Check bounce
-
మీ చెక్ బౌన్స్ అయితే ఎలా? ఏం చేయాలి?
నేను ఒక వ్యక్తి దగ్గర 2019 జనవరి లో కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాను. కానీ కోవిడ్ వేవ్ రావడం వల్ల ఉద్యోగం పోయి అనుకున్న సమయానికి తిరిగి ఇవ్వలేకపోయాను. డబ్బు తీసుకునేటప్పుడు ష్యూరిటీ కింద ప్రామిసరీ నోటు, డేట్ వేయని రెండు చెక్కులు ఇచ్చాను. పోయిన నెలలో ఆ చెక్కులు నాకు చెప్పకుండా బ్యాంకులో వేసి బౌన్స్ చేశారు. చెక్ బౌన్స్ కేసు వేస్తాము అంటూ లీగల్ నోటీస్ కూడా పంపించారు. నేను డబ్బు కట్టేస్తాను అని వారికి తెలియజేయగా, ‘ఇప్పుడు తీసుకున్న దానికి మూడింతలు ఇవ్వాలి, లేకుంటే నీ మీద చీటింగ్ కేసు పెడతాము, జైలుకు వెళతావు’ అని బెదిరిస్తూ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తగిన పరిష్కారం చూపగలరు. – మానవేందర్, విజయవాడఅవతలి వాళ్లు మీ మీద చీటింగ్ కేసు పెడతామని అనగానే భయపడవలసిన అవసరం లేదు. కోర్టు వాయిదాల వల్ల కొంత ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ సరైన న్యాయసలహా పొందితే తప్పుడు కేసుల నుంచి తప్పించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా వర్ణించి, క్రిమినల్ చట్టాల కింద కేసులు పెట్టడం ఒక అలవాటుగా మారిపోయింది. చాలా సందర్భాలలో హైకోర్టులు, సుప్రీంకోర్టు సైతం అలాంటి కేసులను కొట్టివేశాయి. మీ కేసులో కూడా సివిల్ కేసును క్రిమినల్ పరిధిలోకి తీసుకు రావడానికి చట్టాన్ని దుర్వినియోగం చేశారు అని రుజువైతే కేసు కొట్టివేస్తారు.ఇకపోతే... చెక్కు బౌన్స్ కేసులో వచ్చిన నోటీసుకు సరైన గడువులోపు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఆ సమాధానంలోనే చెక్కు మీద రాసినంత నగదు చెల్లిస్తాము అని అంగీకరిస్తూ కూడా మీరు నోటీసుకు రిప్లై ఇవ్వవచ్చు. ఒకవేళ నోటీసులో తప్పులు ఉన్నట్లయితే వాటన్నింటినీ తిరస్కరిస్తూ మీరు ప్రపోజల్ చేయవచ్చు. ఒకవేళ వాళ్లు అప్పటికీ కేసు వేస్తే, కోర్టుకు కూడా మీ వాదనలు తెలియపరుస్తూ, సగటు అప్పు చెల్లిస్తాము అని చెప్తే, కోర్టు మీ అభ్యర్థనను పరిగణించి అందుకు అనుగుణంగా తీర్పు చెబుతుంది. అప్పుడు మీకు జైలు శిక్ష పడకపోవచ్చు. అయితే చెక్ బౌన్స్ కేసులలో నిందారోపితులు డబ్బులు కట్టేస్తాము అన్నంత మాత్రాన నేరం లేకుండా పోదు. ఇటీవలే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అదే చెప్తుంది. కాబట్టి చెక్ బౌన్స్ కేసును మాత్రం కొంత సీరియస్‌గానే పరిగణించండి. మీ లాయర్ గారి సలహా మేరకు కేసు నడపాలా లేక రాజీ కుదుర్చుకోవాలా అనే నిర్ణయాన్ని తీసుకోవడం మంచిది. మీరు డబ్బులు ఇవ్వాలి అనేది నిజమే అని చెప్తున్నారు కాబట్టి, లాయర్ గారి ద్వారా లేదా కోర్టు అనుమతి ద్వారా కూడా మధ్యవర్తిత్వం చేసి రాజీ కుదుర్చుకోవచ్చు. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసంsakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు. ఇదీ చదవండి: మార్నింగ్ టీ కప్‌తోపాటు ఆకాంక్ష స్నాక్స్ ! ఇది కదా సక్సెస్! -
చెక్ బౌన్స్ కేసులో గణేశ్‌కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష
-
భార్య చెక్కులతో తమాషాలా?
కర్ణాటక: భార్యకు చెప్పకుండా బ్లాంక్ చెక్కు ఉపయోగించి రుణం పొందడం ఆమెను మానసిక ంగా హింసించడంతో సమానమని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ అంశం ఆధారంగా దంపతుల కు కింది కోర్టు మంజూరు చేసిన విడాకులను ఎత్తి చూపింది. గతంలో కుటుంబ న్యాయస్థానం భార్య పిటిషన్ మీద విడాకులు మంజూరు చేయడాన్ని ప్రశ్నిస్తూ మండ్య జిల్లా హొనగానహళ్లికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌కుమార్ ఏ.పాటిల్ ధర్మాసనం ఈ కేసును విచారించింది, భార్యను ఆమె భర్త బలిచ్చే గొర్రెగా చేశారని అభిప్రాయపడింది. అతని పిటిషన్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించింది. భార్యను భర్త మానసిక హింసకు గురిచేశారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. భార్యకు చెందిన చెక్కులను దుర్వినియోగం చేయడంపై పిటిషనర్ స్పందించడం లేదు. ఇదంతా కూడా భార్యను ఇబ్బంది పెట్టడం అని అర్థమవుతుంది. ఆ చెక్కుల ద్వారా అప్పులు చేయడం క్రిమినల్ కేసులతో కూడిన బెదిరింపులను మహిళ ఎదుర్కోవాల్సి వచ్చిందని న్యాయస్థానం తన తీర్పులో వెల్లడించింది. అంతేకాకుండా భర్త నడవడికతో భార్య అవమానం, మానసిక హింసను అనుభవించారు. ఈ అంశాన్ని కుటుంబ న్యాయస్థానం కూలంకుషంగా పరిశీలించి తీర్పును ప్రకటించిందని ధర్మాసనం పేర్కొంది. కుటుంబ న్యాయస్థానం అన్ని ఆధారాలను పరిశీలించి న్యాయసమ్మతమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల్లో ఎలాంటి లోపదోషాలు కనిపించలేదని న్యాయస్థానం తెలియజేసి, పిటిషన్ సస్పెండ్ చేయాలని ఆదేశించింది. -
కోర్టులో ఫైన్ కట్టిన డైరెక్టర్ లింగుసామి
సినీ దర్శకుడు లింగుసామి చెక్ బౌన్స్ కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కోలీవుడ్‌లో దర్శకుడిగా మంచి పేరు ఉన్న ఈయనపై పీవీపీ క్యాపిటల్ అనే సంస్థ చెక్ బౌన్స్ కేసులో స్థానిక సైదాపేట కోర్టును ఆశ్రయించింది. తమ నుంచి దర్శకుడు లింగుసామి తీసుకున్న రూ.1.3 కోట్లు తిరిగి చెల్లించలేదని, ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని పిటిషన్లో పేర్కొంది. కేసును విచారించిన న్యాయస్థానం దర్శకుడు లింగుసామికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ, రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. దీంతో రూ.10 వేలును లింగస్వామి కోర్టుకు అపరాధ రుసుం చెల్లించాడు. ఈ కేసు తిరుపతి బ్రదర్స్ సంస్థకు సంబంధించిందని, ఈ వ్యవహారంలో తాము చెన్నై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. చదవండి: (షాకింగ్: స్టార్ డైరెక్టర్‌కు 6నెలల జైలు శిక్ష.. ఎందుకంటే) -
షాకింగ్: స్టార్ డైరెక్టర్‌కు 6నెలల జైలు శిక్ష.. ఎందుకంటే
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, 'ది వారియర్' మూవీ డైరెక్టర్ లింగుస్వామికి కోర్టుషాక్ ఇచ్చింది. చెక్‌బౌన్స్ కేసులో ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. కొన్నేళ్ల క్రితం కార్తీ, సమంతలు హీరోహీరోయిన్లుగా సినిమాను ‘ఎన్నిఇజు నాల్ కుల్ల’ అనే ఓ సినిమాను తెరకెక్కించాలని లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ భావించారు. ఇందుకోసం పీవీపీ సినిమాస్ అనే కంపెనీ నుంచి రూ. 35లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అయితే సినిమా పట్టాలెక్కకపోవడంతో తీసుకున్న సొమ్మును చెక్ రూపంలో తిరిగి చెల్లించారు. కానీ ఆ చెక్‌బౌన్స్ అవ్వడంతో సదరు సంస్థ కోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం డైరెక్టర్ లింగుస్వామి, అతని సోదరుడు చంద్రబోస్‌లకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా తీసుకున్న డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో లింగుస్వామి పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. -
తక్కువ ధరకు వాహనాలు ఇప్పిస్తానని మోసం
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ సబ్సిడీ వెహికల్ పాలసీ(సీఎస్‌వీపీ) కింద తక్కువ ధరకు వాహనాలు ఇప్పిస్తానంటూ తండ్రి కొడుకులు తమను మోసం చేశారంటూ బాధితులు సీసీఎస్ పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మహ్మద్ ఖుష్రో అహ్మద్ ఫారూఖీ అనే వ్యాపారికి దూరపు బంధువులైన ఖాజా నసీరుద్దీన్, అతడి కుమారుడు జియాయుద్దీన్ తమకు రాజకీయ పలుకుబడి ఉందని, ఆ పలుకుబడితో కార్లు, ట్రక్స్, మోటర్ సైకిల్స్ సబ్సిడీపై ఇప్పిస్తామని చెప్పారు. వీరి మాటలు నమ్మిన ఫారూకీ రూ. 1.61 కోట్లు వాహనాల కోసం చెల్లించాడు. అయితే వాహనాలు ఇప్పించక పోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ వారిపై ఒత్తిడి చేశాడు. దీంతో రూ. 66 లక్షలు తిరిగి చెల్లించి, మిగతా వాటికి గ్యారంటీగా చెక్కులు ఇచ్చారు. ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తమతో పాటు మరికొందరిని స్కీమ్‌ల పేర్లతో మోసం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: ముందుగా బేరం.. కానీ మధ్యలో రూ. 5 వేలు చోరీ చేసిందని చంపేశాడు!) -
మార్కాపురం కోర్టుకు హీరో సుమంత్, సుప్రియ
సాక్షి, ప్రకాశం: చెక్ బౌన్స్ కేసులో హీరో సుమంత్, సుప్రియలు గురువారం మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు. నరుడా.. ఓ నరుడా సినిమాకు సంబంధించి తనకిచ్చిన చెక్ బౌన్స్ అయిందని మార్కాపురం కోర్టులో ఫైనాన్సియర్ కారుమంచి శ్రీనివాసరావు కోర్టులో కేసు వేశారు. కాగా, ఈ సినిమాకు హీరోగా సుమంత్, నిర్మాతగా సుప్రియ ఉన్నారు. అదే సినిమాకు కారుమంచి శ్రీనివాసరావు ఫైనాన్స్ అందించారు. ఈ వ్యవహారంలోనే తనను మోసం చేశారని మార్కాపురంలో శ్రీనివాసరావు కేసు వేశారు. ఈ కేసుకు సంబంధించిన వాయిదా కోసం హీరో సుమంత్, సుప్రియ గురువారం మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు. చదవండి: (మరీ ఇంత దారుణమా!.. సొంత చెల్లినే పెళ్లాడిన అన్న..) -
ఆ విషయంపై కోర్టుకు వెళ్తా: రాధిక
నటి రాధికకు కరోనా సోకిందంటూ సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా ఈ వార్తలను ఖండించిన రాధిక తనకు కరోనా రాలేదని స్పష్టం చేసింది. సెకండ్ డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కాస్త ఒళ్లునొప్పులతో బాధపడ్డానని తెలిపింది. తన ఆరోగ్యం గురించి, చెక్ బౌన్స్ కేసు గురించి అసత్యవార్తలు రాస్తున్న వారి మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. తన బాగోగుల గురించి ఆరా తీస్తున్నవారి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేసింది. అలాగే చెక్ బౌన్స్ కేసు విషయంలో ఉన్నత కోర్టులో పోరాడతానని పేర్కొంటూ ట్వీట్ చేసింది. ఈ కేసులో రాధిక దంపతులకు ఏడాది జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. నటుడు శరత్ కుమార్, రాధిక భాగస్వాములుగా ఉన్న మేజిక్ ఫ్రేమ్స్ సంస్థ 'ఇదు ఎన్న మాయం' సినిమా నిర్మాణం కోసం రాడియన్స్ సంస్థ నుంచి 2014లో రూ.15 కోట్లు అప్పు తీసుకుంది. దీన్ని 2015 మార్చిలో చెల్లిస్తామని వారు మాటిచ్చారు. ఒకవేళ అప్పు తీర్చకపోతే టీవీ ప్రసార హక్కులు లేదా తర్వాత నిర్మించే సినిమా హక్కులు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. దీనికి తోడు అదనంగా కోటి రూపాయలు అప్పు తీసుకుని చెన్నై టీనగర్‌లోని ఆస్తిని తాకట్టుపెట్టారు. ఈ డబ్బుతో మరో సినిమా నిర్మించారు. అయితే ఇక్కడ ఒప్పందాన్ని ఉల్లంఘించడంలో తమకు రావాల్సిన రూ.2.50 కోట్లను వడ్డీతో సహా చెల్లించేలా ఆదేశాలివ్వాలని, టీ నగర్ ఆస్తులు అమ్మకుండా నిషేధం విధించాలని రాడియన్స్ సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. దీంతో డబ్బు చెల్లించాల్సిందే అని కోర్టు తీర్పు వెలువరించడంతో రాధిక దంపతులు 7 చెక్కులు సదరు సంస్థకు అందజేశారు.. శరత్‌కుమార్ దంపతుల బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోవడంతో వీటిలో ఒక చెక్కు బౌన్స్ అయింది. ఈ కారణంగా శరత్‌కుమార్ దంపతులపై, మరో భాగస్వామి స్టీఫెన్‌పై రాడియన్స్ సంస్థ చెన్నై సైదాపేట కోర్టులో క్రిమినల్ కేసు పెట్టింది. ఈ కేసును ఎమ్మెల్యేల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో బుధవారం విచారణకు రాగా, శరత్‌కుమార్, రాధిక దంపతులకు, స్టీఫెన్‌కు తలా ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే అప్పీలు కోసం శరత్‌కుమార్, స్టీఫెన్‌లకు అవకాశం ఇస్తూ శిక్షను నిలిపివేసింది. కోర్టుకు హాజరుకానందున రాధికపై పిటీ వారెంట్ జారీచేసింది. Thanks everyone for the love and affection, I am not down with corona virus, just body ache after second vaccine. On line press are just filing rubbish about health and case.We will fight it in higher courts. I am back at work, have a good day ❤️❤️❤️ — Radikaa Sarathkumar (@realradikaa) April 9, 2021 చదవండి: రాధిక, శరత్‌కుమార్ దంపతులకు షాక్ కమల్ హాసన్, అజిత్ ద్రోహం చేశారు: నటుడి ఆవేదన -
చెక్ బౌన్స్ నేరం... ఇక క్రిమినల్ కాదు!!
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన సంక్షోభంతో తల్లడిల్లుతున్న వ్యాపార వర్గాలకు కాస్త ఊరటనిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా చిన్న చిన్న ఉల్లంఘనలను క్రిమినల్ చర్యల పరిధి నుంచి తప్పించడంపై దృష్టి సారించింది. ఖాతాల్లో బ్యాలెన్స్ లేక చెక్ బౌన్స్ కావడం, రుణాల చెల్లింపు నిబంధనల ఉల్లంఘన మొదలైన చిన్నపాటి నేరాలను డీక్రిమినలైజ్ చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ఇందుకోసం 19 చట్టాలకు తగు విధంగా సవరణలు చేయనుంది. వీటిపై సంబంధిత వర్గాలు జూన్ 23లోగా తమ అభిప్రాయాలు తెలపాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా నిర్దిష్ట సెక్షన్ పరిధిలో ఏ నేరాలను క్రిమినల్ నేరాల కింద కొనసాగించాలి, వేటిని డీక్రిమినలైజ్ చేయొచ్చు అన్నది ఆర్థిక సర్వీసుల విభాగం నిర్ణయం తీసుకుంటుంది. ‘చిన్న నేరాలను డీక్రిమినలైజ్ చేయడమనేది వ్యాపారాలకు సులభతరమైన పరిస్థితులు కల్పించే దిశగా ఎంతగానో తోడ్పడుతుంది. న్యాయవ్యవస్థలు, జైళ్లపై ఒత్తిడి తగ్గగలదు‘ అని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఉల్లంఘనల జాబితా సిద్ధం.. కరోనా వైరస్ ప్రభావిత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ప్యాకేజీ వివరాల వెల్లడి సందర్భంగా సాంకేతిక, ప్రక్రియపరమైన చిన్నపాటి ఉల్లంఘనలను డీక్రిమినలైజ్ చేసే అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత నెలలోనే ప్రస్తావించారు. దీనికి అనుగుణంగా కేంద్ర ఆర్థిక సర్వీసుల శాఖ వివిధ చట్టాల్లో డీక్రిమినలైజ్ చేయతగిన చిన్న స్థాయి ఉల్లంఘనల జాబితాను రూపొందించింది. ప్రస్తుతం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881లోని సెక్షన్ 138 కింద ఖాతాలో తగిన బ్యాలెన్స్ లేక చెక్ బౌన్స్ అయితే దాన్ని జారీ చేసిన వ్యక్తి నేరం చేసినట్లుగా పరిగణించి రెండేళ్ల దాకా జైలు శిక్ష లేదా చెక్ పరిమాణానికి రెట్టింపు పెనాల్టీ విధించవచ్చు. లేదా జైలుశిక్ష, జరిమానా రెండూ విధించవచ్చు. తాజా ప్రతిపాదనల ప్రకారం దీన్ని సవరించే అవకాశం ఉంది. అలాగే, ఎల్ఐసీ విషయానికొస్తే ఆ సంస్థ పత్రాలు, ఖాతాలు లేదా ఇతరత్రా ప్రాపర్టీ ఏదైనా చట్టవిరుద్ధంగా ఎవరైనా తమ వద్ద ఉంచుకుంటే ఏడాది దాకా జైలు శిక్ష, రూ. 1,000 దాకా జరిమానా లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది. దీన్ని కూడా సవరించవచ్చు. విదేశీ ఇన్వెస్టర్లకు ఊరట..: ఆర్థిక నేరాలకు సంబంధించి క్రిమినల్ చర్యల గురించి విదేశీ ఇన్వెస్టర్లలో ఎంతో కాలంగా ఆందోళన నెలకొందని, తాజా ప్రతిపాదనలు వారికి ఊరటనివ్వగలవని నిషిత్ దేశాయ్ అసోసియేట్స్ సంస్థ వ్యవస్థాపక భాగస్వామి ప్రతిభా జైన్ తెలిపారు. ఎస్ఎఫ్ఐవో, ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీల పరిధిపై స్పష్టత లేకపోవడంతో బహుళ నియంత్రణ సంస్థలు ఒకే నేరంపై విచారణ జరుపుతుండటం వల్ల ప్రతివాదులకు పెద్ద సమస్యగా ఉంటోందని ఆమె పేర్కొన్నారు. మరోవైపు చర్యలు తీసుకున్నా, తీసుకోకపోయినా కొన్ని నేరాల డీక్రిమినలైజేషన్‌తో ఉల్లంఘనలకు పాల్పడేవారిలో భయం పోతుందని శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కో పార్ట్నర్ వీణ శివరామకృష్ణన్ అభిప్రాయపడ్డారు. రుణాలిచ్చే సంస్థల కోణంలో చూస్తే క్రిమినల్ చర్యల భయంతోనైనా డిఫాల్టర్లు కనీసం పునర్వ్యవస్థీకరణ లేదా చెల్లింపులపై చర్చలకైనా ముందుకొస్తున్నారని, దాన్ని డీక్రిమినలైజ్ చేస్తే ఆ భయాలు కూడా ఉండవని పేర్కొన్నారు. సవరణలు ప్రతిపాదించిన చట్టాలు ► నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ (చెక్ బౌన్స్) ► సర్ఫేసీ (బ్యాంకు రుణాల రీపేమెంట్పరమైన ఉల్లంఘనలు) ► ఎల్ఐసీ ళీ పీఎఫ్ఆర్డీఏ ళీ ఆర్బీఐ ► ఎన్‌హెచ్‌బీ ళీ బ్యాంకింగ్ నియంత్రణ ► చిట్ ఫండ్స్ ళీ యాక్చువేరీస్ ► జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (జాతీయీకరణ) ► అనియంత్రిత డిపాజిట్ స్కీముల నిషేధ చట్టం ► డీఐసీజీసీ ళీ నాబార్డ్ ళీ బీమా చట్టం ► ప్రైజ్ చిట్స్, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (నిషేధ) ► పేమెంట్ అండ్ సెటిల్మెంట్స్ సిస్టమ్స్ యాక్ట్ ► స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ► క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ (నియంత్రణ) ► ఫ్యాక్టరింగ్ నియంత్రణ చట్టం -
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు బౌన్స్
కర్నూలు (గాయత్రీ ఎస్టేట్): ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) అంటే ఆషామాషీ కాదు. ప్రభుత్వానికి సంబంధించి ఏ విభాగంలో అయినా నిధుల కొరత ఉండొచ్చేమో కానీ.. సీఎం సహాయ నిధి పద్దులో మాత్రం కొరత ఉండదు. ఇది అత్యవసర పద్దు కిందకు వస్తుంది. టీడీపీ సర్కారు పుణ్యమాని ప్రస్తుతం ఆ పద్దులోనూ నిధులు ఖాళీ అయ్యాయి. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ పద్దును సైతం ఖాళీ చేసి నిధులను ఇతర పథకాలకు మళ్లించారు. ఫలితంగా అనారోగ్యం బారినపడిన వారికి మంజూరు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. ఎన్నికల ముందు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వగా.. ఆ పద్దులో సొమ్ము లేకపోవడంతో బ్యాంకర్లు తిప్పి పంపిస్తున్నారు. తాజాగా, కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీకి చెందిన జ్యోతి పేరిట ఇచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్కును ‘ఇన్‌సఫీషియంట్ ఫండ్స్’ అని పేర్కొంటూ బ్యాంక్ అధికారులు వెనక్కి ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. రెవెన్యూ కాలనీకి చెందిన గంగాధర్‌రెడ్డి భార్య జ్యోతికి 2018 నవంబర్‌లో తీవ్ర కడుపు నొప్పి రావటంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెకు అత్యవసరంగా ఆపరేషన్ చేయించాలని సూచించారు. ఆ కుటుంబానికి ఆరోగ్యశ్రీ సదుపాయం లేకపోవడంతో అప్పు తెచ్చి ఆపరేషన్ చేయించారు. మొత్తంగా రూ.56 వేలు ఖర్చయ్యింది. సహాయం కోసం పాణ్యం టీడీపీ ఇన్చార్జి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ద్వారా నవంబర్ 26న సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. రూ.26,920 మంజూరు చేస్తున్నట్టు ఈ ఏడాది మార్చి 15న సమాచారం వచ్చింది. ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఏప్రిల్ 9వ తేదీన ఏరాసు ప్రతాప్‌రెడ్డి బాధిత కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించారు. 10వ తేదీన చెక్కును బ్యాంక్‌లో సమర్పించగా.. 15వ తేదీన ఆ పద్దులో నిధులు లేవని బ్యాంక్ అధికారులు లిఖిత పూర్వకంగా సమాచారం ఇచ్చారు. సీఎంఆర్ఎఫ్లో నిధులు లేకపోవటమా.. సీఎంఆర్ఎఫ్ చెక్కు తీసుకుని బ్యాంక్‌కు వెళితే నిధులు లేవన్నారు. ఆపరేషన్ కోసం అప్పు చేశాం. రిలీఫ్ ఫండ్ నుంచి రూ.26,920 మంజూరవటంతో కొంతలో కొంతైనా అప్పు తీరుతుందని భావించాం. ఆ ఖాతాలో డబ్బులు లేవని చెప్పడం చూస్తే పేద, మధ్య తరగతి జనాలను పట్టించుకోవటం లేదని అర్థమవుతోంది. ఎన్నికల్లో ఓటు వేస్తారనే ఉద్దేశంతో పోలింగ్‌కు రెండు రోజుల ముందు చెక్కు ఇచ్చారు. – జ్యోతి, గంగాధరరెడ్డి దంపతులు -
చెక్‌బౌన్స్ అయితే.. తక్షణ పరిహారం
సాక్షి, అమరావతి: ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు పెరుగుతున్నా బ్యాంకు చెక్కులకు ఉన్న ప్రాధాన్యం ఏమాత్రం తగ్గడం లేదు. న్యాయస్థానాల్లో పెరిగిపోతున్న చెక్ బౌన్స్ కేసులే ఇందుకు నిదర్శనం. దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో 45 లక్షలకు పైగా చెక్ బౌన్స్ కేసులున్నాయని అంచనా. ఒక చెక్ బౌన్స్ కేసు పరిష్కారం కావడానికి సగటున నాలుగేళ్లు పడుతోందని ఒక సామాజిక సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కేసుల సంఖ్య పెరిగి పరిష్కారానికి సుదీర్ఘ సమయం పడుతుండటం బాధితుడికి సరైన ప్రయోజనం లభించడం లేదు. దీంతో నెగోషిబుల్ ఇన్స్ట్రుమెంటల్ యాక్ట్ 1881కి కీలక సవరణలు చేశారు. ఈ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలపడంతో త్వరలోనే చట్ట రూపం దాల్చనుంది. దీనివల్ల చెక్ బౌన్స్ కేసుల విచారణ వేగంగా పరిష్కారమై విలువైన సమయంతో పాటు కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య తగ్గుతుందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. చెక్కు తీసుకున్న వారి హక్కులు పరిరక్షించేలా.. ఆర్థిక లావాదేవీల్లో హామీగా చెక్కులివ్వడం పరిపాటి. ఒక వ్యక్తి నుంచి నగదు తీసుకున్నా, లేక సరుకు తీసుకున్నా ఆ మొత్తానికి హామీగా పోస్ట్‌డేటెడ్ చెక్కులు తీసుకుంటారు. కానీ లావాదేవీల్లో ఏమాత్రం తేడా వచ్చినా ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవుతుంటాయి. ఇలా బౌన్స్ అయిన వాటిపై కోర్టులకు వెళుతుంటారు. కానీ ఇక నుంచి చెక్‌బౌన్స్ అయితే ముందుగా చెక్ ఇచ్చిన మొత్తంలో 20 శాతం కట్టడానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి. చెక్కు తీసుకున్న వారి హక్కులు పరిరక్షించేలా నెగోషిబుల్ ఇన్స్ట్రుమెంటల్ యాక్ట్‌లో సెక్షన్ 143ఏ వచ్చి చేరింది. ప్రస్తుత చట్టంలోని సెక్షన్ 138 ప్రకారం చెక్‌బౌన్స్ కేసులను క్రిమినల్ నేరంగా భావించి గరిష్టంగా రెండేళ్ల వరకు జైళ్లు శిక్ష విధించే అవకాశం ఉంది. కానీ కేసు తేలే వరకూ బాధితుడికి ఒక్క పైసా కూడా రావడం లేదు. కింది కోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చినా.. పై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్నారు. దీనివల్ల చెక్ తీసుకున్న వాళ్లు సరుకులు, డబ్బులు ఇచ్చి అవి తిరిగిరాక ఏళ్లకు ఏళ్లు ఎదురు చూడాల్సి వస్తోంది. దీనిని అరికట్టడానికి చట్టంలో మూడు కీలక మార్పులు చేశారు. 1. మధ్యంతర పరిహారం చెక్ బౌన్స్ అయ్యిందంటూ కోర్టుకు వెళితే తక్షణమే మధ్యంతర పరిహారం ఇచ్చే హక్కులను సెక్షన్ 143ఏ కల్పిస్తోంది. దీని ప్రకారం చెక్ ఇచ్చిన మొత్తంలో 20 శాతం వరకు బాధితుడికి చెల్లించేలా కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీచేయవచ్చు. ఈ మొత్తాన్ని 60 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల కేసు పూర్తయ్యేలోగా కనీసం కొంత మొత్తమైనా బాధితుడికి లభించనుంది. ఇప్పటి వరకు కేసు పూర్తి విచారణ అయ్యి తుది తీర్పు వచ్చే వరకూ ఎటువంటి చెల్లింపులు చేయడానికి అవకావం ఉండేది కాదు. 2. అప్పీల్‌కి వెళితే డిపాజిట్ చేయాలి ఒక వేళ కింది కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చిందని చెక్ ఇచ్చిన వ్యక్తి భావించి పై కోర్టులో సవాల్ చేయాలంటే.. కింది కోర్టు తీర్పు ఇచ్చిన నష్టపరిహారంలో 20 శాతం మొత్తాన్ని బాధితుడికి చెల్లించాల్సి ఉంటుంది. 3. ఓడిపోతే వడ్డీతో సహా చెల్లించాలి ఒకవేళ చెక్ బౌన్స్ అయ్యిందంటూ కోర్టుకెళ్లిన వ్యక్తి సహేతుక కారణాలు చూపించలేకపోతే.. డిపాజిట్ చేసిన మొత్తంపై వడ్డీతో సహా చెక్ ఇచ్చిన వారికి చెల్లించాల్సి ఉంటుంది. -
ముఖ్యమంత్రి చెక్ బౌన్స్ అయ్యింది
లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన అలోక్ మిశ్రాకు టెన్త్‌క్లాస్ పరీక్షల్లో రాష్ట్రంలో ఏడో ర్యాంకు వచ్చింది. అతని ప్రతిభను గుర్తించిన యూపీ సర్కార్ అలోక్‌ను అభినందించింది. ప్రతిభ చూపిన విద్యార్థులను సత్కరించేందుకు లక్నోలో ఓ సమావేశంలో సీఎం ఆదిత్యనాథ్ స్వయంగా లక్ష రూపాయల చెక్(నంబర్ 974926)ను అలోక్‌కు ప్రదానం చేశారు. లక్ష రూపాయలు వచ్చిన ఆనందంలో అలోక్ సీఎం అందించిన చెక్‌ను జూన్ 5న హజ్రత్‌గంజ్‌లోని దేనా బ్యాంకులో క్రెడిట్ చేశాడు. చెక్ క్లియర్ అయి డబ్బులు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూశాడు. కానీ అకౌంట్లో డబ్బులు రాకపోగా అతనికి పెనాల్టీ కూడా పడింది. దీంతో బ్యాంకు అధికారుల్ని ఆశ్రయించగా సీఎం ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని అసలు విషయం చెప్పారు. బారబంకి జిల్లా స్కూల్ ఇన్స్పెక్టర్ రాజ్‌కుమార్ యాదవ్ చెక్‌పై చేసిన సంతకంలో వ్యత్యాసం ఉండటంతోనే బౌన్స్ అయిందన్న అధికారులు.. అలోక్‌కు జరిమానా విధించారు. కాగా, అలోక్‌కి కొత్త చెక్ జారీ చేశామని రాజ్‌కుమార్ చెప్పారు. -
చెక్ బౌన్స్ కేసులను తీవ్రంగా పరిగణించాలి
న్యూఢిల్లీ: చెక్ బౌన్స్ కేసుల వల్ల కోర్టుల్లో రోజువారీగా పరిశీలించాల్సిన వ్యాజ్యాలకు ఆటంకం ఏర్పడుతోందని, ఫలితంగా చాలా వ్యాజ్యాలు అపరిష్కృతంగా మిగిలి పోతున్నాయని, అందువల్ల చెక్ బౌన్స్ కేసులను తీవ్రంగా పరిగణించాల్సి ఉందని ఢిల్లీ కోర్టు అభిప్రాయపడింది. ఢిల్లీకి చెందిన లలిత్ కుమార్ అనే వ్యక్తి ఓ ఆర్మీ జవాన్ భార్యకు లక్ష రూపాయల చెక్కు జారీ చేశాడు. అయితే, అది బౌన్స్ అయింది. దీంతో ఆమె కోర్టును ఆశ్రయిం చింది. ఈ మేరకు ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అశోక్ కుమార్ సోమవారం కేసు విచారణ చేపట్టారు. ఈ కేసులో ఆర్మీ జవాన్ భార్యకు 1.5 లక్షల జరిమానా చెల్లించాలని తీర్పు చెప్పారు. చెక్కుల జారీలో నిజాయితీ లోపించడం వల్ల వాటి విశ్వసనీయత దెబ్బతింటోందని పేర్కొన్నారు. చెక్కు జారీలో నిజాయితీ లోపించడం, కోర్టుల విలు వైన సమయాన్ని వృథా చేయడమే కాకుండా ఫిర్యాదు దారు రాలి డబ్బును తన వద్ద ఉంచుకొని ఆమెను వేధింపులకు గురి చేశారని మేజిస్ట్రేట్ పేర్కొన్నారు. -
చెక్ బౌన్స్ కేసులో ప్రభుత్వ ఉద్యోగికి జైలుశిక్ష
చెక్‌బౌన్స్ కేసులో ప్రభుత్వ ఉద్యోగిని చింతపల్లి ఝాన్సీకి విజయవాడ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు ఓ సంవత్సరం జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు స్పెషల్ మేజిస్ట్రేట్ టి.రమేష్‌బాబు ఇటీవల తీర్పు వెలువరించారు. తను ప్రభుత్వ ఉద్యోగినని, తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్నానని, తనపై ఆధారపడిన కుమార్తె ఉన్నారని, అందువల్ల తనపై దయ చూపాలంటూ ఝాన్సీ చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఝాన్సీ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించాల్సిన కారణాలు ఏమీ కనిపించడం లేదని, ఆమెకు విధించిన రూ.5 లక్షల జరిమానాలో రూ.4.90 లక్షలను ఫిర్యాదుదారు పరిహారంగా పొందవచ్చునని రమేష్‌బాబు తన తీర్పులో పేర్కొన్నారు. కాగా.. విజయవాడ, భవానీపురానికి చెందిన వి.ఎస్.సిహెచ్.శేఖర్ నుంచి గొల్లపూడి గ్రామానికి చెందిన ఝాన్సీ తన కుటుంబ అవసరాల నిమిత్తం 2009లో రూ.4.75 లక్షలను అప్పుగా తీసుకున్నారు. ఇందుకు ప్రామిసరీ నోటు కూడా ఇచ్చారు. అయితే అప్పు చెల్లించని నేపథ్యంలో శేఖర్ చేసిన విజ్ఞప్తి మేరకు అప్పులో కొంత భాగం చెల్లించేందుకు ఝాన్సీ 2012లో రెండు చెక్కులు ఇచ్చారు. బ్యాంకులో తగిన నిధులు లేవంటూ వాటిని బ్యాంకు అధికారులు తిరస్కరించారు. దీంతో ఝాన్సీకి శేఖర్ లీగల్ నోటీసు పంపారు. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో ఆయన కోర్టులో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం (ఎన్ఐ యాక్ట్) కింద కేసు దాఖలు చేశారు. దీనిపై స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ జరిపింది. తన సంతకాలను స్కాన్ చేసి శేఖర్ తప్పుడు హామీ పత్రాలు సృష్టించారన్న ఝాన్సీ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. అవి తప్పుడు పత్రాలు కావని, ఝాన్సీ స్వయంగా సంతకం చేసిన ప్రామిసరీ నోటని కోర్టు తేల్చింది. తాను సంతకం చేసిన ఖాళీ చెక్కులను, ప్రామిసరీ నోటును ఎవరో దొంగతనం చేశారన్న ఝాన్సీ వాదనలను సైతం కోర్టు తిరస్కరించింది. ఆమె చెబుతున్నవన్నీ అబద్ధమని తేల్చింది. అన్ని సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్ఐ యాక్ట్ ప్రకారం ఝాన్సీ నేరం రుజువైందని, అందువల్ల ఆమె శిక్షార్హురాలని కోర్టు తేల్చింది. ఆమెకు జైలుశిక్ష, జరిమానా విధించింది. -
10కె రన్ విజేతల చెక్‌లు బౌన్స్
-
రాజమౌళి తండ్రిపై చెక్‌బౌన్స్ కేసు కొట్టివేత
యలమంచిలి: ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తండ్రి, సినీ కథా రచయిత కె.వి.విజయేంద్రప్రసాద్‌కు చెక్‌బౌన్స్ కేసు నుంచి విముక్తి లభించింది. విజయేంద్రప్రసాద్‌పై పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు దాఖలుచేసిన చెక్‌బౌన్స్ కేసును కొట్టివేస్తూ యలమంచిలి ఏజేఎఫ్సీఎం కోర్టు న్యాయమూర్తి యజ్ఞనారాయణ గురువారం తీర్పు వెల్లడించారు. సినీ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావుకు 2011 మే 16న విజయేంద్రప్రసాద్ రూ.30 లక్షలకు ఇచ్చిన ఆంధ్రాబ్యాంకు చెక్కు చెల్లకపోవడంతో యలమంచిలి ఏజెఎఫ్‌సీఎం కోర్టులో కేసు దాఖలు చేశారు. నాలుగేళ్ల పాటు ఈ కేసు విచారణ ఇక్కడ కోర్టులో జరిగింది. వాదోపవాదనల అనంతరం సరైన ఆధారాలు లేనికారణంగా విజయేంద్రప్రసాద్‌ను నిర్దోషిగా న్యాయమూర్తి ప్రకటించారు. బుధవారమే ఈ కేసులో తీర్పు వెల్లడిస్తారని అంతా భావించారు. అయితే విజయేంద్రప్రసాద్ కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి తీర్పును గురువారానికి రిజర్వ్ చేశారు. విజయేంద్రప్రసాద్ కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించడంతో స్థానిక న్యాయవాదులతో పాటు హైకోర్టుకు చెందిన ప్రముఖ న్యాయవాదులతో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన కోర్టుకు హాజరయ్యారు. -
సినీ దర్శకుడు గుణశేఖర్‌పై చెక్‌బౌన్స్ కేసు
సాక్షి, హైదరాబాద్: రుద్రమదేవి సినిమా దర్శక నిర్మాత గుణశేఖర్‌పై సినీనటుడు సుమన్ చెక్ బౌన్స్ కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా సుమన్ గురువారం నాంపల్లి మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమన్ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసి తదుపరి విచారణను వాయిదా వేసింది. రుద్రమదేవి సినిమాలో నటించినందుకు ప్రతిఫలం (రెమ్యూనరేషన్)లో భాగంగా గుణశేఖర్ రూ. 5 లక్షల చెక్కు ఇచ్చారని, ఆయన బ్యాంకు ఖాతాలో నగదు లేకపోవడంతో చెక్కు బౌన్స్ అయిందని సుమన్ పేర్కొన్నారు. దీనిపై వివరణ కోరినా గుణశేఖర్ స్పందించకపోవడంతో.. కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. -
ఆర్థిక ఇబ్బందుల్లో శ్రుతిహాసన్?
నటి శ్రుతిహాసన్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారట. ఏమిటి నమ్మశక్యం కావడంలేదా? తమిళం, తెలుగు, హిందీ అంటూ బహుభాషల్లో క్రేజీ నటిగా వెలుగొందుతూ సంపాదిస్తున్న శ్రుతిహాసన్‌కు ఆర్థిక ఇబ్బందులంటే ఎవరయినా నవ్విపోతారు. అయితే ఇలాంటి వార్త మాత్రం నిజంగానే ప్రచారంలో ఉంది. అసలు విషయం ఏమిటంటే శ్రుతి హాసన్ బాలీవుడ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్న భావనతో ముంబాయిలో ఇటీవల ఒక డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. అంత వరకు బాగానే ఉన్నా ఆమె ఫ్ల్లాట్కొన్నది మామూలు ప్రాంతంలో కాదు. అత్యంత ధనవంతులు నివశించే అందేరిలో. ఈ ఫ్లాట్ కొనుగోలు కోసం బ్యాంకులో రుణం తీసుకున్నారట. అయితే ఆమె బ్యాంక్‌కు ఇచ్చిన చెక్కు బౌన్స్ అవ్వడంతో వారు ఆశ్చర్యపోయారట. ఈ విషయాన్ని వారిప్పుడు శ్రుతిహాసన్‌కు తెలియజేస్తున్నారట. ఈ వ్యవహారం కాస్త బయటకు పొక్కడంతో శ్రుతిహాసన్ చెక్ బౌన్స్, ఆర్థిక ఇబ్బందుల్లో శ్రుతిహాసన్ అంటూ ప్రచారం చేసేస్తున్నారు. అసలు విషయం తెలియాలంటే శ్రుతి నోరు విప్పాల్సిందే.