ఫారిన్‌ టూర్‌లో మహేశ్‌.. తివిక్రమ్‌ సినిమా షూటింగ్‌ అప్పుడేనా? | Mahesh Babu, Triviram 2nd Schedule Starts From November | Sakshi
Sakshi News home page

ఫారిన్‌ టూర్‌లో మహేశ్‌.. తివిక్రమ్‌ సినిమా షూటింగ్‌ అప్పుడేనా?

Published Tue, Oct 18 2022 12:39 AM | Last Updated on Tue, Oct 18 2022 10:34 AM

Mahesh Babu, Triviram 2nd Schedule Starts From November - Sakshi

‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత దాదాపు పన్నెండేళ్ల అనంతరం హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ కొత్త సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ ముగిసింది.

ఈ షెడ్యూల్‌లో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఈ నెల 9న ఆరంభం కావాల్సిన ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ వాయిదా పడింది. అనుకోకుండా మహేశ్‌బాబు తల్లి ఇందిరా దేవి మృతి చెందడంతో ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. కాగా నవంబరు మొదటివారంలో ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను ఆరంభించాలనుకుంటున్నారట.

గత వారం ఓ యాడ్‌ షూట్‌లో పాల్గొన్న మహేశ్‌బాబు ప్రస్తుతం ఫారిన్‌ టూర్‌లో ఉన్నారు. మహేశ్‌ తిరిగి హైదరాబాద్‌కు రాగానే ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. ఈ సెకండ్‌ షెడ్యూల్‌లో మహేశ్, పూజాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement