
సినీ దర్శకుడు లింగుసామి చెక్ బౌన్స్ కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కోలీవుడ్‌లో దర్శకుడిగా మంచి పేరు ఉన్న ఈయనపై పీవీపీ క్యాపిటల్ అనే సంస్థ చెక్ బౌన్స్ కేసులో స్థానిక సైదాపేట కోర్టును ఆశ్రయించింది. తమ నుంచి దర్శకుడు లింగుసామి తీసుకున్న రూ.1.3 కోట్లు తిరిగి చెల్లించలేదని, ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని పిటిషన్‌లో పేర్కొంది.
కేసును విచారించిన న్యాయస్థానం దర్శకుడు లింగుసామికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ, రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. దీంతో రూ.10 వేలును లింగస్వామి కోర్టుకు అపరాధ రుసుం చెల్లించాడు. ఈ కేసు తిరుపతి బ్రదర్స్ సంస్థకు సంబంధించిందని, ఈ వ్యవహారంలో తాము చెన్నై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
చదవండి: (షాకింగ్: స్టార్ డైరెక్టర్‌కు 6నెలల జైలు శిక్ష.. ఎందుకంటే)
Comments
Please login to add a commentAdd a comment