గోలీసోడాలో మెసేజ్‌ | 'Soda Goli Soda' Commences Second Schedule in Hyderabad | Sakshi
Sakshi News home page

గోలీసోడాలో మెసేజ్‌

Published Sun, Jun 25 2017 12:56 AM | Last Updated on Mon, Oct 22 2018 8:14 PM

గోలీసోడాలో మెసేజ్‌ - Sakshi

గోలీసోడాలో మెసేజ్‌

మానస్, నిత్యా నరేష్, కారుణ్య, అలీ ముఖ్య తారలుగా మల్లూరి హరిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సోడా గోలిసోడా’. ఎస్‌.బి. ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై భువనగిరి సత్య సింధూజ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ గోదావరి జిల్లాలో కంప్లీట్‌ అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న సెకండ్‌ షెడ్యూల్లో ముఖ్య తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హరిబాబు మాట్లాడుతూ – ‘‘పదిమంది హాయిగా నవ్వుకునే విధంగా తెరకెక్కిస్తున్నాం. మరో పది రోజుల్లో సెకండ్‌ షెడ్యూల్‌ను కంప్లీట్‌ చేస్తాం. ఆగస్టులో ఆడియో లాంచ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం.

కెమెరామేన్‌ ముజీర్‌ మాలిక్‌ తీసిన ప్రతి ఫ్రేమ్‌లోనూ రిచ్‌నెస్‌ కనిపిస్తుంది. కథ వినగానే అవకాశం ఇచ్చిన సింధూజగారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘మంచి మేసేజ్‌ని చక్కని కామెడీతో కలిపి సినిమా తీస్తున్నాం. హరిబాబు చాలా క్లారిటీతో సినిమా తీస్తున్నారు. అలీ, కృష్ణభగవాన్, ప్రభాస్‌ శ్రీను, గౌతంరాజు కామెడీ అందరినీ నవ్విస్తుంది’’ అన్నారు సింధూజ. ‘‘బీడు భూముల్లో కూడా పంటలు పండించవచ్చనే మెయిన్‌ కాన్సెప్ట్‌తో ఎంటర్‌టైనింగ్‌ సినిమా సాగుతుంది’’ అన్నారు నటుడు అలీ. ఈ చిత్రానికి సంగీతం: భరత్, కో–ప్రొడ్యూసర్‌: భువనగిరి శ్రీనివాస మూర్తి, ఎడిటర్‌ నందమూరి హరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement