cm Adityanath Yogi
-
అలహాబాద్.. ఇకపై ప్రయాగ్‌రాజ్!
అలహాబాద్: చారిత్రక నగరం అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై సీఎం ఆదిత్యనాథ్ మాట్లాడారు. విస్తృత ఏకాభిప్రాయం తర్వాతే అలహాబాద్ పేరును మారుస్తాం. ప్రయాగ్‌రాజ్‌గా మార్చాలన్నది ఎక్కువ మంది ప్రజల ఆకాంక్ష. అందరూ అంగీకరిస్తే ప్రయాగ్‌రాజ్‌గా మారుస్తాం’ అని తెలిపారు. ఈ మేరకు సీఎం పంపించిన ప్రతిపాదనలకు గవర్నర్‌తో పాటు కేంద్రం కూడా ఆమోద ముద్ర వేసింది. వచ్చే ఏడాది జనవరిలో ఇక్కడ జరగనున్న కుంభమేళాకు ముందుగానే కొత్తపేరు ప్రయాగ్‌రాజ్‌ను ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. 16వ శతాబ్దంలో మొఘలు చక్రవర్తి అక్బర్ ఇక్కడి గంగా–యమున కలిసే సంగమ ప్రాంతంలో కోటను నిర్మించాడు. ఆ కోటకు, పరిసర ప్రాంతానికి కలిపి ఇలాహాబాద్ అని పేరు పెట్టాడు. కుంభమేళా జరిగే సంగమ ప్రాంతాన్ని ప్రయాగ్ అనే పేరుతోనే ఇప్పటికీ పిలుస్తున్నారు. -
ముఖ్యమంత్రి చెక్ బౌన్స్ అయ్యింది
లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన అలోక్ మిశ్రాకు టెన్త్‌క్లాస్ పరీక్షల్లో రాష్ట్రంలో ఏడో ర్యాంకు వచ్చింది. అతని ప్రతిభను గుర్తించిన యూపీ సర్కార్ అలోక్‌ను అభినందించింది. ప్రతిభ చూపిన విద్యార్థులను సత్కరించేందుకు లక్నోలో ఓ సమావేశంలో సీఎం ఆదిత్యనాథ్ స్వయంగా లక్ష రూపాయల చెక్(నంబర్ 974926)ను అలోక్‌కు ప్రదానం చేశారు. లక్ష రూపాయలు వచ్చిన ఆనందంలో అలోక్ సీఎం అందించిన చెక్‌ను జూన్ 5న హజ్రత్‌గంజ్‌లోని దేనా బ్యాంకులో క్రెడిట్ చేశాడు. చెక్ క్లియర్ అయి డబ్బులు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూశాడు. కానీ అకౌంట్లో డబ్బులు రాకపోగా అతనికి పెనాల్టీ కూడా పడింది. దీంతో బ్యాంకు అధికారుల్ని ఆశ్రయించగా సీఎం ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని అసలు విషయం చెప్పారు. బారబంకి జిల్లా స్కూల్ ఇన్స్పెక్టర్ రాజ్‌కుమార్ యాదవ్ చెక్‌పై చేసిన సంతకంలో వ్యత్యాసం ఉండటంతోనే బౌన్స్ అయిందన్న అధికారులు.. అలోక్‌కు జరిమానా విధించారు. కాగా, అలోక్‌కి కొత్త చెక్ జారీ చేశామని రాజ్‌కుమార్ చెప్పారు. -
అలాంటివాళ్లను ఎన్కౌంటర్లో లేపేయటమే!
ఘజియాబాద్ : నేరస్థులను జైలుకు పంపటం లేదా ఎన్కౌంటర్లో కాల్చి చంటమే సరైన పనని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అభిప్రాయపడ్డారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్న తరుణంలో శనివారం రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీలో ఆయన నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక యూపీలో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయని.. నేరాలు తగ్గి పరిస్థితి చాలా మెరుగైందని ఆయన చెప్పారు. ఒకప్పుడు ఇక్కడ నేరాలను తట్టుకోలేక వర్తక వ్యాపారస్థులు, యువత ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. కానీ, 2017 మార్చి తర్వాత(ఆదిత్యానాథ్ పగ్గాలు చేపట్టాక) లా అండ్ ఆర్డర్ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆదిత్యానాథ్ అన్నారు. ‘‘అధికారంలోకి వచ్చాక నేరాలను అదుపు చేయటమే ప్రధాన లక్ష్యంగా పని చేయటం ప్రారంభించాం. దీంతో వారికి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడు వారి ముందున్నవి రేండే రెండు దారులు.. జైలుకి అయినా వెళ్లాలి. లేదా ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయి యముడిని చూడాలి’’ అని ఆదిత్యానాథ్ వ్యాఖ్యానించారు. అనంతరం మీరట్‌లో కూడా ఇదే తరహాలో ర్యాలీ నిర్వహించగా.. అక్కడ నిరసకారుల నల్ల జెండాలు ప్రదర్శించి సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు వారిని చితకబాది పోలీసులకు అప్పగించారు. -
ఇది కూడా ఆదిత్యనాథ్ యోగి రికార్డే
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని మెరగుపరుస్తామన్న హామీతో గత మార్చి నెలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. దురదష్టవశాత్తు పరిస్థితి మెరగు పడాల్సిందిపోయి మరింత దిగజారింది. ఆదిత్యనాథ్ యోగి అధికారంలోకి వచ్చిన 2017, మార్చి 15వ తేదీ నుంచి 2017, ఏప్రిల్ 15వ తేదీ మధ్యన, అంటే నెల రోజుల్లో. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే అత్యాచారాలు, దొంగతనాలు నాలుగింతలు పెరిగాయి. ఇక దోపిడీలయితే ఏడింతలు పెరిగాయి. హత్యలు రెండింతలు పెరిగాయి. పెరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలను అరికట్టడంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మరీ దారణంగా ఉంది. ఓ బీజేపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి సీనియర్ పోలీసు అధికారి ఇంటిపైనే దాడి చేశారంటే పరిస్థితులు ఎంతగా దిగజారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మాంసం విక్రయాల క్రమబద్ధీకరణ పేరుతో వేలాది మాంసం దుకాణాలను మూసేయించి వారి పొట్టగొట్టిన ప్రభుత్వానికి మాంసం విక్రయాలను ఆపేయించడంలో వున్న శ్రద్ధ, చిత్తశుద్ధి శాంతి భద్రతల పరిరక్షణపై లేకపోవడమే పరిస్థితి దిగజారేందుకు కారణం అవుతోంది. మే 5వ తేదేన దళితులపై ఠాకూర్లు దాడి చేసినప్పుడే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలు తీసుకొని ఉన్నట్లయితే పరిస్థితి చేయిదాటి పోయేది కాదు. సహరాన్‌పూర్‌లో దళితులను మే 9వ తేదీన చితకబాదారు. పర్యవసానంగా ఠాకూర్లు మంగళవారం నాడు దళితులపై దాడిచేసి ఒకరిని హత్య చేశారు. అగ్రవర్ణాల మద్దతో అధికారంలోకి వచ్చిన అగ్రవర్ణానికి చెందిన ఆదిత్యనాథ్ వారి సంక్షేమం కోసమే కషి చేస్తున్నారన్న భావం బీసీల్లో, దళితుల్లో పెరిగిపోతోంది. ఇప్పుడే చక్కదిద్దే ప్రయత్నాలను చేపట్టకపోతే పరిస్థితి మరింత దిగజారి అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. – ఓ సెక్యులరిస్ట్ కామెంట్