గెట్‌ రెడీ | Ram new movie The Warrior teaser released on 14 may 2022 | Sakshi
Sakshi News home page

గెట్‌ రెడీ

Published Mon, May 9 2022 5:56 AM | Last Updated on Mon, May 9 2022 5:57 AM

Ram new movie The Warrior teaser released on 14 may 2022 - Sakshi

రామ్‌ తొలిసారి పోలీసాఫీసర్‌గా నటిస్తున్న చిత్రం ‘ది వారియర్‌’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి లింగుసామి దర్శకుడు. కృతీశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా చేస్తున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.

ఇందులో పోలీసాఫీసర్‌ సత్య పాత్రలో నటిస్తున్నారు రామ్‌. జూలై 14న ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. అయితే ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 14న విడుదల చేయనున్నట్లు యూనిట్‌ వెల్లడించింది. ‘‘గెట్‌ రెడీ... ఈ నెల 14న సత్యను పరిచయం చేస్తున్నాం’’ అని రామ్‌ పేర్కొన్నారు. అక్షర గౌడ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement