రెండు దశాబ్దాల తర్వాత... | Bhumika Chawla joins the second schedule of Euphoria | Sakshi
Sakshi News home page

రెండు దశాబ్దాల తర్వాత...

Published Thu, Dec 5 2024 1:00 AM | Last Updated on Thu, Dec 5 2024 1:00 AM

Bhumika Chawla joins the second schedule of Euphoria

మహేశ్‌బాబు హీరోగా గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ‘ఒక్కడు’ (2003) సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు భూమిక. కాగా 20 ఏళ్ల తర్వాత మళ్లీ గుణశేఖర్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు భూమిక. ప్రస్తుతం గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘యుఫోరియా’ చిత్రంలో భూమిక ఓ పవర్‌ఫుల్‌ రోల్‌ చేస్తున్నారు. 

రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రం సెకండ్‌ షెడ్యూల్‌ప్రారంభమైంది. ఈ సందర్భంగా సెట్స్‌ నుంచి ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘వైవిధ్యమైన, హిట్‌ సినిమాలకు పెట్టింది పేరైన గుణశేఖర్‌ ప్రస్తుతం యూత్‌ఫుల్‌ సోషల్‌ డ్రామాగా ‘యుఫోరియా’ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దురాగతాలపై ఈ చిత్రం రూపొందుతోంది. భూమిక కోసం గుణశేఖర్‌ ఓ పవర్‌ఫుల్‌ పాత్రను సృష్టించారు. ఇటీవలే ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్‌ కె. పోతన్, సంగీతం: కాల భైరవ.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement