వినోదాల సోడా | Producer Sindhuja Bhuvanagiri @ Soda Goli Soda Movie Trailer | Sakshi
Sakshi News home page

వినోదాల సోడా

Published Fri, Feb 16 2018 3:07 AM | Last Updated on Mon, Oct 22 2018 8:14 PM

Producer Sindhuja Bhuvanagiri @ Soda Goli Soda Movie Trailer - Sakshi

మల్లూరి హరిబాబు, సత్య సింధుజ, శ్రీనివాసమూర్తి, మానస్‌

హీరో హీరోయిన్స్‌గా మల్లూరి హరిబాబు దర్శకత్వంలో భువనగిరి సత్య సింధుజ నిర్మించిన చిత్రం ‘సోడ గోలీసోడ’. ఈ సినిమా ఇవాళ విడుదల కానుంది. ఈ సందర్భంగా సత్య సింధుజ మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్‌లో వస్తున్న ఫస్ట్‌ సినిమా. కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌. మెసేజ్‌ ఓరియంటెడ్‌ మూవీ కాబట్టి ఆడియన్స్‌ ఆదరిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘కుటుంబం మొత్తం కలిసి చూడాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశాం. హీరో, హీరోయిన్‌ ఎంతో ఇష్టంతో కష్టపడి చేశారు.

సినిమా రిలీజ్‌ కావాలంటే ప్రొడ్యూసర్స్‌ సపోర్ట్‌ కావాలి. ప్రొడ్యూసర్స్‌ మంచి సపోర్ట్‌ ఇచ్చారు’’ అన్నారు హరిబాబు. మానస్‌ మాట్లాడుతూ – ‘‘టీమ్‌ సపోర్ట్‌ ఉంటే సినిమా బాగా వస్తుందని ఈ సినిమాతో ప్రూవ్‌ అయింది. నన్ను హీరోగా సెలెక్ట్‌ చేసుకున్న దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘మంచి సినిమాను ఆడియన్స్‌ ఆదరించాలని దర్శక–నిర్మాతలు సినిమా తీశారు. అందరూ కష్టపడి చేశారు. సినిమాలో మంచి రోల్‌ ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు’’ అన్నారు  కృష్ణ భగవాన్‌. ఈ చిత్రానికి సహనిర్మాత: భువనగిరి శ్రీనివాసమూర్తి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement