
‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్‌గా మారిపోయారు కృతి శెట్టి. ఆల్రెడీ నాని ‘శ్యామ్ సింగరాయ్’, సుధీర్‌బాబు– మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ సినిమాల్లో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ఆఫర్‌ను దక్కించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతీ శెట్టిని ఎంపిక చేయాలనుకుంటున్నారనే టాక్ వినబడుతోంది. చూడబోతుంటే కృతీ డైరీ ఫుల్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment