
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందులోను 'బుల్లెటు' సాంగ్‌కు విపరీతమైన ఆదరణ లభించింది.
ఇక మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. శుక్రవారం(జూలై 1) దర్శకుడు బోయపాటి శ్రీను తెలుగు ట్రైలర్ విడుదల చేయగా... తమిళ ట్రైలర్‌ను స్టార్ హీరో శివ కార్తికేయన్ రిలీజ్ చేశాడు. ఆద్యంతం మాస్ యాక్షన్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ పోలీసు ఆఫసర్‌గా కనిపిస్తుండగా.. ఆది పినిశెట్టి విలన్‌గా మరోసారి మెప్పించనున్నాడు. ప్రతి కథానాయకుడిగా ఆది సరికొత్తగా కనిపించబోతున్నాడని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment