RAPO19: Linguswamy Fires On Krithi Shetty In Shooting Set, Check Details - Sakshi
Sakshi News home page

Krithi Shetty : కృతిశెట్టిపై డైరెక్టర్‌ లింగుస్వామి సీరియస్‌?

Aug 10 2021 6:56 PM | Updated on Aug 10 2021 8:27 PM

director Lingusamy Fires On Krithi Shetty: RAPO19 - Sakshi

Lingusamy fires on Krithi Shetty: తొలి చిత్రంతోనే స్టార్‌ హీరోయిన్‌ అంత క్రేజ్‌ సంపాదించుకుంది కన్నడ భామ కృతిశెట్టి. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీని తన వైపుకు తిప్పుకుంది ఈ బ్యూటీ. ఆకర్షించే ఆందంతో పాటు, ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకులకు తక్కువ సమయంలోనే ఎక్కువ దగ్గరైంది. మొదటి సినిమానే సూపర్‌, డూపర్‌ హిట్‌ అవ్వడంతో ఈ ‘బేబమ్మ’కు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ రామ్‌ పోతినేని హీరోగా, లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది.

ఇదిలా ఉండగా ఓ సన్నివేశం షూట్‌ చేస్తున్న సమయంలో కృతిశెట్టిని డైరెక్టర్‌ లింగుస్వామి మందలించినట్లు సమాచారం. సీనియర్‌ నటుడు నాజర్‌-కృతిశెట్టిల సెంటిమెంట్‌ సీన్‌ షూట్‌ చేస్తుండగా సరైన ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వడంలో కృతి ఫెయిల్‌ అయిందట. అప్పటికే చాలా టేకులు తీసుకున్నా కృతి సరిగ్గా పర్‌ఫార్మ్‌ చేయకపోవడంతో విసిగిపోయిన డైరెక్టర్‌ ఆమెపై గట్టిగా అరిచినట్లు సంబంధిత వర్గాల సమాచారం.

నాజర్‌ లాంటి సీనియర్‌ నటులతో షూట్‌ ఉన్నప్పుడు అయినా ముందుగా ప్రాక్టీస్‌ చేసుకుంటే బావుంటుందని యూనిట్‌ సభ్యులు సైతం భావించారట. కాగా తొలి సినిమా ఉప్పెనలో విజయ్‌ సేతుపతి లాంటి స్టార్‌తో నటించిన కృతిశెట్టి..ఈ చిత్రంలో ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వడంలో ఎలా ఫెయిల్‌ అయ్యిందోనని కొందరు పెదవి విరుస్తున్నారు. మరోవైపు ఎంత పెద్ద స్టార్‌ హీరో అయినా ఒక్కోసారి ఎక్స్‌ప్రెషన్స్‌ పండాలంటే సమయం పడుతుందిగా అంటూ మరికొందరు ఆమెను వెనకేసుకొస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement