ప్రముఖ దర్శకుడు లింగుస్వామికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. చెక్‌బౌన్స్ కేసులో ఆయనపై కిందికోర్టు విధించిన 6నెలల జైలు శిక్షపై స్టే విధించింది. వివరాల్లోకి వెళితే.. లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ కలిసి కార్తీ, సమంత హీరోహీరోయిన్లుగా ఎన్ని ఇజు నాల్ అనే సినిమా తెరకెక్కించాలని భావించారు. చదవండి: యాంకర్ అనసూయ 'ప్రేమ విమానం'కు మహేశ్‌బాబు సపోర్ట్
ఇందుకోసం 2014లో పీవీపీ కేపిటల్స్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.35 లక్షలు అప్పు తీసుకున్నారు.చివరకు ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో తీసుకున్న డబ్బునంతటినీ చెక్ రూపంలో తిరిగిచ్చారు. కానీ ఆ చెక్ బౌన్స్ కావడంతో సదరు సంస్థ కోర్టుమెట్లెక్కింది.
కేసును విచారించిన అనంతరం కోర్టు లింగుస్వామికి, ఆయన సోదరుడికి 6 నెలల జైలు శిక్షను విధించింది. కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ లింగుస్వామి హైకోర్టును ఆశ్రయించడంతో జైలు శిక్షపై స్టే విధించింది. చదవండి: 'పుష్ప-2' సెట్స్‌లో జూ.ఎన్టీఆర్.. వైరల్‌గా మారిన ఫోటో
Comments
Please login to add a commentAdd a comment