Second Schedule
-
రెండు దశాబ్దాల తర్వాత...
మహేశ్‌బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వం వహించిన ‘ఒక్కడు’ (2003) సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించారు భూమిక. కాగా 20 ఏళ్ల తర్వాత మళ్లీ గుణశేఖర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు భూమిక. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘యుఫోరియా’ చిత్రంలో భూమిక ఓ పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ప్రారంభమైంది. ఈ సందర్భంగా సెట్స్ నుంచి ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘వైవిధ్యమైన, హిట్ సినిమాలకు పెట్టింది పేరైన గుణశేఖర్ ప్రస్తుతం యూత్‌ఫుల్ సోషల్ డ్రామాగా ‘యుఫోరియా’ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దురాగతాలపై ఈ చిత్రం రూపొందుతోంది. భూమిక కోసం గుణశేఖర్ ఓ పవర్ఫుల్ పాత్రను సృష్టించారు. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కె. పోతన్, సంగీతం: కాల భైరవ. -
రెండో విడత ప్రచారానికి సిద్ధమవుతున్న కేసీఆర్
-
ఫారిన్ టూర్లో మహేశ్.. తివిక్రమ్ సినిమా షూటింగ్ అప్పుడేనా?
‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత దాదాపు పన్నెండేళ్ల అనంతరం హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ కొత్త సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ ముగిసింది. ఈ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఈ నెల 9న ఆరంభం కావాల్సిన ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ వాయిదా పడింది. అనుకోకుండా మహేశ్‌బాబు తల్లి ఇందిరా దేవి మృతి చెందడంతో ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కాగా నవంబరు మొదటివారంలో ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను ఆరంభించాలనుకుంటున్నారట. గత వారం ఓ యాడ్ షూట్లో పాల్గొన్న మహేశ్‌బాబు ప్రస్తుతం ఫారిన్ టూర్లో ఉన్నారు. మహేశ్ తిరిగి హైదరాబాద్‌కు రాగానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ సెకండ్ షెడ్యూల్లో మహేశ్, పూజాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల కానుంది. -
రెండో విడతకు సన్నాహాలు
సాక్షి, యాదాద్రి : రెండో విడత గొర్రెల పంపిణీకి జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. గత ఏడాది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టింది. గొర్రెల కాపరుల కుటుంబాలకు ఆర్థికంగా చేయూతను ఇవ్వడంతోపాటు మాంసం ఉత్పత్తిని పెంచాలన్నది ప్రభుత్వం ధ్యేయం. అందుకోసం గత ఏడాది మొదటి విడతలో 75శాతం సబ్సిడీతో 18 ఏళ్లు నిండిన గొల్ల,కురుమ సామాజిక వర్గానికి చెందిన వారికి గొర్రెలను పంపిణీ చేసింది. త్వరలో రెండో విడత చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. గత ఏడాది ఇలా.. గొర్రెల పెంపకానికి ముందుకు వచ్చే గొల్ల, కురుమ కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. జిల్లాలో 342 గొర్రెల,మేకల పెంపకందారుల సంఘాలు ఉన్నాయి. 2017జూన్‌లో గ్రామ సభలు నిర్వహించి సంఘంలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరినీ ఎంపిక చేశారు. సభ్యత్వం లేని వారికి సభ్యత్వం ఇచ్చి గొర్రెలను అందజేశారు. గ్రామ సభల ద్వారా ఏ, బీ రెండు జాబితాలను తయారు చేసి మొదటి విడతలో ఏ జాబితాలోని యూAనిట్లకు గొర్రెలను పంపిణీ చేశారు. ముందుగా జిల్లాలో గల మండలాలు, గ్రామాలు, లబి ్ధదారుల ఎంపిక పూర్తిగా అధికారులు, సంఘాల ప్రతినిధుల సమక్షంలో లాటరీ పద్ధతిలో జరిగా యి. ఏ లిస్టులోని లబ్ధిదారులకు 17వేలకుపైగా గొర్రెలను పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గొర్రెలను కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందజేశారు. ఇంకా కొందరికి పంపిణీ చేయాల్సి ఉంది. బి జాబితాలో.. ప్రస్తుతం బి జాబితాలోని 15,000 మందికి రెండో విడతలో గొర్రెలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రెండో జాబితాలో 1,543మంది డీడీలు చెల్లించి సిద్ధంగా ఉన్నారు. 1,700 మందికి బి జాబితా లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. మిగతా వారికి పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పశు వైద్యాధికారులు చెబుతున్నారు. రెండో విడతలో గొర్రెలను మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నియమాలను పాటించాలి ఒకే కుటుంబంలోని ఎంత మంది సభ్యులున్నా వారు సంఘాల్లో ఉండవచ్చు. సంఘాల్లో ఉన్న వారందరికీ సబ్సిడీ గొర్రెల యూనిట్ మంజూరు చేస్తారు. గొర్రెలు ఉన్నవారికి, ఉద్యోగం చేస్తున్న కుటుంబాలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఒక్కో యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలుతో కలిపి 21 ఇస్తారు. యూనిట్ విలువ రూ.1.25లక్షలు. బ్యాంకులతో నిమిత్తం లేకుండా లబ్ధిదారులకు ఈ పథకం వర్తిస్తుంది. యూనిట్ మొత్తంలో 25శాతం (రూ.31,250) లబ్ధిదారుడి వాటా, 75 శాతం (రూ.93.750) ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. లాటరీ పద్ధతిలో గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక చేశారు. ఉదాహరణకు ఒక గ్రామంలో 60 మంది సభ్యులుంటే అందులో 30 మందిని సంఘాల సభ్యుల సమక్షంలోనే లాటరీ ద్వారా గుర్తించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ పర్యవేక్షణ ఉంటుంది. మండల స్థాయిలో తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారి, స్థానిక పశువైద్యుడితో కూడిన త్రి సభ్య కమిటీలు ఉంటాయి. పంపిణీ చేసే గొర్రెలను పక్క రాష్ట్రం నుంచే కొనుగోలు చేయాలన్న నిబంధన సడలించారు. గొర్రెల రవాణా, వాటి బీమా ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుంది. కొత్తగా ఇచ్చే గొర్రెలతో పాటు పాత జీవాలకు కూడా ఉచితంగా బీమా చేస్తున్నారు. గొర్రె ఆరోగ్య పరిరక్షణకు ఏడాదికి మూడుసార్లు టీకాలు, నట్టల మందు సరఫరా చేస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున సంచార పశువైద్యశాలలు ఏర్పాటు చేశారు. గొర్రెల మార్కెటింగ్ కోసం ప్రత్యేక చర్యలు ప్రతి రెండు మూడు మండలాలకు ఒకటి చొప్పున గొర్ల అంగడి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఆదేశాల కోసం చూస్తున్నాం మొదటి దశ లబ్ధిదారులను ఎంపిక చేసిన సమయంలోనే రెండో విడతకు లబ్ధిదారులను ఎంపిక చేశాం. నిబంధనల ప్రకారం లబ్ధిదారుల నుంచి వారి వాటాధనం డీడీలు ఆహ్వానిస్తాం. ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీ కోసం ఇచ్చే ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం. –మదన్‌కుమార్, జిల్లా పశు వైద్యాధికారి -
రైతు చింత!
మహబూబ్‌నగర్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం విజయవంతమై దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. మొదటి విడతలో అధికారులు చకచకా పనులు చేసి రైతులకు చెక్కుల రూపంలో డబ్బులు అందించారు. రెండోవిడతలోనూ అలాగే అందించాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఎన్నికల కమిషన్ సూచన మేరకు ఆన్లైన్ ద్వారా రైతుల ఖతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు వ్యవసాయాశాఖ అధికారులు రైతుల వద్ద వారి వ్యక్తిగత ఖాతాల వివరాలు తీసుకున్నారు. చాలామందికి అనుకున్న సమయంలోనే డబ్బులు జమ అయ్యాయి. వారిలో కొంతమందికి వివిధ కారణాలతో ఇంకా జమ కాలేదు. దీంతో రైతులు పెట్టుబడి పైసల కోసం రోజు బ్యాంకులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అమలులో జాప్యం.. రైతుబంధు పథకం నగదు ఆన్లైన్ జమ నత్తనడకన సాగుతోంది. అక్టోబర్ మాసంలో రైతుల బ్యాంకు ఖాతాల్లోనగదు జమ చేయాల్సి ఉన్నా నేటికీ ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం 80శాతం రైతుల ఖాతాల్లో నగదు జమ అయింది. కానీ ఏ గ్రామానికి వెళ్లి అడిగినా రైతులు తమ ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమ కాలేదని.. ఎప్పుడు అవుతుందని అధికారులను ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ విషయం గురించి అధికారుల వద్ద కూడా స్పష్టమైన సమాధానం లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మళ్లీ వడ్డీవ్యాపారుల వద్ద అప్పులు.. రైతులు పంట పెట్టుబడి సాయంకోసం ఎదురు చూసి విసిగి వేసారిపోయారు. గత్యంతరం లేక మళ్లీ దళారులు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రైతులు వడ్డీవ్యాపారుల చేతుల్లో చిక్కి ఆర్థి్థకంగా నష్టపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఖరీఫ్ పెట్టుబడి సాయం ఎకరానికి రూ.4వేల చొప్పున అందించగా, రబీ సీజన్‌కు సంబంధించి పెట్టుబడి సాయం మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో రాలేదు. ఈ ప్రక్రియ ప్రారంభమై మూడు నెలలు గడిచింది. డబ్బులు ఖాతాల్లో జమ కానీ రైతులు ఆందోళన చెంది వ్యవసాయ అధికారులను అడిగి వేసారిపోయారు. రేపు.. మాపంటూ కారణాలు చెప్పడంతో చేసేదిలేక అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారు. రైతుల ఖాతాల్లో రూ.276.34 కోట్లు జిల్లాలో రైతుబంధు పథకానికి సంబంధించి అర్హులైన రైతులు 2,77,790 మంది ఉన్నారు. ఇందుకు సంబం«ధించి రూ.316.86 కోట్ల నగదు జమ కావాల్సి ఉంది. వ్యవసాయశాఖ ఏఈఓలు ఇప్పటివరకు 2,50,017 మంది రైతుల బ్యాంకు ఖాతాలను సేకరించి ఆన్లైన్లో పొందుపరిచారు. ఈ ఖాతాల్లో రైతుబంధు నగదు బదిలీ కోసం హైదరాబాద్‌లోని కమిషనరేట్ కార్యాలయానికి పంపించారు. అక్కడి అధికారులు 2,45,500 ఖాతాల్లో డబ్బుల జమ కోసం ఆన్లైన్ ద్వారా ట్రెజరీకి పంపించారు. ఇప్పటివరకు 2,34,300 మంది రైతులకు రూ.276.34 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. 80 శాతం మంది రైతుల ఖాతాల్లో నగదు జమ అయిందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇంకా 15,717 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావాల్సి ఉంది. వీరితో పాటు ఖాతా నంబర్లు పంపించినప్పటికీ వాటి వివరాలు సరిగా లేకపోవడం, వివిధ కారణాలతో దాదాపు 1800 ఖాతాలకు సంబం«ధించిన నగదు సుమారు రూ.45 లక్షలు తిరిగి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఆ రైతుల ఖాతాలను మళ్లీ సేకరించి పంపించనున్నారు. ఖాతాల వివరాలు ఇచ్చాం రైతుబంధు పథకం డ బ్బులు ఖాతాలో జ మ అవుతాయంటే వివరాలన్నీ అధికారులకు ఇచ్చాం. ఎన్నికలు ముగిసి మూడు నెలలు అవుతోంది. అయినా ఇంత వరకు మాకు పంట పెట్టుబడి సాయం రాలేదు. ఇకనైనా సారోళ్లు పట్టిం చుకుని పెట్టుబడి సాయం విడుదల చేయాలి. – జి.లక్ష్మయ్య, రైతు, రామచంద్రాపూర్, మహబూబ్‌నగర్ రూరల్ త్వరలో జమ చేస్తాం జిల్లాలోని 2,34,300 మంది రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.276.34 కోట్ల పెట్టుబడి సాయం జమ చేశాం. ఇంకా 27,773 మంది రైతులు తమ అకౌంట్ నంబర్లు ఇవ్వలేదు. వాటి సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అది పూర్తవ్వగానే వీలైనంత త్వరగా మిగిలిన రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తాం. – సుచరిత, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
రబీ ‘బంధు’కు రెడీ..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రైతాంగానికి శుభవార్త. మరో మూడు రోజుల్లో ‘రైతుబంధు’ రెండో విడత సాయం చేతికందనుంది. పంట పెట్టుబడి కింద ఏటా ఎకరాకు రూ.8వేల నగదు ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. రబీ సీజన్‌కు సంబంధించిన చెక్కులను 5వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు చెక్కులను ముద్రించేందుకు సన్నాహాలు చేస్తోంది. రైతుబంధు పథకానికి మే నెలలో శ్రీకారం చుట్టిన సర్కారు.. ఖరీఫ్‌కు సంబంధించిన చెక్కులను అందజేసిన సంగతి తెలిసిందే. తాజాగా రబీ సీజన్ సాయాన్ని పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా తొలి విడతలో 2.87 లక్షల మందికి పెట్టుబడి ప్రోత్సాహకాన్ని అందించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకోగా ఇందులో 2.42 లక్షల మందికి మాత్రమే పంపిణీ చేసింది. వివిధ కారణాలతో మిగతావారికి సంబంధించిన చెక్కులను పెండింగ్‌లో పెట్టింది. ఈ సారి మాత్రం దాదాపు 3లక్షల మంది రైతులకు చెక్కులు జారీ కానున్నాయని వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. అభ్యంతరాలతో గతంలో పక్కనపెట్టిన భూములకు సంబంధించి కొత్తగా పట్టాదార్ పాస్‌పుస్తకాలను జారీ చేసినందున సుమారు 15వేల మంది రైతులు అదనంగా చేరినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌లో రూ.283.28 కోట్లు పంపిణీ చేసిన యంత్రాంగం తాజాగా రూ.300 కోట్ల మేర రైతులకు అందజేయడానికి సన్నద్ధమవుతోంది. మండల కేంద్రాలతో షురూ.. రైతుబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా భావించిన సర్కారు.. పట్టాదార్పాస్పుస్తకాలు, చెక్కులను ఏకకాలంలో పంపిణీ చేసింది. దీంతోపాటు చెక్కుల్లో ముద్రణా లోపాలు తలెత్తకుండా జాగ్రత్తపడింది. ఈ మేరకు రైతుకిచ్చే ప్రతి చెక్కు(లీఫ్)ను సునిశితంగా పరిశీలించింది. ఈ మేరకు నిర్దేశిత బ్యాంకు ప్రధాన కార్యాలయాల్లో వ్యవసాయశాఖాధికారులను అందుబాటులో ఉంచింది. దీంతో నిర్ధిష్ట సమయానికి రైతుల చేతికి సాయం అందింది. ఈ సారి మాత్రం ఈ ఇబ్బందుల నుంచి అధికారులకు విముక్తి కలుగనుంది. ధరణి వెబ్సైట్ నుంచే సమాచారాన్ని సేకరిస్తుండడం.. గతంలో ఒకసారి తప్పులను సరిదిద్దినందున చెక్కులను పరిశీలించే అవకాశంలేకుండా పోయింది. దీంతో వ్యవసాయశాఖాధికారులకు చెక్కుల పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు జిల్లాలోని రైతుల చెక్కుల పంపిణీ సాధ్యపడదు గనుక.. మండల కేంద్రాల్లోని రైతులకు తొలుత చెక్కులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా మండల కేంద్రాల రైతుల చెక్కుల ముద్రణపై దృష్టి సారించింది. ఈ మేరకు వ్యవసాయశాఖకు కూడా సమాచారం అందజేసింది. మండల కేంద్రంలో మొదలుపెట్టి దశలవారీగా గ్రామాలకు విస్తరించాలని నిర్ణయించింది. -
రెండో షెడ్యూల్ కోసం మీసం తీసిన నరసింహారెడ్డి!
ఖైదీ నంబర్ 150తో ఘన విజయం సాధించిన మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రంగా సై రా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా తనయుడు రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. డిసెంబర్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించిన చిత్రయూనిట్, ప్రస్తుతం షూటింగ్ కు గ్యాప్ ఇచ్చింది. ఈ సినిమా యూనిట్ ఫస్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్‌లో పూర్తి చేసింది. మొదట రెండో షెడ్యూల్ ను రాజస్థాన్ లేదా పొలాచ్చిలో జరపాలని అనుకుంది. కానీ తాజా సమాచారం ప్రకారం సైరా నరసింహారెడ్డి రెండో షెడ్యూల్ ను కేరళలో ప్లాన్ చేశారు. వచ్చేనెల మొదటి వారం నుంచి రెండో షెడ్యూల్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ షెడ్యూల్ లో నయనతార కూడా పాల్గొననుందన్న టాక్ వినిపిస్తోంది. మ్యూజిక్ డైరక్టర్ పై ఇంకా క్లారిటీ రాలేదు. రెండో షెడ్యూల్లో మెగాస్టార్ కొత్త లుక్ లో కనిపించనున్నారు. చాలా కాలంగా మీసం, గడ్డంతో కనిపిస్తున్న మెగాస్టార్ తాజాగా క్లీన్ గా షేవ్ చేసుకొని అభిమానులకు దర్శనమిచ్చారు. జువ్వ సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న చిరు.. గెడ్డం, మీసం లేకుండా కనిపించారు. ఈ గెటప్ తోనే చిరంజీవిపై కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. -
రజనీ రిటర్న్స్!
అభిమానులంతా ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మెడికల్ చెకప్ కోసం రజనీకాంత్ అమెరికా వెళ్లిన ప్రతిసారీ... ఇండియాలో అభిమానులు టెన్షన్ పడడం కామన్ అయ్యింది. గత నెలాఖరున రజనీ అమెరికా వెళ్లినప్పుడూ అభిమానులు టెన్షన్ పడ్డారు. రజనీకి అభిమానుల టెన్షన్ అర్థమైనట్లుంది! ఈసారి అమెరికాలో ఉన్నప్పుడు ఓ సెల్ఫీ వీడియో పోస్ట్ చేశారు. దాంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం రజనీకాంత్ ఇండియా తిరిగొచ్చేయడంతో వాళ్లంతా ఫుల్ ఖుషీ. ప్రస్తుతం పా. రంజిత్ దర్శకత్వంలో ‘కాలా’ సినిమా చేస్తున్నారీ హీరో. అమెరికా వెళ్లడానికి ముందు ‘కాలా’ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఈ రోజు (బుధవారం) నుంచి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నారు. -
గోలీసోడాలో మెసేజ్
మానస్, నిత్యా నరేష్, కారుణ్య, అలీ ముఖ్య తారలుగా మల్లూరి హరిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సోడా గోలిసోడా’. ఎస్.బి. ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై భువనగిరి సత్య సింధూజ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ గోదావరి జిల్లాలో కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న సెకండ్ షెడ్యూల్లో ముఖ్య తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హరిబాబు మాట్లాడుతూ – ‘‘పదిమంది హాయిగా నవ్వుకునే విధంగా తెరకెక్కిస్తున్నాం. మరో పది రోజుల్లో సెకండ్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేస్తాం. ఆగస్టులో ఆడియో లాంచ్‌కి ప్లాన్ చేస్తున్నాం. కెమెరామేన్ ముజీర్ మాలిక్ తీసిన ప్రతి ఫ్రేమ్‌లోనూ రిచ్‌నెస్ కనిపిస్తుంది. కథ వినగానే అవకాశం ఇచ్చిన సింధూజగారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘మంచి మేసేజ్‌ని చక్కని కామెడీతో కలిపి సినిమా తీస్తున్నాం. హరిబాబు చాలా క్లారిటీతో సినిమా తీస్తున్నారు. అలీ, కృష్ణభగవాన్, ప్రభాస్ శ్రీను, గౌతంరాజు కామెడీ అందరినీ నవ్విస్తుంది’’ అన్నారు సింధూజ. ‘‘బీడు భూముల్లో కూడా పంటలు పండించవచ్చనే మెయిన్ కాన్సెప్ట్‌తో ఎంటర్టైనింగ్ సినిమా సాగుతుంది’’ అన్నారు నటుడు అలీ. ఈ చిత్రానికి సంగీతం: భరత్, కో–ప్రొడ్యూసర్: భువనగిరి శ్రీనివాస మూర్తి, ఎడిటర్ నందమూరి హరి.