న్యూఢిల్లీ: చెక్ బౌన్స్ కేసుల వల్ల కోర్టుల్లో రోజువారీగా పరిశీలించాల్సిన వ్యాజ్యాలకు ఆటంకం ఏర్పడుతోందని, ఫలితంగా చాలా వ్యాజ్యాలు అపరిష్కృతంగా మిగిలి పోతున్నాయని, అందువల్ల చెక్ బౌన్స్ కేసులను తీవ్రంగా పరిగణించాల్సి ఉందని ఢిల్లీ కోర్టు అభిప్రాయపడింది. ఢిల్లీకి చెందిన లలిత్ కుమార్ అనే వ్యక్తి ఓ ఆర్మీ జవాన్ భార్యకు లక్ష రూపాయల చెక్కు జారీ చేశాడు. అయితే, అది బౌన్స్ అయింది. దీంతో ఆమె కోర్టును ఆశ్రయిం చింది.
ఈ మేరకు ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అశోక్ కుమార్ సోమవారం కేసు విచారణ చేపట్టారు. ఈ కేసులో ఆర్మీ జవాన్ భార్యకు 1.5 లక్షల జరిమానా చెల్లించాలని తీర్పు చెప్పారు. చెక్కుల జారీలో నిజాయితీ లోపించడం వల్ల వాటి విశ్వసనీయత దెబ్బతింటోందని పేర్కొన్నారు. చెక్కు జారీలో నిజాయితీ లోపించడం, కోర్టుల విలు వైన సమయాన్ని వృథా చేయడమే కాకుండా ఫిర్యాదు దారు రాలి డబ్బును తన వద్ద ఉంచుకొని ఆమెను వేధింపులకు గురి చేశారని మేజిస్ట్రేట్ పేర్కొన్నారు.