
అల్లు అర్జున్‌కి ఎప్పటి నుంచో ఓ డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్‌లో ఉన్నది ఏఆర్ రెహమాన్. ఈ సంగీత సంచలనం స్వరపరచిన పాటలకు స్టెప్పులేయాలన్నది అల్లు అర్జున్ కల అట. ఆ కల త్వరలో నెరవేరనుందని సమాచారం. ‘పందెంకోడి’ ఫేమ్ ఎన్. లింగుస్వామి దర్శకత్వంలో అల్లు అర్జున్ తెలుగు–తమిళ భాషల్లో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకి సంగీతదర్శకునిగా రెహమాను తీసుకోవాలనుకుంటున్నారట. ఈ విషయమై రెహమాన్‌ని సంప్రదిస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెన్నై కోడంబాక్కమ్ టాక్. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత లింగుస్వామితో చేయనున్న ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందట.
Comments
Please login to add a commentAdd a comment