రజనీ రిటర్న్స్‌! | Every time Rajinikanth went to America ... fans in India tension | Sakshi
Sakshi News home page

రజనీ రిటర్న్స్‌!

Published Tue, Jul 11 2017 11:21 PM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM

రజనీ రిటర్న్స్‌!

రజనీ రిటర్న్స్‌!

అభిమానులంతా ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మెడికల్‌ చెకప్‌ కోసం రజనీకాంత్‌ అమెరికా వెళ్లిన ప్రతిసారీ... ఇండియాలో అభిమానులు టెన్షన్‌ పడడం కామన్‌ అయ్యింది. గత నెలాఖరున రజనీ అమెరికా వెళ్లినప్పుడూ అభిమానులు టెన్షన్‌ పడ్డారు. రజనీకి అభిమానుల టెన్షన్‌ అర్థమైనట్లుంది! ఈసారి అమెరికాలో ఉన్నప్పుడు ఓ సెల్ఫీ వీడియో పోస్ట్‌ చేశారు.

దాంతో ఫ్యాన్స్‌ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం రజనీకాంత్‌ ఇండియా తిరిగొచ్చేయడంతో వాళ్లంతా ఫుల్‌ ఖుషీ. ప్రస్తుతం పా. రంజిత్‌ దర్శకత్వంలో ‘కాలా’ సినిమా చేస్తున్నారీ హీరో. అమెరికా వెళ్లడానికి ముందు ‘కాలా’ ఫస్ట్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌ చేశారు. ఈ రోజు (బుధవారం) నుంచి సెకండ్‌ షెడ్యూల్‌ స్టార్ట్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement