
ఎనర్జీటిక్ హీరో రామ్ పోతినేని, తమిళ దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తెలుగు, తమిళ బాషల్లో రూపొందనున్న ఈ మూవీపై తాజాగా రామ్ ఓ అప్‌డేట్‌ను ఇచ్చాడు. ఈ సందర్భంగా ఇటీవల డైరెక్టర్ లింగుస్వామి ఫైనల్ స్క్రీప్ట్ పూర్తిచేసినట్లు వెల్లడించాడు. రామ్ ట్వీట్ చేస్తూ.. ‘చివరి కథనం పూర్తెయింది.కథ సూపర్ డూపర్ కిక్ ఇచ్చింది. లవ్ యూ లింగుస్వామి సార్. ఇక షూటింగ్ మొదలు పెడదాం’ అంటూ రాసుకొచ్చాడు.
ఇక రామ్ ట్వీట్, అతడి ఎక్జైట్‌మెంట్ చూస్తుంటే ఈ మూవీ ఓ రేంజ్‌లో ఉండబోందని అర్థమవుతుంది. దీంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు పూర్తి స్క్రీప్ట్ వినకుండానే ఈ సినిమాకు ఒకే చెప్పి రామ్ సాహసం చేశాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Final Narration Done & How!!! @dirlingusamy love you sir!! Super duper kicked!!! Roll that camera I say!!! 🔥@SS_Screens @ThisIsDSP @IamKrithiShetty #RAPO19
— RAm POthineni (@ramsayz) June 24, 2021