లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన అలోక్ మిశ్రాకు టెన్త్‌క్లాస్ పరీక్షల్లో రాష్ట్రంలో ఏడో ర్యాంకు వచ్చింది. అతని ప్రతిభను గుర్తించిన యూపీ సర్కార్ అలోక్‌ను అభినందించింది. ప్రతిభ చూపిన విద్యార్థులను సత్కరించేందుకు లక్నోలో ఓ సమావేశంలో సీఎం ఆదిత్యనాథ్ స్వయంగా లక్ష రూపాయల చెక్(నంబర్ 974926)ను అలోక్‌కు ప్రదానం చేశారు. లక్ష రూపాయలు వచ్చిన ఆనందంలో అలోక్ సీఎం అందించిన చెక్‌ను జూన్ 5న హజ్రత్‌గంజ్‌లోని దేనా బ్యాంకులో క్రెడిట్ చేశాడు.
చెక్ క్లియర్ అయి డబ్బులు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూశాడు. కానీ అకౌంట్లో డబ్బులు రాకపోగా అతనికి పెనాల్టీ కూడా పడింది. దీంతో బ్యాంకు అధికారుల్ని ఆశ్రయించగా సీఎం ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని అసలు విషయం చెప్పారు. బారబంకి జిల్లా స్కూల్ ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్ యాదవ్ చెక్‌పై చేసిన సంతకంలో వ్యత్యాసం ఉండటంతోనే బౌన్స్ అయిందన్న అధికారులు.. అలోక్‌కు జరిమానా విధించారు. కాగా, అలోక్‌కి కొత్త చెక్ జారీ చేశామని రాజ్‌కుమార్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment