సినిమాల ఎంపిక విషయంలో అల్లు అర్జున్‌ని ఫాలో అవుతున్నాడు హీరో రామ్. గతంలో బన్ని ఎంచుకున్న దర్శకుడితోనే బైలింగువల్ సినిమా చేయడం చూస్తుంటే..రామ్ పక్కా ప్లాన్‌తో కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. టాలీవుడ్, మాలీవుడ్‌లో స్టార్ డమ్ అందుకున్న తర్వాత బన్ని ఇమిడియెట్ గా కోలీవుడ్ పై ఫోకస్ పెట్టాడు. స్టూడియో గ్రీన్ సంస్థలో లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నాడు.ఇందుకు సంబంధించి అఫీసియల్ ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆ తర్వాత బన్ని పుష్పలో నటించి పాన్ ఇండియా పాపులారిటీ తెచ్చుకున్నాడు.
(చదవండి: అలా చేస్తే ‘సర్కారువారి పాట’మరో 100 కోట్లు వసూలు చేసేది)
కోలీవుడ్ లోకూడా పుష్ప సూపర్ హిట్ కావడంతో అనుకోకుండానే తమిళ మార్కెట్ లోకి బన్ని అఫీసియల్ గా ఎంట్రీ ఇచ్చినట్లు అయింది. అయితే ఏ లింగుస్వామితో కలసి తమిళ మార్కెట్ లోకి బన్ని ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడో, ఇప్పుడు అదే దర్శకుడితో కలసి తమిళ, తెలుగు బైలింగువల్ మూవీ ‘ది వారియర్’ చేశాడు రామ్.
జులై 14న ఈ చిత్రం తమిళంలో భారీ స్థాయిలో విడుదల అవుతోంది. అందుకు తగ్గట్లే వారియర్ తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. భారతీరాజా, మణిరత్నం, శంకర్ సహా తమిళ దర్శకులందరూ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేశారు. హీరో రామ్ కు తమిళ సినీ పరిశ్రమకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment