chife minister
-
నారా లోకేష్ కోసమేనా ఈ క్లియరెన్స్ అంతా!
ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గం కూర్పు గమనిస్తే తెలుగుదేశం పార్టీలో తరం మారుతోందన్న స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లు అనిపిస్తుంది. బహుశా ఈ టరమ్ లోనే చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ను ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉండవచ్చనిపిస్తుంది. దానికి తగ్గట్లుగా కొత్త టీమ్ ను తయారు చేసే ప్రక్రియ ఆరంభించినట్లు విశ్లేషణలు వస్తున్నాయి. అందుకే తొలివిడత ఎన్నికైన ఎమ్మెల్యేలు పలువురికి మంత్రి పదవులు ఇచ్చారని అభిప్రాయపడుతున్నారు. తద్వారా లోకేష్ కు సొంత టీమ్ తయారు అవుతుందని అంటున్నారు. ముఖ్యంగా 1995లో ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేసిన సందర్భంలో అత్యంత కీలకభూమిక పోషించిన యనమల రామకృష్ణుడుకు ప్రస్తుత మంత్రివర్గంలో చాన్స్ ఇవ్వకపోవడం గమనార్హం. యనమల ఎమ్మెల్సీగా ,మండలిలో ఇంతకాలం ప్రతిపక్షనేతగా ఉన్నారు. ఆయన కుమార్తె దివ్య తుని నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ రకంగా కూడా ఒక తరం మారినట్లు లెక్క. యనమల 1999,2014 టరమ్ ల లో ఆర్ధిక మంత్రిగా పనిచేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా పేరొందారు. 1983 లో పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన కీలకంగా ఉన్నారు. అలాగే 1983 లో శాసనసభకు ఎన్నికైన బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రుడు, ఆ తర్వాత కాలంలో ఎమ్మెల్యేలు అయిన గద్దె రామ్మోహన్, ధూళిపాళ్ల నరేంద్ర,జ్యోతుల నెహ్రూ వంటివారికి కూడా అవకాశం దక్కలేదు. ఎంత సీనియర్లు యినా అందరికి అవకాశాలు రావడం కష్టమే.కాని ఓవరాల్ గా చూసినప్పుడు మంత్రివర్గ స్వరూపాన్ని బట్టి ఈ విశ్లేషణలు వస్తాయి. అప్పట్లో యువకులే అయినా, ప్రస్తుతం వీరంతా వృద్దాప్యానికి చేరువ అవడాన్ని కూడా కొట్టిపారేయలేం. 1985లో తొలిసారి ఎన్నికై టీడీపీలోనే కొనసాగుతున్న ఎన్ ఎమ్ డి ఫరూక్ కు ఈ సారి కూడా మంత్రి పదవి వచ్చింది. విశేషంగా 1983లో టిడిపిలో ఉండి,1989 నుంచి కాంగ్రెస్ లో,తిరిగి 2014 టరమ్ లో టీడీపీలో, 2019లో వైఎస్సార్సీపీలో ఉండి, 2024 ఎన్నికల నాటికి టీడీపీలో చేరిన నెల్లూరు జిల్లా నేత ఆనం రామనారాయణరెడ్డికి చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కడం ఆసక్తికరంగా ఉంది. ఇదీ చదవండి: ఏపీలో ఏ శాఖ ఎవరికి?.. కొనసాగుతున్న లీక్స్మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి కుమారుడు ,కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టీడీపీ లో చేరి ఈసారి ఢోన్ లో గెలిచారు. అయినా ఆయనకు మంత్రి చాన్స్ రాలేదు. మరో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కు, చంద్రబాబుకు మధ్య ఉప్పు,నిప్పుగా ఉంటుంది. కాని భాస్కరరావు కుమారుడు మనోహర్ జనసేన తరపున గెలిచి చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి కావడం ఇంకో ప్రత్యేకత. ఇతర కోణాలను పరిశీలిస్తే, గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాబినెట్ కూర్పునకు ఈ క్యాబినెట్ కు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది. అప్పట్లో జగన్ బలహీనవర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వగా, చంద్రబాబు ఆ స్థాయిలో ప్రాముఖ్యత ఇవ్వలేకపోయారు. జగన్ ఐదుగురికి,అందులో నలుగురు బలహీనవర్గాలవారికి ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయించగా,చంద్రబాబు క్యాబినెట్ లో ఆ అవకాశం ఉండదు..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి లభించనుంది. ఆయనకు కాకుండా ఇతరులకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే ప్రాధాన్యత తగ్గించినట్లవుతుందని భావించి ఇలా చేశారట. జగన్ అధికారంలోకి రాగానే ఏభైశాతం మందికి బలహీనవర్గాలవారికి మంత్రి పదవులు ఇచ్చి, తదుపరి పునర్వ్యవస్థీకరణలో దానిని అరవై ఎనిమిది శాతానికి పెంచారు. ఆయన క్యాబినెట్ లో ఎస్సి,ఎస్టి, బిసి,మైనార్టీ వర్గాల వారు పదిహేడు మంది ఉండేవారు. ప్రస్తుతం చంద్రబాబు టీమ్ లో ఆ సంఖ్య పన్నెండుగానే ఉంది. జగన్ ఐదుగురు ఎస్సిలకు పదవులు ఇవ్వగా,ఇప్పుడు ఇద్దరికే అవకాశం వచ్చింది. జగన్ బిసిలు పదకుండు మందికి చాన్స్ ఇస్తే, చంద్రబాబు ఎనిమిది మందికే ఇచ్చారు.అప్పట్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన ఒకరు కొంతకాలం మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం నలుగురు కమ్మ నేతలకు మంత్రిపదవులు దక్కాయి. కాపులకు సంబంధించి అప్పటి మాదిరే నలుగురికి అవకాశం వచ్చింది. అప్పట్లో రెడ్లు నలుగురు ఉంటే,చంద్రబాబు వద్ద ముగ్గురు రెడ్లకే పదవులు దక్కాయి. స్థూలంగా చూస్తే అగ్రవర్ణాలకు చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇవ్వక తప్పలేదు.జనసేన నుంచి ముగ్గురికి అవకాశం వస్తే ఇద్దరు కాపు,ఒక కమ్మ నేతకు పదవులు వచ్చాయి. బీజేపీ ఒక బిసి కి మంత్రి పదవి ఇచ్చింది. 2014 టరమ్ లో నలుగురు బిజెపి ఎమ్మెల్యేలు ఉంటే ఇద్దరికి మంత్రి పదవులు కట్టబెట్టారు. కాని ఈ టరమ్ లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా, ప్రస్తుతానికి ఒకరికే అవకాశం ఇచ్చారు. కేంద్రంలో తాను ఆశించినన్ని పదవులు మోడీ ఇవ్వలేదన్న అసంతృప్తితో ఏమైనా ఇలా చేశారా?లేక మరో స్థానం ఖాళీగా ఉంది కనుక ,బీజేపీకి రిజర్వు చేసి ఉంచారా అన్నది చూడాల్సి ఉంటుంది. చంద్రబాబు పదమూడు మంది అగ్రవర్ణాల వారికి పదవులు ఇచ్చారు. తొలిసారి మంత్రి పదవులు పొందినవారి సంఖ్య పదహారుగా ఉండడం విశేషం. వీరిలో మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన ఏడుగురికి పదవులు రావడం విశేషం.కాగా గతంలో ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రి పదవులు నిర్వహించిన ఇద్దరు లోకేష్, పి.నారాయణలు ఈసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికై మంత్రి పదవులు పొందారు.వైఎస్సార్సీపీ నుంచి టీడీపీ లోకి వెళ్లిన ఇద్దరు ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్ధసారధిలకు చంద్రబాబు క్యాబినెట్ లో అవకాశం రావడం విశేషం. కింజరపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర,పి.నారాయణ,ఫరూఖ్ , రామనారాయణరెడ్డి, పార్ధసారధి,లోకేష్ లకు మంత్రి పదవులు చేసిన అనుభవం ఉంది.నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ ప్రభుత్వ టైమ్ లో డిప్యూటి స్పీకర్, స్పీకర్ పదవులు చేశారు. పవన్ కళ్యాణ్ తో సహా వంగలపూడి అనిత,సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, డోలా వీరాంజనేయ స్వామి,గొట్టిపాటి రవి,కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బిసి జనార్ధనరెడ్డి, టిజి భరత్, ఎస్.సవిత,వాసంశెట్టి సుభాష్,కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లె రాంప్రసాదరెడ్డి లు తొలిసారి మంత్రులు అయ్యారు. వీరిలో పయ్యావుల కేశవ్ తొలిసారి 1994 లో శాసనసభకు ఎన్నికయ్యారు. ఇంతకాలం టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈయన ఓటమిపాలవడం, లేదా ఈయన గెలిచినప్పుడు టీడీపీ అధికారంలోకి రాకపోవడం జరుగుతుండేది. ఈసారి ఆ ఇబ్బంది రాలేదు. గొట్టిపాటి రవి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, తదుపరి 2014లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఉండేవారు. వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు టీడీపీలోకి వెళ్లి 2019లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు. ఈసారి మంత్రి పదవి పొందగలిగారు. సత్యకుమార్ యాదవ్ పూర్వం బీజేపీ అగ్రనేతలలో ఒకరైన ఎమ్..వెంకయ్య నాయుడు వద్ద పిఎ గా జీవితాన్ని ఆరంభించి, ఆ తర్వాత నేరుగా అమిత్ షా అండతో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అయ్యారు. ఈ విడత బీజేపీ టిక్కెట్ పొంది, గెలిచి మంత్రి కాగలిగారు.రాజకీయ రంగం ప్రవేశం చేసిన తర్వాత ఓటమి ఎరుగని గంటా శ్రీనివాసరావుకు కూడా మంత్రి పదవి రాలేదు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన మరో నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి పదవి హామీ ఉందని చెబుతారు. కాని ఆయనకు ఇవ్వకుండా ఆనం వైపు మొగ్గు చూపారు.బీజేపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన మరో సీనియర్ నేత ఆరుసార్లు ఎన్నికైన కన్నా లక్ష్మీనారాయణకు కూడా చాన్స్ రాలేదు. సహజంగానే మంత్రి పదవులు దక్కని సీనియర్లకు కొంత అసంతృప్తి ఉంటుంది. అది ఇప్పటికిప్పుడు బహిర్గతం కాకపోయినా, భవిష్యత్తులో వెల్లడి కావచ్చు. మంత్రి పదవులు ఇవ్వడం అన్నది ఒక సవాలు.అందరిని సంతృప్తిపరచడం ఏ సీఎం వల్ల కాదు. బలహీనవర్గాలవారికి ఆశించిన రీతిలో పదవులు రాలేదన్న భావన ప్రచారం కాకుండా జాగ్రత్త పడడంలో చంద్రబాబు నేర్పరే అయినప్పటికీ, జగన్ క్యాబినెట్‌తో ఈ విషయంలో అంతా పోల్చుకుంటారని చెప్పకతప్పదు.లోకేష్ సహజంగానే మంత్రివర్గంలో తన ముద్ర ఉండాలని కోరుకుంటారు.అందుకు తగ్గట్లుగానే చంద్రబాబు మంత్రుల ఎంపిక చేసి ఉండవచ్చు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఉన్న పలువురు కీలక నేతలకు మంత్రులుగా అవకాశం రాకపోవడం తరం మార్పునకు ఒక సూచనగా పరిగణిస్తున్నారు. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఏపీ: ట్రాఫిక్ ఆర్ఎస్ఐకు అరుదైన గౌరవం
సాక్షి, అమరావతి: మహిళ ప్రాణాలు రక్షించిన ట్రాఫిక్ ఆర్ఎస్ఐ అర్జున్‌రావుకు అరుదైన గౌరవం దక్కింది. "ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శౌర్య పతకం" ప్రభుత్వం ప్రకటించింది. ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ గౌతమ్ సవాంగ్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన "దిశ"పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. "దిశ"పై మహిళా పోలీసులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ దిశానిర్దేశం చేశారు. ఇంటింటికి వెళ్లి మహిళల ఫోన్లలో దిశయాప్‌ను డౌన్లోడ్ చేసి అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని డీజీపీ ఆదేశించారు. చదవండి: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు ఏపీ మరో కీలక నిర్ణయం: వారిక మహిళా పోలీసులు -
16 ఎంపీ సీట్లు మనవే
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘనవిజయం సాధిస్తుందని ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓట్ల శాతం ఐదు నుంచి పది శాతం వరకు అదనంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో టీఆర్ఎస్ 16, ఎంఐఎం ఒక స్థానంలో గెలుస్తాయన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై చర్చించేందుకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం గురువారం ఇక్కడ ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన రెండు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కేంద్రం వద్ద పెండింగ్ అంశాల పరిష్కారం, లోక్‌సభ ఎన్నికలపై టీఆర్ఎస్ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ‘వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలను మనమే గెలవాలి. దీని కోసం ఇప్పటి నుంచే అన్ని రకాలుగా సిద్ధం కావాలి. మీ పరిధిలో ఎక్కడెక్కడ లోపాలున్నాయో మీకు తెలుసు. వాటిని వెంటనే సరిచేసుకోవాలి. ఎమ్మెల్యేలు మీ కంటే తక్కువ స్థాయి అయినా మీ గెలుపు కోసం తిరిగేది వారే. వారితో సమన్వయంగా ఉండాలి. కలసి పనిచేయాలి. అందరితో మంచిగా మాట్లాడితే పోయేదేమీ ఉండదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిస్థితిని వెంటనే చక్కదిద్దుకోవాలి. తుమ్మ ల నాగేశ్వర్రావు, మిగిలిన ముఖ్యలు కలసి మాట్లాడుకోండి. లోక్‌సభ ఎన్నికలు మనకు పూర్తి అనుకూలంగా ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికల్లో మన పార్టీ ఓట్ల శాతం 5 నుంచి 10 శాతం వరకు పెరుగుతుంది. ఫలితాలు ఎలా ఉంటా యో మనకు సమాచారం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కొంచెం ఇబ్బందిగా ఉన్న ఏడు స్థానాలను ముందే గుర్తించి అభ్యర్థులను మార్చాం. అన్ని స్థానాల్లో గెలిచాం. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం పనిచేయండి. మనదే గెలుపు’అని కేసీఆర్ అన్నారు. పెండింగ్ అంశాలపై పోరాటం: జితేందర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన పెండింగ్ అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని నిర్ణయించినట్లు టీఆర్ఎస్ లోక్‌సభాపక్షనేత ఎ.పి.జితేందర్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం జితేందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ ఏర్పాటు అంశం సహా అన్ని విషయాలపై కేంద్రాన్ని నిలదీస్తాం. బైసన్ పోలో గ్రౌండ్‌ను సచివాలయం కోసం వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తాం. అనేక పెండింగ్ అంశాలపై ఇప్పటికే సీఎం కేసీఆర్ 33 సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్రానికి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదు. 52 అంశాలపై జాతీయ స్థాయిలో పోరాడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖల వద్దకు వెళ్లి మరోసారి వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు. జనవరి 1 నాటికి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కావాల్సి ఉంది. ఈ విషయంలో జాప్యం చేయడంపై కేంద్రాన్ని నిలదీయాలని కేసీఆర్ ఆదేశించారు’అని కేసీఆర్ అన్నారు. సమస్యలపై పోరాటం.. ‘కేంద్ర ప్రభుత్వం ఏ విషయంలోనూ స్పందించడంలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అంశాలపైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. బీజేపీ మంత్రులు మాత్రం ఎన్నికల్లో ఇక్కడికి వచ్చి అబద్ధాలు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేంద్రానికి లేఖలు రాస్తే రా యలేదని చెప్పారు. ఎంపీలందరూ కలసి ఢిల్లీ లో మీడియా సమావేశం నిర్వహించి మనం రాసిన లేఖలను విడుదల చేయండి. రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంట్లో గట్టిగా పట్టుబట్టాలి. సాగునీటి ప్రాజెక్టుల కు కేంద్రం నుంచి నిధులు రాబట్టే విషయంలో గట్టిగా కొట్లాడాలి. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేసే ప్రతిపాదనపైనా పార్లమెంట్లో పోరాడాలి. కేంద్రం ఏ విషయంలో ఎలా నిర్లక్ష్యంగా ఉందో ఎండగట్టాలి. రాష్ట్రానికి సంబం ధించిన 52 అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. పునర్విభజనలో పెట్టినవి గట్టిగా అడగాలి. సోమవారం నుంచి అధికారులు మీకు ఢిల్లీలో అందుబాటులో ఉంటారు. కొన్ని రోజల తర్వాత నేను ఢిల్లీకి వస్తా. పార్లమెంట్ సమావేశాలు జరిగే రోజుల్లోనే వస్తా. అన్ని సమస్యలను పరిష్కరించుకునేలా ప్రయత్నాలను గట్టిగా కొనసాగించాలి’అని కేసీఆర్ అన్నారు. పుస్తక ప్రేమికుల మన్ననలు పొందుతుంది ‘బుక్‌ఫెయిర్’పై సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15 నుంచి 25 వరకు నిర్వహించనున్న 32వ ‘బుక్ ఫెయిర్’ పుస్తక ప్రేమికుల మన్ననలు పొందుతుందని సీఎం కేసీఆర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ భాషా, సాంస్కృతికశాఖ సహకారం తో హైదరాబాద్‌లోని దోమల్‌గూడలో ఉన్న తెలంగాణ కళాభారతి వేదికగా జరగనున్న బుక్ ఫెయిర్ శనివారం ప్రారంభం కానుంది. గురువారం రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కె.చంద్రశేఖర్‌రావును ప్రగతి భవన్లో కలిసి అభినందనలు తెలుపుతున్న రాష్ట్ర ఆర్థిక సంఘం అధ్యక్షుడు జి.రాజేశం గౌడ్ -
ముఖ్యమంత్రి చెక్ బౌన్స్ అయ్యింది
లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన అలోక్ మిశ్రాకు టెన్త్‌క్లాస్ పరీక్షల్లో రాష్ట్రంలో ఏడో ర్యాంకు వచ్చింది. అతని ప్రతిభను గుర్తించిన యూపీ సర్కార్ అలోక్‌ను అభినందించింది. ప్రతిభ చూపిన విద్యార్థులను సత్కరించేందుకు లక్నోలో ఓ సమావేశంలో సీఎం ఆదిత్యనాథ్ స్వయంగా లక్ష రూపాయల చెక్(నంబర్ 974926)ను అలోక్‌కు ప్రదానం చేశారు. లక్ష రూపాయలు వచ్చిన ఆనందంలో అలోక్ సీఎం అందించిన చెక్‌ను జూన్ 5న హజ్రత్‌గంజ్‌లోని దేనా బ్యాంకులో క్రెడిట్ చేశాడు. చెక్ క్లియర్ అయి డబ్బులు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూశాడు. కానీ అకౌంట్లో డబ్బులు రాకపోగా అతనికి పెనాల్టీ కూడా పడింది. దీంతో బ్యాంకు అధికారుల్ని ఆశ్రయించగా సీఎం ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని అసలు విషయం చెప్పారు. బారబంకి జిల్లా స్కూల్ ఇన్స్పెక్టర్ రాజ్‌కుమార్ యాదవ్ చెక్‌పై చేసిన సంతకంలో వ్యత్యాసం ఉండటంతోనే బౌన్స్ అయిందన్న అధికారులు.. అలోక్‌కు జరిమానా విధించారు. కాగా, అలోక్‌కి కొత్త చెక్ జారీ చేశామని రాజ్‌కుమార్ చెప్పారు. -
త్రిపుర కొత్త సీఎం విప్లవ్!
అగర్తలా: త్రిపుర తదుపరి ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విప్లవ్ కుమార్ దేవ్ నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ–ఐపీఎఫ్టీ (ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర) కూటమి ఎమ్మెల్యేలు మంగళవారం సమావేశమై తమ ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ హాజరవనున్నారు. విప్లవ్ మాట్లాడుతూ ‘నేను ఇంకా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నిక కాలేదు. మాణిక్‌ను కలసి ఆశీర్వాదం తీసుకున్నాను’ అని చెప్పారు. త్రిపురలో పుట్టి పెరిగిన విప్లవ్ తన గ్రాడ్యుయేషన్ అనంతరం ఢిల్లీ వెళ్లి 16 ఏళ్లు ఆరెస్సెస్‌లో పనిచేశారు. అనంతరం 2015లో త్రిపురకు తిరిగొచ్చి బీజేపీలో కీలక బాధ్యతలు చేపట్టారు. 2016లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. గతేడాది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు. విప్లవ్ సీఎంగా ఈనెల 8న ప్రమాణం చేసే అవకాశముంది. మాణిక్ సర్కార్ రాజీనామా శాసనసభ ఎన్నికల్లో ఓడిపోవడంతో త్రిపుర ప్రస్తుత సీఎం మాణిక్ సర్కార్ తన పదవికి రాజీనామా చేశారు. మాణిక్ ఆదివారం గవర్నర్ తథాగత రాయ్‌ని కలసి తన రాజీనామా లేఖను సమర్పించారు. 1998 నుంచీ త్రిపుర సీఎంగా ఉన్న మాణిక్ సర్కార్.. బీజేపీ కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకునే వరకు పదవిలో కొనసాగుతారు. త్రిపురలో 59 స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీజేపీ–ఐపీఎఫ్టీ కూటమి 43, సీపీఎం 16 సీట్లు గెలుపొందడం తెలిసిందే. కాగా, మంత్రివర్గంలో తమ పార్టీకి గౌరవనీయమైన ప్రాతినిధ్యం కల్పించాలని బీజేపీని ఐపీఎఫ్టీ కోరింది. బీజేపీ 35 స్థానాల్లో గెలవడంతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే స్థితిలో ఉంది. అటు ఐపీఎఫ్టీ 9 స్థానాల్లో పోటీచేసి 8 చోట్ల గెలిచింది. కాంగ్రెస్‌తో పొత్తుపై పునరాలోచన.. జనవరిలో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశం జరిగినప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ, భవిష్యత్తులో కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తులూ ఉండకూదంటూ పార్టీ శ్రేణులు అప్పట్లో ఓ ముసాయిదా తీర్మానం కూడా చేశాయి. వచ్చే నెలలో సీపీఎం మహాసభలు జరగనున్నాయి. ఇప్పుడు త్రిపురలో ఓటమి నేపథ్యంలో ఆ తీర్మానాన్ని వెనక్కు తీసుకునే అవకాశముంది. ‘కాంగ్రెస్‌తో పొత్తులు, సర్దుబాట్లు ఉండకూడదని గతంలో నిర్ణయించాం. కానీ ఇప్పుడు పునరాలోచించాల్సిన అవసరం ఉంది’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు హన్నన్ మొల్లా చెప్పారు. -
వేరే రాష్ట్రాల్లో ఆకస్మిక పర్యటనలు వద్దు
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలాంటి సమాచారం లేకుండా వేరే రాష్ట్రాల్లో అకస్మాత్తుగా పర్యటిస్తుండటంపై కేంద్ర హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పర్యటనల వల్ల సదరు సీఎంలకు భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రులందరికీ తెలియజేయాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. ముందుగా సమాచారం ఇస్తే ఆతిథ్య సీఎంకు తగిన భద్రత కల్పించడం వీలవుతుందని తెలిపింది. సీఎంలకు జెడ్(22 మందితో), జెడ్ ప్లస్(55 మందితో) భద్రత కల్పిస్తారు. -
గజ్వేల్‌లో ఎడ్యుకేషన్ హబ్
- ఉత్తర్వులు జారీ - సీఎం హామీ మేరకు.. - బాలురు, బాలికలకు వేర్వేరుగా గజ్వేల్:గజ్వేల్ నగర పంచాయతీలో బాలికలు, బాలురకు వేర్వేరుగా ఎడ్యుకేషన్ హబ్‌లు ఏర్పాటు కానున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 12న తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన కేసీఆర్ ప్రత్యేకించి గజ్వేల్ నగర పంచాయతీకి కొత్తరూపు తీసుకురావాలని నిర్ణయించిన విషయం తెల్సిందే. ప్రస్తుతమున్న విద్యాసంస్థలను ఒకే సముదాయానికి మార్చడానికి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చిన విషయం కూడా విదితమే. ఈ మేరకు బాలికలకు, బాలురకు వేర్వేరుగా ఎడ్యుకేషన్ హబ్‌ల నిర్మాణానికి జీఓలు విడుదలయ్యాయి. టెన్త్ నుంచి పీజీ వరకు వీరికి అవసరమయ్యే విద్యా సంస్థలను హబ్‌లలో నెలకొల్పనున్నారు. బాలికల కోసం ప్రత్యేకంగా గురుకుల డిగ్రీ కళాశాల కూడా ఇందులో ఉంది. ఈ హబ్‌ల నిర్మాణం కోసం రూ.25 కోట్లు మంజూరు చేశారు. ఇందుకోసం అవసరమయ్యే స్థలాలను పరిశీలించేందుకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బుధవారం గజ్వేల్‌కు రానున్నారు. జీఓలు విడుదలైన విషయాన్ని ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు ధ్రువీకరించారు.