
దివంగత ప్రఖ్యాత కవి అబ్దుల్ రెహ్మాన్ తనకు గురువులాంటి వారని దర్శకుడు లింగుస్వామి అన్నారు. రెహ్మాన్ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకునే విధంగా లింగుస్వామి కవితల పోటీలు నిర్వహించారు. ప్రథమ బహుమతికి రూ.25 వేలు, ద్వితీయ బహుమతికి రూ.15 వేలు, తృతీయ బహుమతికి రూ.10 వేలుతో పాటు మరో 50 మందికి తలా వెయ్యి రూపాయలు నగదును అందించారు.
హైకూ కవిదై- 2022 పేరుతో స్థానిక కస్తూరి రంగన్ రోడ్డులోని రష్యా కల్చరల్ హాలులో జరిగిన ఈ వేడుకలో పార్లమెంట్ సభ్యురాలు కనిమొళి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు, జ్ఞాపికలు అందించి (53 మంది రాసిన కవితలతో ముద్రించిన) హైకూ కవిదై - 2022 బుక్‌ను ఆవిష్కరించారు. అనంతరం లింగుస్వామి మాట్లాడుతూ ఇకపై ఏటా ఆయన పేరుతో కవితల పోటీలు నిర్వహిస్తామని చెప్పారు.
చదవండి: నీటి అలల మధ్య భర్తకు అనసూయ లిప్‌లాక్.. వీడియో వైరల్
‘చింగారీ’ సాంగ్ ఫేం వలూశా డిసూజా గురించి ఈ విషయాలు తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment