సినీ దర్శకుడు గుణశేఖర్‌పై చెక్‌బౌన్స్ కేసు | Director gunasekhar check bounce case | Sakshi
Sakshi News home page

సినీ దర్శకుడు గుణశేఖర్‌పై చెక్‌బౌన్స్ కేసు

Published Fri, Jan 30 2015 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

సినీ దర్శకుడు గుణశేఖర్‌పై చెక్‌బౌన్స్ కేసు

సినీ దర్శకుడు గుణశేఖర్‌పై చెక్‌బౌన్స్ కేసు

సాక్షి, హైదరాబాద్: రుద్రమదేవి సినిమా దర్శక నిర్మాత గుణశేఖర్‌పై సినీనటుడు సుమన్ చెక్ బౌన్స్ కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా సుమన్ గురువారం నాంపల్లి మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమన్ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసి తదుపరి విచారణను వాయిదా వేసింది. రుద్రమదేవి సినిమాలో నటించినందుకు ప్రతిఫలం (రెమ్యూనరేషన్)లో భాగంగా గుణశేఖర్ రూ. 5 లక్షల చెక్కు ఇచ్చారని, ఆయన బ్యాంకు ఖాతాలో నగదు లేకపోవడంతో చెక్కు బౌన్స్ అయిందని సుమన్ పేర్కొన్నారు. దీనిపై వివరణ కోరినా గుణశేఖర్ స్పందించకపోవడంతో.. కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement