
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలాంటి సమాచారం లేకుండా వేరే రాష్ట్రాల్లో అకస్మాత్తుగా పర్యటిస్తుండటంపై కేంద్ర హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పర్యటనల వల్ల సదరు సీఎంలకు భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రులందరికీ తెలియజేయాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. ముందుగా సమాచారం ఇస్తే ఆతిథ్య సీఎంకు తగిన భద్రత కల్పించడం వీలవుతుందని తెలిపింది. సీఎంలకు జెడ్(22 మందితో), జెడ్ ప్లస్(55 మందితో) భద్రత కల్పిస్తారు.