్ ఉన్న హవీశ్ కాంబినేషన్లో సినిమా రూపొందడం అందరిలో ఆసక్తిని పెంచుతుంది. త్వరలోనే సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను ప్రకటిస్తామని చిత్ర బృందం తెలియజేసింది. నువ్విలా, రామ్ లీలా, జీనియస్ చిత్రాలతో అలరించిన హవీశ్ తాజాగా ‘సెవెన్’చిత్రంతో అలరించాడు. ఓ వైపు హీరోగా నటిస్తూనే నిర్మాతగానూ రాణిస్తున్నాడు. ఇక తమిళ క్రేజీ డైరెక్టర్ లింగుస్వామి తెలుగులో రూపొందిన `తఢాఖా` సినిమాను తమిళంలో రూపొందించారు. అలాగే ఈయన రూపొందించిన `సండైకోళి` తెలుగులో `పందెంకోడి`గా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. గత ఏడాది `పందెంకోడి `2 కూడా విడుదలైంది. అయితే ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా ఉంటుందని అందరూ భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా హవీశ్‌తో సినిమాను పట్టాలెక్కించేందుకు లింగుస్వామి సిద్దమయ్యారు. -
కల నిజమవునా?
అల్లు అర్జున్‌కి ఎప్పటి నుంచో ఓ డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్‌లో ఉన్నది ఏఆర్ రెహమాన్. ఈ సంగీత సంచలనం స్వరపరచిన పాటలకు స్టెప్పులేయాలన్నది అల్లు అర్జున్ కల అట. ఆ కల త్వరలో నెరవేరనుందని సమాచారం. ‘పందెంకోడి’ ఫేమ్ ఎన్. లింగుస్వామి దర్శకత్వంలో అల్లు అర్జున్ తెలుగు–తమిళ భాషల్లో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంగీతదర్శకునిగా రెహమాను తీసుకోవాలనుకుంటున్నారట. ఈ విషయమై రెహమాన్‌ని సంప్రదిస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెన్నై కోడంబాక్కమ్ టాక్. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత లింగుస్వామితో చేయనున్న ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందట. -
చెన్నై ఎక్స్‌ప్రెస్‌కు టైముందట!
ఆల్మోస్ట్ ఇంకో ఏడాది టైముందట.. అల్లు అర్జున్ చెన్నై ఎక్స్‌ప్రెస్ ఎక్కడానికి! నిజం చెప్పాలంటే... ఈ టైమ్‌కి అల్లు అర్జున్ ఎక్కేయాలి. ఒకానొక దశలో అసలు చెన్నై ఎక్స్‌ప్రెస్‌ను క్యాన్సిల్ చేశారనే మాటలూ వినిపించాయి. అయితే... అటువంటిదేం లేదట. చెన్నై ఎక్స్‌ప్రెస్ అంటే ట్రైన్ కాదు, తమిళ సినిమా. అల్లు అర్జున్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా తెలుగు–తమిళ సినిమా ఒకటి ప్రకటించిన సంగతి తెలిసిందే. చెన్నైలో అట్టహాసంగా ప్రారంభోత్సవమూ జరిగింది. నిజానికి, ‘దువ్వాడ జగన్నాథమ్’ తర్వాత బన్నీ–లింగుస్వామి సినిమా షూట్ మొదలవ్వాలి. కానీ, వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ ప్రారంభించారు బన్నీ. మరోపక్క విశాల్ హీరోగా తమిళంలో ‘సండైకోళి–2’ ప్రారంభించారు లింగుస్వామి . తెలుగులో మంచి విజయం, విశాల్‌కు గుర్తింపు సాధించిన ‘పందెం కోడి’కి సీక్వెల్ ఇది. మరి, ముందుగా ప్రకటించిన బన్నీ సినిమా సంగతేంటి? అంటే... ‘‘తప్పకుండా ఆ సినిమా ఉంటుంది. ‘నా పేరు ఇండియా–నా ఇల్లు ఇండియా’ పూర్తయిన తర్వాత బన్నీ ఆ సినిమా స్టార్ట్ చేస్తారు. ఈలోపు లింగుస్వామి ‘సండైకోళి–2’ పూర్తి చేసి వస్తారు. ఆల్రెడీ బన్నీ–లింగుస్వామిలు ఎప్పుడో స్క్రిప్ట్‌ను లాక్ చేశారు’’ అని గీతా ఆర్ట్స్ సన్నిహిత వర్గాల సమాచారం. -
అల్లు అర్జున్ కొత్త చిత్రం ప్రారంభం
-
ఆ పాట వింటే అనుష్కే గుర్తొస్తుంది!!